Sunday, March 30, 2014

కన్న కలలు కల్లలాయె... కడకు మిగిలింది కన్నీళ్ళేనాయె....


(దగా పడ్డ ఈ దీనురాలి దయనీయ గాథ)
 ''ట్రుంటు ట్రూం, ట్రుంటు ట్రూ'' నోకియా రింగ్‌ టోన్‌లో మొబాయిల్‌ మ్రోగసాగింది. ఇల్లు తుడుస్తున్న లీనా పరుగెత్తుకుని వెళ్ళి ఫోన్‌ రిసీవ్‌ చేసింది.
 ''హెలో గుడ్‌ మార్నింగ్‌! నేను వతనియా ఆవ¦ీసు నుండి అయిషాని మాట్లాడు తున్నాను. లీనా గారితో మాట్లాడాలి'' (ఉర్దూలో మాట్లాడుతుంది ఆ అమ్మాయి)
''ఆఁ, ఆఁ నేను లీనానే మాట్లాడేది''
   ''కంగ్రాచ్యులేషన్స్‌, మీకు మువ్పై వేల దీనార్ల లాటరీ వచ్చింది....'' ఉలిక్కి పడింది లీనా. ఆ వెద్ద 'షాక్‌' నుండి తేరుకుంటూ ఆలోచించసాగింది. తనకు ఉర్దూ వచ్చా రాదా? ఆ ఫోన్‌లోని స్వరాన్ని తను సరిగా అర్థం చేసుకోగలిగిందా? ''తీస్‌ హజార్‌ దీనార్‌!'' అంటే మువె¦్ౖప వేల దీనార్లే కదా!
  ''నేనేమి వింటున్నాను, ఇది   కలా నిజమా?''  నా మెదడులో ఉన్న డబ్బు విచ్చి చెవుల్లో ఈ రూపంలో మారుమ్రోగడం లేదు కదా'' ఊహాలోకాల్లో తేలిపోతోంది లీనా. అంతలో ''మీరు టీ.వి చూడడంలేదా? మేము నాలుగు రోజులుగా మీ వేరున లాటరీ వచ్చిందని ప్రకటిస్తున్నాం''.
  ''నాకదేం తెలియదే! నేనసలు టీ.వి చూడనండీ, అప్పుడప్పుడు తీరిక ఉన్నప్పుడే చూస్తాను''.
''మీకు కేష్‌ కావాలా, చెక్‌  కావాలా?''
 ''ఇదేంటీ? నేనింత అదృష్టవంతురాలినా? జీవితాంతం ఇండ్లలో పనిచేసి బ్రతికిన నాకు మువె¦్ౖప వేల దీనార్లా! ఓ అల్లాహ్‌ా! నావై ఒక్కసారే ఇంతగా దయ దలిచావా? నిజంగా నీవు కరుణామయుడివి. అమ్మయ్య! హాయిగా ఇండియాకెళ్ళిపోతాను, నా రెక్కలు సుఖపడే సమయమొచ్చేసింది.'' క్షణంలో రక రకాల కలలు...రకరకాల  ఆలోచనలు ముసురు కున్నాయి. ''ఓ దేవుడా! ఇది నిజమా?'' అని గట్టిగా అరచినట్లడిగింది. 
  ''సిస్టర్‌! ఇది నూటికి నూరు పాళ్ళు నిజం, మీరు నమ్మలేకున్నారు కదూ! ఒక పని చేయండి, మీ వద్ద ఒకవేళ లాన్డ్‌ లైనుంటే దాంతో నా నెంబరువై ఫోన్‌ చేయండి. మీ మొబైల్‌లోని సిమ్‌ కార్డ్‌ తీసి నెంబరు చూసుకోండి. మీ నెంబరు 9636.'' ఆమె చెవ్పినట్లు అలాగే లాండ్‌లైన్‌తో ఆమెకు ఫోన్‌ చేసింది లీనా. పాపం తనకు ఆ నెంబరు చూడడం తెలియదు.  హడావిడిగా తన ఇంగ్లీషు బాస్‌ వద్దకు వెళ్ళి నెంబరు చూడమని ప్రాధేయపడింది. అతను ఎందుకన్నట్లు ప్రశ్నార్థకంగా ఆమె వైపు చూస్తూ నెంబరు చెప్పసాగాడు. (ఆ నెంబరు అమ్మాయి చెవ్పిందే) అరే నిజమే ఆ నెంబరే! ఉంది. ఆ అమ్మాయి మాటలవై పూర్తిగా నమ్మకం కుదిరింది లీనాకు. ''ఇప్పుడేం చేయాలి నేను?'' అనడిగింది లీనా.
 ''మీకు కువైట్‌లో బ్యాంక్‌  అకౌంట్‌ ఉందా?''
''లేదు''
''ఐతే ఇప్పుడే ఏ షాపు నుండైనా పది పది దీనార్ల  27 వతనియా కార్డులు కొని వాటి నెంబర్లను మాకు తెలియ పరచాలివెంటనే మేము మీకు డబ్బు ఏర్పాటు చేస్తాం''.
  ''ఇప్పుడే ఎలా కుదురుతుంది? కాసేపు ఆగి వెళతాను. నేనుండే ఇంటికి షాపు చాలా దూరంగా ఉంది'' అంది లీనా. కాని ఆమె ఒప్పుకోలేదు. ''నేను లైనులో ఉంటాను. మీరు నాతో మాట్లాడుతూ వెళ్ళండి, కొని తీసుకు రండి'' అని పురమాయించింది.
  లీనా అబాయా వేసుకొని త్వరత్వరగా తన అకామా కోసం దాచివెట్టిన 800 వందల దీనార్లలోనుండి 270 దీనార్లు తీసిబఖాలా నుండి 27 కార్డులు కొని, వారికి    నెంబర్లు 
 చెవ్పింది. (ఇలా   ఏవ్రిల్‌ నెల 2010 8 వ తేదిన  పంవింది) నెంబర్లు తీసుకోగానే ఆ అమ్మాయి ఇలా అంది: ''ఒక విషయం సిస్టర్‌! దీనిలో ఇతరులను ఇన్వాల్వ్‌ చేయకూడదు, మాకు మరెవ్వరితోనూ పనిలేదు. మేము మీతోనే డయిరెక్ట్‌గా సరప్రదిస్తాము. మీరు మెసేజెస్‌ చూస్తూ ఉండండి. మరి ఫోన్‌ రిసీవ్‌ చేస్తూ ఉండండి, హేవ్‌ ఎ నైస్‌ డే'' అని వెట్టేసింది.
  ''యా రబ్బీ! నీవు అపార  కరుణా మయుడివి, ఊహకందని చోటు నుండిస్తావు'' అంటూ   కళ్ళు  మూసుకుని గట్టిగా గాలి వీల్చుకుంది లీనా. తను బయటకు వెళ్ళడం, రావడం, నెంబర్లు చెప్పడం అంతా కన్నార్పకుండా చూస్తూ ఆమెను గమనిస్తు న్నాడు ఆమె బాస్‌. కాసేపటికి తన లోకంలో నుండి బయటపడి చుట్టూ చూడగానే తననే చూస్తున్న బాస్‌ను చూసి ఖంగు తిన్నది లీనా. బాస్‌కు ఈ విషయం చెప్పాలా వద్దా అనే సందిగ్ధంలో పడింది క్షణం. తరువాత ఎలాగైనా చెవ్పడం మేలనుకుని సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతూ పూర్తి విషయాన్ని అతనికి వివరించింది. అంతా విని 'ఇలాంటి విచ్చి పనుల్లో తల దూర్చకు, ఇదంతా ఫ్రాడ్‌, లాటరీ వస్తే వతనియా వారికి డబ్బు చెల్లించడమేమిటి? ఇవన్నీ పబ్లిక్‌తో డబ్బు లాగే ట్రిక్కులు'' అని మందలించాడు. అతని ముందు తల ఊవింది, కాని తన లోపల మాత్రం తనకు పూర్తి నమ్మకం. తను ధనికురాలైపోయింది. ఇక ముందు తనకే లోటూ ఉండదు, అన్ని కష్టాలకు ఇక స్వస్తి' - వైకి మాత్రం ఏమీ చెప్పలేదు. అంతలోనే వారివురి మధ్య ఆవరించిన నిశ్శబ్దాన్ని చీలుస్తూ మెసేజ్‌. మెసేజ్‌లో తనకు మువె¦్ౖప వేల దీనార్ల లాటరీ వచ్చిందని, దానికి వతనియా వారు శుభాకాంక్షలు తెలియ జేస్తున్నారని ఉంది. (ఆ మెసేజ్‌ నెంబరు 60641262).
  తను ఆ మెసేజ్‌ని తన బాస్‌కు చూవించింది, బాస్‌ దాన్ని నమ్మాలో, నమ్మకూడదో సందేహంగా తేల్చుకోలేక పోయాడు.  కార్డులు పంవించిన క్షణం నుంచీ లీనా అందమైన ఊహా లోకంలోనే విహరిస్తోంది. ప్రతి అర్థ గంటకు ఫోన్‌ మ్రోగుతూ ఉంది. ఈసారి మళ్ళీ ఉత్కంఠ.
''పాకిస్తానీ మేనేజర్‌ మీకు శుభాకాంక్షలు తెలియ పరచాలను కుంటున్నారు'' అని ఫోన్‌ అతనికిచ్చింది.  ''బహుత్‌ బహుత్‌ ముబారక్‌'' అని చెవ్పి 800 దీనార్లు కట్టి రసీదు తీసుకోండి అన్నాడు మేనేజర్‌. 800 దీనార్లే? మొన్ననే పది పది దీనార్ల కార్డులు అని కట్టించుకున్నారు. మళ్ళీ అంత డబ్బా, ఓ అల్లాహ్‌ా! ఏం చేయాలి? డబ్బు కావాలంటే డబ్బు చెల్లించాలి. తన వద్ద లేదు కాబట్టి తన బాస్‌కు అప్పు ఇవ్వమని అడిగింది. 20 సంవత్సరాలుగా వారింట్లో పని చేస్తుంది కానీ ఎప్పుడూ అలాంటి అవసరం రాలేదు. తను అడగలేదు కాని ఈ సిచ్యువేషన్‌ వేరు. ...మొత్తానికి తన యజమాని నుండి డబ్బు తీసుకుంది. తను కృతజ్ఞతలు తెలుపుకుని 'అల్‌ ముల్లా ఎక్స్‌ంఛేజ్‌' లో కట్టమని వతనియా వాళ్ళు పోన్‌ చేసి చెవ్తే కట్టింది. తనకు ఒక విషయంలో చాలా ఆశ్చర్యం వేసింది. అదేమిటంటే ఏ బ్యాంకి వేరూ, అడ్రసు ఏమీ లేకుండా ఒక వ్యక్తి ఎలా డబ్బు తీసుకోగలడు? ''ముహమ్మద్‌ సులైమాన్‌, సన్‌ ఆవ¦్‌ ముహమ్మద్‌ సులైమాన్‌, పాకిస్తాన్‌.''  వేరిట చెక్కు కట్టించుకున్నారు వాళ్ళు. (ఆనాడు కట్టిన డ్రాప్టు నెంబరు - 6531924598) తన సందేహాన్ని బేంక్‌లో అడిగింది. దానికి వారు ''ఆ వేరిట చెక్‌ పంవిస్తే అతను పాకిస్తాన్‌లో ఏ బ్యేంకీ నుండైనా తీసికోగలడు'' అన్నారు. అతను చాలా వలుకుబడి ఉన్న వ్యక్తి కాబోలు అనుకుంది లీనా. బాస్‌ చెవ్పినట్లు వీళ్ళు ఫ్రాడ్‌ ఆయి ఉండవచ్చు అన్న అనుమానం మాత్రం రాలేదు ఆ పిచ్చి తల్లికి.
    డబ్బు అందిన తరువాత కృతజ్ఞతగా మెసేజ్‌ వచ్చింది. తను పొంగి పోయింది వారి ఎటికేట్స్‌ చూసి. డబ్బు కట్టిన తరువాత ''ఇక్కడకొచ్చి మీ చెక్‌  తీసుకోండి, అని మెసేజ్‌ వస్త్తుందో లేక ఫోన్‌ మ్రోగు తుందోనని వేయి కళ్ళతో నిరీక్షిస్తుండగా మొబైల్‌ మ్రోగింది, మొదటి రింగ్‌కే ఆదుర్దాగా రిసీవ్‌ చేసింది లీనా, అది పాకిస్తాన్‌ నుండి, కంగ్రాట్స్‌ చెవ్పి (800 దీనార్లు అడిగిన వ్యక్తి) మరలా చాలా తీయగా మాట్లాడి ''మీకు చాలా వెద్ద అమౌంట్‌ వచ్చింది కాబట్టి మీరు 750 దీనార్లు ఒకటి, 400 దీనార్లు, 402 దీనార్లు వేర్వేరుగా పంవించాలి. ఇది మీకు ఇవ్వబడే అమౌంట్‌ యొక్క టేక్స్‌. అది కట్టకపోతే డబ్బు తీసుకోవడం వీలు కాదు'' అన్నాడు.
 
  ఓ అల్లాహ్‌! ఇప్పుడే డబ్బు కట్తిని, మళ్ళీ ఎక్కడ్నుంచి వస్తుంది? (తను ఒక ఇంట్లో మేయిడ్‌గా పని చేస్తుందని, ఇప్పటి వరకు పంవిన డబ్బు అప్పు తీసికుని పంపానని మళ్ళీ అంత డబ్బు కట్టలేనని ప్రాధేయ పడింది. కాని అతను, నేను కూడా అశక్తుణ్ణనీ, ఇదీ కంవెనీ నిర్ణయం గనక మీరు కట్టాల్సిందే, సిస్టర్‌! ఎలాగో చేసి కట్టేయండి  త్వరలోనే మీ చెక్‌ మీకొస్తుంది కదా! వెంటనే  పంవించాలి, పంవించక పోతే మేము బాధ్యులము కాము'' అన్నాడు. అతను అర్జెంట్‌ అంటూంటే రెండ్రోజుల గడువు తీసుకుంది.
 ఆ తరువాత డబ్బు కలెక్ట్‌ చేయడానికి తను పడిన కష్టాలు తనకే తెలుసు.  ఆనాడు నిజంగా తనకి తెలిసి వచ్చింది- తను చేసిన తప్పు. కుమిలి కుమిలి ఏడ్చింది. చేతిలో చిల్లి గవ్వ లేదు. అకామా డబ్బు తప్ప. ఇప్పుడే బాస్‌ వద్ద 800 దీనార్లు బాకీ.  మువె¦్ౖప వేల దీనార్లు వస్తాయన్న ధీమాతో ఇంతకి తెగించింది.  కాని డబ్బు జాడలేదు. ఇప్పుడేం చేయగలదు. సరిదిద్దుకునే చాన్స్‌ లేదు, డబ్బు పంవించకపోతే వారు బాధ్యులు కారంట. కట్టకపోతే ముందు పంవిన సొమ్ము నట్టేటిలో మునిగినట్లే అనుకుని ఎలాగో ఇది     చివరిసారి    కదా    అని మళ్ళీ నడుం కట్టింది. అందరు స్నేహితురాళ్ళ వద్ద చందా ఎత్తినట్లు ఒకరి వద్ద నుండి 100, 50, 20, 10 తెలిసినవారందరి దగ్గరా తీసికుని, తన వద్ద అకామా కోసం మిగిలిన డబ్బు అంతా కలివి మూడు డ్రాప్టులుగా  పంవించింది. ( ఆ డ్రాప్టు నెంబర్లు 750 కెడీస్‌, 8137666130, 402 కెడీస్‌, 5896797955, 400 కెడీస్‌, 5590256448) ఇంత డబ్బు పంవే ముందు కనీసం ఈసారన్నా ఎవరినయినా అడుగుదాం, ఏం చేయాలో సలహా తీసుకుందాం అని కూడా ఆలోచించక డబ్బు పంవించేసి పూర్తిగా దివాలా తీసింది. ఆశగా ఎదురు చూస్తోంది, తన ఆశలు అడియాసలౌతాయని కించిత్తు కూడా అనుకోలేదు పాపం. 2,750 దీనార్లు లాటరీ వేరున పంవించి, నిద్రాహారాలు మాని తన తెలివి తక్కువ పనిని ఎవరితో చెప్పుకోలేక కుమిలిపోతోంది. తను ఫోన్‌ చేస్తే రిసీవ్‌ చేసేవారెవరూ లేరు. 'ఆ పాకిస్తానీ నెంబరుకు (ఇంటర్నెట్టుతో ఫోన్‌ చేస్తే నో రెస్పోన్స్‌'. ఒకసారి తను ఫోన్‌తో చేస్తే చక్కగా మాట్లాడాడు, ''మీరు భయపడకండి సిస్ట్టర్‌! మీ డబ్బులు ఎక్కడికీపోవు చాలా త్వరగా వచ్చేస్తాయి'' ఆని హామీ ఇచ్చి మరో 150 దీనార్లు పంపమని కోరాడు. అయ్యో! ఇంకా నూట యాభై దీనార్లా! సిగ్గులేదా వాడికి అనుకుంది. ''భాయి ఇలా చేయడం మీకన్యాయం! వేదరాలిని. పుట్టెడు అప్పులైపోయాయి. కాస్త కనికరించి పంవించండి   మీకు మీ విల్లలకు జీవితాంతం రుణపడి ఉంటాను, దుఆ చేస్తాను.  ఆ లాటరీ డబ్బు కాక పోయినా నేను పంవిన డబ్బే నాకు పంపండి'' అని వలవలా ఏడుస్తూ విన్నవించుకుంటూ ఉంటే ఫోన్‌ కట్‌ చేసేసాడు. అయి పోయింది పాలూ నీరూ తేలిపోయింది. దుర్మార్గులు వేద దాని రక్తం వీల్చుకున్నారు.
  ఇక ఈమె ఏడ్పులూ రోదనలూ వారికి అనవసరం. మొబైల్‌ నిశ్శబ్దమైపోయింది. కొంత మంది కర్కశులు, మనుషులుగా జన్మించి కూడా అణువంత కరుణ లేకుండా ప్రజల పాలిట జలగలై జీవిస్తారు. అంత వెద్ద మోసం చేయడానికి ఎంత వెద్ద ముఠా తయారై ఉంటుందో కాస్త ఆలోచించండి!
''సోదర సోదరీమణులారా !
ఇది ఒక్క లీనాయే కాదు, ఈ కువైట్‌లో ఇంకెందరో అభాగ్యులు ఇలాగే మోసపోయి జీవచ్ఛవాల్లా జీవిస్తూ ఉండవచ్చు''. ఈ ముప్పు ఒక కనువిప్పు. అల్లాహ్‌ా సుబ్‌హానహూ వ తఆలా దివ్య ఖుర్‌ఆన్‌లో ఇలా ప్రకటించాడు:
  ''విశ్వాసులారా ! సారాయి, జూదం, దైవేతర మందిరాలు, పాచికల ద్వారా జోస్యం - ఇవన్నీ అసహ్యకరమైన షైతాన్‌ పనులు. వాటిని విసర్జించండి. మీకు సావ¦ల్య భాగ్యం కలిగే అవకాశం ఉంది.'' (అల్‌ మాయిద: 90)
  ఏదైనా ఒక క్రొత్త పని లేక తెలియని పని ప్రారంభించినప్పుడు ఇతరుల సలహా తీసికోవడం ఉత్తమం. అల్లాహ్‌ ఇలా ఆదేశించాడు:
  ''(విశ్వసించి, తమ ప్రభువునే నమ్ముకున్న భక్తులు) తమ ప్రభువు ఆజ్ఞను శిరసావహిస్తారు. నమాజును నెలకొల్పుతారు. తమ వ్యవహారాలలో పరస్పరం సంప్రదించుకుని ఒక అవగాహనకు వస్తారు....'' (అష్‌ షూరా - 38)

  వై సూక్తి ప్రకారం పరస్పరం సలహా తీసుకోవాలని వ్రేరేవించబడినది. సలహా తీసికునే వారి కార్యాలలో  శ్రేయాన్ని, అల్లాహ్‌ా సమృద్ధిని పొందు పరుస్తాడు. సలహా  వల్ల మనం సత్యానికి దగ్గరౌతాము, ఇతరుల అభిప్రాయాలూ, అనుభవాల వెలుగులో మంచి నిర్ణయానికి వస్తాము. అంతే కాకుండా వ్రేమాభిమానాలు వెరుగుతాయి.  సలహా, మనిషిని  అహంభావం, పొగరుకు దూరంగా ఉంచుతుంది. సలహా తీసుకొనే వారికి ఎప్పుడూ అవమానం లేక వైవ¦ల్యమనేది ఉండదు. సలహా చెడు పరిణామాలను అరికట్తుంది. కనుక సలహా సంప్రతింపులు చాలా అవసరం. లీనా కూడా ఒకవేళ ఎవర్నన్నా సంప్రదించి ఉంటే తను ఇలా మోసపోయి ఉండేది కాదు. (అల్లాహ్‌ ఆమెకు సహనమివ్వుగాక మరియు కష్టాలను దూరం చేయుగాక. ఆమీన్‌)

ఓ మనిషీ! పాపాల నుండి రక్షించుకో


 - షేక్ రియాజ్ 
 అల్లాహ్‌ మనిషిని స్వేచ్ఛా జీవిగా సృష్టించాడు. మనిషి ఈ స్వేచ్ఛను విని యోగించుకుని మంచి లేదా చెడు మార్గాలను అవలంబించవచ్చు. ''మరి మేమతనికి (మంచి, చెడుకు సంబం ధించిన) రెండు మార్గాలను చూపాము''. (అల్‌ బలద్‌ :10)
  మరో చోట అల్లాహ్‌ ఇలా సెలవిస్తు న్నాడు: ''మేమతనికి మార్గం కూడా చూపాము. తద్వారా అతను కృతజ్ఞుడు అయినా కావచ్చు లేదా మేలును మరచిన వాడైనా కావచ్చు''. (అద్‌ దహ్ర్‌: 3)
   సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్‌ మానవునికి శక్తియుక్తులను, స్వేచ్ఛా స్వాతంత్య్రాలనిచ్చి ఇట్టే వదలిపెట్టలేదు. అతని మార్గదర్శనం కొరకు గొప్ప ఏర్పాట్లు చేశాడు. ప్రవక్తలను పంపి, గ్రంథాలను అవతరింపజేసి, వీరి ద్వారా సన్మార్గం ఏదో, దుర్మార్గం ఏదో చాలా చక్కగా వివరించాడు.
    ఎవరైతే దైవవిధేయతా మార్గాన్ని అవలంబిస్తారో వారు స్వర్గ సౌఖ్యాలను అనుభవిస్తారు. మరెవరైతే దైవ తిరస్కార మార్గమైన దుర్మార్గాన్ని అవలంబిస్తారో వారు భగభగమండే నరకాగ్నికి ఆహుతి అవుతారు. కాబట్టి మానవులందరూ పరలోకంలోని శాశ్వతమైన సుఖ సౌఖ్యాల జీవనం కొరకు ఇహలోకంలో ఒకే ఒక్క సృష్టికర్త అయిన అల్లాహ్‌ను విశ్వసించి, ఆయన చూపిన మార్గాన్ని ఎన్నుకొని ఆయనకే విధేయతను చూపుతూ, ఆయన వారించిన నిషిద్ధ (హరామ్‌) పనులకు దూరంగా ఉంటూ సహనంతో జీవనం గడపాలి.  మనిషి కూడా వస్తూ ఉంటాయి. అదే విధంగా మంచితోపాటుచెడు కూడా వస్తూ ఉంటుంది. కాని నిజమైన విశ్వాసి (ముస్లిం) యొక్క   లక్షణం   ఏమిటంటే,   మంచిని    ఆస్వాదించి   చెడు   నుండి  తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. సృష్టికర్త అయిన అల్లాహ్‌ తన దాసులను పాపాల నుండి రక్షణ పొందేందుకు ఎన్నో హెచ్చరికలు చేశాడు. ముందు జాగ్రత్తలు, సూచనలను సూచించాడు.
ఆదం హవ్వా (అ)లు తప్పు చేయటం వల్లనే స్వర్గం నుంచి తీసివేయబడ్డారు
    పాప కారణంగానే మన మాతాపితలైన ఆదం, హవ్వా (అ)లను స్వర్గం నుంచి తీసివేయడం జరిగిందన్న విషయాన్ని ప్రతి మనిషీ ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. చివరికి షైతాన్‌ వారిని పెడ తోవ పట్టించి అక్కడి (స్వర్గం) నుంచి బయటికి తీసివేయించాడు. మేము వారిని ఇలా ఆదేశించాము: ''దిగిపోండి. మీరు ఒండొకరికి శత్రువులు. ఒక నిర్ణీత కాలం వరకు భూమిపైనే ఉండి మీరు లబ్ది పొందవలసి ఉంది''. అప్పుడు ఆదం (అ) తన ప్రభువు నుంచి కొన్ని మాటలు నేర్చుకుని పశ్చాత్తాపం చెందారు. అల్లాహ్‌ా ఆయన పశ్చాత్తాపాన్ని ఆమోదిం చాడు. నిశ్చయంగా ఆయన పశ్చాత్తా పాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు కూడాను''. (అల్‌ బఖరా: 36, 37)

అల్లాహ్‌ వినేవాడు, చూచేవాడు

    పాపాల నుండి చాలా సులువుగా తప్పించుకోవచ్చు. అదెలా సాధ్యం? అని సందేహపడుతున్నారా! నాకు చెవులిచ్చిన ప్రభువు నా మాట వినకుండా ఉంటాడా? నాకు కండ్లనిచ్చిన ప్రభువు నేను చేసే పనులను చూడకుండా ఉంటాడా? అనే భావనను మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి.
ఉదాహరణకు:- షాపింగ్‌ మాల్‌లో సీసీ కెమెరాలుంటే దొంగతనం చేయాలను కునే దొంగకు కెమెరాల ద్వారా   తనను చూస్తున్నారు అనే భయం అతనిలో చోటు చేసుకుంటే ఇక అతను దొంగ తనం చేయగలడా?
  ''భూమ్యాకాశాలలో ఉన్న ప్రతి వస్తువును గురించి అల్లాహ్‌ాకు తెలుసన్నది నీవు చూడటం లేదా? నాల్గవ వాడుగా అల్లాహ్‌ా లేకుండా ఏ ముగ్గురి మధ్య కూడా మంతనాలు జరుగవు. అరవ వాడుగా అల్లాహ్‌ా లేకుండా ఏ ఐదుగురి మధ్య కూడా (రహస్య మంతనాలు సాగవు.) అంతకన్నా తక్కువ మంది ఉన్నా, ఎక్కువ మంది ఉన్నా, వారెక్కడ ఉన్నా - ఆయన (జ్ఞానపరంగా) వారితో ఉంటాడు. మరి వారు చేసుకున్నవన్నీ ప్రళయ దినాన వారికి తెలియపరుస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ అన్నీ తెలిసిన వాడు''. (అల్‌ ముజాదల:7)
   కాబట్టి ఎవరిలోనయితే ''నన్ను సృష్టించి, పోషించి, పాలించే ప్రభువైన అల్లాహ్‌ా ఎప్పుడూ నా వెంట ఉన్నాడు. నా ప్రతి క్రియను చూస్తున్నాడు. నా ప్రతి మాటను వింటున్నాడు. నా చూపుల చౌర్యాన్ని గమనిస్తున్నాడు. నా హృద యంలోని వాటిని సయితం ఎరిగిన వాడు'' అనే భావన ఉంటుందో అటువంటి మనిషి పాప కార్యాలు ఎలా చేయగలుగుతాడు? తన ప్రభువు పట్ల కృతఘ్నతకు ఎలా పాల్పడగలుగుతాడు? ''అల్లాహ్‌ా కళ్ళలోని మోసాన్ని, గుండెల్లోని గుట్టును సయితం (బాగా) ఎరిగినవాడు''. (అల్‌ మూమిన్‌: 19)

దైవ దూతలు రికార్డు తయారు చేస్తున్నారు

  మనిషి తను చేసే ప్రతి పనిని, తను పలికే ప్రతి పలుకునూ దైవ దూతలు వ్రాస్తున్నారు. రేపు ప్రళయ దినాన వీటిని బట్టి లెఖ్క తీసుకోబడుతుంది. ఆ తర్వాత స్వర్గమో, నరకమో ఖరారు చేయబడు తుంది. ఈ విషయాన్ని ప్రతి వ్యక్తీ స్మరించుకుంటూ ఉండాలి.   ''నిశ్చయంగా మీపైన పర్యవేక్షకులు నియమితులై ఉన్నారు. (వారు మీ కర్మలను నమోదు చేసే) గౌరవనీయులైన లేఖకులు. మీరు చేసేదంతా వారికి తెలుసు''. (అల్‌ ఇన్ఫితార్‌: 10-12)
    వేరొక చోట అల్లాహ్‌ ఇలా సెలవిస్తు న్నాడు: ''మేమే మనిషిని సృష్టించాము. వాడి మదిలో మెదిలే ఆలోచనలు సయితం మాకు తెలుసు. మేమతని ప్రాణనాళం కంటే కూడా అతి చేరువలో ఉన్నాం. అతని వద్దకు వెళ్ళిన ఇద్దరు దైవదూతలు అతని కుడి, ఎడమల వైపు కూర్చొని ఉంటారు. మనిషి నోట ఒక మాట వెలువడటమే ఆలస్యం అతని దగ్గర ఒక పర్యవేక్షకుడు (దాన్ని నమోదు చేయటానికి) సిద్ధంగా ఉంటాడు''. (ఖాఫ్‌: 16-18)

పాపం చేసే ముందు మృత్యువును గుర్తు చేసుకోవాలి

  పాపానికి పాల్పడే ముందు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటే కూడా తలపెట్ట బోయే పాపం నుండి మనల్ని రక్షించుకో వచ్చు. ఎందుకంటే మరణం ఒక పచ్చి నిజం. అది ఎక్కడ, ఎప్పుడు, ఎలా సంభ విస్తుందో కూడా ఎవరికీ తెలియదు. దాన్నుండి ఎవ్వరూ తప్పించు కోలేరు.
    ''ప్రతి ప్రాణీ మృత్యువు రుచి చూడ వలసినదే. ప్రళయ దినాన మీరందరూ మీ కర్మల పూర్తి ఫలితాన్ని పొందుతారు. అప్పుడు ఎవడు నరకాగ్ని నుండి కాపాడబడి, స్వర్గంలో ప్రవేశం కల్పించ బడతాడో అతడు నిశ్చయంగా సఫలీ కృతుడయ్యాడు. ప్రాపంచిక జీవితమైతే ఒక మాయా వస్తువు తప్ప మరేమీ కాదు''. (ఆలి ఇమ్రాన్‌: 185)
    సోదరులారా! మనిషి పాపం చేస్తున్న ప్పుడు విశ్వాసం నుంచి తిరిగి పోతాడు.అవిశ్వాస స్థితిలో ఉంటాడు. ఒకవేళ పాపం చేస్తున్న సమయంలోనే మరణం సంభవిస్తే ఇక అతని పరిస్థితి ఏమిటి? ఎవరు అతనిని రక్షిస్తారు? పశ్చాత్తాపం చెందే సమయం కూడా దొరకదాయె!

మన శరీరావయవాలు మనకు  వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి

  ఒకవేళ మనం పాపాలకు పాల్పడితే రేపు ప్రళయం రోజు మన శరీరా వయవాలైన కాళ్ళూ, చేతులు, నోరు, చర్మం మొదలగునవి అల్లాహ్‌ా ముందర సాక్ష్యమిస్తాయన్న సంగతి ఆలోచిస్తూ ఉండాలి. ''ఆ విధంగా వారు నరకాగ్నికి చాలా సమీపంలోకి రాగానే వారి చెవులు, వారి కళ్ళూ, వారి చర్మాలు సయితం వారు చేస్తూ ఉండిన పనుల గురించి సాక్ష్యమిస్తాయి. ''మీరు మాకు వ్యతిరే కంగా ఎందుకు సాక్ష్యమిచ్చారు''? అని వారు తమ చర్మాలనుద్దేశించి అడుగు తారు. ''అన్ని వస్తువులకు మాట్లాడే శక్తిని చ్చిన అల్లాహ్‌యే మాకు మాట్లాడే శక్తిని ప్రసాదించాడు. మరి ఆయన వైపునకే మీరంతా మరలించబడతారు'' అని అవి సమాధానమిస్తాయి.(హామీమ్‌ అస్సజ్దహ్‌: 20,21)

ప్రళయం రోజున పాపాత్ములు  పశ్చాత్తాపంతో కుమిలి పోతారు.

    ఇహలోకంలో సృష్టికర్త అయిన అల్లాహ్‌ా ను, ఆయన ప్రవక్తలను, గ్రంథాలను తిరస్కరించి తన ఇష్టమొచ్చినట్లు పాపాల మీద పాపాలు చేస్తూ పోయే వ్యక్తి మరణ సమయంలోగానీ, ప్రళయ దినానగాని పశ్చాత్తాపంతో అల్లాహ్‌ాను వేడుకుం టాడు. కాని ఏం లాభం? ఆ రోజు ఆ పశ్చాత్తాపాన్ని ప్రభువైన అల్లాహ్‌ా అంగీ కరించడు. తిరిగి సత్కార్యాలు చేసే దానికి భూలోకంలోకి పంపించ డమూ జరుగదు. ''చివరికి వారిలో ఎవరికైనను చావు వచ్చినప్పుడు 'ఓ మా ప్రభూ! నన్ను వెనక్కి పంపించు. నేను వదలి వచ్చిన లోకంలోకే వెళ్ళి సత్కార్యం చేస్తాను'' అని అంటాడు. ముమ్మాటికి అలా జరుగదు. అది అతను అంటున్న ఒక మాట మాత్రమే. వారు మళ్ళీ సజీవులై లేచే రోజు వరకూ వారి వెనుక ఒక అడ్డు తెర ఉటుంది''. (అల్‌ మోమినూన్‌: 99,100)
    వేరొక చోట ఇలా ఉంది: ''ఆ రోజు దుర్మార్గుడైన వ్యక్తి తన చేతులు కొరుక్కుంటూ ఇలా అంటాడు: ''అయ్యో! నేను దైవప్రవక్త మార్గాన్ని అనుసరించి ఉంటే ఎంత  బాగుండేది!    అయ్యో! నా పాడుగాను! నేను ఫలానా వ్యక్తిని స్నేహితునిగా చేసుకోకుండా ఉంటే ఎంత బాగుండేది! నా వద్దకు ఉపదేశం  వచ్చిన  తర్వాత కూడా వాడు నన్ను అపమార్గం పట్టించాడే! ఎంతెనా షైతాను మనిషికి (అదను చూసి) ద్రోహం చేసేవాడే''.   (అల్‌ ఫుర్ఖాన్‌: 27-29)
పాపాలు శాపాలకు గురవుతాయి
   పాపాల వలన మనిషి పరువు పోయి, నలుగురిలో నవ్వుల పాలవుతాడు. ఇంకా శాపానికి గురి అవుతాడు. ''ఇస్రాయీలు సంతతిలోని అవిశ్వాసులు దావూదు నోట, మర్యం పుత్రుడైన ఈసా నోట శపించబడ్డారు. ఎందుకంటే వారు విధే యతకు పాల్పడేవారు. హద్దు మీరి ప్రవర్తించేవారు''. (అల్‌ మాయిదా: 78)
 శపించబడటం అంటే, దైవ కారుణ్యా నికి, శ్రేయోసాఫల్యాలకు దూరంగా ఉంచటం అని భావం. ఈ శాపానికి రెండు కారణాలు: 1) అల్లాహ్‌ా విధించిన వాటిని నెరవేర్చకుండా ఉండటం. హరాం (నిషిద్ధ) విషయాల వెంట పడటం. 2) ధర్మం విషయంలో అతిశ యిల్లటం. లేనిపోని వాటిని ధర్మంలో జొప్పించి, దాని రూపురేఖలను మార్చి వేయటం. (అహ్సనుల్‌ బయాన్‌ - తెలుగు - పేజీ: 524)
  సోదర సోదరీమణులారా! పాపాలన్నిం టిలో అతి ఘోరమైన,  క్షమించరాని పాపం సర్వ లోకాలకు ఒకే ఒక్క సృష్టికర్త అయిన అల్లాహ్‌ాను విశ్వసించకుండా, ఆయన సృష్టించిన సృష్టితాలను ఆయనకు సహవర్తులుగా (షిర్క్‌) చేయడటం. రెండవది: దేవుడు విధించిన ఆజ్ఞలను పాటించకుండా (హరాం) నిషిద్ధ మైన పనులు చేయటం. ఎవరైతే ఇటు వంటి పాపాలకు పాల్పడుతున్నారో వెంటనే ఆ పాపాలను వదిలేసి పశ్చాత్తాపం చేసుకొని పైన తెలిపిన విషయాలను గనక ప్రతి వేళ గుర్తు చసుకుంటూ జాగ్రత్తను వహిస్తే ఇన్షాఅల్లాహ్‌ా  పాపాల నుండి రక్షణ పొందవచ్చు. 

ధర్మ సందేహాలు



ఎడారిలో పని చేసే కార్మికులపై కూడా సామూహిక నమాజు అనివార్యమేనా?

ప్రశ్న:  నేను ఒక ఎడారి ప్రదేశంలో పని చేస్తున్నాను. అక్కడి నుంచి మస్జిద్‌కు వెళ్ళాలంటే 25 కి.మీ ప్రయాణించాలి. అందుకే నేను ఐదు పూటలు నమాజులు ఇంట్లోనే చేసుకుంటున్నాను. ఇది అభ్యంతరకరమా? (ఒక సోదరుడు)
జ: ఇస్లాం ఒక సులభ ధర్మం. దైవదాసులు మోయగలిగినంత బరువు మాత్రమే వారిపై విధించబడింది. ''శాయశక్తులా అల్లాహ్‌కు భయపడండి'' (అత్తగాబున్‌ -16) అని అల్లాహ్‌ ఆదేశిస్తున్నాడు.
  ''మేము దేని నుంచి మిమ్మల్ని వారించామో దాన్నుండి మీరు ఆగిపోండి. మరి మేము దేనిని చేెయమని ఆజ్ఞాపించామో దానిని శాయశక్తులా చేయండి'' అని దైవ ప్రవక్త (స) ఉపదేశించారు. (బుఖారీ, ముస్లిం)
    మీరు మస్జిద్‌కు 25 కి.మీ దూరంలో ఉంటున్నారు కాబట్టి సామూహిక నమాజులో పాల్గొనాల్సిందేనన్న ఆజ్ఞ మీకు వర్తించదు. మీరున్న చోటే ఒంటరిగా నమాజ్‌ చేసుకోవచ్చు. అయితే మీరుంటున్న ఎడారి ప్రదేశంలో మరి కొంత మంది ముస్లింలు కూడా ఉంటే వారితో కలిసి నమాజు చేయటం వాంఛనీయం. ఇదే ఉత్తమం కూడా. ఒకవేళ ఎవరూ లేని పక్షంలో మీరు ఒంటరిగా నమాజు చేసినాసరే మీకు సామూహిక నమాజ్‌ నెరవేర్చిన పుణ్యం లభిస్తుంది. ఒక యుద్ధ సందర్భంగా మహా ప్రవక్త (స) ఇలా వక్కాణించారు: ''మదీనాలో కొంతమంది ఉన్నారు. మీరెంత దూరం ప్రయాణం చేసినా, ఎన్ని లోయలు దాటి వెళ్ళినా వారు కూడా మీ వెంటే ఉన్నారని భావించండి. ఎందుకంటే అనారోగ్యం వారిని మదీనాలో ఉండిపోయేలా చేసింది''. (ముస్లిం)
    దీన్ని బట్టి అవగతమయ్యేదేమిటంటే మనిషిలో సంకల్పశుద్ధి ఉండి, ఒక కార్యాన్ని నెరవేర్చే అవకాశం దొరకనప్పుడు, అల్లాహ్‌ తన కృపతో ఆ కార్యాన్ని నెరవేర్చిన పుణ్యం అతనికి ప్రసాదించగలడు. కాబట్టి ఈ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి. కాని రోజూ ఐదు పూటల నమాజు మాత్రం విధిగా చేస్తూ ఉండండి. వేళకు చేస్తూ ఉండండి.
అఖీఖా ఎన్నాళ్ళ వరకు చేయవచ్చు?

ప్రశ్న: అఖీఖా ఏ వయస్సు వరకు చేయవచ్చు?  (అలీ - కువైట్‌)
జ: 'అఖీఖా' అనేది శైశవంతో ముడిపడి ఉంది. తల్లి కడుపు నుంచి బయటపడిన  శిశువు     శిరోముండనం    చేయడమే అఖీఖా. దాంతోపాటు స్థోమత ఉంటే దైవం తమకు బిడ్డ రూపంలో అనుగ్రహాన్ని వొసగినందుకు కృతజ్ఞతా సూచకంగా పశువును జిబహ్‌ా చేయటం సంప్రదాయం (సున్నత్‌). ఎందుకంటే దైవప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ''ప్రతి శిశువు తన అఖీఖాకి బదులు తాకట్టు (కుదువ)గా ఉంటుంది. కాబట్టి పుట్టిన ఏడు రోజులకు ఆ శిశువు తరఫున పశువును జిబహ్‌ా చేయాలి. (శిశువుకు) పేరు పెట్టాలి. తల వెంట్రుకలు తీయాలి''. (సుననె తిర్మిజీ)
    ఈ హదీసు ద్వారా సుబోధకమయ్యేదేమిటంటే, ఏడవ రోజున అఖీఖా చేయాలి. ఒకవేళ కారణాంతరాల వల్ల ఏడవ రోజున చేయలేకపోతే 14వ రోజున చేయాలి, అదీ కుదరకపోతే 21వ రోజున చేయాలి. ఒకవేళ ఎవరయినా ఒక వయోజనుడు కూడా తన అఖీఖా జరగలేదని తెలిస్తే - ఎప్పుడయినాసరే - తన తరఫున అఖీఖా బాధ్యతను నెరవేర్చడం తప్పు కాదు. 

పీడ కల వస్తే!?
ప్రశ్న: పీడ కల మూలంగా నేను తరచూ రాత్రి పూట  భయాందోళనకు గురవుతూ ఉంటాను...
                                                                                                     (ముహమ్మద్‌ అబ్దుల్‌ జబ్బార్‌ - కువైట్‌)
జ: రాత్రిపూట మీరు నిద్రలో భయపడటం, భయంతో, వ్యాకులతతో అరవటం - ఇదంతా షైతాను వల్లనే. హజ్రత్‌ జాబిర్‌ (ర) కథనం ప్రకారం ఒక పల్లెటూరి వ్యక్తి దైవప్రవక్త (స) సన్నిధికి వచ్చి ''నేను ఒక కల గన్నాను. ఆ కలలో ఒకతను నా తల తీసేశాడు. నేనేమో అతని వెనకే పరుగులు తీస్తున్నాన''ని అన్నాడు. ఇదంతా విన్న దైవప్రవక్త (స) ''నిద్రలో షైతాన్‌ నీ పట్ల చేసిన వెకిలి చేష్టల గురించి ఇతరులతో చెప్పుకోకు'' అని సూచించారు.

  నిద్రకు ఉపక్రమించినప్పుడు షరీయతు సూచించిన రీతిలో 'ధ్యానం' చేసుకుంటే ఇలాంటి పైశాచిక విన్యాసాల నుండి ఉపశమనం లభించవచ్చు. కాబట్టి మీరు నిద్రకు ముందు వుజూ చేసుకుని మస్నూన్‌ దుఆలు చేసుకోండి. ఉదాహరణకు: ఆయతుల్‌ కుర్సీ, నాలుగు 'ఖుల్‌' సూరాలు పఠించి, మీ రెండు చేతులపై ఊది, వాటిని మీ శరీరంపై స్పర్శించండి. ముందు మీ ముఖాన్ని, తర్వాత తలను, ఆ తర్వాత ఇతర శరీర భాగాలను తుడుచుకోవాలి. అల్లాహ్‌ా మీ వ్యాకులతను దూరం చేయుగాక!