Monday, January 18, 2016

ప్రవక్త (స) వారి వైద్య విధానం


తేనెలో స్వస్థత ఉంది

ఖుర్‌ఆన్‌లోని ‘నహల్‌’ (తేనెటీగ) అధ్యాయంలో ఇలా ఉంది: ”ఈ తేనెలో ప్రజలకు స్వస్థత ఉంది.” (16:69). ఈ నిజం 1400 సంవత్సరాలకు పూర్వమే ఖుర్‌ఆన్‌ ప్రకించింది. ఈ విషయాన్ని వైజ్ఞానికులు కూడా ధృవీకరించారు.
ఎంతో మధురమైన, రుచికరమైన ఈ తేనెను చిన్నా-పెద్దా తేడా లేకుండా అందరూ ఎంతో హాయిగా సేవిస్తారు. ప్రఖ్యాత హదీసు సంకలన గ్రంథం ‘అల్‌ జామెఉస్సగీర్‌’లో ”తేనె, ఖుర్‌ఆన్‌ మన స్వస్థతకు మంచి సాధనాల”ని ఉంది.
హజ్రత్‌ నాఫె (ర) ఉల్లేఖనం; ”ఇబ్నెఉమర్‌ (ర)కు ఎప్పుడైనా పుండ్లు లేచినా లేదా ఇలాంటి ఇతర బాధలేమైనా కలిగితే దానిపై తేనె పూసి ఖుర్‌ఆన్‌ లోని ఈ సూక్తి పఠించేవారు-‘యఖ్‌రుజు మిమ్‌బు తూనిహా షరాబున్‌ ముఖ్‌తలిఫున్‌ అల్‌వానుహూ ఫీహి షిఫాఉల్లిన్నాసి.” (ఈ తేనెటీగ నుంచి ఒక విధమైన రంగురంగుల పానకం వెలువడుతుంది. అందులో ప్రజలకు స్వస్థత కూడా ఉంది.) (ఖుర్‌ఆన్‌-16:69)

తేనె – ఉదర వ్యాధులు

హజ్రత్‌ అబూసయీద్‌ ఖుద్రి (ర) ఉల్లేఖనం: హజ్రత్‌ అబూసయీద్‌ ఖుద్రీ (ర) తేనె చికిత్స గురించిన ఓ సంఘటన ఇలా పేర్కొన్నారు: ”ఒకతను దైవప్రవక్త (స) దగ్గరకు వచ్చి ‘నా సోదరుడు కడుపునొప్పితో బాధపడుతున్నాడు’ అని అన్నాడు. దానికి దైవప్రవక్త(స) ‘అయితే అతనికి తేనె తాగించు’ అని చెప్పారు. ఆ వ్యక్తి మళ్ళీ వచ్చాడు (కడుపు నొప్పి తగ్గలేదంటూ). దైవప్రవక్త (స) తిరిగి ‘అతనికి తేనె తాగించు’ అని చెప్పారు. ఆవ్యక్తి మూడోసారి వచ్చాడు (నొప్పి తగ్గలేదంటూ). దైవప్రవక్త (స) మళ్ళీ అతనికి తేనె తాగించు అనే చెప్పారు. అతను నాల్గవసారి వచ్చి ‘నేనతనికి తేనె తాగించాను (కాని నొప్పి తగ్గలేదు)’ అని అన్నాడు. అప్డుడు దైవప్రవక్త (స) ‘దేవుడు నిజమే చెప్పాడు. నీ సోదరుని కడుపే అబద్ధమాడుతోంది. అతనికి తేనె తాగించు’ అని చెప్పారు. ఆ వ్యక్తి (తన సోదరునికి) మళ్ళీ తేనె తాగించాడు. దాంతో అతని సోదరునికి స్వస్థత చేకూరింది.” (బుఖారి,ముస్లిం)
దైవప్రవక్త (స) ‘అతనికి తేనె త్రాగించండి’ అని చెప్పడంలో ఆ వ్యక్తికి సోకిన వ్యాధి కారణంగా ఎక్కువ పరిమాణంలో తేనె త్రాగాల్సిన అవసరం ఏర్పడి ఉండవచ్చు. ఇక తేనె ప్రత్యేక గుణాలు, తీసుకోవాల్సిన పరిమాణం విషయంలో పరిశోధనలు జరపడం మన వైద్యుల బాధ్యత.

తేనె నెలకు మూడుసార్లు సేవించాలి

రంగును బట్టి తేనె రెండు విధాలుగా ఉంటుంది. – ఒకి కొంచెం ఎరుపు వర్ణం, మరొకటి గుడ్డులోని తెల్లని సొనలా ఉంటుంది. దైవప్రవక్త (స) తేనెను చాలా ప్రశంసించారు. ప్రత్యేకంగా ఈ క్రింది ఉల్లేఖనాన్ని గమనించండి:
హజ్రత్‌ అబూహురైరహ్‌ (ర) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త (స) ఇలా ప్రవచించారు: ”ప్రతి నెలా మూడుసార్లు తేనెను సేవించే వారికి ఎలాంటి పెద్ద వ్యాధులు రావు.” (మిష్కాతుల్‌ మసాబీహ్‌, సుననె ఇబ్నెమాజ)
నేటి ఆధునిక పరిశోధనల ద్వారా కూడా తేనె అనేక రోగాలకు మందుగా ఉపయోగపడుతుందని తేలింది. ఇందులో విటమిన్లు వివిధ పరిమాణాల్లో ఉన్నాయి. తేనె విరేచనకారి. కడుపుబ్బరాన్ని, అజీర్తిని, కడుపులోని చెడు త్రేన్పులను దూరం చేస్తుంది. శరీరానికి శక్తిని, కాంతిని ఇచ్చి ఊపిరితిత్తులకు బలం చేకూరుస్తుంది. ఇతర మందులలో తేనెను కలిపి నిల్వ ఉంచటం వల్ల అవి చెడిపోకుండా ఎక్కువ కాలం ఉంటాయి. తేనె దగ్గు, ఆయాసం, జలుబు, పడిశాలకు కూడా బాగా పనిచేస్తుంది. మూతివంకరకు, పకవాతాల్లో మంచి ఫలితాన్నిస్తుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. గుండె జబ్బులకు లాభకారి. కళ్ళ జబ్బులకు హితకారి. శరీరానిఇ కళ, కాంతుల్ని ఇనుమడింపజేస్తుంది. (కితాబుల్‌ ముఫ్రదాత్‌, ఖాసుల్‌ అద్‌వియ పేజి 243)

తేనె ప్రత్యేకతలు

అటుపురాతన వైద్యం, ఇటు ఆధునికవైద్యం రెండూ తేనెలోని బహుముఖ ప్రయోజనాలకు గుర్తించాయి. మొత్తానికి తేనె వల్ల ఒనగూడే లాభాలను గురించి తెలుపని వైద్యం లేదు. ఇక్కడ తేనె ప్రయోజనాలు చూడండి:
– పేగుల్ని శుభ్రపరుస్తుంది.
– ఇది చాలా సున్నితంగా ఉంటుంది కాబ్టి వాత, పిత్త, కఫ, శ్లేష్మాల్ని సమతుల్యంగా ఉంచుతుంది.
– వృద్ధులకు, ఉష్ణశరీర తత్వం గలవారికి ఎక్కువ ప్రయోజనకారి.
– శీతల స్వభావులకు కూడా హితకారియే.
– మూత్రకోశానికి, ప్లీహానికి, ఛాతికి, గుండెకు, జీర్ణకోశానికి స్వస్థత చేకూరుస్తుంది.
– మలమూత్రాలను జారీ చేస్తుంది. మూత్రం సాఫీగా జారీ అవుతుంది.
– కేశవర్థినిగా పనిచేస్తుంది.
– కళ్ళల్లో పెడ్తే చూపు మెరుగవుతుంది. కండ్లకలకను దూరం చేస్తుంది.
– పళ్ళు శుభ్రపడి కాంతులీనుతాయి, గ్టిపడతాయి.
ఇది ఔషధమే గాక, మంచి ఆహారం, పానీయం కూడాను.
ఇన్ని ప్రత్యేకతలతో పాటు సమస్త లోపాలకు అతీతమైనది. ఇది సృష్టికర్త తరపున మానవునికి ప్రసాదించబడిన ప్రత్యేక దివ్యౌషధం-ఇహలోకంలోనూ, పరలోకంలోనూ. (అత్తిబ్‌-యె-నబవి: ఇబ్నె ఖయ్యమ్‌ జౌజి)

సర్వరోగ నివారిణి ఖుర్‌ఆన్‌

సృష్టికర్త, సర్వేశ్వరుడయిన అల్లాహ్‌ ఇలా తెలియజేస్తున్నాడు: ”మేమీ ఖుర్‌ఆన్‌లో విశ్వాసులకు స్వస్థత, (దైవ) కారుణ్యాలు చేకూర్చే విషయాలు అందజేస్తున్నాము. అయితే దుర్మార్గులకు మాత్రం ఇది మరింతో నష్టాన్నే కలిగిస్తుంది.” (ఖుర్‌ఆన్‌-17:82)
ఖుర్‌ఆన్‌ స్వస్థతకు నిలయం. ఇందులో ఆధ్యాత్మిక వ్యాధులతో పాటు శారీరక వ్యాధులక్కూడా స్వస్థత ఉంది. ఇది మానవుల నీతినడవడికల్లోని లోపాలకు, సామాజిక చెడులకు స్వస్థత చేకూర్చే దివ్యౌషధి. ఖుర్‌ఆన్‌ చూపిన మార్గంలో అత్యంత శ్రద్ధాసక్తులతో, పూర్తిగా నడుచుకునే అదృష్టవంతులు సమస్త వ్యాధులకు దూరమైనట్లే. అలాిం వారికి వైద్యులు అవసరం అంతగా ఉండదు.

గోరింటాకు ప్రయోజనాలు

గోరింటాకును మన దేశంలో సాధారణంగా అందరూ వాడతారు. అయితే దీని పూర్తి ప్రయోజనాలు జనసామాన్యానికే కాదు, చదువుకున్నవారికి కూడా తెలియదు. సాధారణంగా గోరింటాకుల్ని రుబ్బి అందం, అలంకరణ కోసం లేదా వేడిని తగ్గించటం కోసం చేతులకు, కాళ్ళకు ప్టిస్తారు. పెళ్ళిళ్ళు పండుగ పబ్బాలకు, లేదా ఏవైనా శుభకార్యాల వేళల్లో కూడా దీన్ని ఎక్కువగా వాడతారు. వైద్యుల పరిశోధనల ప్రకారం గోరింటాకు రక్తాన్ని శుభ్రపరుస్తుంది, చర్మరోగాలలో లాభకారి. కుష్ఠురోగులకు, సుఖవ్యాధుల్లో, కామెర్లలో దీని బెరడు కషాయాన్ని త్రాగించటం ఎంతో ప్రయోజనకరం. శరీర వాపులో, కాలిన చర్మానికి దీన్ని లేపనం చేస్తే మంచి గుణకారిగా పని చస్తుంది.

షిబ్రమ్‌ – ఓ విరేచనకారి

షిబ్రమ్‌ అనేది పాలు కలిగిన ఓ గడ్డిజాతి మొక్క. ఇది నిరుగా సన్నగా పెరుగుతుంది. దీని ఎత్తు సుమారు రెండు మూరల వరకు ఉంటుంది. దీని బెరడు పైభాగంపై నూగు ఉంటుంది. దీన్ని విరిచి చూస్తే దారాల మాదిరిగా నార బయికొస్తుంది. ఇది పచ్చదనం, ఎరుపు మిశ్రితమై లేదా తెలుపు రంగులో ఉంటుంది. ఇది ఉష్ణతత్వంగల మూలిక. శరీరంలోని మలినాలన్నినీ మూత్రం ద్వారా జారీచేస్తుంది. (కితాబుల్‌ మఫ్రదాత్‌, ఖాసుల్‌ అద్‌వియ)
షిబ్రమ్‌ చెట్టులోని కొన్ని భాగాలు విషపూరితంగా ఉంాయి. ఈ మందు శ్లేష్మము, కఫము, కళ్ళె మొదలైన వాి చిక్కదనాన్ని కరిగించి విరేచనాల రూపంలో విసర్జింపజేస్తుంది.ఇది హానికరమైనది కావున దీనిని అనుభవజుడైన వైద్యుని సలహా లేకుండా ఎి్ట పరిస్థితిలోనూ వాడరాదు. ఈ మూలిక తాలూకు దైవప్రవక్త (స) హదీసును గమనించండి.
హజ్రత్‌ అస్మా బిన్త్‌ అమీస్‌ (ర) ఉల్లేఖనం: ”మీరు, విరేచనానికి ఏ మందు వాడతారని దైవప్రవక్త (స) మమల్మి అడిగారు. మేము ‘షిబ్రమ్‌’ వాడతామని చెప్పాము. అప్పుడు దైవప్రవక్త (స) ‘హారున్‌ హారున్‌ (ఇది వేడి చేస్తుంది)’ అన్నారు. మరొక ఉల్లేఖనంలో ‘హారున్‌ యారున్‌’ (చాలా వేడి చేస్తుంది) అని, వేరొక చోట ‘హారున్‌ జారున్‌’ ) వేడి
చేస్తుంది, పైగా విరేచనకారి కూడా)’ అని తెలియజేశారు.” తర్వాత ”షిబ్రమ్‌ ఆకులకు బదులు సునాముఖి ఆకులు వాడమని దైవప్రవక్త (స) మాకు సలహా ఇచ్చారు.”

తౌహీద్ రకాలు


తౌహీద్ (ఏకదైవోపాసన) మూడు రకాలు. ఈ సందర్భంగా ఏకదైవోపాసనకు సంబంధించిన ఈ మూడు రకాలను, క్లుప్తంగానయినా సరే వివరించటం సమంజసం అనిపిస్తోంది. అవేమంటే – 1. తౌహీదె రుబూబియత్ 2. తౌహీదె ఉలూహియత్ 3. తౌహీదె అస్మా వ సిఫ్పాత్.

తౌహీదె రుబూబియత్ అంటే భావం:

ఈ మొత్తం విశ్వానికి సృష్టికర్త, యజమాని, పోషకుడు, కనిపెట్టుకుని ఉన్నవాడు, వ్యూహ రచయిత కేవలం అల్లాహ్ మాత్రమే. నాస్తికులు మినహా మిగిలిన వారంతా ఈ తౌహీద్ ను అంగీకరిస్తారు. ఆఖరికి బహుదైవోపాసకులు సయితం ఈ దృక్పథాన్ని ఒప్పుకున్నారు. ఒప్పుకుంటున్నారు. మక్కాకు చెందిన బహుదైవారాధకుల (ముష్రిక్కుల) ఒప్పుకోలును గురించి ఖుర్ఆన్ ఇలా అభివర్ణించింది:
“ఓ ప్రవక్తా! వారిని అడగండి: ఆకాశం నుంచీ, భూమి నుంచీ మీకు ఉపాధినొసగే వాడు ఎవడు? (మీ) వినేశక్తీ, చూసే శక్తీ ఎవరి అధీనంలో ఉన్నాయి? నిర్జీవమైన దాన్నుంచి జీవమున్న దాన్ని, జీవమున్న దాన్నుంచి జీవము లేని దాన్ని తీసే వాడెవడు? అసలీ విశ్వవ్యవస్థను నడుపుతున్న వాడెవడు? ‘అల్లాహ్’ అని వారు ఠకీమని అంటారు” (యూసుఫ్ – 31)
మరొకచోట ఇలా అనబడింది: “భూమ్యాకాశాలను సృష్టించిన వాడెవడు? అని వారినడిగితే, ‘అల్లాహ్’ అని వాళ్లు చెబుతారు”(అజ్జుమర్-38)
వేరొకచోట సెలవీయబడింది:“ఈ భూమి, భూమిలో ఉన్నదంతా ఎవరిదో మీకు తెలిస్తే చెప్పండి?” అని వారిని అడుగు. ‘అల్లాహ్ దే’ అని వారు చెబుతారు. మరలాంటప్పుడు మీరు ఎందుకు గ్రహించటం లేదు? అని వారితో అను. ఇంకా సప్తాకాశాలకూ, మహోన్నతమైన సింహాసనానికి అధిపతి ఎవరని కూడా వారిని ప్రశ్నించు. ‘అల్లాహ్’ అని వారు తడబడకుండా సమాధానమిస్తారు. మరి అటువంటప్పుడు మీరు ఆయనకు ఎందుకు భయపడటం లేదు? అని వారిని నిలదియ్యి” (అల్ మోమినూన్ : 84 – 89)

తౌహీదె ఉలూహియత్:

అంటే భావం అన్ని కరాల ఆరాధన (ఇబాదల్) లకు, దాస్యాలకు, వేడుకోళ్ళకు అర్హుడు అల్లాహ్ మాత్రమే. ఎవరైనా ఒక ప్రత్యేక వ్యక్తి మెప్పుకోసం లేక అతని అప్రసన్నతకు గురవుతామేమెనన్న భయం కొద్దీ చేసే ప్రతి పనీ ఆరాధన (ఇబాదత్) గానే భావించబడుతుంది. అందుచేతనే నమాజ్, ఉపవాసం, హజ్, జకాత్ వంటి క్రియలు మాత్రమే ఆరాధనలు కావు – ఒకానొక ప్రత్యేక అస్తిత్వం ఎదుట అభ్యర్థించుకోవటం, అతని పేర మొక్కకోవటం, మొక్కుబడులు తీర్చుకోవటం, అతని ఎదుట బుద్ధిగా చేతులు కట్టుకుని నిలబడటం, అతని చుట్టూ ప్రదక్షిణ చేయటం, అతని సమక్షంలో భయభక్తులను ప్రదర్శించటం, అతను తమకేదైనా అనుగ్రహిస్తాడేమోనని ఆశగా నిరీక్షించటం – ఇత్యాదులన్నీ ఆరాధన (ఇబాదత్) గానే పరిగణించబడతాయి. మరి ఇటువంటి పనులన్నీ ఒక్కడైన అల్లాహ్ కోసమే చేయాలి. ఇదే తౌహీదె ఉలూహియత్ (అయితే బాహ్య కారకాల కనుగుణంగా బ్రతికి ఉన్న మనుషుల వద్దకు వెళ్ళి, వారి నుండి ఏదైనా ఆశించటం, వారి యెడల వినయ వినమ్రతలను కలిగి ఉండటం మాత్రం ‘తౌహీద్’ కు విరుద్ధం కాదు). సమాధి పూజ వ్యాధికి లోనయిన సామాన్యులు, ప్రముఖులు ఈ ‘తౌహీదె ఉలూహియత్’ లో షిర్క్ కు ఒడిగడు తుంటారు. ఇటువంటి ఆరాధనలను వారు సమాధులలో ఖననం చేయబడినవారి నుద్దేశించి చేస్తుంటారు. ఇది ముమ్మాటికీ షిర్కే!

తౌహీదె అస్మా వ సిఫ్పాత్ :

అంటే భావం ఖుర్ఆన్ మరియు హదీథులలో అల్లాహ్ గురించి చెప్పబడిన గుణగణాలను, లక్షణాలను ఏమాత్రం వక్రీకరించకుండా, వాటిలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా – యథాతథంగా అంగీకరించటం. అంటే ఆ గుణగణాలు వేరొకరిలో కూడా ఉన్నాయన్న భావనకు సుతరామూ తావీయకూడదు.
ఉదాహరణకు: అగోచర జ్ఞానం అల్లాహ్ గుణం, లేదా దూరాన ఉన్నవారు మొరపెట్టుకున్నా, చేరువలో ఉన్నవారు ఫిర్యాదు చేసినా – అందరి గోడునూ ఆయన వింటాడు అనేది ఇంకొక గుణం. విశ్వమండలంలో ఏదైనా సరే చేయగల అధికారం ఆయనకు ఉంది అనేది ఇంకొకటి. ఇలాంటివే అనేకానేక గుణగణాలు ఆయన సొంతం. మరి అటువంటి గుణగణాలలో ప్రవక్తనో, వలీనో, సజ్జనులనో చేర్చరాదు. ఒకవేళ వారిని కూడా సహవర్తులుగా చేర్చి, ఆ మహనీయులకు కూడా అటువంటి గుణాలే ఉన్నాయని భావిస్తే అది ముమ్మాటికీ ‘షిర్కే’ అవుతుంది.

ఇబాదత్:

ఇబాదత్ అంటే ఒకరి ప్రసన్నతను చూరగొనెందుకు అత్యంత అణుకువను, అశక్తతను, వినయ వినమ్రతలను అభివ్యక్తం చేయటం అని భావం. ఇబ్నె కథీర్ మాటల్లోనే చెప్పాలంటే, “షరిఅత్ లో సంపూర్ణమైన ప్రేమ, అభిమానం, భయము, భక్తీ – వీటన్నింటి సమ్మేళనమే ఇబాదత్.” అంటే ఎవరిపట్లనయితే ప్రేమాభిమానాలు కలిగి ఉంటామో, ఆయన శక్తియుక్తుల ముందు తమ నిస్సహాయ స్థితినీ, దైన్యస్థితినీ వ్యక్త పరచాలి. ఆ శక్తిమంతుడు తమను నిలదీసి అడుగుతాడన్న భీతి కూడా ఆ దాస్యంలో తొణకిసలాడుతూ ఉండాలి. విషయాన్ని సాదాసీదా చెప్పవలసి ఉంటే “నా బుదుక, వ నస్తయీనుక” (మేము నిన్ను ఆరాధిస్తాము, సహాయం కొరకు నిన్ను అర్థిస్తాము) అని అనబడేది. కాని, అల్లాహ్ ఇక్కడ “ఇయ్యాక నాబుదు వ ఇయ్యాక నస్తయీన్” అని నొక్కి వక్కాణించి ఈ వాక్యానికి ప్రత్యేకతను, వైశిష్ఠ్యాన్ని కల్పించాడు – అంటే దీని అర్థం: “ఓ అల్లాహ్! మేము నిన్నే ఆరాధిస్తున్నాము. సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము” అని.
దీని ప్రకారం అల్లాహ్ ను గాక వేరొకరిని పూజించటం గానీ, సహాయం కొరకు వేరితరులను మొరపెట్టుకోవటం గానీ ధర్మసమ్మతం కాదు. ఈ పదాల ద్వారా షిర్క్ (అల్లాహ్ కు భాగస్వాముల్ని నిర్ణయించటం) నిర్ద్వంద్వంగా ఖండించబడింది. కాని హృదయాలలో షిర్క్ రోగం తిష్ఠవేసి ఉన్నవారు ఈ మూలాంశాన్ని విస్మరించి, అపోహలో పడిపోయి, భ్రమలకు లోనై పిడివాదానికి దిగుతారు. నం జబ్బుపడినప్పుడు డాక్టరు సహాయం పొందటం లేదా? ఇల్లాలి సేవల్ని పొందటం లేదా? ఇరుగు పొరుగువారి తోడ్పాటును, డ్రైవరు సాయాన్ని పొందటం లేదా? అని దబాయిస్తారు. ఈ విధంగా వాళ్లు, అల్లాహ్ గాక వేరితరుల సహాయాన్ని అర్థించటం కూడా సమ్మతమేనని మీరు ఒప్పుకునేలా చేయటానికి ప్రయత్నిస్తారు. నిజానికి కారకాలకు లోబడి ఒండొకరి సహాయాన్ని కోరటం, సహాయపడటం షర్క్ కానే కాదు. ఇదైతే దేవుడు సమ్మతించి ఆమోదించిన వ్యవస్థ. ఆ వ్యవస్థలోని పనులన్నీ బాహ్యకారకాలకు అనుగుణంగానే జరుగుతాయి. కడకు దైవప్రవక్తలు సయితం మనుషుల సహాయసహకారాలను పొందుతూ ఉంటారు. దైవప్రవక్త హజ్రత్ ఈసా అలైహిస్సలాం తన జాతి జనులనుద్దేశించి, ‘అల్లాహ్ (ధర్మం) కొరకు నాకు సహాయపడేవారు మీలో ఎవరున్నారు?’ అని అడిగారు (అస్సఫ్ – 14). అల్లాహ్ స్వయంగా విశ్వాసుల నుద్దేశించి, “సత్కార్యం, దైవభక్కికి సంబంధించిన విషయాలలో ఒకరికొరకు సహకరించండి” అని సెలవిచ్చాడు. (అల్ మాయిదా: 2)
మరి ఇటువంటి సహాయసహకారాలు నిషేధించబడటంగానీ, షిర్క్ గా అభివర్ణించబడటం గానీ జరగలేదు. పైగా ఇలాంటి పనులు జరగాలని ప్రోత్సహించటమైంది. ఇలాంటి సత్కార్యాలు ప్రశంసనీయంగా పేర్కొనబడ్డాయి. వాస్తవమైన షిర్క్ తో దీనికి ఎటువంటి సంబంధమూ లేదు. బాహ్యపరమైన కారకాల రీత్యా సహాయం చేయటం ఏమాత్రం చేతకాని వానిని, సహాయం చేయజాలని వానిని “సహాయం చెయ్యి” అని అర్థించటమే అసలు షిర్క్. ఉదాహరణకు: చనిపోయిన ఒకానొక వ్యక్తిని సహాయం కోసం మొరపెట్టుకోవటం, అతడు కష్టాల నుండి గట్టెక్కిస్తాడనీ, అక్కరలు తీరుస్తాడని తలపోయటం, లాభనష్టాలు అతని అధీనంలో ఉన్నాయని ఊహించటం, దగ్గరున్నవారు పిలిచినా, దూరమున్నవారు మొరపెట్టుకున్నా, ప్రతి ఒక్కరి మొరలను ఆలకించే ‘శక్తి’ అతనిలో ఉందని నమ్మటం – ఇదంతా దైవానికి వేరొకరిని సహవర్తులుగా నిలబెట్టడంగా, భాగస్వామ్యం కల్పించటంగా, దేవుని లక్షణాలను వేరొకరికి ఆపాదించటంగా పరిగణించబడుతుంది. ఇదే షిర్క్! దురదృష్టవశాత్తూ ముస్లిం దేశాలలో సయితం ఇటువంటి షిర్క్ వర్థిల్లుతోంది. మహనీయుల (ఔలియాల) పట్ల ప్రేమ కలిగి ఉండటం అవసరం మరి! అంటూ ముస్లింలు ఈ ప్రేమాభిమానంలో అతిశయిల్లి రాగానపడి షిర్కుకు ఒడిగడుతున్నారు. ఇటువంటి పోకడలబారి నుంచి అల్లాహ్ మనల్ని కాపాడుగాక!

హజరె అస్వద్


మక్కాలోని కాబాలో ఉన్న నల్ల రాయిని అరబీ భాషలో అల్ హజర్ అల్ అస్వద్ అంటారు. అనేక భూగోళ శాస్త్రజ్ఞులు మరియు చరిత్రకారులు దీన్ని ఉల్క అంటారు. కాబాలో ఇది తూర్పు దిశ మూలలో ఉంది. ఇది నల్లగా ఉంది.

చరిత్ర

ఇబ్రాహీం అలైహిస్సలాం కాబా నిర్మాణం పూర్తి చేశాక, ఒక రాయి తక్కువపడితే, ఇస్మాయిల్ అలైహిస్సలాం ను వెతకమన్నారు. ఇస్మాయిల్ అలైహిస్సలాం చాలా వెతికారు, కాని దొరకక పోవడంతో తిరిగి వచ్చి చూస్తే, తన తండ్రి ఒక రాయిని పెట్టేశారు. అప్పుడు ఆయన తన తండ్రిని ఇలా అడిగారు: “ఓ తండ్రి! ఈ రాయి ఎక్కడ దొరికింది?” దానికి ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా జవాబిచ్చారు: “జిబ్రయీల్ అలైహిస్సలాం స్వర్గం నుంచి తెచ్చారు.”
ఈ విధంగా కాబా నిర్మాణం పూర్తి అయ్యింది. ఈ రాయి స్వర్గం నుంచి తెచ్చినప్పుడు పాల కన్నా తెల్లగా ఉండింది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “నల్ల రాయి స్వర్గం నుంచి పంపబడినప్పుడు పాల కంటే తెల్లగా ఉండేది. ప్రజల పాపాల వల్ల అది నల్లగా మారిపోయింది.” (తిర్మిజి 2577)
కాబాను పునర్నిర్మించడానికి ఖురైషులు దాన్ని పడగొట్టినప్పుడు, నల్ల రాయి వరకు నిర్మాణం పూర్తిచేశాక, ఒక వివాదం తలెత్తింది. నల్ల రాయిని దాని స్థలంలో ఎవరు ఉంచాలి అనే దానిపై తర్జన భర్జన జరగసాగింది. ఆ వివాదం యుద్ధానికి దారి తీసేలా కనిపించసాగింది. బనూ అబ్దుద్ దార్ ఒక పాత్రనిండా రక్తం తీసుకు వచ్చాడు. అన్ని తెగలకు చెందిన వారు అందులో చేతులు ముంచారు. ఇక అందరూ యుద్దానికి సిద్ధమయ్యారు. వారిలో ఒక పెద్దాయన అబూ ఉమయ్యా ఇబ్న్ అల్ ముఘీరా ఒక ప్రస్తావన ఉంచాడు. అదేమిటంటే, బనీ షైబా ద్వారం గుండా ఎవరైతే మొదట వస్తారో, వారి తీర్పు స్వీకరిద్దాము. దీనికి అందరూ ఒప్పుకున్నారు. ఆ ద్వారం గుండా దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మొట్ట మొదట వచ్చారు. ఈ సంఘటన దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రవక్తగా నియమించబడటానికి ఐదు సంవత్సరాల ముందు జరిగింది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నల్ల రాయిని ఒక దుప్పట్లో ఉంచి, దాని కొసలను ప్రతి జాతికి చెందిన ఒక మనిషిని పట్టుకోమన్నారు. ఇలా పట్టుకుని దాన్ని దాని స్థలానికి దగ్గరగా తెచ్చారు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన స్వంత హస్తాలతో దాన్ని దాని అసలు స్థానంలో ఉంచారు. ఈ విధంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన వివేకం ద్వారా ఒక పెద్ద యుద్ధాన్ని నివారించారు.
ఇస్మాయిలి షియా తెగకు చెందిన ఖర్మాతియన్ యోధులు 930 CE లో హజరె అస్వద్ ను దొంగిలించారు. వారు మక్కా వాసులను చంపి, వారి శవాలను జంజం బావిలో పడేశారు. హజరె అస్వద్ (నల్ల రాయిని) ను తమతో పాటు ప్రాచీన బహరైన్ లోని తమ స్థావరం అయిన ఇహ్సాకు తీసుకెళ్ళారు. అల్ జువైని అనే చరిత్రకారుని ప్రకారం నల్ల రాయి తిరిగి తన స్థానంలో 952 CE లో చేర్చబడింది.
హజరె అస్వద్ ముందు ఒకటిగా ఉండేది. కాని అనేక చారిత్రక సంఘటనల వల్ల అది ఇప్పుడు ఎనిమిది ముక్కలుగా చేయబడింది. ఈ ముక్కలు వివిధ సైజుల్లో ఉన్నాయి. ఈ ముక్కలన్నీ ఒక పెద్ద రాయికి అతికించి దాన్ని వెండి ఫ్రేములో పొదిగించారు. ఈ వెండి ఫ్రేమును మొదట అబ్దుల్లా బిన్ జుబైర్ (రజి) చేయించారు. ఆ తరువాత అవకాశాన్ని బట్టి ఖలీఫాలు దాన్ని మార్చారు.
ఆరు (అదనపు) ముక్కలు టర్కీలోని ఇస్తాంబుల్ లో ఉన్నాయని టర్కీయులు దావా చేస్తున్నారు. అవి నీల మస్జిద్ (బ్లూ మొస్క్)లో ఉన్నాయని వారు అంటారు. దీని ధృవీకరణ ప్రశ్నార్ధకం. తుర్కీయులు అనేక సంవత్సరాలు సౌదీ అరబియాపై పరిపాలన చేశారు. అనేక ఇస్లామీయ అవశేషాలను తమతో పాటు తీసుకెళ్ళారు. కాబట్టి దీని గురించి అల్లాహ్ కే తెలుసు.
హదీస్
అబూ తుఫైల్ ఇలా అన్నారని ఉల్లేఖించబడింది: “దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కాబా తవాఫ్ చేస్తూ, హజరె అస్వద్ (నల్ల రాయి) ను తనతో ఉన్న ఒక కర్రతో స్పర్శించారు. ఆ తరువాత ఆ కర్రను ముద్దుపెట్టుకున్నారు.” (సహీహ్ ముస్లిం 1275)
ఇబ్న్ అబ్బాస్ (రజి) ఉల్లేఖించారు: “దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన ఒంటెపై తవాఫ్ చేశారు. ప్రతి సారి నల్ల రాయి (హజరె అస్వద్) ఉన్న కొసకు రాగానే, దాని వైపు సైగ చేసి ‘అల్లాహు అక్బర్’ అనేవారు.” (సహీహ్ బుఖారీ 4987)

నల్ల రాయి ప్రాముఖ్యత

నల్ల రాయి గురించి అనేక హదీసులు ఉన్నాయి. వాటిని క్రింద పేర్కొనడం జరిగింది.
నల్ల రాయిని అల్లాహ్ స్వర్గం నుండి భూమిపై పంపించాడు. ఇబ్న్ అబ్బాస్ (రజి) ఉల్లేఖించారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “నల్ల రాయి స్వర్గం నుండి వచ్చింది.” (తిర్మిజి 877, నసాయి 2935)
ఈ రాయి పాల కంటే తెల్లగా ఉండేది. కాని ఆదం సంతానం పాపాల మూలంగా ఇది నల్లగా మారింది. ఇబ్న్ అబ్బాస్ (రజి) ఉల్లేఖించారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “నల్ల రాయి స్వర్గం నుండి వచ్చినప్పుడు పాల కంటే తెల్లగా ఉండేది. కాని, ఆదం సంతానం యొక్క పాపాల వల్ల అది నల్లదై పోయింది.” (తిర్మిజి 877; అహ్మద్ 2792, ఇబ్న్ ఖుజైమిన్ సహీహ్ అని ధృవీకరించారు 4/219)
(a) అల్ ముబారక్ పూరి (రహి) అల్ మర్ఖాలో ఇలా అన్నారు: ఆదం సంతానం పాపాల వల్ల, వారు తాకిన ఈ రాయి నల్లగా మారిపోయింది.
(b) అల్ హాఫిజ్ ఇబ్న్ హజర్ (రహి) ఇలా అన్నారు: కొందరు ఈ హదీసును విమర్శిస్తూ ఇలా అన్నారు: బహుదైవారాధకుల పాపాలు దీన్ని నల్లగా మార్చినప్పుడు, ఏకదైవారాధన చేసే వారి ఆరాధనలు దీన్ని ఎందుకు తెల్లగా మార్చలేదు? ఇబ్న్ ఖుతైబా చెప్పినదాన్ని నేను జవాబుగా చెబుతున్నాను: అల్లాహ్ తలిస్తే, ఇలా జరిగేది. నల్ల రంగు ఇతర రంగులను మారుస్తుంది, కాని స్వంత రంగును మార్చుకోలేదు. తెల్ల రంగు ఇతర రంగులను మారుస్తుంది మరియు స్వంత రంగును కూడా మార్చుకుంటుంది. అల్లాహ్ ఇలా చేశాడు.
(c) అల్ ముహిబ్బ్ అల్ తబరీ ఇలా అన్నారు: అంతర్ద్రుష్టి గలవారికి ఇది నల్లగా ఉండడంలో ఒక పాఠo ఉంది. మానవుని పాపాలు ఒక ప్రాణం లేని రాయి మీద ఇంతగా ప్రభావం చూపించగలిగినప్పుడు, మానవుని హృదయంపై ఇంకెంత ప్రాభవం వేయగలవో ఊహించండి. (ఫత్ హుల్ బారి 3/463)

నల్ల రాయి తీర్పు దినాన వచ్చి, తనను తాకిన వారి పక్షంలో సాక్ష్యం ఇస్తుంది.

ఇబ్న్ అబ్బాస్ (రజి) ఉల్లేఖించారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నల్ల రాయి గురించి ఇలా అన్నారు: “అంతిమ దినాన అల్లాహ్ నల్ల రాయిని తీసుకు వస్తాడు. అప్పుడు దానికి రెండు కళ్ళు ఉంటాయి, దాంతో అది చూస్తుంది మరియు నాలుక ఉంటుంది, దానితో అది మాట్లాడుతుంది. దాన్ని మనస్ఫూర్తిగా తాకిన వారి గురించి అది సాక్ష్యం ఇస్తుంది.” (తిర్మిజి 961; ఇబ్న్ మాజా 2944)
హజ్ కోసమైనా, ఉమ్రా కోసమైనా లేదా నఫిల్ తవాఫ్ అయినా – నల్ల రాయిని తాకడం, చుంబించడం లేదా దాని వైపు సైగ చేయడం తవాఫ్ మొదలు పెట్టే ముందు చేయవలసిన పని.
జాబిర్ ఇబ్న్ అబ్దుల్లా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మక్కాకు వచ్చినప్పుడు, తవాఫ్ చేసే ముందు నల్ల రాయి కొసను ముద్దాడేవారు. ఆ తరువాత తవాఫ్ లోని ఏడు ప్రదక్షినల్లో, మొదటి మూడింటిలో రమల్ (వేగంగా నడవడం) చేసేవారు. (సహీహ్ బుఖారీ 2.673 & సహీహ్ ముస్లిం 1218)
దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నల్ల రాయిని ముద్దాడారు. ఆయన సమాజం (ముస్లింలు) వారిని అనుసరించారు.
ఉమర్ (రజి) నల్ల రాయి వద్దకు వచ్చి, దాన్ని ముద్దాడారు. ఆ తరువాత ఇలా అన్నారు: “నీవు కేవలం ఒక రాయివి అని నాకు తెలుసు. నీవు నాకు లాభం గానీ, నష్టం గానీ కలిగించలేవు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నిన్ను ముద్దాడుతూ నేను చూసి ఉండక పోతే, నేను నిన్ను ముద్దాడే వాణ్ణి కాదు.” (సహీహ్ బుఖారీ 1520; సహీహ్ ముస్లిం 1720)
ఎవరైనా నల్ల రాయిని చుంబించలేకపోతే, అతను దాన్ని చేతితో తాకడానికి ప్రయత్నించాలి లేదా ఇతర దేనితోనైనా తాకి, దాన్ని చుంబించవచ్చు.
(a) అబూ తుఫైల్ ఇలా అన్నారని ఉల్లేఖించబడింది: “దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కాబా తవాఫ్ చేస్తూ, హజరె అస్వద్ (నల్ల రాయి) ఉన్న కొసను స్పర్శించారు. ఆ తరువాత తనతో ఉన్న సిబ్బందిని ముద్దుపెట్టుకున్నారు.” (సహీహ్ ముస్లిం 1275)
ఒకవేళ ఎవరైనా పై దానిని చేయలేని పక్షంలో, అతను తన చేతితో సైగ చేస్తూ “అల్లాహు అక్బర్” అనాలి. ఇబ్న్ అబ్బాస్ (రజి) ఉల్లేఖించారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన ఒంటెపై తవాఫ్ చేశారు. నల్ల రాయి ఉన్న కొసకు వచ్చిన ప్రతి సారి దాని వైపు సైగ చేసి “అల్లాహు అక్బర్” అనేవారు. (సహీహ్ బుఖారీ 4987)
నల్ల రాయిని తాకడం వల్ల అల్లాహ్ మనిషి పాపాలను మన్నిస్తాడు. ఇబ్న్ ఉమర్ (రజి) ఉల్లేఖించారు: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఆ రెండిటినీ (నల్ల రాయి మరియు రుక్నె యమాని)ని తాకిన వారి పాపాలు మన్నించబడుతాయి.” (తిర్మిజి 959) [3]

అపోహ : రాయి దైవం కాగలదా?

తవాఫ్ లో నల్ల రాయిని అంతగా చుంబించిననూ, ముట్టుకున్ననూ ముస్లింలు దీన్ని పూజించరు. ఒక్క అల్లాహ్ ను ఆరాధించే వారు ఎవరూ ఇలా ఆలోచించరు. ఇది వారికి ఒక రాయి మాత్రమే. ఇది ఎవరికీ ఎలాంటి మేలు లేదా చెడు కలిగించజాలదు. మేలు లేదా చెడు కలిగించే అధికారం కేవలం ఒక్కడైన అల్లాహ్ కు మాత్రమే ఉంది. ఒక్క అల్లాహ్ ను ఆరాధించే వారెవరూ ఇలా చేయరు. కేవలం బహుదైవారాధకులు మాత్రమే ఇలా చేస్తారు. ఇలాంటి వారికి నల్ల రాయి ఓ రహస్యంగా మారిపోయింది. అజ్ఞానం కారణంగా వీరు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కాబాలోని విగ్రహాలన్నిటిని విరగ్గొట్టి కేవలం కాబాను లేదా నల్ల రాయిని విడిచిపెట్టారు అని అంటారు. అంతెందుకు కొందరు ముస్లింలు కూడా సందేహానికి లోనవుతారు. అందుకే రెండో ఖలీఫా ఉమర్ (రజి) ప్రజల్లోని ఈ సందేహాన్ని చెరపడానికే, దాన్ని (నల్ల రాయిని) చుంబించడానికి వచ్చినప్పుడు అందరు వినేలా బిగ్గరగా ఇలా అన్నారు: అబిస్ బిన్ రబియా ఉల్లేఖించారు: ఉమర్ (రజి) నల్ల రాయి వద్దకు వచ్చి, దాన్ని చుంబించి ఇలా అన్నారు: “నిస్సందేహంగా నీవు ఒక రాయివి మాత్రమే. నీవు ఎవరికీ ఎలాంటి మంచి లేదా చెడు కలిగించలేవు. నేను గనక దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నిన్ను చుంబిస్తూ చూడకపోతే, నిన్ను ఎన్నటికీ చుంబించే వాడిని కాను.” (సహీహ్ బుఖారీ 808)
రాయిని చుంబించడం, దాన్ని ఆరాధించినట్లు కాదు. నల్ల రాయిని చుంబించడం విగ్రహారాధన చేసినట్లు అవదు. ఎందుకంటే, రాయి ఒక రూపం కాదు. కొందరు, ముస్లింలు విగ్రహారాధన చేస్తారు అని అంటారు. కాని, వాస్తవం ఏమిటంటే ముస్లింలు ఒక్కడైన అల్లాహ్ తప్ప ఎవరినీ ఆరాధించరు.
అల్లాహ్‌! తన అను మతితో, మిమ్మల్ని స్వర్గం వైపునకు మరియు క్షమాభిక్షపొందటానికి పిలుస్తున్నాడు.మరియు ఈ విధంగా ఆయన తన సూచనలను ప్రజలకు – బహుశా వారు గుణ పాఠం నేర్చుకుంటారని – స్పష్టంగా తెలుపు తున్నాడు.