Friday, February 25, 2022
Thursday, February 24, 2022
భ్రమల వలయం
'నష్టతుల్ అరబ్'లోని ఓ క్యారెక్టర్ అష్అబ్. ఓ రోజు అష్అబ్ అల్లరి పిడుగుల్లాంటి పిల్లలతో పరేషాన్ అయిపోయాడు. వీరి నుండి ఎలాగైనా బ్రతికి బయట పడటానికి ఓ పథకం వేసుకున్నాడు. పిల్లలందరినీ పిలిచి “చూడండీ పిల్లలూ! మీరంతా నాతో ఉండి ఓ మంచి అవకాశాన్ని చేజార్చుకుంటున్నారు. ఎందుకంటే, ఊరి పొలిమేరల్లో పప్పు-బెల్లాలు, లడ్డూ-జాంగిరీలు పంచుతున్నారు. వెళ్ళండి ఆలస్యం చేయొద్దు" అన్నాడు.
ఈ వార్త విన్నదే ఆలస్యం పిల్లలందరూ మిఠాయిల కోసం ఉరుకో ఉరుకు అని పరుగు
లంకించుకున్నారు. వారు వెళ్లిన కాసేపటికే అష్అబ్ కి ఏం తట్టిందో ఏమోగానీ ....తానూ
పిల్లల వెంబడి పరుగెత్తసాగాడు. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న ఓ వ్యక్తి- “నువ్వెందుకు
అలా పరుగెత్తుతున్నావు?” అని నిలదీయగా, “బహుశా
నిజంగానే అక్కడ మిఠాయిలు పంచుతున్నారేమో!” అన్నాట్ట అష్అబ్.
ఈ పిట్ట కథ ద్వారా పుకారుకి - భ్రమకి మధ్య తేడా తెలుసుకోవచ్చు. పిల్లలు అష్అబ్
రేకెత్తించిన రూమర్ ప్రభావానికి లోనై పరుగెత్తారు. వారి ఈ ప్రతి స్పందనకు కారణం ఓ
గట్టి నమ్మకం ఊహ మరియు అజ్ఞానం, తెలియనితనం అయితే, అష్అబ్
కూడా పరుగెత్తడం అనేది కేవలం ఓ భ్రమ ప్రభావమే. అది తెలియనితనం ఎంత మాత్రం కాదు.
అతని ఈ భ్రమ అన్నది మూర్ఖత్వం , పేరాశ లాంటి నకారాత్మక ఎమోషన్స్ తో
మిళితమైనది. ఈ తేడాను ఎందుకు ఎత్తి చూపాల్సి వచ్చిందంటే, మనసు చేసే
గారడిని, ప్రజల్లో, సంఘంలో ప్రబలివున్న రూమర్లని అర్థం చేసుకునేందుకు ఇది దోహదపడుతుంది. ఈ
వ్యత్యాసాన్ని విస్మరించిన మూలంగానే వదంతి అన్నది ఓ భ్రమగా రూపాంతరం చెందుతుంది. ఆ
భ్రమే మానవ హృదయాల్లో గట్టిగా నాటుకుపోయి ఓ నమ్మకంగా స్థిరపడుతుంది. అలా అది అనేక
సమస్యలకు దారి తీస్తుంది. ఇటువంటి పుకార్లను ముస్లింలు నమ్ముతూ వాటినే సరైన
మార్గంగా భ్రమించి బ్రతుకుతున్నారన్నది నిరాకరించలేని నిజం. ప్రజల్లో ప్రబలివున్న
ఈ భ్రమలను మూడు విధాలుగా విభజించవచ్చు.
(1)
సాధారణ ప్రజల భ్రమలు (2)
విద్యావంతుల భ్రమలు (3) పండితుల భ్రమలు. ఇక్కడ మనం మొదటి రకం భ్రమల్ని
తెలుసుకుందాం.
ధర్మంలో లేని విషయాలు:
(ఇక) అవిశ్వాసుల
కర్మలు ఎండమావుల్లా నిరుపయోగమవుతాయి. దప్పిక గొన్నవాడు ఎడారి మైదానంలో ఎండమావిని చూసి, అక్కడేదో జలాశయం
ఉందని భావిస్తాడు. తీరా ఆ ప్రదేశానికి చేరుకుంటే అక్కడసలు నీరే ఉండదు. పైగా (తీవ్రమైన
దాహంతో నాలుక పిడచగట్టుకుపోయి, కొనఊపిరితో కొట్టుమిట్టాడే దుస్థితి ఏర్పడుతుంది.
(నూర్: 39)
ఎండ సమయంలో తారు రోడ్డు మీద మనం నిలబడినపుడు కొంత దూరంలో రోడ్డు మీద నీటి మడుగు
ఉన్నట్టు కన్పిస్తుంది. కాని అక్కడ నీరు ఉండదు ఈ విధంగా భ్రమ కలిగించే మాయా నీటిని
మావులను ఎండమావులు అంటారు.
కాంతి కిరణాలు వంగి ప్రయాణించడం వలన దూరంగా ఉన్న వస్తువులు స్పష్టంగా కాక కదలాడుతున్నట్లు
భ్రమ కలిగిస్తాయి. ఎడారిలో దూరం నుంచి చూస్తే నీరున్నట్లు కనిపించడం కూడా దీని ప్రభావమే.
ఇలాగే మనిషిలోని విజ్ఞాన కాంతి క్షీణించినప్పుడు మానసిక, ఆధ్యాత్మిక
భ్రమలు చోటు చేసుకుంటాయి.
ధార్మికంగా చూస్తే ఏ ఆధారం లేకుండా ఏర్పర్చుకున్న భ్రమలు 'బిదాత్ ' (నూతన
పోకడలు) క్రిందికి వస్తాయి. అయితే ఈ ఆచార దురాచారాలను తుంగలో తొక్కేయాలని, మొగ్గలోనే
తుంచేయాలని దృఢ సంకల్పంతో లేచిన ఉద్యమాలన్నీ విఫలమవ్వడం ఆశ్చర్యానికి
గురిచేస్తుంది. బహుశా దీనికి గల ముఖ్య కారణం-ప్రజలు నయవంచకుల నయా సిద్దాంతాల్ని
నిజానిజాలు తెలుసుకోకుండా నమ్ముతూ జీవించడమే.
ఈ వర్గం 'ఖురానీ ఆమాల్' లాంటి దురాచారాల
చాటున మంత్ర తంత్రాల- క్షుద్ర విద్యల విచిత్ర లోకాన్ని ప్రవేశపెట్టారు. ఇటు
ప్రజల్లోని సామాన్యులు, ప్రముఖులు కూడా ఇలాంటి కార్యాలను 'బర్కత్' గా
గొప్పవిగా భావిస్తూ వచ్చారు. నిశిత దృష్టితో గనక పరీక్షిస్తే అనేక ఖురానీ ఆమాల్
బహుదైవారాధనతో మలినమయి ఉన్నాయి. అయితే ప్రజల్లో ధర్మావగాహన లోపాన్ని, వారికి
అరబ్బీ వాక్యాల అర్థం తెలియకపోవడాన్ని సువర్ణావకాశంగా భావించిన మెగా
మోసగాళ్లు కొందరు వారిని వంచించి సొమ్ము
చేసుకుని జేబులు నింపుకుంటున్నారు.
“రూహుల్
జఫర్” 174వ పేజీలో ఇలా ఉంది: "అన్ని రకాల మనో
వాంఛల్ని తీర్చగలిగే విధానం ఇది; యా హువ, యా అల్లాహ్, యా సమద్, యా అహద్, యా
జిబ్రీల్. (ఓ శక్తిమంతుడా! ఓ అల్లాహ్! ఓ నిరపేక్షా పరుడా! ఏకైక దేవుడా! ఓ
జిబ్రీల్!)
చూశారా ! అల్లాహ్ తో పాటు దైవ దూత జిబ్రీలను సైతం దైవత్వంలో
చేర్చి ప్రజల ధర్మాన్ని ఎలా భ్రష్టుపట్టిస్తున్నారో!? ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇవీ, ఇలాంటి అనేక దురాచారాలు ఇస్లామీయ ఆచారాలుగా
భావించబడుతూ ఉన్నాయి. ఇలాంటి దురాచారాలకి దైవం తరఫు నుండి, దైవ ప్రవక్త (స) గారి తరఫు నుండి ఎలాంటి
ప్రమాణం లేనప్పటికీ - ఒకప్పుడు పుకార్లుగా, రూమర్స్ గా ఉన్న ఈ దురాచారాలు భ్రమలుగా మారి నేడు ముస్లిం జనజీవనాన్నే
శాసిస్తున్నాయి. పటిష్టమైన విశ్వాసంగా, ధర్మంలోని భాగంగా అవిభాజ్య అంశంగా చెలామణి అవుతున్నాయి.
తమకు తోచిన విధంగా ఊహాగానాలు చేయటం అతి పెద్ద నేరంగా పరిగణించింది ఇస్లాం.
అయినప్పటికిన్నీ ఈ వంచకులు అదే బాటన నడిచారు. ఖుర్ఆన్ ఆయతులను నీళ్ళలో నానబెట్టి
త్రాగటం, స్నానం చేయటం, రక్తంతో వ్రాయడం, ఇంకా
ఇంతకన్నా నీచ ప్రవృత్తికి పాల్పడటం, ఖురానీ -ఆమాల్
పేరిట తావీజులు, దండలు కస్టమర్ ఇచ్చే రేటుని బట్టి తయారు చేయటం, దివ్య
వచనాలను సంఖ్యల్లో మార్చి వ్రాయటం, జెండాలు తీయటం, ఉరుసులు
చేయటం, ఊరేగింపులు తీయటం, దర్గాలను, దగాకోరులను
ఆశ్రయించటం మొదలైనవి ఈ కోవకు చెందినవే. వీరి గురించి అల్లాహ్ ఏమంటున్నాడో కాస్త
గమనించండి.
“వారు స్వయంగా
మార్గభ్రష్టత్వం కొనితెచ్చు కోవడమే కాక, మిమ్మల్ని కూడా భ్రష్టుల్ని చేయజూస్తున్నారు." (దివ్య ఖుర్ఆన్-
4:44)
“వారిలో కొందరు
నిరక్షరాసులు కూడా ఉన్నారు. వారికి గ్రంథ జ్ఞానం బొత్తిగా లేదు. అయినా వారు
లేనిపోని ఆశలు కల్పించుకొని ఊహాకెరటాలపై తేలిపోతుంటారు." (దివ్య ఖుర్ఆన్- 2:
78)
“వారిలో కొందరు
దైవవాణిని చదివి అర్థం చేసుకున్నప్పటికీ, దాన్ని ఉద్దేశ్య పూర్వకంగా తారుమారు చేస్తుంటారు."
(దివ్య ఖుర్ఆన్- 2:
75)
pasword: 8125397662
user name /
22-DS109
22-DS110
22-DS111
22-DS112
22-DS113
