Saturday, September 18, 2021
Sunday, July 25, 2021
Sunday, May 2, 2021
ఇస్లాంలో మానవ హక్కులు
అపార కృపామయుడై న అల్లాహ్ పేరుతో
ఇస్లాంలో మానవ హక్కులు - సకల మానవాళికి, యావత్ విశ్వానికి ఏకైక సంపూర్ణాధికారి అల్లాహ్. ఆయనే సార్వభౌముడు. ఆయనే జీవికనిచ్చేవాడు, పోషించేవాడూను. అపార కరుణామయుడు. ఆయన కరుణా కటాక్షాల వల్ల సమస్త జీవజాలం ధన్యమవుతుంది. అంతేకాదు, ఆయన ప్రతి మనిషికి గౌరవ ప్రతిష్ఠలను ప్రసాదించాడు. ఆయన మనిషిలో తన ఆత్మను ఊదాడు. కాబట్టి, మానవులంతా అల్లాహ్ దృష్టిలోను ఆయన కారణంగాను ఒక్కటే. తమ సహజ లక్షణాలు ఎలా ఉన్నప్పటికి మానవులందరూ నిర్ద్వంద్వంగా సమానులే. మనుష్యుల మధ్య ఉన్న యాధృ చ్చిక భిన్నత్వం - జాతీయత, రంగు, జాతిలాంటి దాని ప్రాతిపదికన వారి మధ్య ఎలాంటి వ్యత్యాసాలనూ పాటించ లేము. ప్రతి మనిషికి అందరితోనూ బాంధవ్యముంది. అందరిదీ ఒకే వర్గం. సౌభ్రాత్రతతో, సంతోషంతో, అనంత కరుణామయుడైన విశ్వప్రభువును సేవించే వర్గమిది. అలాంటి స్వర్గతుల్యమైన వాతావరణంలో ఇస్లాంలోని ఏకేశ్వరభావన బలవత్తరమయింది. వాతావరణానికి కేంద్రంగా నిలుస్తుంది. మానవ సమానత సర్వమానవ సౌభ్రాత్రతా భావనలకు ఊతంగా నిలుస్తుంది.
ఇస్లామీయ రాజ్యం భూమి పై ఎక్కడయినా ఏర్పడ వచ్చు. అయితే ఇస్లాం మాత్రం మానవ హక్కులను మానవ అధికారాలను భూసరిహద్దులకు మాత్రమే పరిమితం చేయదు. సర్వ మానవాళి కొరకు ఇస్లాం కొన్ని ప్రాథమిక మానవ హక్కుల్ని ప్రతిపాదించింది. ఈ హక్కులు అన్ని పరిస్థితులలోనూ గౌరవించదగ్గవి, ఆచరించదగ్గవి. ఇస్లామీయ రాజ్య పరిధుల్లో ఉన్న వ్యక్తి అయినా లేక బయట ఉన్న వ్యక్తి అయినా సరే, శాంతి సమయంలో అయినా లేక యుద్ధ సమయంలోనయినా ఎల్లవేళలా ఈ హక్కులు మానవులందరి పట్లా పాటించదగ్గవి. ఈ విషయమై ఖురాన్ స్పష్టంగా చెబుతుంది.
[caption id="attachment_3433" align="aligncenter" width="300"]
“మీ ప్రాణం, మీ ఆస్తులు ప్రళయంలో మీరు మీ ప్రభువు సన్నిధిలో హాజరయ్యే వరకు ఒండొరులకు నిషిద్ధమైనవి."ఇస్లాంలో మానవ హక్కులు[/caption]
విశ్వసించిన ప్రజలారా! అల్లాహ్ కొరకు సత్యం పై స్థిరంగా ఉండే వారుగా, న్యాయానికి సాక్షులుగా నిలబడండి. (ఏదైనా) వర్గంలో ఉన్న వైరం కారణంగా మీరు ఆవేశానికి లోనయి న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చేయండి , ఇది దైవభక్తి పరాయణతకు చాలా సన్నిహితం. (5 : 8)
ఎట్టి పరిస్థితులలోనయినా మానవ రక్తం పవిత్రమైనది. తగిన కారణమేదీ లేకుండా మానవ రక్తాన్ని చిందించరాదు. ఎలాటి కారణమూ లేకుండా ఓ వ్యక్తిని చంపడం ద్వారా మానవ రక్తానికి గల పవిత్రతకు ఎవరయినా భంగపరిస్తే ఆ అకృత్యాన్ని సకల మానవాళిని హత్య చేయడంతో సమానంగా పరిగణిస్తుంది ఖురాన్.
ఎవరయితే ఓ మనిషిని, హత్యకు ప్రతి హత్య (శిక్ష)గానో లేక భువిలో అల్లకల్లోలాన్ని సృష్టించినందుకు (శిక్ష)గానో తప్ప మరే కారణంగానయినా హత్య చేసినట్లయితే అతను మానవాళినంతటినీ హత్య చేసినట్లు. (5 : 32)
మహిళలు, పిల్లలు, వృద్ధులు, రోగగ్రస్తుల పై అణచివేత అనుమతించరాదు, మహిళల మాన మర్యాదలను అన్ని పరిస్థితులలోనూ గౌరవించాలి. అన్నార్తులకు ఆహారమందాలి. కట్టుబట్టల్లేనివారికి దుస్తులనివ్వాలి. రోగగ్రస్తులకు, క్షతగాత్రులకు - వారు ఇస్లామీయ రాజ్యంలోని ముస్లిములై నా ముస్లిమేతరులయినా లేక శత్రువర్గం వారు అయినా సరే - వారికి తప్పక వైద్య సహాయం అందాలి.
ఇస్లాంలో మానవ హక్కుల గురించి మాట్లాడడమంటే వాస్తవానికి ఈ హక్కులు అల్లాహ్ ప్రసాదించినవని ఒప్పుకోవడమన్నమాట. ఈ హక్కులను ఏ రాజుగాని, లేక ఏ చట్ట సభగాని ఇవ్వలేదు. రాజులు, చట్టసభలు ఇచ్చిన హక్కులు ఏ విధంగా ప్రాప్తించాయో అదే విధంగా రద్దు కానూవచ్చు. అదేవిధంగా నియంతలు ఇచ్చిన హక్కులు సయితం అశాశ్వతమైనవి. నియంతలు, రాజులు తమ కిష్టం ఉన్నప్పుడు ఆయా హక్కులను అంగీకరిస్తారు. తమకు కష్టంగా తోచినప్పుడు నిరాకరిస్తారు. ఆయా హక్కులను తమకిష్టం వచ్చినప్పుడు కాలరాస్తారు. కాని, ఇస్లాంలో మానవ హక్కులను అల్లాహ్ ప్రసాదించాడు కనుక ప్రపంచంలోని ఏ చట్టసభకు, ఏ ప్రభుత్వానికి, దైవ ప్రసాదితమైన ఈ హక్కులలో మార్పులు, చేర్పులు చేసే అధికారం గాని - ఈ హక్కుల్ని నిరాకరించే, రద్దుపరచే అధికారంగాని లేదు.
కేవలం ప్రదర్శనా లక్ష్యంతో కాగితాలకే పరిమితమై, ప్రదర్శన ముగిసిన తరువాత వాస్తవ జీవితానికి అందని హక్కులు కావివి. అలాగే కేవలం తాత్విక భావనలు, ఆచరణకు నోచుకోలేని వాదాలు కావివి. ఐక్యరాజ్యసమితి చార్టరు, తీర్మానాలు, ప్రకటనలను అల్లాహ్ ప్రసాదితమైన ఈ హక్కులతో పోల్చలేము. ఎందుకంటే ఇస్లాంలోని హక్కులు ఇస్లామీయ విశ్వాసంలోని భాగాలు. ప్రతి ముస్లిం, ముస్లింగా ప్రకటించుకునే ప్రతి పాలకుడు ఈ హక్కులను అంగీకరించాలి. ఈ హక్కులను గుర్తించాలి. అమలులోకి తేవాలి, ఆచరించాలి. ఈ హక్కులను అమలు పరచలేకపోతే, దైవప్రసాదితమైన హక్కులను త్రోసి పుచ్చడం ప్రారంభిస్తే, ఈ హక్కులలో మార్పులు, చేర్పులు చేయనారంభిస్తే కేవలం నోటి మాటను హక్కులుగా గుర్తించి ఆచరణలో నిరాకరిస్తే అలాటి ప్రభుత్వాల గురించి దివ్య ఖుర్ఆన్ స్పష్టంగా, నిర్ద్వంద్వంగా ఇలా అంటుంది :అల్లాహ్ అవతరింపజేసిన చట్టం ప్రకారం ఎవరైతే తీర్పు చెయ్యరో, వారే తిరస్కారులు. (5 : 44)
ఇస్లామీయ రాజ్యంలో మానవ హక్కులు
1. ప్రాణరక్షణ; ఆస్తి రక్షణ :
ఆఖరి హజ్ యాత్ర సందర్భంగా ప్రవక్త మహనీయులు చేసిన ప్రసంగంలో “మీ ప్రాణం, మీ ఆస్తులు ప్రళయంలో మీరు మీ ప్రభువు సన్నిధిలో హాజరయ్యే వరకు ఒండొరులకు నిషిద్ధమైనవి." అని ఉద్బోధించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ 'జిమ్మి' (ఇస్లామీయ రాజ్యంలోని ముస్లిమే తరు)ల గురించి ఇలా అన్నారు: "ఒడంబడిక రక్షణలో ఉన్న వ్యక్తి (అంటే జిమ్మి)ని హత్య చేసిన వ్యక్తి స్వర్గం సువాసనను కూడా ఆఘ్రాణించలేడు."
2. మానమర్యాదల రక్షణ :
దివ్య ఖుల క్రింది విధంగా ఆదేశిస్తుంది.
1. విశ్వసించిన వారలారా ! ఓ జాతి ప్రజలు మరో జాతి ప్రజలను అపహాస్యం చేయనీయవద్దు. 2. ఒండొరులను అప్రదిష్ఠపాలు చేయవద్దు. 3. యెగతాళిగా పేరు మార్చి అవమానించవద్దు. 4. ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడవద్దు. (49 : 11,12)
3. వ్యక్తిగత జీవిత పవిత్రత, రక్షణ :
దివ్య ఖర్ఆన్ క్రింది విధంగా ఆదేశిస్తుంది. ఆ 1. ఒకరిపై ఒకరు నిఘావేసి వెంటాడరాదు.
2. అనుమతి లేనిదే ఎవరి ఇంటిలోనికి జొరబడరాదు.
4. వ్యక్తిగత స్వేచ్చకు రక్షణ :
ఏ వ్యక్తి నేరమయిననూ బహిరంగ న్యాయస్థానంలో నిరూపితం కావంతవరకు ఏ పౌరుడినీ నిర్బంధించరాదు అని దివ్య ఖుర్ఆన్ నిర్దేశిస్తుంది. కేవలం అనుమానమున్నంత మాత్రాన ఏ వ్యక్తినయినా నిర్బంధించడం వ్యాయస్థానంలో తగిన వ్యవహారం నడుపకుండా కారాగారంలో పెట్టడం, ఆ వ్యక్తికి తాను నిర్దోషినని నిరూపించుకునే అవకాశాన్ని ఇవ్వకపోవడం - ఇలాటి చర్యలకు ఇస్లాంలో అనుమతి లేదు.
5. దౌర్జన్యాన్ని నిరోధించే హక్కు :
ఇస్లాం మానవాళికి ప్రసాదించిన హక్కుల్లో ప్రభుత్వ దమననీతిని నిరోధించే హక్కు ఒకటి. ఈ విషయమై ఖుర్ఆన్ ఇలా అంటుంది : మనిషి బహిరంగంగా చెడును మాట్లాడటాన్ని అల్లాహ్ ఇష్టపడడు. అయితే అన్యాయానికి గురయిన వ్యక్తికి ఆ హక్కు ఉంది. (4 : 148)
ఇస్లాంలో ఇంతకుముందు వివరించినట్లు, సర్వాధి కారాలు, ఆధిపత్యం అల్లాహ్ కే చెందుతాయి. మనిషి వద్ద కేవలం ప్రాతినిధ్యం వహించే అధికారం మాత్రమే ఉంది. మానవునికి ఉన్న అధికారం కేవలం దైవదత్తమయింది. అది మానవునికడ ఉన్న దేవుని ఓ అప్పగింత. అలాటి అధికారమును గ్రహించినవాడు, తాను ఎవరిపై ఎవరి కోసం, ఈ అధికారాన్ని ఉపయోగించడానికి వచ్చాడో ఆ ప్రజల ముందు జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. ఈ విషయం హజ్రత్ అబూబకర్ రజి) చేసిన మొదటి ప్రసంగం ద్వారా విదితమవుతుంది.
"నేను సక్రమంగా వ్యవహరిస్తున్నంతకాలం నాతో సహకరించండి, కాని నేను పొరపాటు చేస్తే సరిదిద్దండి. దైవం, దైవ ప్రవక్త ఆదేశాలను నేను అనుసరించినంతకాలం నాకు విధేయత చూపండి. నేను దైవ ఆదేశాలను ఉల్లంఘిస్తే నాకు ఎదురుతిరగండి."
6. వాక్ స్వాతంత్ర్యం :
ఇస్లాం ఆలోచనా స్వాతంత్ర్యాన్ని భావప్రకటనా స్వేచ్చను దేశ పౌరులందరికీ సమానంగా ఇస్తుంది. అయితే ఈ స్వేచ్చ కేవలం మంచినీ, సత్యాన్ని ప్రచారం చేయడానికి మాత్రమే వినియోగించాలి. చెడును, చెడు నడతను ప్రచారం చేయడానికి వాడరాదు అన్న ఆంక్ష విధిస్తుంది. పాశ్చాత్య దేశాల్లోని భావప్రకటనా స్వేచ్చ భావన కన్నా ఇస్లాం ప్రతిపాదించే భావన ఎంతో ఉన్నతమైనది. ఎలాంటి పరిస్థితులలోను ఇస్లాం చెడుల ప్రచారానికి అనుమతినివ్వదు. విమర్శల పేరుతో దూషించే, ఇతరులను కించపరిచే అధికారాన్ని ఇస్లాం ఎవరికీ ఇవ్వదు. ప్రవక్త కాలంలో ముస్లింలు ఏదైనా విషయంపై తమ భావాలను ప్రకటించే ముందు దైవ ప్రవక్తను సంబంధిత విషయమై దైవాదేశాలు అవతరించాయా అని అడగడం అలవాటుగా ఉండేది. ఆయన ఆ విషయంలో ఎలాటి దైవాదేశాలు అవతరించలేదని చెబితే అప్పుడు ముస్లింలు స్వేచ్ఛగా తమ భావాలను ప్రకటించేవారు.
7. కూటముల నేర్పరిచే స్వేచ్చ :
పార్టీలను, సంస్థలను, కూటములను ఏర్పరిచే స్వేచ్ఛను సయితం ఇస్లాం ప్రసాదించింది. అయితే ఈ స్వేచ్ఛ సయితం కొన్ని నిర్దిష్ట నియమాలకు లోబడి ఉంటుంది.
8. మనస్సాక్షిని అనుసరించే, అవలంబించే స్వేచ్చ :
“ధర్మంలో ఎలాటి బలత్కారమూ ఉండరాదు" అని శాసిస్తూంది ఇస్లాం.
ఇందుకు విరుద్ధంగా ఏక సత్తాక (Totalitarian) సమాజాలు వ్యక్తుల స్వేచ్ఛను పూర్తిగా నిరాకరించాయి. ఈ అన్యాయ భరితమైన రాజ్యాధికారం వాస్తవానికి వ్యక్తులను బానిసలుగా, దాసులుగా పరిగణిస్తుంది. పూర్వం బానిసత్వానికి అర్థం, ఓ మనిషిపై మరో మనిషి సర్వాధికారం కలిగి ఉండటం, కాగా నేడు అలాటి బానిసత్వం న్యాయపరంగా రద్దయినప్పటికీ, దాని స్థానే ఏకసత్తాక (Totalitarian) సమాజాలు వ్యక్తుల పై అదే విధమైన బానిసత్వాన్ని రుద్దుతున్నాయి.
9. మత విశ్వాసాల రక్షణ :
మనస్సాక్షిని ఆచరించే స్వేచ్ఛతో పాటు ఇస్లాం మత విశ్వాసాల పట్ల తగిన గౌరవాన్ని చూపాలని నిర్దేశిస్తుంది. ఎవరూ మరొకరి మత విశ్వాసాలను గాయపరచే విధంగా, వ్యక్తి హక్కులను భంగం కలిగేలా మాట్లాడరాదు, వ్యవహరించ రాదు.
10. నిరంకుశ నిర్బంధాన్ని నిరోధించే రక్షణ :
ఇతరులు చేసిన నేరానికిగాను ఏ వ్యక్తి అరెస్టు కాకుండా ఉండే హక్కును ఇస్లాం గుర్తిస్తుంది. దివ్య ఖుర్ఆన్ క్రింది విధంగా సూచిస్తుంది. "ఒకరి భారాన్ని మరే వ్యక్తి పై వేయడమూ జరుగదు." (6 : 164)
11. కనీస జీవితావసరాల హక్కు :
అవసరార్డులకు సహాయ సహకారాలు అందించాలని, అది వారి హక్కు అని ఇస్లాం గుర్తిస్తుంది.
"దైవం వారికి ప్రసాదించిన వారి సంపదలో అగత్య పరులకు అనాధలకు హక్కు ఉంది. " (70 : 24,25)
12. చట్టం ముందు సమానత్వం :
చట్టం దృష్టిలో పౌరులందరూ అన్ని విధాల సమాను లన్న హక్కుని ఇస్లాం పౌరులకిస్తుంది.
13. పాలకులు చట్టానికి అతీతులు కారు ?
ఉన్నత గౌరవనీయ వంశానికి చెందిన ఓ మహిళ దొంగతనం నేరం మీద నిర్బంధించబడింది. ఈ కేసు మహా ప్రవక్త (సఅసం) వద్దకు వచ్చింది. ఆమెను దొంగతనం శిక్షనుండి మినహాయింపునివ్వాలన్న సిఫారసులు వచ్చాయి. అప్పుడు ప్రవక్త ఇలా బదులిచ్చారు; “మీకన్నా ముందు గతించిన జాతులను దైవం నాశనం చేసాడు. ఎందుకంటే వాళ్ళు సామాన్య పౌరులను వారి నేరాలకుగాను శిక్షించేవారు, ఉన్నత వర్గాలకు శిక్షనుండి మినహాయించేవారు. నా ప్రాణం ఎవరి చేతుల్లో ఉందో నేను ఆయన పేర ప్రమాణం చేస్తున్నాను. ముహమ్మద్ కుమార్తె ఫాతిమా ఈ నేరం చేసినా నేను ఆమె చేతులు ఖండిస్తాను."
14. రాజ్య వ్యవహారాల్లో పాల్గొనే హక్కు :
వారి వ్యవహారాలు పరస్పర సంప్రదింపుల ద్వారా జరగాలి." (42:38) ఆషూరా' లేక శాసన సభకు అంతకుమించి వేరే అర్థం లేదు. ప్రభుత్వ అధినేత, శాసన సభ సభ్యులు ప్రజల ద్వారా స్వేచ్ఛగా ఎన్నికవ్వాలి.
చివరిగా ఇస్లాం పైన ఉదాహరించిన మానవ హక్కులను స్థాపించాలని ప్రయత్నిస్తుంది. ఇంకా అనేక హక్కులను - కేవలం న్యాయపరమైన రక్షణ కల్పించటం ద్వారా మాత్రమే కాదు, మానవ జాతిని జంతు స్థాయినుండి పైకి లేపి, జాత్యహంకారం, భాషా దురభిమానం ఆర్థిక ఆధిపత్యాలకు అతీతంగా ఎదిగేలా చేయాలని ప్రయత్నిస్తుంది.
మానవ జాతి మొత్తం ఒక సమాజంగా ఉనికిలోకి రావాలని, మనిషి తన అంతర పరిణతిననుసరించి విశ్వమానవ సౌభ్రాత్రతను గుర్తించాలని అది ఆహ్వానిస్తుంది.
Monday, February 22, 2021
సుభిక్షం - దుర్భిక్షం part 2
సుభిక్షం - దుర్భిక్షం part 2
వీరు కాదు, వృత్తిగా అడిగేవారి విషయంలో కాదు, విధి లేక ఆడిగేవారి సంగతే ఆలోచించాలి. కాల చక్రభ్రమణంలో పడి, కత్తెర బోనులాంటి అవస్థ వచ్చినప్పుడు, గత్యంతరం లేక నోరు విడిచి ఒకరిని అడగవలసి వచ్చిన వాళ్ళ సంగతే పరిశీలించాలి. పూటకు గుప్పెడు మెతుకులు లేక త్రాగడానికి సయితం గుక్కెడు నీళ్ళు కరువై కాలే కడుపులతోనే కాలం గడిపి గతిలేక, ప్రాణం నిలుపుకునేందుకు హరామ్ అని తెలిసి కూడా చచ్చిన గాడిద మాంసాన్ని అసహ్యించుకుంటూనే తిని ప్రాణాలు నిలపుకునే ఆత్మాభిమాన కుటుంబాల గురించే విచారించాలి. పిల్లలు భరించలేని ఆకలితో 'అమ్మా బువ్వ' అని అలమటించిపోతుంటే చూడలేక, చూసి తాళలేక, మర్యాదగా కాలం గడుపుతూ, సిగ్గు వదలి చేయి చాచే వ్యక్తి సంగతే పరిశోధించాలి. అంటే, వీరు కష్టాలకు భయపడి ఇలా చేస్తున్నారని కాదు, మానసం గల ప్రతివాడూ, మర్యాదగా బతికే ప్రతి వాడూ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాడు; సాధ్యం కాదు. ఇతరుల సాయం ఆవశ్యకం అవుతుంది. అడగక తీరదు, అంటే; ఆత్మహత్య అన్న ఒక్క దారి తప్పు, అలాంటప్పుడు అడుగుతారే వాళ్ళ గురించి ఆలోచించాలి. అట్టి ఆత్మాభిమాని అడగటానికి సాహసించాడంటే అతను కనబరచిన త్యాగం అపారం. ఆ అవస్థ దుర్బరం, ఆ స్థితి సంఘంలో ఉండటం అవమానకరం. మానవజాతికే అది లజ్జాకారణం.
దైవ ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: “కొందరు దుమ్ముకొట్టుకుని (చూడటానికి అసహ్యంగా) కనబడతారు. వారిని గుమ్మం ఆవల నుంచే కసరి కొట్టడం జరుగుతుంది. కాని వారు గనక అల్లాహ్ పై ప్రమాణం చేస్తే అల్లాహ్ వారి ప్రమాణాన్ని తప్పకుండా నిజం చేస్తాడు”. (ముస్లిం) -
మరో హదీసులో ఇలా ఉంది: “ఓ ఆదం పుత్రుడా! నీ దగ్గర మిగిలిపోయిన ధనాన్ని నువ్వు (మంచికై) ఖర్చు పెడితే అది నీకే మంచిది. దాన్ని ఎవరికి ఇవ్వకుండా ఆపుకుంటే దానివల్ల నీకే నష్టం. అవసరాలకు సరిపోయేటంత ధనాన్ని కూడబెట్టుకున్న పక్షంలో నీవు నిందారుడవు కావు”. (ముస్లిం)
సృష్టి మొత్తం దైవ దాసులే అంటామే; 'మొత్తం' అన్న ఆ మాటను కనీసం ఒకే ఒక్క ప్రాంతానికైనా, జిల్లాకైనా, రాష్ట్రానికైనా, దేశానికైనా వర్తింపజేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామా? 'వారు వికలాంగులు, గ్రుడ్డివారు, ఏ పనీ చేయలేని వారైతే దానికి మేమేం చెయ్యాలి? అది వారి ఖర్మ' అని కొందరు ప్రబుద్ధులు ప్రశ్నిస్తారు. సరే, వారినే చెప్పనివ్వండి! ఒక కుటుంబంలో ఉన్న వారంతా ఆరోగ్యవంతులేనా? ప్రయోజకులేనా? అప్రయోజకులు, ఎందుకూ పనికిరాని వారు కొందరు ఉంటారు కదా? వారికి సయితం తక్కిన వారిలాగా కూడు, గూడు, గుడ్డ ఎందుకిస్తాము? 'లేదే' అన్న కొరత వారిని లేకుండా ఎందుకు చేస్తాము? ఒక ఇంట్లో ఒక అవిటివాడో, గ్రుడ్డివాడో పుట్టాడనుకోండి. కూడు, గుడ్డ మనలాగే అతనికి పెట్టమా? అతని అన్ని అవసరాలు తీర్చడానికి మనం కష్ట పడతామే. అతనిని పోషించడం మన ధర్మంగా ఎంచుతామే. ఆ ధర్మం-సంఘం, సమాజం విషయంలోకొచ్చే సరికి ఏమయ్యింది? ఇదీ ఒక కుటుంబం కాదా! అందులో ఒకరిని అడుక్కోనివ్వడం సిగ్గుచేటు కాదా! అలా తన అవసరాన్ని ఇతరుల ముందు పెట్టేవాడికి ఏమి ఇవ్వక పోగా 'ఛీ,ఫో' అని కసురుకున్న వారిని ఏమనాలి? 'యాచించే వారిని గద్దించకండి' అని ఆ పరమప్రభువు చెబుతుంటే మనం ఇలా వ్యవహరించడం దైవధిక్కారం కాదా? "తన కోసం ఇష్టపడేదాన్నే తన తోటి సోదరుని కోసం కూడా ఇష్టపడనంత వరకూ మీలో ఎవరూ (పరిపూర్ణ) విశ్వాసి కాజాలరు”. అని ప్రవక్త (స) హెచ్చరించి ఉంటే మనం ఇలా బిహేవ్ చెయ్యడం దైవ ప్రవక్త అవిధేయత కాదా?
'ధర్యం చెయ్యండి బాబూ!' అన్న అర్థన వినబడగానే దానికి మనకు తోచిన అర్ధాన్ని మనం ఇచ్చుకుంటాము. దోసెడు ధాన్యం అని కొందరు, రూపాయి-రెండు రూపాయలని కొందరు భావించుకొని దాతల సరసరన నిలబడేందుకు తాపత్రయ పడుతుంటారు. నిజంగా ఆ పిలుపుకి అర్థం అదేనా? నిజం అది కాదు. వారు సంఘాన్ని, సమాజాన్ని, అందులో స్వచ్చంద సేవా సంస్థల లేబుల్తో చెలామణి అవుతున్న వాటిని, పెద్దల్ని, కలిమి-బలిమి గల వారిని హెచ్చరిస్తున్నారు. దీన దైవదాసులైన తమ పట్ల వారు వ్యవహరిస్తున్న వైఖరిని ఎండగడుతున్నారు. మరుపున పడ్డ విషయాన్ని సంఘం పట్ల వారి విద్యుక్త ధర్మాన్ని, కనీస బాధ్యతను జ్ఞప్తికి తెస్తున్నారు. సాటి జనుల పట్ల మన జగుప్సారకమైన ధోరణిని, నిర్లక్ష్య వైఖరిని ఎత్తి చూపుతున్నారు. సమాజంలో దట్టంగా పేరుకుపోయిన కఱపఁషన్ని కరెక్షన్ చేసి కరెక్ట్ చేయమని పిలుపునిచ్చి చెంప పెట్టు పెడుతున్నారు. కాగడా పట్టి మనలోని లోపాలను ఎత్తి చూపుతున్నారు.
ఓ సంఘ సంస్కర్తల్లారా! ధర్మం చర అంటూనే, మీరు మీ ధర్మాన్ని మూలన పడేస్తున్నారా? సత్యం వద అంటూనే సత్యం నోరు నొక్కేస్తున్నారా? "తాము కడుపారా భోంచేసి తన పొరుగువాని ఆకలి దాహాలను పట్టించుకోని వాడు నిజమైన విశ్వాసి కాజాలడు' అన్న ప్రవక్త ముహమ్మద్ (స) వారి మాటను అప్పుడే మర్చి పోయారా? ఇప్పుడయినా నిజాన్ని గ్రహించండి. మీరు నిర్వర్తించాల్సిన ధర్మాన్ని మీరు నిర్వర్తించండి అని ఒక మహోపన్యాసమే చేస్తున్నారు.
ఏమండి పండితులారా! లేని ప్రజలకు కదా ఇవ్వాలి? దీనికి మీరే మంటారు? 'ధర్మం అంటే దానం, దానం అంటే ధర్మం' అన్నా రే-భూదానం, గోదానం, హిరణ్యదానం, శాకదానం, కుషాంద దానం, గోగర్భ దానం, తులభార దానం - ఇన్నీ దానాల మధ్య నిజమైన దానం కానరాకుండా చేశారే! ఎవరిదీ పాపం? గతి లేక అడుక్కుతినేవారిదా? అడుక్కుతినే స్థాయికి దిగజార్చిన వారిదా? ఇట్టి వ్యక్తుల జీవితానికి సంబంధించిన అసలు కేంద్రబిందువు వారి ఆర్థిక ప్రయోజనాలు, భార్యాపిల్లలు, ఇంకా వారి ప్రాపంచిక సౌఖ్యాలు అయి ఉంటాయి. కాని ఇతరులతో సంభాషించేటప్పుడు మాత్రం పారమార్థికత ఉట్టిపడేలా తాము దైవ ధర్మానికి, సంఘ సేవకు అంకితమైనవారిలా, దర్మోన్నతే, ప్రజాహితమే తమ మతంగా, సర్వేజనః సుఖినోభవంతు అన్నదే తమ ప్రధమ కర్తవ్యమని చెబుతుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే- “వారు తమ హృద యాలలో లేని మాటలను తమ నోటితో పలుకుతారు”. (ఆలి ఇమ్రాన్: 167)
ఉదాహరణకు ఒక వ్యక్తి సమాజ తిరోగమనంపై, సంఘ దుస్థితి పై ఎంతో ఆర్థంగా ప్రసంగాలు, ప్రకటనలు, వ్యాస పరంపరలు, ప్రచురణలు చేస్తూ ఉంటాడు. కానీ, తన నిజ జీవితంలో సమాజ శ్రేయం కోసం, మానవాభ్యదయం కోసం ఆందోళన చెందుతూ ఒక్క రాత్రి అయినా గడిపి ఎరుగడు. తనకు పడక మీదకు చేరగానే ఒక్క నిద్ర తప్ప మరేమీ గుర్తుండదు కూడా. అశ్రుపూరిత నయనాలతో - నిశి రాత్రిన లేచి దైవ సమక్షంలో నిలబడి - 'ఓ అల్లాహ్! ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని అభ్యుదయ బాటన నడి పించు. ఇక్కడి ప్రజల్లో సుహృద్భావాన్ని, సామరస్యాన్ని పెంపొందించు. సకల మానవుల సమస్యలను పరిష్కరించు' అని వేడుకోడు. అంటే ఇట్టివారికి తన జాతి, మానవ జాతి గురించిన చింతన కంటే తన స్వార్థం గురించిన చింతనే, బాధే అధికంకా వేధిస్తూ ఉంటుంది. ఇట్టివారు లాంఛనాప్రాయంగా నియమనిష్టల విషయమై చాలా భేషైన ప్రమాణాలు చూపుతూ ఉంటారు. కానీ తమ నిత్య జీవితంలో క్రియాశూన్యులుగానే దర్శనమిస్తుంటారు. ఇది తమ ఆంతర్యాల్లో లేని నీతిని తమ మాటల ద్వారా తమలో ఉందని ప్రజానికానికి నిరూపించడానికి పడుతున్న పాట్లే తప్ప మరేమి కాదు. ఖుర్ఆన్లో ఇలా ఉంది: “వారు జరిపే అత్యధిక రహస్య మంతనాలలో ఏ మేలూ ఉండదు”. (నిసా: !!4) “వారు (ఇవన్నీ) పరులకు చూపడానికే చేస్తారు. అతి సామాన్య మైన వాడుక వస్తువులను సయితం ఇవ్వడానికి నిరాకరిస్తారు”. (మావూన్: 6,7)
ఒక పెద్ద మనిషి అడిగాడు అంటే, అంత దుర్వస్థ, దుర్భిక్ష స్థితి ఇంట్లో ఉందన్న మాట. ఆయన తన మనసులో అంత యాతన అనుభవించాడన్న మాట. అడగడంలో అంత ఆయాస పడ్డాడన్న మాట. అయితే అడగడమే, భిక్షాటనే వృత్తిగా చేసుకున్నవారు ఇందులో చేరరు. 'యాయవారం మా కుల వృత్తి' అని చెప్పేవారు ఇందులో చేరరు. దేవుడే మమ్మల్ని అడుక్కొని బ్రతకమన్నాడని సిగ్గు వదిలి చెప్పేవారు ఇందులో జమ అవ్వరు. పంచ కేశాలు పెంచడం అనే ఆచారానికి భిన్నంగా పంచ కేశాలను క్షవరం గావించుకుని, బ్రతికుండగానే మృతులలో చేర్చబడి పచ్చని తలపాగలతో పట్టభద్రులై, నెమలి ఈకలు చేత పట్టుకుని షరీయతు ఆదేశాలేవీ తమకు వర్తించవని చెబుతూ నమాజు చదవక, రోజాలు పాటించక మాదక ద్రవ్యాలను సేవిస్తూ, గంజాయి -పీలుస్తూ సామాన్యులను సాంబ్రాణి పొగతో వంచిస్తూ అర చేతిలో స్వర్గం చూపేవారు ఇందులో చేరరు.
ఒకరి ముందు చేయి చాచడంకన్నా చావే నయం అనుకుంటూనే విషమయ పరిస్తితులకు లోనై బ్రతకలేక బ్రతికేవారినే -ఇందులో చేర్చాలి. ఆత్మ కుటుంబం అనుభవిస్తున్న బాధ, వ్యధ అన్యులకు కనబడనీయకుండా గుట్టుగా బ్రతికేందుకు ప్రయత్నిస్తున్నవారినే ఇందులో చేర్చాలి. విద్యా, బుద్ధి, బలము, ఓపికా అన్నీ ఉన్నప్పటికీ ఒకరిని అడగకుండా ఆత్మాభిమానంతోనే అనేక అవస్థలు పడుతున్నవారినే ఇందులో చేర్చాలి. సమయం కలిసొస్తే - తామే పది మందికి పెట్టగలిగినవారైనప్పటికీ 'దుర్భిక్షం' చేత అడగక తప్పని దుర్వస్థకు వచ్చిన వారినే ఇందులో చేర్చాలి. అటువంటి ఆత్మాభిమాన ధనులు అడిగినప్పుడు, వారు అడిగారని, అర్జించారని భావించడం తప్పు, అధర్మం. నిజంగా వారు ఎదుటి - వారికి ఒక మహదవకాశాన్ని ఇచ్చారన్న మాట గ్రహించాలి. అటువంటి ఆత్మాభిమానుల మానసం దెబ్బ తినకుండా సహాయం అందించగలిగితే వారి వల్ల లోకానికి ఎంత లాభం! వారి మేధా శక్తితో లోకానికి ఎంత ఉపకరించవచ్చును! ఎన్ని మహత్తర కార్యాలకు శ్రీకారం చుట్టవచ్చును! ఆ సమయంలోని ఆ స్వల్ప సహాయం సదుపాయం చేసినవాడిది కదా ఆ పుణ్యం, అ కీర్తి అంతానూ.
ఇటువంటి ఆత్మాభిమాన ధనుల పక్షం వహిస్తూ రేపు ప్రళయ దినాన అల్లాహ్ కలవారైన, కలిమి-బలిమి గలవారైన తన దాసులను నిలదీస్తాడు. దైవ ప్రవక్త ముహ్మద్ (స) ఇలా తెలియ జేశారు: 'నిశ్చయంగా మహోన్నతుడైన అల్లాహ్ ప్రళయ దినాన ఇలా అంటాడు: “ఓ ఆదం కుమారుడా! నేను వ్యాధికి గురయినప్పుడు నువ్వు పరామర్శించలేదేమిటి?” దానికి దాసుడు ఆశ్చర్యపోతూ, స్వామీ! నీవు సర్వలోకాలకు ప్రభువు, పరిపాలకుడవు, పరిపోషకుడవు, సంరక్షకుడవు. అలాంటప్పుడు నేను నిన్ను పరామర్శించడమేమిటి? అని విన్నవించుకుంటాడు. అప్పుడు అల్లాహ్ అతనితో - నా పలానా దాసుడు వ్యాధిగ్రస్టుడయ్యాడని తెలిసి కూడా నువ్వతన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు. ఒకవేళ నువ్వెళ్లి అతన్ని పరామర్శించి ఉంటే అక్కడ నువ్వు నన్ను పొంది ఉండేవాడవన్న సంగతి నీకు తెలియదా? అని అంటాడు.
“ఓ ఆదం పుత్రుడా! నేను నిన్ను అన్నం పెట్టమని అడిగితే నువ్వు నాకు అన్నం పెట్టలేదేమిటి?' అని ప్రశ్నిస్తాడు. దానికి దాసుడు 'ప్రభూ! సకల లోకాలకు పరిపోషకుడవు నీవు. అలాంటిది నేను నీకు అన్నం పెట్టడమేమిటి? అని విన్నవించుకుంటాడు. దానికి అల్లాహ్, 'నా ఫలానా దాసుడు నిన్ను అన్నం (బాబూ! ధర్మం) పెట్టమని యాచించాడు. కాని (పెట్టగలిగే స్థితిలో నువ్వుండి కూడా) నువ్వతనికి అన్నం పెట్టలేదు. అప్పుడు నువ్వతనికి అన్నం పెట్టి ఉంటే దాన్ని నా దగ్గర పొంది ఉండేవాడవన్న విషయం నీకు తెలుయదా? అని అడుగుతాడు.
“ఓ ఆదం సంతానమా! నేను నిన్ను మంచి నీళ్లు అడిగాను. కాని నువ్వు నాకు మంచి నీళ్లు కూడా ఇవ్వలేదే' అనంటాడు. దానికి దాసుడు, దేవా! నీవు సకల లోకాలకు జీవనోపాధిని ప్రసాదించే వాడవు. నేను నీకు మంచి నీళ్లు త్రాపించడమేమిటి? అని విన్న
వించుకుంటాడు. అప్పుడు అల్లాహ్ అతనితో, 'నా ఫలానా దాసుడు నిన్ను మంచి నీళ్లు అడిగితే నువ్వతనిక మంచి నీళ్లు కూడా ఇవ్వలేదు. నువ్వతనికి మంచి నీళ్లు ఇచ్చి ఉంటే దాన్ని నువ్వు నా దగ్గర పొంది ఉండేవాడవన్న విషయం నీకు తెలి యదా? అని అంటాడు. (ముస్లిం)
మరో హదీసులో ఇలా ఉంది: 'ఓ ఆదం కుమారుడా! నేను నగ్నంగా ఉన్నాను. నువ్వు నాకు బట్ట కప్పలేదేమిటి? అని అడుగుతాడు. అందుకు దాసుడు, ప్రభూ! నువ్వు సకల లోకాల మేలును కోరేవాడవు. అలాంటిది నేను నీకు ఆచ్చాదనం తొడిగించడమేమిటి? అని ఆశ్చర్యపోతాడు. దానికి అల్లాహ్, నా ఫలానా దాసుడు నగ్నంగా ఉన్నాడు అని నీకు తెలిసి కూడా నువ్వతనికి ఆచ్చాదనాన్ని ఇవ్వలేదు. ఒకవేళ నువ్వతనికి బట్టలు తొడిగించి ఉంటే నన్ను అక్కడ పొందేవాడవన్న విషయం తెలీదా నీకు?” అని ప్రశ్నిస్తాడు అల్లాహ్.
అదే 'లేదు,పో' అన్న మూడు అక్షరాల ఫలితం ఏమవుతుందో ఊహించారా? ఆ వ్యక్తి ఆత్మాభిమానంతో చచ్చిపోతాడు. ఒకసారి తస్కారం జరిగాక మళ్ళీ దానికై సాహసించడు. తన బుద్ది బలం చేతనూ, తన శక్తి చేతనూ మానవ అభ్యుదయానికి తోడు పడదగిన ఒక వ్యక్తి బలవంతంగా అసువులు బాసాడు. అతని విజ్ఞానం వల్ల లాభం, అతని కౌశలం వల్ల ఫలితం ప్రపంచానికి దక్కకుండా పోయింది. అతనికీ, అతని కుటుంబానికే కాకుండా సర్వ మానవాళికి తీరని లోటు మిగిల్చింది. జగత్తుకే ఒక మహా ఉపద్రవబం తెచ్చి పెట్టింది.
దీనంతటికి కారణం 'కలవాడు' లేదు పొమ్మన్నాడు'. ఒక్క రూక కాదు-నిజంగా అది ఒక ఈక. ఇవ్వడానికి సందేహించాడు. అల్ప సహాయం చేయడానికి చేతులు వచ్చాయి కావు. పైగా “ఇటువంటి వారితో అల్లాహ్ ప్రసాదించిన దానిలో నుంచి కొంత ఖర్చు చేయండి అని అన్నప్పుడల్లా, ఈ తిరస్కారులు విశ్వాసులతో, మేము వారికి ఎందుకు తినిపించాలి? అల్లాహ్ తలిస్తే స్వయంగా వారికి అన్నం పెట్టగలడు కదా!' (దేవుడు తలిస్తే వారిని దరిద్రులుగా ఉంచేవాడే కాదు. అలాంటప్పుడు మేము ఈ దరిద్రులకు
సహాయపడి దైవాభిమతానికి వ్యతిరేకంగా ఎందుకు ప్రవర్తించాలి) అని వారు పెడసరిగా జవాబిస్తారు”. (యాసీన్: 47)
ఒక పదవ వంతు కాదు, ఆ ఆత్మాభిమానధనులు అడిగినది. - తాము తమ పిల్లలు ఒక గంటలో కేవలం వినోదాల కింద ఖర్చు
పెట్టిన దానిలో అణుమాత్రం కాదు ఆ నిర్భాగ్యుడుకి లేదు పొమ్మ న్నది. ఆడంబరాల కోసం, వేడుకల కోసం ప్రతి దినం తాను - వ్యయం చేస్తున్న దానిలో నూరోవంతు కాదు ఆ అవసరార్ధునికి కాదన్నది. అటువంటి నోరు, మనసు గలవాడికి మనిషి అని నామకరణం చేయడం ఎంత వరకు సబబో మనసున్నవారే నిర్ణయించాలి. పేరు కోసం, ప్రకటన కోసం అని కోట్లకి కోట్లు ఖర్చు చేసిన ఈ దాత వట్టి రోత కాడా? నిజంగా చెప్పాలంటే, అడవులు, సముద్రాలు, పర్వతశ్రేణులు - ఇవేవి భూమికి బరువు కాదు. ఇటువంటి ధనికులే భూమికి భారం.
గృహశోభ, గృహ ప్రవేశానికి, గృహశాంతికి, గృహవాస్తుకని లక్షలకిలక్షలు ఖర్చు పెట్టే మనిషి, భూత దయ కోసం, వృక్ష మోక్షం కోసం వేలకి వేలు ఖర్చు పెట్టే మనిషి, అందులోనే మోక్షం చూరగొనాలనుకుంటాడు. మూర్ఖ బుద్ది! జంతువులలోకెల్లా మహా జంతువు, సృష్టిరాసులలోకెల్లా శ్రేష్ఠుడు మనిషి; వారిలో మానసం గలవాడు మణిపూస, సోదర మానవుడు. అలాంటి ఉత్కృష్ట జీవి - అష్టకష్టాలు పడుతూ, అష్ట దారిద్రియానికి అనుభవిస్తూ, అడిగి లేదనిపించుకున్న యాతనను భరిస్తూంటే, ఇతనికి నిజంగా భూత దయ ఉందా? ఆ మాటకు, ఈ రోతకు ఎంత దూరం? ఈ ఆడంబరం అంతా పేరు కోసం ప్రాకులాడటం, మెప్పు కోసం అర్రులు చాచడం, విలాసాలు, ఖులాసాల కోసం దేవులాడటం. అంతే కాని ధర్మం ఆచరించడానికి కాదు..
ఇవన్నీ తెలిసిన అల్లాహ్ ప్రతిదాంట్లో స్వార్థాన్ని చూసే మనల్ని ఉద్దేశించి మీరు చేసే సహాయం వృధా పోయిందని బాధపడనవసరం లేదు, మీరు ఇచ్చిన ప్రతి పైసా నా దగ్గర మీరు నాకిచ్చిన రుణంగా వ్రాసుకోబడుతుందని తెలియజేస్తున్నాడు: “నిశ్చయంగా దానధర్మాలు చేసే పురుషులు, దానధర్మాలు చేసే స్త్రీలు, అల్లాహ్ కు (చిత్తశుద్ధితో) రుణం ఇచ్చేవారు- వారు ఇచ్చినది వారి కొరకు పెంచబడుతుంది. మరి వారి కొరకు గౌరవ ప్రదమైన ప్రతిఫలం ఉంది”. (అల్ హదీద్: !8)
అంటే, ఒక్కో సత్కార్యానికి కనీసం పదింతల పుణ్యం అంతకన్నా అధికంగా 700 రెట్లు ప్రసాదించబడుతుంది. దైవ చిత్తమయితే ఈ పుణ్యం ఒక్కోసారి అంతకన్నా ఎక్కువగా కూడా ఉంటుంది. అయితే అది ఇచ్చేవాడి చిత్తశుద్ధిపై, పుచ్చుకునే వాడి దుర్భిక్ష అగత్య స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే
“తాము అమిత అవసరంలో ఉన్నప్పటికీ తమపైన వారికే ప్రాధాన్యతనిస్తారు. వాస్తవానికి తమలోని స్వార్థప్రియత్వం - (పేరాశ, పిసినారితనం) నుండి రక్షించబడినవారే కృతార్థులు". (హష్: 9)
ముస్లిం మదిపై ఇస్రా – మేరాజ్ స్మృతులు
ముస్లిం మదిపై ఇస్రా – మేరాజ్ స్మృతులు
”తన దాసుణ్ణి రాత్రికి రాత్రే మస్జిదె హరామ్ నుండి మస్జిదె అక్సా వరకు తీసుకుపోయిన అల్లాహ్ పరిశుద్ధుడు. దాని పరిసరాలను మేము శుభ వంతం చేశాము. ఎందుకంటే, మేమతనికి మా (శక్తికి సంబంధించిన) కొన్ని సూచనలను చూపదలచాము. నిశ్చయంగా అల్లాహ్‌ా మాత్రమే బాగా వినేవాడు, చూసేవాడు”. (బనీ ఇస్రాయీల్: 1)
గగన విహారం:
మేరాజ్ కానుకలు:
దహకాండ ఇటు – ధీరకాంత అటు
ప్రతి ఏటా ఇస్రా – మేరాజ్ ఇచ్చే సందేశం:
Sunday, February 21, 2021
సుభిక్షం - దుర్భిక్షం - 1st part
సకలలోక సృష్టికర్త అయిన అల్లాహ్ మనిషికి మహీతలంపై తన మనుగడ సవ్యంగా సాగించేందుకు కావాల్సి ఒనరుల్ని, అవసరమైన వసతులను అతను అడగకుండానే ప్రసాదించాడు. సృష్టిలో సృష్టికర్త చేసిన లోటు ఏమి లేదు. సకల సౌఖ్యాలను మనిషికి ప్రసాదించి అతన్ని సమస్త జీవరాసులలో ప్రవరుఁనిగా చేసి నిలబెట్టాడు. అయితే మనిషి తనకు ప్రాప్త మయి ఉన్న మహోన్నత స్థానాన్ని కాపాడుకోలేక పోయాడు, ఇది అతని తప్పు. తన స్వార్థం కోసం, తన స్వయ ప్రయోజనాల కోసం నాకంలా ఉన్న ఈ 'నర' లోకాన్ని ఒక ప్రయోగశాలగా, ఒక మారణహోమంగా మార్చి 'నరక కూపం' లాంటి చేదు అనుభూతిని మిగిల్చాడు. సకల విధమైన సౌకర్యాలతో, దేవుని అనుగ్రహాలతో సుభిక్షంగా ఓలలాడుతున్నఅవనీతలాన్ని అపాయం పాయేసి దయనీయ దుర్భిక్ష స్థితికి గురి చేశాడు. ఈ పాపం మనిషిది. ఈ విపర్యాసం దుర్గర్వ దానవుడు చేసినదే. అవును, ఈ దుర్భిక్ష స్థితి ప్రకృతి చేసినది ఎంత మాత్రం కాదు. దేవుడు చేసినది అంతకన్నా కాదు. ఇదంతా నరుడు చేసినదే, దుర్మార్గ మానవుడు చేసినదే. కాబట్టి ఈ దుస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత కూడా నరులమైన మనందరి మీద ఉంది. అందు కోసం కనీస సామాజిక సృహ మనకు అవసరం. ఈ వ్యాసం ఆ కార్యసిద్ధిలో కొంత వరకైనా దోహద పడగలదని నమ్మకం.
బస్సుల్లో, బజార్లల్లో, బస్తీల్లో, పుణ్యక్షేత్రాలలో, హోటళ్ల ముందు, అంగళ్ల దగ్గర....ఎక్కడ చూసినా కనబడతారు అవ్వరార్డులు. ముష్టివాళ్లు, అడుక్కుతినేవాళ్లు అని వీరిని నామకరణం చేసి తామేదో డిక్షనరీలో లేని కొత్త పదాన్ని కనుక్కున్నామంతగా సంబర పడిపోతూ ఈ బలహీనుల్ని తస్కరించడం కూడా మనం గమనిస్తూనే ఆదేదో మనకు సంబంధం లేని విషయంగా దాటి వెళ్లిపోతుంటాము. వారు మా (నవ) లోకానికి చెందినవారు కానట్టుగా ఉపేక్షిస్తూ ఉంటాము. అవసరం ఏదీ లేకపోయినా, ఆస్తులుపాస్తులు మస్తుగా ఉన్నా, దేశాల మీద ఏదోక సంస్థ పేరు తో, సేవ పేరుతో తన పబ్బం గడుపుకోవడానికి అడక్కునే వాళ్లను భిక్షగాళ్లన్నా, ముషెత్తుకు బ్రతికేటోళ్లన్నా చెల్లుతుంది. అంతేగానీ, పూట గడవక, కడుపు మంట చల్లార్చుకోవడం కోసం పిడికెడు అన్నం అడిగేవారిని భిక్షగాళ్లని, ముష్టివాల్లని అనడం ఎంత మాత్రం సబబు కాదు. నిజంగా వారు ఆడుగుతున్నది. భిక్షం కాదు; మన మీద వారికున్న కనీస హక్కును వారు అడుగుతు న్నారు. ఇదే విషయాన్ని ఖుర్ఆన్ ఇలా సెలవిస్తున్నది: “వ ఫీ అమ్వాలిహిమ్ హక్కుల్ లిస్సాయిలి వల్ మరహూమ్”. వారి సంపదలో నిర్ణీత హక్కు ఉంటుంది. అడిగేవారికి, అడగనివారికి (అవసరం ఉండి కూడా ఆత్మాభిమానం వల్ల అడగనివారు, ప్రకృతి వైపరీత్యాలు తారసపడి సర్వస్వాన్ని కోల్పోయినవారికి) కూడా. (నూహ్: 24,25)
నిజమే; కాలూ చెయ్యీ బాగుండి, సంపాదించే శక్తి ఉండి కూడా కొందరు ఈ యాచకుల వర్గంలో మనకు తారసపడతారు. అంతమాత్రాన తొందర పడి వారిని సోంబేరులుగానో, పని దొంగలుగానో ఖరారు చేసెయ్యడం సబబు కాదు. 'యాచకుడు మీ వద్దకు ఒంటె మీద స్వారీ అయి వచ్చినా మీరతనికి ఇవ్వండి' అని ప్రవక్త (స) వారి మాట ప్రకారం మనం చేయగలిగిన సహా మం మనం చేయాలి. అంతేగాని, ఒక రూక కూడా ఇవ్వకుండా, ఒక్క ఈక కూడా విదిలించకుండా యాచకుణ్ణి నిందించే హక్కు మనకు లేదన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఒకవేళ మనం అనుకున్నదే నిజమయినా, అప్పుడు కూడా మనమెంతో సౌమ్యం గా వ్యవహరించి సమస్యకు తగిన పరిష్కారాన్ని సూచించగలిగతే, వారు చెయగలిగిన పనిని వారికి పురమాయించ కలిగితే మాన కాభ్యుదయానికి, సమాజాభ్యున్నతికి, దేశాభివృద్ధికి దోహదం కెసినవారం అవుతాము. గత్యంతరం లేని వాళ్లను, అనాథలను, తంతువులను, వికలాంగులను, ఆసరా కరువై, ఆదరణకు హరమైన వృద్ధజీవులకు విధిగా కూడు, గూడు, గుడ్డ వంటి
నీస అవసరాల్ని తీర్చాలన్నది ఇస్లాం ఉపదేశం. ఈ బడుగు, -లహీన వర్గాలను ఉద్దరించేందుకు మానవ సమాజంలో ధనం ఒక కాదు, కావలసిందల్లా మంచి చేయాలన్న హృదయం. సాటి
నిషి ఆదుకోవాలన్న తపన. మానవునికి ఎదుర్కొంటున్న పర్భిక్ష దయనీయ స్థితిని దూరం చేయాలన్న సదభిప్రాయం కావాలి. అంతే! ఈ విషయమై ఖుర్ఆన్ మనల్ని ఇలా బోధిస్తుంది: మరియు దేవుడు నిన్ను మార్గము తెలియని వానిగా పొందెను. -వున నీకు (ధర్మ) మార్గమును చూపెను. మరియు దేవుడు న్ను పేదవానిగా పొందెను. కావున నిన్ను ధనవంతునిగా జేసే సెను. కావున తండ్రి లేని బిడ్డను (అనాథను) నీవు గద్దింప ము. మరియు అడుగునట్టివానిని అదలింపకుము. మరియు నీ 5భువు యొక్క మేలును గూర్చి పలుకుచుండుము". -
(అజుహా: 7-) ఎరో చోట ఇలా సెలవియ్యబడింది: “వ అహ్సిన్ కమా -హ్సనల్లాహు ఇలైక”. అల్లాహ్ నీకు ఏ విధంగా మేలు చేశాడో అదే విధంగా నువ్వు కూడా (ప్రజల పట్ల) సద్వ్యవహారం చెయ్య. (అల్ ఖసస్: 77)
ఆ విషయానికొస్తే,
మనమందరం బీదవారమే, అవసార్డులమే అశక్తులమే; ఒక్క అల్లాహ్ తప్ప. “యా అయ్యుహన్నాసు అన ముల్ ఫుఖరావు ఇలల్లాహ...” ఓ ప్రజలారా! మీరంతా అల్లాహ్ అవసరం కలిగినవారే. అల్లాహ్ మాత్రం అక్కర లేనివాడు. సర విధాల స్తుతించదగినవాడు. (ఫాతిర్: 15) ఇవ్వడం కష్టమైతే అడగడం మరింత కష్టం 'అడిగాడు' అనగానే అతను ఎంతటివాడైనా అల్పుడైపోతాడు. అంతకు ముందు అతనో దాతయినా, మహా నేతయినా, ప్రాణ మిత్రుడైనా, సమీప బంధువైనా, క్షణం క్రితం వారిని అభిమానిఁ చిన మనమే వారిని అట్టడుగున పడేస్తాము. మరుక్షణం నుండి అతనిలోని సకల సుగుణాలకు అర్థం మారిపోతుంది. అతని పరువు ప్రతిష్టలు మట్టి పాలవుతాయి, అతని కీర్తికండూతి మొత్తం జీరో స్థాయికి చేరుకుంటుంది. ఏం? అడిగినందుకు ఫలితం కలిగినా, కలగకపోయినా ఈ ఛీత్కారం మాత్రం తప్పదు. ఇలా మనం ఎందుకు వ్యవహరిస్తామో ఒక్క క్షణం కోసం ఎప్పడైనా సునిశితంగా ఆలోచించామా?! ఒక వ్యక్తి మనల్ని ఏదైనా సహాయం అడిగాడు అంటే మనల్ని తన పాలిట శ్రేయోభిలాషులుగా ఎంచి తన సమస్యను మన ముందు పెట్టాడు అని ఎందుకు అనుకోము? అడిగాడు-అంటే, అడుక్కున్నాడు,
ముప్టెత్తుకుంటు న్నాడు అనేగా అని వాదిస్తాము. ఇంకా స్నేహము, బాంధవ్యము, మర్యాద అన్న మాటలు అర్థం లేనివి అని భావిస్తాము. అది అతని పాలిట వరమో లేదా మన పాలిట శాపమో దేవుడికే ఎరుక.
ఎంత కష్టం! ఆలోచించే కొద్దీ గుండె తరుక్కుపోతుంది. ఎవరిని అడగాలి? ఎలా అర్థించాలి? ఏ విధంగా ఆరంభించాలి? ఏమని అడగాలి? కంఠస్వరంలో గాద్గదం కలుగుతుంది. లోగొంతు పడు తుంది. మాట రావడం కష్టమైపోతుంది. బలవంతంగా మాటను బయటికి ఈడ్వాల్సి ఉంటుంది. ఈ సంఘర్షణలో మాటలు తెగి పోతాయి. అన్ని అక్షరాలు స్వచ్ఛంగా ఉచ్చరించడానికి దమ్ము,
ధైర్యమ చాలదు. అనుకున్న మాటలు అంతరిక్షానికి ఎగిరి పోతాయి. వల్లే వేసుకున్న పాఠాలు చెల్లాచెదురైపోతాయి. ఇదో వేదనయితే, అడినందుకు ఫలం 'అడిగాడు' అని అన్పించుకో వడం తప్ప ఇతర ఫలం దక్కదేమోనన్న యమ యాతన మరో వైపు. ఒళ్లంతా పాములు, తేళ్లు పాకుతున్న అనుభూతి. గుండె ల్లో శూలాలు గుచ్చుకుంటున్నట్టు విపరీత బాధ. ప్రాక్టీస్ కోసమే 'సహాయం' అని అనబోతాడు. 'స' అన్న అక్షరం మాత్రమే విన బడుతుంది. తర్వాత అధరాలు మాత్రం అదురుతాయి. మనసున్న మారాజులు, ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే, ఒకరికి మంచి చేయాలన్న హృదయం గలవారు గ్రహించుకోవాల్సిందే. ఈ యాతన అంతా పూర్వ రంగమే. ఇది తెలిసిన కాళిదాసు ఇలా అన్నాడు:
అభ్యర్థనాభంగ భమేవ సాధుః
మాధ్యస్థ మిద్దే ప్యపలంబ్య తేర్దే
]అడిగితే ఎక్కడ లేదని సమాధానం వినవలసి వస్తుందేమోనని కావలసిన వస్తువును కూడా అక్కర లేదన్నట్టే ఊరుకుంటారట. ఖుర్ఆన్లో ఇటువంటి ఆత్మాభిమానధనుల గురించి ఇలా సెల వియ్యబడింది: “ముఖ్యంగా సహాయానికి అర్హులైనవారు, దైవ
ధ్యేయ పథంలో తలమునకలై ఉండి స్వంత ఉపాధి సంపాదనకై - ధరణిలో ఎటూ కదలలేని నిర్ధనులు. వారిని ఎరుగని వ్యక్తి వారి ఆత్మాభిమానాన్ని చూసి, వారు కలిగినవారేనని తలపోస్తాడు. వారి ముఖాల ద్వారా వారి నిజ స్థితిని మీరు గ్రహించగలరు. కాని, వారు జనుల వెంటబ రకం కాదు. వారి సహా యార్థం మీరు ఏదైనా ఖర్చు చేస్తే అది అల్లాహ్ కు తెలియకుండా ఉండదు”. (అల్ బఖర: 273) మరో చోట ఇలా ఉంది: “వ యఫ్లెలూనక మాజా యున్ ఖూన్ ఖులిల్ అప్స్” ఏం ఖర్చు పెట్టాలి? అని వారు నిన్ను అడుగుతున్నారు. (ఓ ప్రవకా!) 'మీ ఖర్చులు పోగా మిగిలినది' అని నువ్వు వారికి చెప్పు. (అల్ బఖర:2!9 )
మన అవసరాలకు అయి మిగిలిన దాంట్లోంచి కొంచెం ఇవ్వడానికే మనకు అంత కష్టంగా ఉంటే, తన దగ్గర మిగిలున్న ఒకేఒక్క ఆత్మాభిమానం అనే ధనాన్ని సయితం పరిత్యజించి 'లేదు' అని అడగటం అంతకన్నా కష్టమవుతుంది. ఇచ్చేవాడి త్యాగం రవ్వంత అయితే, ఆత్మాభిమానాన్ని చంపుకుని అడిగే వాడి త్యాగం కొండంతటిది. ఆశ్చర్యంగా ఉంటాయీ మాటలు. అడుక్కునేవారికి త్యాగంతో ఏం సంబంధం? అని శంకిస్తుంది హృదయం. కొంచెం అతిగా, అసత్యంగా ఉన్నట్లు కూడా తోస్తుంది. నిజమే. కాని అడిగేవాడు ఎవడు? అడగడమే అల వాటుగా, అదే తమ వృత్తిగా చేసుకొని ఊర్లమీద పడి తిరిగేవారు ఈ జాబితాలోకి రారు. వీరు అడుక్కొడాన్ని ఒక విద్యగా, ఒక కళగా చేశారు. కాలేజీలు, యూనివర్సిటీలు లేవుగాని, ఉంటేనా ఈ కళలో వీరంతా డిగ్రీలు పుచ్చుకుని పట్టభద్రులయి ఉండే వారేమో కాబోలు! ఈ వృత్తి పెద్దల్ని అడిగారని చెబితే అప చారం, అపచారం అంటూ లెంపలేసుకోవడం మనకు ముందు నుంచి ఉన్న ఆనవాయితే. “సువర్ణ పుష్పం సమర్పయామి” అంటూ సగౌరవంగా ఇచ్చుకుంటాము. అవును; ఇటువంటివారు అడుక్కోడానికే పుట్టారనిపిస్తుంది. అప్పుడప్పుడు. ధర్మశాస్త్రాలు వీరి సొత్తు అయినట్టు. ధర్మం వీరి చుట్టమైనట్టు. ఇట్టివారికి ఎట్టి వ్యధాభరిత శిక్ష ఉంటుందో ప్రవక్త (స) హెచ్చరించి ఉన్నారు: “ప్రజల దగ్గర అడుక్కోవడమే వృత్తిగా చేసుకున్న వ్యక్తి, ముఖం పై ఒక మాంసపు తునకయినా లేని స్థితిలో అల్లాహ్ ను కలుసు కుంటాడు”. (బుఖారీ,ముస్లిం) , “ధనాన్ని కూడబెట్టాలన్న ఉద్దేశ్యంతో అడక్కునే వాడు వాస్తవానికి అగ్ని జ్వాలల్ని కోరుకుంటున్నాడు. కనుక ఎక్కువ అడుక్కుం టాడా, తక్కువ అడుక్కుంటాడా అనేది అతని ఇష్టానికే వదిలి పెడుతున్నాను”. (ముస్లిం) “(అవసరం లేకపోయినా అలవాటు) భిక్షాటన ఒక గాయం లాంటిది. మనిషి భిక్షాటన చేసి తన ముఖాన్ని గాయపర్చు కుంటాడు”. (తిర్మిజీ)



