Monday, February 22, 2021

సుభిక్షం - దుర్భిక్షం part 2

 సుభిక్షం - దుర్భిక్షం   part 2  


వీరు కాదు, వృత్తిగా అడిగేవారి విషయంలో కాదు, విధి లేక ఆడిగేవారి సంగతే ఆలోచించాలి. కాల చక్రభ్రమణంలో పడి, కత్తెర బోనులాంటి అవస్థ  వచ్చినప్పుడు, గత్యంతరం లేక నోరు విడిచి ఒకరిని అడగవలసి వచ్చిన వాళ్ళ సంగతే పరిశీలించాలి. పూటకు గుప్పెడు మెతుకులు లేక త్రాగడానికి సయితం గుక్కెడు నీళ్ళు కరువై కాలే కడుపులతోనే కాలం గడిపి గతిలేక, ప్రాణం నిలుపుకునేందుకు హరామ్ అని తెలిసి కూడా చచ్చిన గాడిద మాంసాన్ని అసహ్యించుకుంటూనే తిని ప్రాణాలు నిలపుకునే ఆత్మాభిమాన కుటుంబాల గురించే విచారించాలి. పిల్లలు భరించలేని ఆకలితో 'అమ్మా బువ్వ' అని అలమటించిపోతుంటే చూడలేక, చూసి తాళలేక, మర్యాదగా కాలం గడుపుతూ, సిగ్గు వదలి చేయి చాచే వ్యక్తి సంగతే పరిశోధించాలి. అంటే, వీరు కష్టాలకు భయపడి ఇలా చేస్తున్నారని కాదు, మానసం గల  ప్రతివాడూ, మర్యాదగా బతికే ప్రతి వాడూ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాడు; సాధ్యం కాదు. ఇతరుల సాయం ఆవశ్యకం అవుతుంది. అడగక తీరదు, అంటే; ఆత్మహత్య అన్న ఒక్క దారి తప్పు, అలాంటప్పుడు అడుగుతారే వాళ్ళ గురించి ఆలోచించాలి. అట్టి ఆత్మాభిమాని అడగటానికి సాహసించాడంటే అతను కనబరచిన త్యాగం అపారం. ఆ అవస్థ దుర్బరం, ఆ స్థితి సంఘంలో ఉండటం అవమానకరం. మానవజాతికే అది లజ్జాకారణం.



దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: “కొందరు దుమ్ముకొట్టుకుని (చూడటానికి అసహ్యంగా) కనబడతారు. వారిని గుమ్మం ఆవల నుంచే కసరి కొట్టడం జరుగుతుంది. కాని వారు గనక అల్లాహ్ పై ప్రమాణం చేస్తే అల్లాహ్ వారి ప్రమాణాన్ని తప్పకుండా నిజం చేస్తాడు”. (ముస్లిం) -

మరో హదీసులో ఇలా ఉంది: “ఓ ఆదం పుత్రుడా! నీ దగ్గర మిగిలిపోయిన ధనాన్ని నువ్వు (మంచికై) ఖర్చు పెడితే అది నీకే మంచిది. దాన్ని ఎవరికి ఇవ్వకుండా ఆపుకుంటే దానివల్ల నీకే నష్టం. అవసరాలకు సరిపోయేటంత ధనాన్ని కూడబెట్టుకున్న పక్షంలో నీవు నిందారుడవు కావు”. (ముస్లిం) 


 సృష్టి మొత్తం దైవ దాసులే  అంటామే; 'మొత్తం' అన్న ఆ మాటను కనీసం ఒకే ఒక్క ప్రాంతానికైనా, జిల్లాకైనా, రాష్ట్రానికైనా, దేశానికైనా వర్తింపజేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామా? 'వారు వికలాంగులు, గ్రుడ్డివారు, ఏ పనీ చేయలేని వారైతే దానికి మేమేం చెయ్యాలి? అది వారి ఖర్మ' అని కొందరు ప్రబుద్ధులు ప్రశ్నిస్తారు. సరే, వారినే చెప్పనివ్వండి! ఒక కుటుంబంలో ఉన్న వారంతా ఆరోగ్యవంతులేనా? ప్రయోజకులేనా? అప్రయోజకులు, ఎందుకూ పనికిరాని వారు కొందరు ఉంటారు కదా? వారికి సయితం తక్కిన వారిలాగా కూడు, గూడు, గుడ్డ ఎందుకిస్తాము? 'లేదే' అన్న కొరత వారిని లేకుండా ఎందుకు చేస్తాము? ఒక ఇంట్లో ఒక అవిటివాడో, గ్రుడ్డివాడో పుట్టాడనుకోండి. కూడు, గుడ్డ మనలాగే అతనికి పెట్టమా? అతని అన్ని అవసరాలు తీర్చడానికి మనం కష్ట పడతామే. అతనిని పోషించడం మన ధర్మంగా ఎంచుతామే. ఆ ధర్మం-సంఘం, సమాజం విషయంలోకొచ్చే సరికి ఏమయ్యింది? ఇదీ ఒక కుటుంబం కాదా! అందులో ఒకరిని అడుక్కోనివ్వడం సిగ్గుచేటు కాదా! అలా తన అవసరాన్ని ఇతరుల ముందు పెట్టేవాడికి ఏమి ఇవ్వక పోగా 'ఛీ,ఫో' అని కసురుకున్న వారిని ఏమనాలి? 'యాచించే వారిని గద్దించకండి' అని ఆ పరమప్రభువు చెబుతుంటే మనం ఇలా వ్యవహరించడం దైవధిక్కారం కాదా? "తన కోసం ఇష్టపడేదాన్నే తన తోటి సోదరుని కోసం కూడా ఇష్టపడనంత వరకూ మీలో ఎవరూ (పరిపూర్ణ) విశ్వాసి కాజాలరు”. అని ప్రవక్త (స) హెచ్చరించి ఉంటే మనం ఇలా బిహేవ్ చెయ్యడం దైవ ప్రవక్త అవిధేయత కాదా?


'ధర్యం చెయ్యండి బాబూ!' అన్న అర్థన వినబడగానే దానికి మనకు తోచిన అర్ధాన్ని మనం ఇచ్చుకుంటాము. దోసెడు ధాన్యం అని కొందరు, రూపాయి-రెండు రూపాయలని కొందరు భావించుకొని దాతల సరసరన నిలబడేందుకు తాపత్రయ పడుతుంటారు. నిజంగా ఆ పిలుపుకి అర్థం అదేనా? నిజం అది కాదు. వారు సంఘాన్ని, సమాజాన్ని, అందులో స్వచ్చంద సేవా సంస్థల లేబుల్తో చెలామణి అవుతున్న వాటిని, పెద్దల్ని, కలిమి-బలిమి గల వారిని హెచ్చరిస్తున్నారు. దీన దైవదాసులైన తమ పట్ల వారు వ్యవహరిస్తున్న వైఖరిని ఎండగడుతున్నారు. మరుపున పడ్డ విషయాన్ని సంఘం పట్ల వారి విద్యుక్త ధర్మాన్ని, కనీస బాధ్యతను జ్ఞప్తికి తెస్తున్నారు. సాటి జనుల పట్ల మన జగుప్సారకమైన ధోరణిని, నిర్లక్ష్య వైఖరిని ఎత్తి చూపుతున్నారు. సమాజంలో దట్టంగా పేరుకుపోయిన కఱపఁషన్ని  కరెక్షన్ చేసి కరెక్ట్ చేయమని పిలుపునిచ్చి చెంప పెట్టు పెడుతున్నారు. కాగడా పట్టి మనలోని లోపాలను ఎత్తి చూపుతున్నారు.


ఓ సంఘ సంస్కర్తల్లారా! ధర్మం చర అంటూనే, మీరు మీ ధర్మాన్ని మూలన పడేస్తున్నారా? సత్యం వద అంటూనే సత్యం నోరు నొక్కేస్తున్నారా? "తాము  కడుపారా భోంచేసి తన పొరుగువాని ఆకలి దాహాలను పట్టించుకోని వాడు నిజమైన విశ్వాసి కాజాలడు' అన్న ప్రవక్త ముహమ్మద్ (స) వారి మాటను అప్పుడే మర్చి పోయారా? ఇప్పుడయినా నిజాన్ని గ్రహించండి. మీరు నిర్వర్తించాల్సిన ధర్మాన్ని మీరు నిర్వర్తించండి అని ఒక మహోపన్యాసమే  చేస్తున్నారు.


ఏమండి పండితులారా! లేని ప్రజలకు కదా ఇవ్వాలి? దీనికి మీరే మంటారు? 'ధర్మం అంటే దానం, దానం అంటే ధర్మం' అన్నా రే-భూదానం, గోదానం, హిరణ్యదానం, శాకదానం, కుషాంద దానం, గోగర్భ దానం, తులభార దానం - ఇన్నీ దానాల మధ్య నిజమైన దానం కానరాకుండా చేశారే! ఎవరిదీ పాపం? గతి లేక అడుక్కుతినేవారిదా? అడుక్కుతినే స్థాయికి దిగజార్చిన వారిదా? ఇట్టి వ్యక్తుల జీవితానికి సంబంధించిన అసలు కేంద్రబిందువు వారి ఆర్థిక ప్రయోజనాలు, భార్యాపిల్లలు, ఇంకా వారి ప్రాపంచిక సౌఖ్యాలు అయి ఉంటాయి. కాని ఇతరులతో సంభాషించేటప్పుడు మాత్రం పారమార్థికత ఉట్టిపడేలా తాము దైవ ధర్మానికి, సంఘ సేవకు అంకితమైనవారిలా, దర్మోన్నతే, ప్రజాహితమే తమ మతంగా, సర్వేజనః సుఖినోభవంతు అన్నదే తమ ప్రధమ కర్తవ్యమని చెబుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే- “వారు తమ హృద యాలలో లేని మాటలను తమ నోటితో పలుకుతారు”. (ఆలి ఇమ్రాన్: 167) 



ఉదాహరణకు ఒక వ్యక్తి సమాజ తిరోగమనంపై, సంఘ దుస్థితి పై ఎంతో ఆర్థంగా ప్రసంగాలు, ప్రకటనలు, వ్యాస పరంపరలు, ప్రచురణలు చేస్తూ ఉంటాడు. కానీ, తన నిజ జీవితంలో సమాజ శ్రేయం కోసం, మానవాభ్యదయం కోసం ఆందోళన చెందుతూ ఒక్క రాత్రి అయినా గడిపి ఎరుగడు. తనకు పడక మీదకు చేరగానే ఒక్క నిద్ర తప్ప మరేమీ గుర్తుండదు కూడా. అశ్రుపూరిత నయనాలతో - నిశి రాత్రిన లేచి దైవ సమక్షంలో నిలబడి - 'ఓ అల్లాహ్! ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని అభ్యుదయ బాటన నడి పించు. ఇక్కడి ప్రజల్లో సుహృద్భావాన్ని, సామరస్యాన్ని పెంపొందించు. సకల మానవుల సమస్యలను పరిష్కరించు' అని వేడుకోడు. అంటే ఇట్టివారికి తన జాతి, మానవ జాతి గురించిన చింతన కంటే తన స్వార్థం గురించిన చింతనే, బాధే అధికంకా వేధిస్తూ ఉంటుంది. ఇట్టివారు లాంఛనాప్రాయంగా నియమనిష్టల విషయమై చాలా భేషైన ప్రమాణాలు చూపుతూ ఉంటారు. కానీ తమ నిత్య జీవితంలో క్రియాశూన్యులుగానే దర్శనమిస్తుంటారు. ఇది తమ ఆంతర్యాల్లో లేని నీతిని తమ మాటల ద్వారా తమలో ఉందని ప్రజానికానికి నిరూపించడానికి పడుతున్న పాట్లే తప్ప మరేమి కాదు. ఖుర్ఆన్లో ఇలా ఉంది: “వారు జరిపే అత్యధిక రహస్య మంతనాలలో ఏ మేలూ ఉండదు”. (నిసా: !!4) “వారు (ఇవన్నీ) పరులకు చూపడానికే చేస్తారు. అతి సామాన్య మైన వాడుక వస్తువులను సయితం ఇవ్వడానికి నిరాకరిస్తారు”. (మావూన్: 6,7) 


ఒక పెద్ద మనిషి అడిగాడు అంటే, అంత దుర్వస్థ, దుర్భిక్ష స్థితి ఇంట్లో ఉందన్న మాట. ఆయన తన మనసులో అంత యాతన అనుభవించాడన్న మాట. అడగడంలో అంత ఆయాస పడ్డాడన్న మాట. అయితే అడగడమే, భిక్షాటనే వృత్తిగా చేసుకున్నవారు ఇందులో చేరరు. 'యాయవారం మా కుల వృత్తి' అని చెప్పేవారు ఇందులో చేరరు. దేవుడే మమ్మల్ని అడుక్కొని బ్రతకమన్నాడని సిగ్గు వదిలి చెప్పేవారు ఇందులో జమ అవ్వరు. పంచ కేశాలు పెంచడం అనే ఆచారానికి భిన్నంగా పంచ కేశాలను క్షవరం గావించుకుని, బ్రతికుండగానే మృతులలో చేర్చబడి పచ్చని తలపాగలతో పట్టభద్రులై, నెమలి ఈకలు చేత పట్టుకుని షరీయతు ఆదేశాలేవీ తమకు వర్తించవని చెబుతూ నమాజు చదవక, రోజాలు పాటించక మాదక ద్రవ్యాలను సేవిస్తూ, గంజాయి -పీలుస్తూ సామాన్యులను సాంబ్రాణి పొగతో వంచిస్తూ అర చేతిలో స్వర్గం చూపేవారు ఇందులో చేరరు. 


ఒకరి ముందు చేయి చాచడంకన్నా చావే నయం అనుకుంటూనే విషమయ పరిస్తితులకు లోనై బ్రతకలేక బ్రతికేవారినే -ఇందులో చేర్చాలి. ఆత్మ కుటుంబం అనుభవిస్తున్న బాధ, వ్యధ అన్యులకు కనబడనీయకుండా గుట్టుగా బ్రతికేందుకు ప్రయత్నిస్తున్నవారినే ఇందులో చేర్చాలి. విద్యా, బుద్ధి, బలము, ఓపికా అన్నీ ఉన్నప్పటికీ ఒకరిని అడగకుండా ఆత్మాభిమానంతోనే అనేక అవస్థలు పడుతున్నవారినే ఇందులో చేర్చాలి. సమయం కలిసొస్తే - తామే పది మందికి పెట్టగలిగినవారైనప్పటికీ 'దుర్భిక్షం' చేత అడగక తప్పని దుర్వస్థకు వచ్చిన వారినే ఇందులో చేర్చాలి. అటువంటి ఆత్మాభిమాన ధనులు అడిగినప్పుడు, వారు అడిగారని, అర్జించారని భావించడం తప్పు, అధర్మం. నిజంగా వారు ఎదుటి - వారికి ఒక మహదవకాశాన్ని ఇచ్చారన్న మాట గ్రహించాలి. అటువంటి ఆత్మాభిమానుల మానసం దెబ్బ తినకుండా సహాయం అందించగలిగితే వారి వల్ల లోకానికి ఎంత లాభం! వారి మేధా శక్తితో లోకానికి ఎంత ఉపకరించవచ్చును! ఎన్ని మహత్తర కార్యాలకు శ్రీకారం చుట్టవచ్చును! ఆ సమయంలోని ఆ స్వల్ప సహాయం సదుపాయం చేసినవాడిది కదా ఆ పుణ్యం, అ కీర్తి అంతానూ.


ఇటువంటి ఆత్మాభిమాన ధనుల పక్షం వహిస్తూ రేపు ప్రళయ దినాన అల్లాహ్ కలవారైన, కలిమి-బలిమి గలవారైన తన దాసులను నిలదీస్తాడు. దైవ ప్రవక్త ముహ్మద్ (స) ఇలా తెలియ జేశారు: 'నిశ్చయంగా మహోన్నతుడైన అల్లాహ్ ప్రళయ దినాన ఇలా అంటాడు: “ఓ ఆదం కుమారుడా! నేను వ్యాధికి గురయినప్పుడు నువ్వు పరామర్శించలేదేమిటి?” దానికి దాసుడు ఆశ్చర్యపోతూ, స్వామీ! నీవు సర్వలోకాలకు ప్రభువు, పరిపాలకుడవు, పరిపోషకుడవు, సంరక్షకుడవు. అలాంటప్పుడు నేను నిన్ను పరామర్శించడమేమిటి?  అని విన్నవించుకుంటాడు. అప్పుడు అల్లాహ్ అతనితో - నా పలానా దాసుడు వ్యాధిగ్రస్టుడయ్యాడని తెలిసి కూడా నువ్వతన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు. ఒకవేళ నువ్వెళ్లి అతన్ని పరామర్శించి ఉంటే అక్కడ నువ్వు నన్ను పొంది ఉండేవాడవన్న సంగతి నీకు తెలియదా? అని అంటాడు.


“ఓ ఆదం పుత్రుడా! నేను నిన్ను అన్నం పెట్టమని అడిగితే నువ్వు నాకు అన్నం పెట్టలేదేమిటి?' అని ప్రశ్నిస్తాడు. దానికి దాసుడు 'ప్రభూ! సకల లోకాలకు పరిపోషకుడవు నీవు. అలాంటిది నేను నీకు అన్నం పెట్టడమేమిటి? అని విన్నవించుకుంటాడు. దానికి అల్లాహ్, 'నా ఫలానా దాసుడు నిన్ను అన్నం (బాబూ! ధర్మం) పెట్టమని యాచించాడు. కాని (పెట్టగలిగే స్థితిలో నువ్వుండి కూడా) నువ్వతనికి అన్నం పెట్టలేదు. అప్పుడు నువ్వతనికి అన్నం పెట్టి ఉంటే దాన్ని నా దగ్గర పొంది ఉండేవాడవన్న విషయం నీకు తెలుయదా? అని అడుగుతాడు.

“ఓ ఆదం సంతానమా! నేను నిన్ను మంచి నీళ్లు అడిగాను. కాని నువ్వు నాకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేదే' అనంటాడు. దానికి దాసుడు, దేవా! నీవు సకల లోకాలకు జీవనోపాధిని ప్రసాదించే వాడవు. నేను నీకు మంచి నీళ్లు త్రాపించడమేమిటి? అని విన్న

వించుకుంటాడు. అప్పుడు అల్లాహ్ అతనితో, 'నా ఫలానా దాసుడు నిన్ను మంచి నీళ్లు అడిగితే నువ్వతనిక మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు. నువ్వతనికి మంచి నీళ్లు ఇచ్చి ఉంటే దాన్ని నువ్వు నా దగ్గర పొంది ఉండేవాడవన్న విషయం నీకు తెలి యదా? అని అంటాడు. (ముస్లిం) 


మరో హదీసులో ఇలా ఉంది: 'ఓ ఆదం కుమారుడా! నేను నగ్నంగా ఉన్నాను. నువ్వు నాకు బట్ట కప్పలేదేమిటి? అని అడుగుతాడు. అందుకు దాసుడు, ప్రభూ! నువ్వు సకల లోకాల మేలును కోరేవాడవు. అలాంటిది నేను నీకు ఆచ్చాదనం తొడిగించడమేమిటి? అని ఆశ్చర్యపోతాడు. దానికి అల్లాహ్, నా ఫలానా దాసుడు నగ్నంగా ఉన్నాడు అని నీకు తెలిసి కూడా నువ్వతనికి ఆచ్చాదనాన్ని ఇవ్వలేదు. ఒకవేళ నువ్వతనికి బట్టలు తొడిగించి ఉంటే నన్ను అక్కడ పొందేవాడవన్న విషయం తెలీదా నీకు?” అని ప్రశ్నిస్తాడు అల్లాహ్.


అదే 'లేదు,పో' అన్న మూడు అక్షరాల ఫలితం ఏమవుతుందో ఊహించారా? ఆ వ్యక్తి ఆత్మాభిమానంతో చచ్చిపోతాడు. ఒకసారి తస్కారం జరిగాక మళ్ళీ దానికై సాహసించడు. తన బుద్ది బలం చేతనూ, తన శక్తి చేతనూ మానవ అభ్యుదయానికి తోడు పడదగిన ఒక వ్యక్తి బలవంతంగా అసువులు బాసాడు. అతని విజ్ఞానం వల్ల లాభం, అతని కౌశలం  వల్ల  ఫలితం ప్రపంచానికి దక్కకుండా పోయింది. అతనికీ, అతని కుటుంబానికే కాకుండా సర్వ మానవాళికి తీరని లోటు మిగిల్చింది. జగత్తుకే ఒక మహా ఉపద్రవబం తెచ్చి పెట్టింది.

దీనంతటికి కారణం 'కలవాడు' లేదు పొమ్మన్నాడు'. ఒక్క రూక కాదు-నిజంగా అది ఒక ఈక. ఇవ్వడానికి సందేహించాడు. అల్ప సహాయం చేయడానికి చేతులు వచ్చాయి కావు. పైగా “ఇటువంటి వారితో అల్లాహ్ ప్రసాదించిన దానిలో నుంచి కొంత ఖర్చు చేయండి అని అన్నప్పుడల్లా, ఈ తిరస్కారులు విశ్వాసులతో, మేము వారికి ఎందుకు తినిపించాలి? అల్లాహ్ తలిస్తే స్వయంగా వారికి అన్నం పెట్టగలడు కదా!' (దేవుడు తలిస్తే వారిని దరిద్రులుగా ఉంచేవాడే కాదు. అలాంటప్పుడు మేము ఈ దరిద్రులకు

సహాయపడి దైవాభిమతానికి వ్యతిరేకంగా ఎందుకు ప్రవర్తించాలి) అని వారు పెడసరిగా జవాబిస్తారు”. (యాసీన్: 47)


ఒక పదవ వంతు కాదు, ఆ ఆత్మాభిమానధనులు అడిగినది. - తాము తమ పిల్లలు ఒక గంటలో కేవలం వినోదాల కింద ఖర్చు

పెట్టిన దానిలో అణుమాత్రం కాదు ఆ నిర్భాగ్యుడుకి లేదు పొమ్మ న్నది. ఆడంబరాల కోసం, వేడుకల కోసం ప్రతి దినం తాను - వ్యయం చేస్తున్న దానిలో నూరోవంతు కాదు ఆ అవసరార్ధునికి కాదన్నది. అటువంటి నోరు, మనసు గలవాడికి మనిషి అని నామకరణం చేయడం ఎంత వరకు సబబో మనసున్నవారే నిర్ణయించాలి. పేరు కోసం, ప్రకటన కోసం అని కోట్లకి కోట్లు ఖర్చు చేసిన ఈ దాత వట్టి రోత కాడా? నిజంగా చెప్పాలంటే, అడవులు, సముద్రాలు, పర్వతశ్రేణులు - ఇవేవి భూమికి బరువు కాదు. ఇటువంటి ధనికులే భూమికి భారం.

గృహశోభ, గృహ ప్రవేశానికి, గృహశాంతికి, గృహవాస్తుకని లక్షలకిలక్షలు ఖర్చు పెట్టే మనిషి, భూత దయ కోసం, వృక్ష మోక్షం కోసం వేలకి వేలు ఖర్చు పెట్టే మనిషి, అందులోనే మోక్షం చూరగొనాలనుకుంటాడు. మూర్ఖ బుద్ది! జంతువులలోకెల్లా మహా జంతువు, సృష్టిరాసులలోకెల్లా శ్రేష్ఠుడు మనిషి; వారిలో మానసం గలవాడు మణిపూస, సోదర మానవుడు. అలాంటి ఉత్కృష్ట జీవి - అష్టకష్టాలు పడుతూ, అష్ట దారిద్రియానికి  అనుభవిస్తూ, అడిగి  లేదనిపించుకున్న యాతనను భరిస్తూంటే, ఇతనికి నిజంగా భూత దయ ఉందా? ఆ మాటకు, ఈ రోతకు ఎంత దూరం? ఈ ఆడంబరం అంతా పేరు కోసం ప్రాకులాడటం, మెప్పు కోసం అర్రులు చాచడం, విలాసాలు, ఖులాసాల కోసం దేవులాడటం. అంతే కాని ధర్మం ఆచరించడానికి కాదు..


ఇవన్నీ తెలిసిన అల్లాహ్ ప్రతిదాంట్లో స్వార్థాన్ని చూసే మనల్ని ఉద్దేశించి మీరు చేసే సహాయం వృధా పోయిందని బాధపడనవసరం లేదు, మీరు ఇచ్చిన ప్రతి పైసా నా దగ్గర మీరు నాకిచ్చిన రుణంగా వ్రాసుకోబడుతుందని తెలియజేస్తున్నాడు: “నిశ్చయంగా దానధర్మాలు చేసే పురుషులు, దానధర్మాలు చేసే స్త్రీలు, అల్లాహ్ కు (చిత్తశుద్ధితో) రుణం ఇచ్చేవారు- వారు ఇచ్చినది వారి కొరకు పెంచబడుతుంది. మరి వారి కొరకు గౌరవ ప్రదమైన ప్రతిఫలం ఉంది”. (అల్ హదీద్: !8)


అంటే, ఒక్కో సత్కార్యానికి కనీసం పదింతల పుణ్యం అంతకన్నా అధికంగా 700 రెట్లు ప్రసాదించబడుతుంది. దైవ చిత్తమయితే ఈ పుణ్యం ఒక్కోసారి అంతకన్నా ఎక్కువగా కూడా ఉంటుంది. అయితే అది ఇచ్చేవాడి చిత్తశుద్ధిపై, పుచ్చుకునే వాడి దుర్భిక్ష అగత్య స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే

“తాము అమిత అవసరంలో ఉన్నప్పటికీ తమపైన వారికే ప్రాధాన్యతనిస్తారు. వాస్తవానికి తమలోని స్వార్థప్రియత్వం - (పేరాశ, పిసినారితనం) నుండి రక్షించబడినవారే కృతార్థులు". (హష్: 9)

ముస్లిం మదిపై ఇస్రా – మేరాజ్ స్మృతులు

 ముస్లిం మదిపై ఇస్రా – మేరాజ్ స్మృతులు 

 ”తన దాసుణ్ణి రాత్రికి రాత్రే మస్జిదె హరామ్‌ నుండి మస్జిదె అక్సా వరకు తీసుకుపోయిన అల్లాహ్‌ పరిశుద్ధుడు. దాని పరిసరాలను మేము శుభ వంతం చేశాము. ఎందుకంటే, మేమతనికి మా (శక్తికి సంబంధించిన) కొన్ని సూచనలను చూపదలచాము. నిశ్చయంగా అల్లాహ్‌ా మాత్రమే బాగా వినేవాడు, చూసేవాడు”. (బనీ ఇస్రాయీల్: 1)

గగన విహారం:

రాత్రి వేళ మస్జిదె హరామ్‌ నుంచి మస్జిదె అఖ్సా వరకు దివి దూతలతో భువి ప్రవక్త ముహమ్మద్‌ (స) చేసిన ప్రయా ణాన్ని ఇస్రా అంటారు. అక్కడి నుండి ఏడు ఆకాశాల అధిరోహణను, అక్కడ తిలకించిన సంగతులను మేరాజ్‌ అంటారు. ఈ అద్భుత సంఘటన హిజ్రత్‌కు ముందు జరిగిందన్న విషయంలో పండితులందరి మధ్య ఏకాభిప్రా యం ఉంది. కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరం ప్రయాణం రాత్రిలోని అతి స్వల్ప భాగంలో జరిగిపోవడం ఒక అద్భుతమే. ఈ యాత్ర కొందరు పొరబడినట్టు ‘స్వప్నావస్థ’లో జరిగింది ఎంత మాత్రం కాదు. ఆయన (స) సశరీరంగా పూర్తి మెలకువలో ఈ యాత్ర చేసి వచ్చారు. ఇస్రా-మేరాజ్‌ మాట వినగానే గత తాలూకు జ్ఞాపకాలు మన మనో తెరలపై కదలాడుతాయి. మనలో అంతరించిన భావ చైతన్యం చిగుళ్లు పోసుకుని నవశక్తిగా ఉద్భవి స్తుంది. అవును, మనం సదా మేల్కొని ఉండాలన్నదే మేరాజ్‌ మధుర ఘట్ట సందేశం.
 మేరాజ్‌ సందర్భంగా మానవ సమాజాన్ని పట్టి పీడించే అనేక రుగ్మతలను అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారికి చూపించి వాటికి విరుగుడును బోధించడం జరిగింది.



మనిషి ఉపాసనారీతులన్నీ, పూజా పద్ధతులన్నీ ఏకైక దైవమయిన అల్లాహ్‌ాకు మాత్రమే ప్రత్యే కించాలని, ఆయనతోపాటు ఇతరులను సాటి కల్పించి ఆరాధించ వలదని, తల్లిదండ్రుల యెడల అత్యుత్తమంగా మసలుకోవాలని, వారి తో చీదరించుకుంటూ మాట్లాడటం తగదని, బంధుమిత్రుల పట్ల సద్వ్యవహారం కలిగి  ఉం డమని, దుబారా ఖర్చుకు దూరంగా మసలుకో వాలని, సరదారాయుళ్లు షైతాన్‌ సోదరులని, అనవసరమయిన విషయాల జోలికి వెళ్ళకండ ని,దానం చెయ్యడంలో సయితం మధ్యేమార్గం మంచిదని, పిసినారితనం పరమ జుగుప్సాకర మైన గుణమని, మనిషి చెప్పే ప్రతిమాట, చేెసే ప్రతి పని లెక్కించబడుతుందని, కలిమి లేములు ఆ కరుణామయుని ఇష్టానుసారమే లభిస్తాయని, లేమి గురయితే కృంగి పోకూడ దని, కలిమి కలిగితే పొంగి పోకూడదని, అశ్లీ చేష్టలకు ఆమడ దూరంలో ఉండాలని, వ్యభి చార దరిదాపులకు సయితం వెళ్ళకూడదని, అనాథల ఆస్తులను స్వాహా చెయ్యడం పరమ నీచం అనీ, ఒండొకరి ధన, మానాలు దోచు కోవడం అన్యాయమని, వడ్డీ, చక్రవడ్డీల పేరు తో జలగల్లా పేదలరక్తం త్రాగొద్దని, సారాయి, జూదం, పాచికల జోస్యం, దైవేతరాల జోలికి పోవద్దని,    మంచిని   పెంచమని,  చెడును తుంచమని ప్రబోధించడం జరిగింది.

మేరాజ్‌ కానుకలు:

మేరాజ్‌ శుభ సందర్భం గా ప్రవక్త (స) అనేక అద్భుత దృశ్యాలను చూశారు. వాటిలో దైవదూతల ఆరాధనా విధానం కూడా ఒకటి. దైవదూతల ప్రార్థనా రీతులన్నింటిని కలగలిపి ప్రసాదించినదే నమాజు. దైవదూతలు వేర్వేరు భంగిమల్లో దైవాన్ని కొలిస్తే, ఒక ముస్లిం  ఒకే సమయం లో సర్వ భంగిమల్లో అల్లాహ్‌ాను ఆరాధిస్తాడు. మన పాలిట ఎంతటి గొప్ప కానుక నమాజు! సర్వ శ్రేష్ఠుడయిన అల్లాహ్‌ ఆ మహిమాన్విత విధానం నమాజు ప్రాశస్త్యాన్ని, ఈ మహా రాధన పట్ల ఏమరుపాటుకి లోనై జీవిస్తున్న తన దాసులకు ఎరుక పరుస్తున్నాడు: ”నీ వద్దకు పంపబడిన గ్రంథాన్ని పఠిస్తూ ఉండు. నమాజును నెలకొల్పు. నిస్సందేహంగా నమాజు చెడుల, అశ్లీల చేష్టల, మితిమీరిన ప్రవర్తన జోలికి పోకుండా నిరోధిస్తుంది. నిశ్చయంగా అల్లాహ్‌ సంస్మరణ ఎంతో గొప్ప విషయం”.(ద్వియఖుర్‌ఆన్‌-29;45)
అలాగే ఈ సందర్భంగా సూరతుల్‌ బఖరా లోని చివరి రెండు ఆయతులు  ప్రసాదించ బడ్డాయి. షిర్క్‌ మహాపరాధానికి పాల్పడని విశ్వాసి పెద్ద పాపాలు మన్నించబడతాయి అని మాటా ఇవ్వబడింది. (ముస్లిం)

దహకాండ ఇటు – ధీరకాంత అటు

 హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ బిన్‌ అబ్బాస్‌ (ర) గారి కథనం-దైవప్రవక్త ముహమ్మద్‌ (స) ఇలా సెలవిచ్చారు: అది ఇస్రా-మేరాజ్‌ నిమిత్తం దైవ దూత జిబ్రయీల్‌ నన్ను తీసుకెళ్ళిన రాత్రి.  ఓ మలయ సౌరభం నన్ను తాకింది. అప్పుడు నేను: ‘ఓ జిబ్రీల్‌! ఈ సుగంధ పరిమళ సంగ తేమి?’ అని అడిగాను. అందుకు ”ఈ మలయ సౌరభం ఫిర్‌ఔన్‌ కుమార్తె యొక్క కేశాలంకరణి అయిన విశ్వాస మహిళ మరియు ఆమె బిడ్డలది” అని బదులిచ్చారు జిబ్రీల్‌ (అ). అది విని నేను ‘ఆమెకేమ య్యింది?’ అని వివరణ కోరగా – జిబ్రీల్‌ (అ) చెప్పనారంభించారు:  (తర్వాతి కథనాన్ని కాస్త వివరణతో ఇక్కడ ఇస్తున్నాము).

 అది ఈజప్టు రాజ్యం. స్థలం నియంత ఫిర్‌ఔన్‌ రాజకోట. బృందావనం లో కూర్చుని ఉంది ఓ విశ్వాస మహిళ.ఏమి వర్చస్సు ఆమె వదనంలో! మూర్తీ భవించిన సత్యంలా ఉంది. ఆవిడే ధీరకాంత ఫిర్‌ఔన్‌ కూతురి కేశాలం కరిణి. ఆమె కేశాలను అలంకరిస్తూ ఆలోచిస్తూ ఉంది. సర్వ లోక ప్రభువు అల్లాహ్‌ ఉండగా ఓ పరిమి ప్రాంతానికి రాజైన ఫిర్‌ఔన్‌ ”నేనే మీ సర్వోన్నత ప్రభువుని” అనడం ఎంత దుర్మార్గం. జాతి వివక్ష  జాఢ్యానికి గురై 70 వేల మంది పసికందుల్ని బలిగొన్న అతని నైచ్యం ఎంత దారుణం. ఇక ఈ పాప పరిపాలన భరించలేం. ఈ దాస్య శృ ఖలాలను ఇంకా సహించలేం. ‘దేవుడొక్కడే’ నినాదం ప్రాణాధికం. అదే కదా మహాత్ములందరూ అందించిన సందేశం. దాసి అయిన నాకు అర్థ మవుతున్న ఈ యాదార్థం, రాజయిన అతని బుర్రకెందుకు ఎక్కడం లేదు? ఇతని నిషేదాజ్ఞలు ప్రజా వాహిని ఆంతర్యంలోని వేళ్ళూనుకొని ఉన్న తౌహీద్‌ విప్లవాన్ని అరికట్టగలవా? ఇతని హింసా చర్యలు సత్య ధర్మ ద్వజవాహకులను ప్రతిఘటించగలవా? ఇలా అలోచిస్తుండగా-పర ధ్యానంలో ఆమె చేతి నుండి దువ్వెన (కేశాలంకరణ పరికరం) జారి పడింది.దాన్ని ఎత్తుకోబోతూ ఆమె ‘బిస్మిల్లాహ్‌ా’-అల్లాహ్‌ పేరుతో అంది.  అది విన్న ఫిర్‌ఔన్‌ కూతురు ఒకింత ఆశ్చర్యానికి లోనవుతూ –
ఫిర్‌ఔన్‌ కుమార్తె: అంటే, ‘నా తండ్రా?’.
ధీరకాంత: ‘కాదు, నా ప్రభువు, నీ తండ్రి ప్రభువయిన అల్లాహ్‌ా’.
ఫిర్‌ఔన్‌ కుమార్తె: ఇది మరీ అన్యాయం, (ఇటీజ్‌ టూ మచ్)
ధీరకాంత: ఇదే న్యాయం (దిసీజ్‌ ట్రూ మెసెజ్)
ఫిర్‌ఔన్‌ కుమార్తె: మా నాన్నకు ఈ విషయం చేరవేయనా?
ధీరకాంత: అవును, అది నా ప్రభువు నీ ప్రభువయిన అల్లాహ్‌ా నామమే. ‘సరే తెలియజయ్యి’. (తక్షణమే ఆగమేఘాల మీద వెళ్ళి ఆ వార్తను తన తండ్రి చెవిన పడేస్తుంది ఫిర్‌ఔన్‌ కూతురు).

 కోపంతో రగిలిపోతూ  ఎక్కడ? ఎక్కడ? ఎక్కడ? నన్ను దైవం కాదన్న ఆ అబల? అంటూ ఆమెను దర్బారులో హాజరు పర్చ వలసిందిగా ఫర్మానా జారీ చేశాడు ఫిర్‌ఔన్‌.
ఫిర్‌ఔన్‌: ‘ఏమిటి? మేము కాక నీకు ఇంకో ప్రభువున్నాడా?’ అని నిప్పులు చెరిగాడు.
ధీరకాంత: అవును; నా ప్రభువు, నీ ప్రభువు అల్లాహ్‌ా ఒక్కడే.
ఫిర్‌ఔన్‌: నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని తెలియదా?
ధీరకాంత: బాగా తెలుసు.
అధికారి: చట్టాన్ని ధిక్కరిస్తే పర్యవసానం ఏమవుతుందో తెలుసా?
ధీరకాంత: బాగా తెలుసు. పశుబలం విజృంభిస్తుందని తెలుసు. ఇనుప లాఠీలు తాండవిస్తాయని తెలుసు. మృగ మనుషులు మంటలు గక్కుతారని తెలుసు. అమాయకులయినా సత్యప్రియుల రక్త ధారలతో పుడమి ఒడి తడిసి ముద్దవుతుందనీ తెలుసు.
అధికారి: ఆఁ…అయితే తెలిసి తెలిసి ఎందుకు ధిక్కరిస్తున్నావు మహా  రాజ దైవత్వాన్ని?
ధీరకాంత: అదే మా లక్ష్యం. అదే సత్య సస్య విప్లవ నినాదానికి మూల  సూత్రం.
అధికారి: చివరిసారిగా హెచ్చరిస్తున్నాను. ఉపన్యాసాలు కట్టబెట్టి బేషరతుగా లొంగిపో.
ధీరకాంత: చాలించను, మీ బెదిరింపులకు చలించను.
అధికారి: అందాక వచ్చిందా నీ అహంకృతి?
ధీరకాంత: అక్కడే మొదలవుతుంది సత్యవాదుల సంస్కృతి.
అధికారి: ఏ ప్రలోభం మాయ చేసింది నిన్ను.
ధీరకాంత: ఇప్పుడిప్పుడే తెరుచుకుంది వెలుతురు కన్ను.
అధికారి: శాసన ధిక్కారానికి ఫలితం అనుక్షణం మృత్యు భయం!?
ధీరకాంత:  ఆ మృత్యు కోరలతో ఆడుకోవడం మాకు ప్రియం.
 (సాంతం అప్రశాంతంగా వింటున్న ఫిర్‌వన్‌ కోపం కట్టలు తెంచు కుంది. రెచ్చిపోయి తెగ ఉరిమాడు. పిచ్చి కుక్కలా అరిచాడు. పచ్చి విషం కక్కాడు).
 బెదిరిపడ్డ ప్రభుత్వం ఏం చేస్తుంది? సత్య వీర నారీమణుల్ని బంధిస్తుంది. ఇరుకు చెరశాలలో చిత్రహింసలు పెడుతుంది. అప్పటికీ కక్ష  తీరకపోతే ఉరి శిక్ష వేస్తుంది. అగ్నిగుండంలో నెట్టేస్తుంది. కాగే నూనె లో పడేసి వేంచేస్తుంది. అదే జరిగింది.
 ఉన్మాదిగా మారిన ఫిర్‌ఔన్‌ తక్షణమే ఓ తొట్టెలో నూనె కాగి ఆమెను, ఆమె బిడ్డలను అందులో పడేయవలసిందిగా ఆ జ్ఞాపించాడు. ఈ వార్త క్షణాల్లో ప్రజల కర్ణపుటాలకు తాకింది. ప్రజలు ఆ ధీరకాంత గురించే మాట్లాడుకుంటున్నారు.

ఒకడు: దిక్కు దిక్కుల ఉక్కు కరవాలాలు త్రిప్పుకుంటూ కంట పడిన  క్రాంతి శక్తులను కటకటాల పాలు చేస్తున్నారు ఫిర్‌ఔన్‌ సేనలు.
మరొకడు: కాగే నూనెలో పడేసి వేంచేస్తారట. ధీరకాంతను ఆమె  సంతాన సమేతంగా కాల్చేస్తారట. ఏమిటీ దురంతం?
(అప్పటి సామాన్య ప్రజా హృదయ ఘోష, ధీరకాంత ప్రాణ రక్షణ  అభిలాష).
ఇంకొకడు: అహింసాసూత్రం ఏమయిపోయింది? ఈ హింసా విజృం భణకు అంతమెప్పుడో? పట్టుదప్పిపోతున్నదా? సత్య సస్య విప్లవం చెదిరి పోనున్నదా?(సత్యప్రియుల అంతరంగాల్లో తెలియని కలవరం). చివరికి ఆ హృదయ విదారక ఘడియ రానే వచ్చింది. పెద్ద తొట్టెల్లో నూనె సలసలా కాగుతున్నది.
 ఆకాశమెప్పుడూ నీలంగా ఉంటుందనే అల్లాహ్‌ చెప్పాడు. కానీ; వానలేనీ ఎండ ఉంటుందని మాత్రం అనలేదే! వేదన లేని సంతోషముంటుందనిగానీ లేదా బాధారహిత ప్రశాంతత సాధ్యమనిగాని అనలేదే. అందుకే మనం నిరంత కఠోర పరిశ్రమలో ఉన్నామన్న విషయాన్ని గ్రహించాలి. సత్యమార్గం మీద నిలకడ కలిగి జీవించాలను కున్నప్పుడు ఇటువంటి హృదయ విదారక సంఘటలు చోటు చేసుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.

ఫిర్‌ఔన్‌: ఓ భీతిల్లిన హరిణీ! ఇప్పటికయినా మించిపోయింది లేదు.  తప్పుకో. ‘నేనే నీ సర్వోన్నత ప్రభువు’నని ఒప్పుకో!
ధీరకాంత: తొలగను. అంగుళం కూడా కదలను. మీ పశుబలానికి లొంగను. నేను సత్యకాంతను, నేను దైవప్రవక్త మూసా ప్రబోధించిన అహింసలో పెరిగిన ఆవేశాన్ని.
అధికారి: మహారాజా! నింద! నింద!
ధీరకాంత: ఛీ! నోర్ముయ్‌ పిరికిపంద.
అధికారి: ఓహ్‌ చింత చచ్చినా పులుపు చావలేదన్న మాట. నీ పిల్లల్ని  పెనుములో పడేసి వేంచేస్తామన్నా ఉద్రేకం తగ్గలేదన్న మాట.
ధీరకాంత: ఉద్రేకం మీలాంటి మిథ్యావాదులకుండదూ! అది మా సత్య  శక్తుల సొత్తు.
ఫిర్‌ఔన్‌: ఏమిటీ నీ చివరి కోరికా?
ధీరకాంత: రాజా! నాదో విన్నపం.
ఫిర్‌ఔన్‌: ఏమిటా నీ అవసరం?
ధీరకాంత: నా మరణానంతరం నా ఎముకల్ని, నా బిడ్డల ఎముకల్ని ఓ గుడ్డలో చుట్టి ఒకే చోట సమాధి చేస్తే నాకు మేలు చేసిన వారవు తారు. (పుండు మీద కారం జల్లినట్టు ఆ ధీరకాంత మాటలు తూటాల్లా పేలాయి).

 తలపెట్టిన కుతంత్రాలు తలక్రిందులవుతుంటే, పన్ని పన్నాగాలన్నీ మన్ను గరిచిపోతుంటే, నిరంకుశ నీచత్వం నివ్వెరబోయి చూసింది. కుళ్లిన కుహనాతత్వం కుక్క గొడుగులు తొడిగింది. తెగిపోతున్న దగా దైవత్వాన్ని జిగురు పెట్టి అతికించాలని, పాతబడిన చట్టాలకు పై పూతలు పూయాలని, ప్రబలుతున్న పరిపూర్ణ సత్య సంరంభాన్ని ప్రక్క దారులు పట్టించాలని కుట్రలు పన్నింది.
ఫిర్‌ఔన్‌: కోపాన్ని ప్రదర్శిస్తూ-‘అలా చెయ్యడం మా ధర్మం’.

 తొట్టెలో నూనె సలసలా కాగుతోంది. కర్కశ సైనికులు ఆ మాతృ మూర్తి చూస్తుండగానే ఆమె కళ్ల ఎదుటే ఒక్కో బాలుడ్ని తీసుకెళ్ళి ఆ నూనెకి ఆహుతి చేసేశారు. చివరికి అంతిమ పరీక్షా సమయం ఆసన్న మయింది. పిల్లలందరూ ఆమె కళ్ళ ముందరే నూనెకి ఆహుతి అయ్యారు. నలుగురికి తర్వాత ఇక ఆమె వద్ద మిగిలింది పాలు త్రాగే ఓ పసికందు మాత్రమే. ఆ పసికందు విషయంలో ఆమె సహనం నశిం చింది. ఆ పసి బాలుడ్ని వారికి అప్పగించే సాహసం చెయ్యలేక పోయింది పాపం! సంధిగ్దావస్థలో కొట్టుమిట్టాడుతున్న తన తల్లినుద్దేశించి ఆ పసికందు నోరు విప్పింది: ”ఓ నా ప్రియమైన అమ్మా! దేని కోసం ఎదురు చూస్తున్నావు. నన్ను బాగా ఒడిసి పట్టుకుని ఆ నూనెలో దూకెయ్యి! ఇహలోకపు ఈ యాతన పరలోకపు నరక యాతన ముందర ఏపాటిది?” అంతే, ఆ ధీరకాంత  తన పసికందునితోపాటు తన దేహాన్ని ఆ నూనెకు ఆహుతి చేసుకోంది….!!!

ప్రకృతి: దుష్టులు కాల్చింది విశ్వాసుల దేహాల్ని మాత్రమే. వారి సత్య శ్వాసను కాదు. ఆ ఊపిరే ఉప్పెనగా మారుతుంది. హింసావాదులు సత్యప్రియుల శాంతాన్ని అశక్తత అనుకుంటున్నారు. వారి సహనాన్ని చేతకానితనంగా తలపోస్తున్నారు.
అదుగో! ఏమిటా జనప్రవాహం? అమ్మో! ఎన్నెన్ని ఉత్సాహ తరం గాలో! ఈ ప్రవాహానికి స్ఫూర్తి ఓ దళిత విశ్వాస మహిళయా? మిథ్యా వాది కాదు; అక్షర సత్యవాది. ముష్కర పాలకుల రాక్షస కృత్యాలను అక్ష్షీణ బలంతో ఎదుర్కొన్న అపూర్వ సాహసమూర్తి. విశ్వాస బలమే ఆమె ఆయుధం. సహనమే ఆమె కవచం.  సత్యమే ఆమె శస్త్రం.
 నేడు చిందిన ప్రతి నెత్తుటి బొట్టూ సరికొత్త విప్లవ శక్తులకు పురుడు పోస్తుంది. వారి ఉచ్ఛ్వాసనిశ్వాసలే సత్యా ప్రభంజనాలయి మిథ్యా వాదుల సువర్ణ సౌధాలను, నెత్తిన పెట్టుకున్న మకుటాలను తుత్తుని యలు చేెసి, దూది పింజల్లా ఊదేసి, వారి ముష్కర బర్బర ప్రభుత్వా న్ని తుదముట్టించే రోజొకటి తప్పక వస్తుంది.
(ఇది జరిగిన కొన్నాళ్ళకే ఫిర్‌ఔన్‌ ప్రభుత్వం కుప్పకూలింది. ఈజిప్టు ధాత్రిపై సత్య కేతనం సంపూర్ణ శోభతో రెపరెపలాడింది).

ఇస్రా ‌ సందర్భంగా దైవదూతల నాయకుల యిన జబ్రీల్‌ (అ) నోట ప్రవక్తలందరి నాయకులయిన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారికి విన్పించిన ఈ సజీవగాధ మనకు చెప్పకనే ఎన్నో విషయాలు చెబుతోంది. మహాప్రవక్త ముహమ్మద్‌ (స) వారి ఇస్రా ‌ ప్రయాణ సందర్భంగా స్వయంగా దైవదూత జిబ్రీల్‌ (అ) ఈ గాధని విన్పించడం వెనకున్న పరమార్థాన్ని అర్థ చేసుకుంటే ముస్లింల పట్ల నేటి అగ్రదేశాల వైఖరి వింతగా తోచదు. తన అంతిమ గ్రంథం ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ా ఇలా సెలవిస్తున్నాడు:

 ”మేము ఏదో ఒక విధంగా తప్పకుండా పరీక్షిస్తూ ఉంటాము- భయంతో, ఆకలిదప్పులతో, ధన ప్రాణాల నష్టంతో, పండ్ల కొరతతో (పరీక్షిస్తాము)! ఈ సహనమూర్తులకు శుభవార్త ఇవ్వండి. వారికెప్పుడ యినా ఏ ఆపద వచ్చి పడినా, ‘మేము ఖుద్దుగా అల్లాహ్‌ాకు చెందిన వారము, మేము మరలి పోవలసింది కూడా ఆయన వద్దకే కదా!’ అని అంటారు. వారిపై వారి ప్రభువు దయానుగ్రహాలు, కారుణ్యం ఉన్నాయి. సన్మార్గం పొందినవారు కూడా వీరే”.(బఖర: 155-157)
  ”మీలో ధీరోదాత్తులు ఎవరో, సహనమూర్తులెవరో నిగ్గు తేల్చడానికి మేము తప్పకుండా మిమ్మల్ని పరీక్షిస్తాము. మీ స్థితిగతులను కూడా పరికిస్తాము”. (ముహమ్మద్‌; 31)

ప్రతి ఏటా ఇస్రా  – మేరాజ్‌ ఇచ్చే సందేశం:

 ”మీలో ఎవరు విశ్వసించి, సత్కార్యాలు చేశారో వారికి అల్లాహ్‌, వారి పూర్వీకులను భూమికి ప్రతినిధులుగా చేసినట్లుగానే వారికి కూడా తప్పకుండా ప్రాతినిధ్యం వొసగుతానని,తాను వారి కోసం సమ్మతించి ఆమోదించిన ధర్మాన్ని వారి కొరకు పటిష్టం చేసి, దానికి స్థిరత్వాన్ని కల్పిస్తానని, వారికున్న భయాందోళనల స్థానే శాంతిభద్రతల స్థితిని కల్పిస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. (అయితే అల్లాహ్‌ ఈ వాగ్దానం షరతులతో కూడుకున్నది) వారు నన్ను మాత్రమే ఆరాధించాలి. నాకు సహవర్తులుగా ఎవరినీ కల్పించకూడదు. ఇంత చెప్పిన తర్వాత కూడా ఎవరయినా విశ్వాస ఘాతుకానికి పాల్పడితే ముమ్మాటికి వారు దుర్మార్గులవుతారు”. (అన్‌ నూర్: 55)

 దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”అల్లాహ్‌ భూమిని  నా కోసం కుంచింపజేశాడు. నేను తూర్పు పశ్చిమ భూభాగాలను చూశాను. అతి త్వరలోనే నాకు చూపించబడిన భూభాగం వరకు నా అనుచర సమాజం రాజ్య విస్తరణ  చేరుకుంటుంది”. (ముస్లిం)
 నేటి మన స్థితి ప్రసవ వేదన వంటిది. ఆ వేదన ఎంత తీవ్రతర మవుతుందో సహాయం కూడా అంతే సమీపంలో ఉంటుందన్న ఆశా భావంతో మనం సత్యధర్మ ధ్వజవాహకులుగా శాంతి స్థాపనకై కంక ణం కట్టాల్సి ఉంది.

Sunday, February 21, 2021

సుభిక్షం - దుర్భిక్షం - 1st part

 


సకలలోక సృష్టికర్త అయిన అల్లాహ్ మనిషికి మహీతలంపై తన మనుగడ సవ్యంగా సాగించేందుకు కావాల్సి ఒనరుల్ని, అవసరమైన వసతులను అతను అడగకుండానే ప్రసాదించాడు. సృష్టిలో సృష్టికర్త చేసిన లోటు ఏమి లేదు. సకల సౌఖ్యాలను మనిషికి ప్రసాదించి అతన్ని సమస్త జీవరాసులలో ప్రవరుఁనిగా చేసి నిలబెట్టాడు. అయితే మనిషి తనకు ప్రాప్త మయి ఉన్న మహోన్నత స్థానాన్ని కాపాడుకోలేక పోయాడు, ఇది అతని తప్పు. తన స్వార్థం కోసం, తన స్వయ ప్రయోజనాల కోసం నాకంలా ఉన్న 'నర' లోకాన్ని ఒక ప్రయోగశాలగా, ఒక మారణహోమంగా మార్చి 'నరక కూపం' లాంటి చేదు అనుభూతిని మిగిల్చాడు. సకల విధమైన సౌకర్యాలతో, దేవుని అనుగ్రహాలతో సుభిక్షంగా ఓలలాడుతున్నఅవనీతలాన్ని అపాయం పాయేసి దయనీయ దుర్భిక్ష స్థితికి గురి చేశాడు. పాపం మనిషిది. విపర్యాసం దుర్గర్వ దానవుడు చేసినదే. అవును, దుర్భిక్ష స్థితి ప్రకృతి చేసినది ఎంత మాత్రం కాదు. దేవుడు చేసినది అంతకన్నా కాదు. ఇదంతా నరుడు చేసినదే, దుర్మార్గ మానవుడు చేసినదే. కాబట్టి దుస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత కూడా నరులమైన మనందరి మీద ఉంది. అందు కోసం కనీస సామాజిక సృహ మనకు అవసరం. వ్యాసం కార్యసిద్ధిలో కొంత వరకైనా దోహద పడగలదని నమ్మకం.

 


బస్సుల్లో, బజార్లల్లో, బస్తీల్లో, పుణ్యక్షేత్రాలలో, హోటళ్ల ముందు, అంగళ్ల దగ్గర....ఎక్కడ చూసినా కనబడతారు అవ్వరార్డులుముష్టివాళ్లు, అడుక్కుతినేవాళ్లు అని వీరిని నామకరణం చేసి తామేదో డిక్షనరీలో లేని కొత్త పదాన్ని కనుక్కున్నామంతగా సంబర పడిపోతూ బలహీనుల్ని తస్కరించడం కూడా మనం గమనిస్తూనే ఆదేదో మనకు సంబంధం లేని విషయంగా దాటి వెళ్లిపోతుంటాము. వారు మా (నవ) లోకానికి చెందినవారు కానట్టుగా ఉపేక్షిస్తూ ఉంటాము. అవసరం ఏదీ లేకపోయినా, ఆస్తులుపాస్తులు మస్తుగా ఉన్నా, దేశాల మీద ఏదోక సంస్థ పేరు తో, సేవ పేరుతో తన పబ్బం గడుపుకోవడానికి అడక్కునే వాళ్లను భిక్షగాళ్లన్నా, ముషెత్తుకు బ్రతికేటోళ్లన్నా చెల్లుతుంది. అంతేగానీ, పూట గడవక, కడుపు మంట చల్లార్చుకోవడం కోసం పిడికెడు అన్నం అడిగేవారిని భిక్షగాళ్లని, ముష్టివాల్లని అనడం ఎంత మాత్రం సబబు కాదు. నిజంగా వారు ఆడుగుతున్నది. భిక్షం కాదు; మన మీద వారికున్న కనీస హక్కును వారు అడుగుతు న్నారు. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ ఇలా సెలవిస్తున్నది: ఫీ అమ్వాలిహిమ్ హక్కుల్ లిస్సాయిలి వల్ మరహూమ్”. వారి సంపదలో నిర్ణీత హక్కు ఉంటుంది. అడిగేవారికి, అడగనివారికి (అవసరం ఉండి కూడా ఆత్మాభిమానం వల్ల అడగనివారు, ప్రకృతి వైపరీత్యాలు తారసపడి సర్వస్వాన్ని కోల్పోయినవారికి) కూడా. (నూహ్: 24,25)

నిజమే; కాలూ చెయ్యీ బాగుండి, సంపాదించే శక్తి ఉండి కూడా కొందరు యాచకుల వర్గంలో మనకు తారసపడతారు. అంతమాత్రాన తొందర పడి వారిని సోంబేరులుగానో, పని దొంగలుగానో ఖరారు చేసెయ్యడం సబబు కాదు. 'యాచకుడు మీ వద్దకు ఒంటె మీద స్వారీ అయి వచ్చినా మీరతనికి ఇవ్వండి' అని ప్రవక్త () వారి మాట ప్రకారం మనం చేయగలిగిన సహా మం మనం చేయాలి. అంతేగాని, ఒక రూక కూడా ఇవ్వకుండా, ఒక్క ఈక కూడా విదిలించకుండా యాచకుణ్ణి నిందించే హక్కు మనకు లేదన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఒకవేళ మనం అనుకున్నదే నిజమయినా, అప్పుడు కూడా మనమెంతో సౌమ్యం గా వ్యవహరించి సమస్యకు తగిన పరిష్కారాన్ని సూచించగలిగతే, వారు చెయగలిగిన పనిని వారికి పురమాయించ కలిగితే మాన కాభ్యుదయానికి, సమాజాభ్యున్నతికి, దేశాభివృద్ధికి దోహదం కెసినవారం అవుతాము. గత్యంతరం లేని వాళ్లను, అనాథలను, తంతువులను, వికలాంగులను, ఆసరా కరువై, ఆదరణకు హరమైన వృద్ధజీవులకు విధిగా కూడు, గూడు, గుడ్డ వంటి

నీస అవసరాల్ని తీర్చాలన్నది ఇస్లాం ఉపదేశం. బడుగు, -లహీన వర్గాలను ఉద్దరించేందుకు మానవ సమాజంలో ధనం ఒక కాదు, కావలసిందల్లా మంచి చేయాలన్న హృదయం. సాటి

నిషి ఆదుకోవాలన్న తపన. మానవునికి ఎదుర్కొంటున్న పర్భిక్ష దయనీయ స్థితిని దూరం చేయాలన్న సదభిప్రాయం కావాలి. అంతే! విషయమై ఖుర్ఆన్ మనల్ని ఇలా బోధిస్తుంది: మరియు దేవుడు నిన్ను మార్గము తెలియని వానిగా పొందెను. -వున నీకు (ధర్మ) మార్గమును చూపెను. మరియు దేవుడు న్ను పేదవానిగా పొందెను. కావున నిన్ను ధనవంతునిగా జేసే సెను. కావున తండ్రి లేని బిడ్డను (అనాథను) నీవు గద్దింప ము. మరియు అడుగునట్టివానిని అదలింపకుము. మరియు నీ 5భువు యొక్క మేలును గూర్చి పలుకుచుండుము". -

(అజుహా: 7-) ఎరో చోట ఇలా సెలవియ్యబడింది: అహ్సిన్ కమా -హ్సనల్లాహు ఇలైక”. అల్లాహ్ నీకు విధంగా మేలు చేశాడో అదే విధంగా నువ్వు కూడా (ప్రజల పట్ల) సద్వ్యవహారం చెయ్య. (అల్ ఖసస్: 77)

విషయానికొస్తే, మనమందరం బీదవారమే, అవసార్డులమే అశక్తులమే; ఒక్క అల్లాహ్ తప్ప. యా అయ్యుహన్నాసు అన ముల్ ఫుఖరావు ఇలల్లాహ... ప్రజలారా! మీరంతా అల్లాహ్ అవసరం కలిగినవారే. అల్లాహ్ మాత్రం అక్కర లేనివాడు. సర విధాల స్తుతించదగినవాడు. (ఫాతిర్: 15) ఇవ్వడం కష్టమైతే అడగడం మరింత కష్టం 'అడిగాడు' అనగానే అతను ఎంతటివాడైనా అల్పుడైపోతాడు. అంతకు ముందు అతనో దాతయినా, మహా నేతయినా, ప్రాణ మిత్రుడైనా, సమీప బంధువైనా, క్షణం క్రితం వారిని అభిమానిఁ చిన మనమే వారిని అట్టడుగున పడేస్తాము. మరుక్షణం నుండి అతనిలోని సకల సుగుణాలకు అర్థం మారిపోతుంది. అతని పరువు ప్రతిష్టలు మట్టి పాలవుతాయి, అతని కీర్తికండూతి మొత్తం జీరో స్థాయికి చేరుకుంటుంది. ఏం? అడిగినందుకు ఫలితం కలిగినా, కలగకపోయినా ఛీత్కారం మాత్రం తప్పదు. ఇలా మనం ఎందుకు వ్యవహరిస్తామో ఒక్క క్షణం కోసం ఎప్పడైనా సునిశితంగా ఆలోచించామా?! ఒక వ్యక్తి మనల్ని ఏదైనా సహాయం అడిగాడు అంటే మనల్ని తన పాలిట శ్రేయోభిలాషులుగా ఎంచి తన సమస్యను మన ముందు పెట్టాడు అని ఎందుకు అనుకోము? అడిగాడు-అంటే, అడుక్కున్నాడు, ముప్టెత్తుకుంటు న్నాడు అనేగా అని వాదిస్తాము. ఇంకా స్నేహము, బాంధవ్యము, మర్యాద అన్న మాటలు అర్థం లేనివి అని భావిస్తాము. అది అతని పాలిట వరమో లేదా మన పాలిట శాపమో దేవుడికే ఎరుక.

ఎంత కష్టం! ఆలోచించే కొద్దీ గుండె తరుక్కుపోతుంది. ఎవరిని అడగాలి? ఎలా అర్థించాలి? ఏ విధంగా ఆరంభించాలి? ఏమని అడగాలి? కంఠస్వరంలో గాద్గదం కలుగుతుంది. లోగొంతు పడు తుంది. మాట రావడం కష్టమైపోతుంది. బలవంతంగా మాటను బయటికి ఈడ్వాల్సి ఉంటుంది. సంఘర్షణలో మాటలు తెగి పోతాయి. అన్ని అక్షరాలు స్వచ్ఛంగా ఉచ్చరించడానికి దమ్ము,

ధైర్యమ చాలదు. అనుకున్న మాటలు అంతరిక్షానికి ఎగిరి పోతాయి. వల్లే వేసుకున్న పాఠాలు చెల్లాచెదురైపోతాయి. ఇదో వేదనయితే, అడినందుకు ఫలం 'అడిగాడు' అని అన్పించుకో వడం తప్ప ఇతర ఫలం దక్కదేమోనన్న యమ యాతన మరో వైపు. ఒళ్లంతా పాములు, తేళ్లు పాకుతున్న అనుభూతి. గుండె ల్లో శూలాలు గుచ్చుకుంటున్నట్టు విపరీత బాధ. ప్రాక్టీస్ కోసమే 'సహాయం' అని అనబోతాడు. '' అన్న అక్షరం మాత్రమే విన బడుతుంది. తర్వాత అధరాలు మాత్రం అదురుతాయి. మనసున్న మారాజులు, ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే, ఒకరికి మంచి చేయాలన్న హృదయం గలవారు గ్రహించుకోవాల్సిందే. యాతన అంతా పూర్వ రంగమే. ఇది తెలిసిన కాళిదాసు ఇలా అన్నాడు:

అభ్యర్థనాభంగ భమేవ సాధుః

మాధ్యస్థ మిద్దే ప్యపలంబ్య తేర్దే

]అడిగితే ఎక్కడ లేదని సమాధానం వినవలసి వస్తుందేమోనని కావలసిన వస్తువును కూడా అక్కర లేదన్నట్టే ఊరుకుంటారట. ఖుర్ఆన్లో ఇటువంటి ఆత్మాభిమానధనుల గురించి ఇలా సెల వియ్యబడింది: ముఖ్యంగా సహాయానికి అర్హులైనవారు, దైవ

ధ్యేయ పథంలో తలమునకలై ఉండి స్వంత ఉపాధి సంపాదనకై - ధరణిలో ఎటూ కదలలేని నిర్ధనులు. వారిని ఎరుగని వ్యక్తి వారి ఆత్మాభిమానాన్ని చూసి, వారు కలిగినవారేనని తలపోస్తాడు. వారి ముఖాల ద్వారా వారి నిజ స్థితిని మీరు గ్రహించగలరు. కాని, వారు జనుల వెంటబ రకం కాదు. వారి సహా యార్థం మీరు ఏదైనా ఖర్చు చేస్తే అది అల్లాహ్ కు తెలియకుండా ఉండదు”. (అల్ బఖర: 273) మరో చోట ఇలా ఉంది: యఫ్లెలూనక మాజా యున్ ఖూన్ ఖులిల్ అప్స్ఏం ఖర్చు పెట్టాలి? అని వారు నిన్ను అడుగుతున్నారు. ( ప్రవకా!) 'మీ ఖర్చులు పోగా మిగిలినది' అని నువ్వు వారికి చెప్పు. (అల్ బఖర:2!9 )

మన అవసరాలకు అయి మిగిలిన దాంట్లోంచి కొంచెం ఇవ్వడానికే మనకు అంత కష్టంగా ఉంటే, తన దగ్గర మిగిలున్న ఒకేఒక్క ఆత్మాభిమానం అనే ధనాన్ని సయితం పరిత్యజించి 'లేదు' అని అడగటం అంతకన్నా కష్టమవుతుంది. ఇచ్చేవాడి త్యాగం రవ్వంత అయితే, ఆత్మాభిమానాన్ని చంపుకుని అడిగే వాడి త్యాగం కొండంతటిది. ఆశ్చర్యంగా ఉంటాయీ మాటలు. అడుక్కునేవారికి త్యాగంతో ఏం సంబంధం? అని శంకిస్తుంది హృదయం. కొంచెం అతిగా, అసత్యంగా ఉన్నట్లు కూడా తోస్తుంది. నిజమే. కాని అడిగేవాడు ఎవడు? అడగడమే అల వాటుగా, అదే తమ వృత్తిగా చేసుకొని ఊర్లమీద పడి తిరిగేవారు జాబితాలోకి రారు. వీరు అడుక్కొడాన్ని ఒక విద్యగా, ఒక కళగా చేశారు. కాలేజీలు, యూనివర్సిటీలు లేవుగాని, ఉంటేనా కళలో వీరంతా డిగ్రీలు పుచ్చుకుని పట్టభద్రులయి ఉండే వారేమో కాబోలు! వృత్తి పెద్దల్ని అడిగారని చెబితే అప చారం, అపచారం అంటూ లెంపలేసుకోవడం మనకు ముందు నుంచి ఉన్న ఆనవాయితే. సువర్ణ పుష్పం సమర్పయామిఅంటూ సగౌరవంగా ఇచ్చుకుంటాము. అవును; ఇటువంటివారు అడుక్కోడానికే పుట్టారనిపిస్తుంది. అప్పుడప్పుడు. ధర్మశాస్త్రాలు వీరి సొత్తు అయినట్టు. ధర్మం వీరి చుట్టమైనట్టు. ఇట్టివారికి ఎట్టి వ్యధాభరిత శిక్ష ఉంటుందో ప్రవక్త () హెచ్చరించి ఉన్నారు: ప్రజల దగ్గర అడుక్కోవడమే వృత్తిగా చేసుకున్న వ్యక్తి, ముఖం పై ఒక మాంసపు తునకయినా లేని స్థితిలో అల్లాహ్ ను కలుసు కుంటాడు”. (బుఖారీ,ముస్లిం) , “ధనాన్ని కూడబెట్టాలన్న ఉద్దేశ్యంతో అడక్కునే వాడు వాస్తవానికి అగ్ని జ్వాలల్ని కోరుకుంటున్నాడు. కనుక ఎక్కువ అడుక్కుం టాడా, తక్కువ అడుక్కుంటాడా అనేది అతని ఇష్టానికే వదిలి పెడుతున్నాను”. (ముస్లిం) “(అవసరం లేకపోయినా అలవాటు) భిక్షాటన ఒక గాయం లాంటిది. మనిషి భిక్షాటన చేసి తన ముఖాన్ని గాయపర్చు కుంటాడు”. (తిర్మిజీ)