Sunday, February 21, 2021

మానవ జీవిత లక్ష్యం

మానవుడు వైజ్ఞానికంగా గొప్ప అబివృద్ధిని సాధించాడు. నక్షత్రాల ఆవల లోకానికి నిచ్చెనలు వేస్తు న్నాడు. అపరిచిత, సుపరిచిత ప్రాంతాలను తన కైవసం చేసుకునేందుకు ఉరకలేస్తున్నాడు. సమాచార ప్రసారానికి అతి వేగమయిన పరికరాలను కనుగొని ప్రపంచాన్ని ఓ గదిగా మార్చగలిగాడు. ఇన్ని విజయాలను సొంతం చేసుకున్న మానవుడు ఇన్ని ప్రగతి ఫలాలను అనుభవిస్తున్న మానవుడు తన ఉనికి గురించి, ఉనికి లక్ష్యం గురి ంచి తెలుసుకోక పోవడం, కనీసం తెలుసుకునేందుకు ప్రయత్నించక పోవడం ఎంతో విచారకరం. కనిపించేదే, విని పించేదే, పంచేంద్రియాల పరిధిలో వచ్చేదే నిజమని అనుకుంటే ప్రమాదం. 

హేతువు మాటున చురకత్తి కదులుతుంది. 

మనిషి బుద్ధి మార్గం తప్పుతుంది.

ఏదోక మాయ మనస్సుని క్రమ్ము కుంటుంది.  

సత్యదర్శనం కరువవుతుంది. 


కాబట్టి ఒక నిమిషం ఆగి మనల్ని మనం ప్రశ్నించుకుం దాం! మనం దేని కోసం పుట్టించ బడ్డాము? మన జీవిత లక్ష్యం ఏమిటి?  సునిశిత మతి ఉంటే ఒక సూచన చాలు. లోతులు ముట్టే ఒక ఆలోచన చాలు.



సాధారణంగా 'మానవ జీవిత లక్ష్యం ఏమిటి? అని మనం ఏ నలుగురిని అడిగామనుకోండి, వైవిధ్యమయిన సమాధానాలు వినబడతాయి. కారణం-  ఆయా వ్యక్తుల ఆశయాలు, ఉద్దేశాలు ప్రాపంచికమయినవి, పరిమితమయినవి మాత్రమే కావడం. వారు పరలో కం గురించి అక్కడ వారి కర్మలకుగాను వారికి లభించే శిక్షా బహు మానాల గురించి ఆలోచించకపోవడమే. 

మానవ జీవితం సప్త రంగులహరి విల్లు. మనిషి జీవితాన్ని ఏడుభాగా ల్లో విభజించవచ్చు.1) కుటుంబం. 2) ఆర్థికం 3) ఆరోగ్యం 4) ఆధ్యా త్మికం 5) వ్యక్తిగతం 6) వ్యాయా మం 7) సామాజికం. నేడు మనం కేవలం ఆధ్యాత్మిక లక్యం గురించి తెలుసుకోబోతున్నాము. ఎందు కంటే అదే మిగతా అన్నింటికి కేంద్రబిందువు గనక.  

నిజమైన దేవుడు ఎవరు? అని ఈ ప్రపంచంలో ఉన్న సగటు వ్యక్తిని ప్రశ్నించండి., విభిన్న సమాధానాలు వస్త్ఘాయి.  ఉదాహరణకు:--   కొందరు దేవుడు ఒక్కడే అని,  మరికొందరు ముగ్గురు అని, ఇంకొందరు ముక్కోటి అని ఇలా అనేక రకాల సమాధానాలు ఇస్తూ ఉంటారు. దేవుడు మానవుడిగా అవతరిచాడు అని కొందరు అంటే,  మనవున్నే దేవునిగా మార్చినవారు మరికొందరు    సృష్టికర్త వేరు, సృష్టి వేరు అని ద్వైతవాదులు అంటే  సృష్టి మరియు  సృష్టికర్త రెండూ ఒక్కటే అనేవారు  అద్వైతవాదులు ఇవన్ని విని అసలు దేవుడే లేడు  అని వాదించే నాస్తికులు ఉన్నారు. 

 నిజమైన దేవుడు ఎవరు? అన్న ప్రశ్న ఎంతో కన్ఫ్యూషన్ కు గురైంది అనేది వాస్తవం. ఈ కన్ఫ్యూషన్ దూరం చేయవలసిన భాద్యత ఎవరిది?  ఆలోచించండి !

 ఒక  చిన్న ఎలక్ర్టానిక్ పరికరాన్ని తయారు చేసిన శాస్త్రవేత్త కూడా దాన్ని ఎలా ఉపయోగిస్తే లాభం, ఎలా ఉపయోగిస్తే నష్టం అన్న విషయాలను తెలియజేయడానికి ఒక విషయ సూచిక (instruction manual ) ను తప్పకుండా ఇస్తాడు.

మరి ఇంత అద్భుతమైన విశ్వాన్ని, అందులో సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త మానవునికి ఎటువంటి మార్గదర్శకత్వాన్ని చూపించకుండా ఉంటాడా.  ఒకవేళ  చూపించకుండా ఉంటే తీర్పుదినం నాడు  మనిషి దేవుడితో తప్పకుండా ఇలా వాదిస్తాడు .. 

"ఓ దేవుడా! నీవు నాకు  ఎటువంటి మార్గదర్శకత్వాన్ని చూపించలేదు,,,,అందుకే నేను నా ఇష్టం వచ్చినట్లు జీవితాన్ని గడిపాను,నా ఇష్టం వచ్చినదాన్ని దేవునిగా చేసుకుని ఆరాధించాను, నీవు నాకు సత్యమేదో అసత్యమేదో,, ధర్మమేదో అధర్మమేదో తెలియజేసి ఉంటె నేను సన్మార్గంలో నడిచి ఉండేవాణ్ణి''అని అంటాడు 

   అందుకే సర్వజ్ఞుడైన సృష్టికర్త  ప్రతి యుగంలో,  ప్రతి జాతిలో  మానవునికి ఋజుమార్గం చూపడానికి ఒక ప్రవక్తను (సందేశాహరుణ్ని) ప్రభవింపజేస్తాడు   ఈ ఖుర్ ఆన్ వాక్యాన్ని గమనించండి:::

 "వలికుల్లి ఉమ్మతి రసూల్ "(10:47) మేము ప్రతి జాతిలోను  ఒక ప్రవక్తను పంపాము 

ఖుర్ ఆన్ హదీసు  గ్రంథం ప్రకారం ఆది నుండి నేటి వరకు దేవుడు 1,24000 మంది ప్రవక్తలను   ప్రభవింపజేసాడు.  


మనిషి తన నిజ సృష్టికర్తను గురించి ఎందుకు అన్వేషించాలి... ?

ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ప్రతి చిన్న విషయాన్ని గురించి ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తాడు. స్వీయపరిశీలన చేయకుండా గుడ్డిగా ఏ వస్తువూ తీసుకోడు.

ఉదాహరణకు:- బట్టల షాపుకు, లేదా చెప్పుల షాపుకు వెళ్ళి,చూడకుండా, పరిశీలించకుండా ఏదైనా వస్తువును కొంటారా... ? ఖచ్చితంగా అలా చేయరు.ఎందుకంటే అలా చేస్తే నష్టపోయే అవకాశం ఉంది. అందుకే ఒక ఒక కేజీ కూరగాయలు తీసుకునే విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా పరిశీలించి తీసుకుంటారు ....

కాని ఒక్క సృష్టికర్త విషయంలో మాత్రం స్వీయపరిశీలన చేయకుండా మన పూర్వీకుల పై, పండితులపై, పాస్టర్లపై, మౌల్వీలపై, గుడ్డిగా ఆధారపడటం వల్ల వారు మనల్ని సత్యానికి దూరంగా తీసుకొని వెళ్తున్నారు.అందువల్ల మనం నిజ దేవుడు ఎవరు అన్న సత్యాన్ని తెలుసుకోలేక అసత్య దైవాలను ఆరాధిస్తూ ... ఇదే మన సంస్కృతి అన్న భ్రమలో ఉన్నాము. ప్రతి చిన్న విషయాన్ని గురించి ఎంతో జాగ్రత్తగా పరిశీలించే మనము,,,ఎవరైతే మనల్ని పుట్టించాడో,, ఎవరైతే మనకు ఈ పరిశీలనా జ్ఞానాన్ని ప్రసాదించాడో, ఆ సృష్టికర్తను గురించి తెలుసుకోవడానికి మాత్రం ఈ పరిశీలనా జ్ఞానాన్ని ఉపయోగించడం లేదు. ప్రాపంచిక సరదాల కోసం ఎంతో సమయాన్ని వృధా చేసే మనము ఆ సృష్టికర్తను గురించి అన్వేషించడానికి మాత్రం సమయాన్ని తీయడానికి ప్రయత్నించడం లేదు. సోదరులార! అందుకే ఆ సృష్టికర్త గురించి ఆలోచించాలి, పరిశీలించాలి. ఆ సృష్టికర్తను అన్వేషించడానికి సమయాన్ని కేటాయించాలి.

పెన్సిల్‌ ఉపమానం: 

ప్రతి వ్కక్తీ కొనగలిగేంతటి చౌకబారు వస్తువు పెన్సిల్‌. అ) మామూలపాటి ఈ పెన్సిల్‌ తనంటత తానుగా ఉనికి లోకి వచ్చిందా? లేదా దాన్ని తయారు చేసినవాడొకడున్నాడా?

'పెన్సిల్‌ తనంతట తానుగా ఉని కిలోకి రాలేదు' అన్నది మీ అందరి సమాధానం. తేలికపాటి పెన్సిల్‌ తనంతట తానుగా తయా రవ్వలేదు అంటే, ఈ సృష్టిబ్రహ్మాం డం, అందులోని మనం ఇట్టే యాదృచ్ఛికంగా, ఒక విస్పోటనం ద్వారా ఉనికిలోకి వచ్చేశాయను కోవడం ఎంత వరకు సహేతుకం? 

''అది సరేగాని, మీరు వదిలే రేతస్సు గురించి ఎప్పుడయినా ఆలోచించారా? ఏమిటి, దాంతో మనిషిని సృష్టించేది మీరా? లేక మేము సృష్టిస్తున్నామా?... సరే! మీరు నాటే వస్తువును(విత్తనాన్ని) గురించి ఎప్పుడయినా ఆలొచిం చారా? ఏమిటి, దాన్ని మీరు పండిస్తున్నారా? లేక దానిని పండించేది మెమా?.....''  (అల్‌ వాఖిఅహ్‌: 58-64)  

దేవుడు ఒక్కడే ఆయన తప్ప మరొకడు లేడు (Rigveda 6:45:16) 

"देवो महा असि" (దేవుడు ఒక్కడే గొప్పవాడు)

దావ్య భూమి జనయాన్ దేవ ఏకః  భూమిని ఆకాశాన్ని సృష్టించినవాడు ఒక్కడే

(Swetha swatharopanishath 3:2)

"एकम यवद्वितीयम" దేవుడు ఒక్కడే ఆయన తప్ప మరొకడు లేడు (Chandogya Upanishath 6:2:1) 

భూదిగంతముల నివాసులరా! నావైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. (యషయా 45:22)   


 ఏసు అంటున్నారు :మీరు ఈలోక మందు ఎవ్వరినీ తండ్రి (దేవుడు)అని పేరు పెట్టి పిలవకండి .మన తండ్రి (దేవుడు)ఒక్కడే . ఆయన పర లోక మందు వున్నాడు. (మత్తయ 23 :9 )

మన ధార్మిక గ్రంధాలైన వేదాలు, ఉపనిషత్తులు, బైబిల్, మరియు ఖుర్ ఆన్, దేవుడు ఒక్కడే అని ఘోషిస్తున్నా ప్రజలు ఆ ఒక్క దువుణ్ణి ఎందుకు ఆరాధించడం లేదు?

 మనం దేవుని విషయంలో  మన పెద్దవాళ్ళ పైన, టీచర్ల పైన ,ధార్మిక పండితుల పైన ఆధార పడుతూ మన ధార్మిక గ్రంధాలకు  చాలా దూరంగా ఉన్నాము. దేవుని ఔన్యత్యము, గుణగణాలు, శక్తి మరియు ఆయన హక్కుల విషయంలో అవగాహనా రాహిత్యం నేడు ఎక్కువ కనపడుతుంది. ఈ అవగాహనా రాహిత్యం వల్లనే దేవునికి భార్యా, పిల్లలు మరియు మానవ రుగ్మతలు ఉన్నాయి అనే భావన నేడు సమాజంలో కనపడుతుంది. 

సృష్టి, ఏ కర్తా లేకుండా ఉనికిలోకి వచ్చేసింది అన్నదీ సత్య దూరమే. సృష్టికి అనేక కర్తలు ఉన్నారు అనడమూ వ్యర్థ ఆలోచనే. 


దేవుడు కనిపిస్తాడా ?

లైసక మిస్లిహీ షైయవ్ (ఖుర్ ఆన్ - 42:11)

ఆయన్ని పోలిన వస్తువు ఏది లేదు. 

 2) లా తుద్రికుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్  (ఖుర్ ఆన్ 6:103)

ఎవరి చూపులు కూడా ఆయనను అందుకోజాలవు కానీ ఆయన అందరి చూపులను పర్యవేష్టించి ఉన్నాడు 

"नातस्य प्रतिमा अस्थि" (దేవునికి ప్రతిమ లేదు) 

న సంద్రుశే తిష్ఠతి రూపమస్య నచాక్షుశా పశ్యతి కశ్చనైనమ్ (దేవుణ్ణి కళ్ళతో చూడలేము ) 

ఎవరి నైతే నీ కన్నులు చూడ లేవో ,ఎవరైతే నిన్ను చూస్తున్నారోఆయనే సృష్టి కర్త , వీరు (జనులు)ఆరాదించేదేది దేవుడు కాడు. కేన ఉపనిషత్ ( 1 : 7 )

దేని నైతే నీవు నీ మనస్సు తో ఉహించ లేవో ఎవరికైతే నీ మనస్సులో ఉన్న రహస్యాలు సైతం తెలుసో ఆయనే సృష్టి కర్త , వీరు (జనులు)ఆరాదించేదేది దేవుడు కాడు. కేన ఉపనిషత్ ( 1 : 6 )

నేను సర్వజ్ఞుడను, పురాతనుడను, సర్వలోక ప్రభువును, సమస్త ప్రపంచానికి ఆధారమైనవాడను. ఆలోచిమ్పసక్యముకాని రూపం గలవాడను, స్వయం ప్రకాశుడను, జ్ఞానిని. (భగవద్గీత  8:9)

 నేను ఇట్టిదని నిర్దేశింపశక్యముకాని, ఇంద్రియాలకు గోచరమ కాని, ఆలొచింపశక్యముకాని రూపం గలవాడిని, బలహీనతలు లేని వాడిని , సర్వజ్ఞానిని. (భగవద్గీత  12:3-4) 

మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు.Bible, (Isaiah 5:37)

కావున మీరు ఎవనితో దేవునిని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? (Bible, Isaiah 40:18)


దేవుడు మానవుడిగా పుడతాడా!

దేవుడు భూమ్మీదకు వచ్చి, మానవుడిగా అవతారమెత్తుతాడన్న భావన ఇస్లాం అంగీకరించాడు. ఇలా దేవుడే మనిషి రూపుదాల్చుతాడనే సిద్ధాంతం మరికొన్ని మతాలలో కూడా ఉంది. దీన్ని ఆంథ్రోపోమార్ఫిజం అంటారు. ఈ సిద్ధాంతాన్ని నమ్మేవారు దీనికొక కారణం కూడా చెబుతారు. అదేమంటే... సర్వశక్తి సంపన్నుడైన దేవుడు ఎంతో పవిత్రుడు. మానవులకు ఎదురయ్యే కష్టాలు... అంటే నొప్పికలిగితే ఎలా ఉంటుంది, సమస్యలెదురైతె ఎంత బాధకలుగుతుంది, మొదలైనవి ఆయనకు తెలీదు. 

అందుకే దేవుడు మానవరూపం దాల్చి వాటన్నింటినీ తెలుసుకుని మానవులు ఏం చేయాలో, ఏం చేయకూడదో మార్గ దరసాకాలు ఏర్పాటు చేస్తాడు. పైపైన  తర్కం సరైనదేననిపిస్తుంది. అంటే దేవుడెంతో పరిశుద్ధుడనీ, మానవుల కష్టాలు తెలుసుకుని, వారికి అవసరమైన మార్గదర్శకాలు ఏర్పరుస్తాడనే తర్కం వినడానికి బాగానే అనిపిస్తుంది. కానీ ఇక్కడ పుట్టే ఒక చిన్న ప్రశ్న ఏమిటంటే... నేనొక వీసీఆర్ (వీడియో కేసెట్ రికార్డర్) ని తయారు చేసాననుకోండి, ఆ వీసీఆర్'కు ఏది తగునో, ఏది తగదో తెలుసుకోవాలంటే స్వయంగా నేను ఆ వీసీఆర్ గా మారిపోవాలా? నేను వీసీఆర్ సృష్టికర్త ను అయినందువల్ల దాని మంచి చెడ్డలు నాకు తెలుస్తాయి. కాబట్టి నిబంధనలు నిర్ణయించడానికి నేను దాని రూపంలోకి మారిపోనక్కరలేదు. మరేం చేయాలి?


నేనొక సూచనల పుస్తకం రాయాలి. క్యాసెట్ లోని ప్రోగ్రాం చూడాలంటే వీసీఆర్ లో కేసెట్ పెట్టి ప్లే బటన్ నోక్కాలనీ, ఆపాలంటే 'స్టాప్' నోక్కాలనీ, ముందుకు పోవాలంటే ఫాస్ట్ ఫార్వార్డ్ నోక్కాలనీ, పైనుంచి కిందికి పడేస్తే అది చెడిపోతుందనీ,  పని చేయదనీ చెబుతూ ఒక సూచనల పుస్తకం రాస్తే సరిపోతుంది. అంటే గానీ దాన్ని సృష్టించేవాడే దాని రూపంలోకి మారిపోనక్కర లేదు. 

అలాగే సర్వసక్తే సంపన్నుడైన దేవుడు కూడా మానవజాతికి సృష్టికర్త కాబట్టి వారికేది మంచో, ఏది చెడో తెలుసుకోవడానికి మనిషి అవతారం ఎత్తనక్కరలేదు. మరేం చేయాలి? మానవులలో ఒక వ్యక్తిని ప్రవక్తగా ఎంపిక చేసుకొని ఆయనకు ఉన్నత స్థాయిలో జ్ఞానం ఇచ్చి, ఆయన ద్వారా ప్రజలకు మార్గదర్శకాలు అందించవచ్చు. 

దేవుడు గ్రంధాలూ అవతరింపజేయడానికి ప్రజల కొరకు ప్రవక్తలు పంపిస్తాడే కాని ఆయన క్రిందకు రాడు. ఈ పరంపరలో తన చిట్టచివరి ప్రవక్త అయిన ముహమ్మద్ (స.అ.సం) (సత్యమైన ఆత్మ) పై ఖుర్ ఆన్ గ్రంధాన్ని అవతరింప జేయడం జరిగింది. అంతేగాని దేవుడు మానవ అవతారం ధరించి ఈ భూమి పైకిరాడు. 

నిశ్చయంగా ఇది (ఈ ఖుర్ ఆన్) సకల లోకాల ప్రభువు అవతరింపజెసినది. విశ్వసనీయుడైన దైవ దూత దీన్ని తీసుకు వచ్చాడు.

  ఓ ముహమ్మద్ (స. అ. సం) నువ్వు హెచ్చరించే వారిలోని వాడవు కావడానికి ఇది (ఖుర్ ఆన్)నీ హృదయం పై అవతరించింది.    (ఖుర్ ఆన్  26:192-194)

ఆ దేవుడు ఎప్పటికి శరీర ధారణ చేయడు (మానవ అవతారం ధరించడు) యజుర్వేదం (40:8) 

 నాశరహితమైనట్టియు, సర్వోత్తమ మైనట్టియు,సర్వ శ్రేష్టమైనట్టియు, నా రూపము తెలియని అవివేకులైన ఈ జనులు అవ్యక్త రూపుడగు నన్ను (చూడడానికి వీలులేని రూపం) మానవ అవతారం దాల్చిన వానిగా భావించుచున్నారు.(భగవద్గీత  7:24) 

నిశ్చయంగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు.(1 వ రాజులు  8:27) 

దేవుడు నరపుత్రుడు కాడు. (సంఖ్యా కాండము 23:19) 

మనిషి జీవితం లక్ష్య రహితమా?

ఆ) పెన్సిల్‌ రాయడం దానిలక్ష్యం గా తనకు తానే నిర్ణయించుకుందా, నిర్ణయించినవాడొకడు న్నాడా? 'దాని తయారు చేసిన వాడే దాన్ని తయారు చేయక ముందే దాని లక్ష్యాన్ని నిర్ణయిం చాడు' అనేది మీ సమాధానం. మరి చిన్న పెన్సిల్‌కే ఒక లక్ష్యాన్ని ఆ వస్తువు నిర్మాత నిర్దేశించిన ప్పుడు, సృష్టికే తలమానికమయిన మనిషి, మనిషి కోసం నిర్మించ బడిన ఈ విశ్వ వ్యవస్థ ఇట్టే అర్థ రహితంగా, లక్ష్యరహితంగా,గమ్య రహితంగా ఉనికి ఇవ్వడం జరిగిందా? 

దివ్యఖుర్‌ఆన్‌, మోమినూన్‌ అధ్యా యం: 115వ వచనంలో మనందరి సృష్టికర్త మనల్ని ఇలా ప్రశ్ని స్తున్నాడు: ''మేము మిమ్మల్ని ఏదో ఆషామాషిగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా వద్దకు మరలి రావడమనేది జరగని పని అని భావిస్తున్నారా?'' 

''(ఆ విషయానికొస్తే) మేము భూమ్యాకాశాలను, వాటి మధ్యనున్న వాటిని -ఏ ఒక్కటినీ లక్ష్యరహితంగా పుట్టించలేదు. యాదృచ్ఛికంగా పుట్టామన్నది అవిశ్వాసుల భ్రాంతి మాత్రమే''. (స్వాద్‌: 27) 

అంటే సృష్టికర్త మనిషిని ఈ భూమి మీద పుట్టించి, అతని జీవితానికవసర మయిన వస్తువులన్నింటిని సమకూర్చి పెట్టాడు. భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు - ఒక్కటేమిటి, పరమాణవు మొదలు పంచభూతాల వరకూ అన్నీ మనిషి సేవ కోసమే పుట్టించాడు. 


మనిషిని దేని కోసం పుట్టించినట్టు? 

దివ్యఖుర్‌ఆన్‌ 51వ అధ్యాయం, 56వ సూక్తిలో ఇలా సెలవియ్యబడింది: ''నేను మానవులను, జిన్నాతులను కేవలం నా ఆరాధన కోసం మాత్రమే పుట్టించాను''.  

అంటే, సూర్యచంద్రనక్షత్రాలను పుట్టించి వాటి కోసం కొన్ని నియమనిబంధల్ని నిర్ణయించినట్లే మానవులకు కూడా కొన్ని నియమనిబంధనలుపెట్టాడు. వారందరి కోసం క్రమశిక్షణతో కూడిన జీవన సంవిధానాన్ని కేటాయిం చాడు. ఆయన నిర్దేశించిన ధర్మం ప్రకారం జీవిస్తే - మనిషి కుటుంబ జీవ నమయినా, అర్థిక, వ్యాయామ, సామాజిక, ఆరోగ్య, వ్యక్తిగత రంగాలన్నీ సక్రమంగా ఉంటాయి. ఆయా రంగాల్లో అతడు పడే శ్రమ దైవాజ్ఞబద్ధ మయి ఉన్నంత కాలం పుణ్యప్రదంగా, సత్కార్యంగా పరిగణించబడుతుంది. అది తోటి సోదరునితో అతని నగుమోము సంభాషణ అయినా, ప్రేమతో భార్యకు తినిపించిన ఒక ముద్దయినా ఆరాధనగా భావించబడుతుంది. కవి మాటల్లో చెప్పాలంటే, 


ఉన్నత చదువులు ఎన్ని చదివినా ఫలితముండబోదురా

సృష్టికర్తను గ్రహించలేని డిగ్రీలన్నీ వ్యర్థమురా!

దేవుడొక్కడని విశ్వసించిన జీవితమగును శాంతిమయం.

దైవదాస్యం చేసిననాడు కలుగును ఇహపర సాఫల్యం!

నీకు కలుగును ఇహపర సాఫల్యం!


ఎవరిని ఆరాధించాలి ? సృష్టినా లేక సృష్టికర్తనా ?

ఓ మానవులారా, మిమ్ముల్ని, మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువునే ఆరాధించండి.(ఖుర్ ఆన్ 2:21);

మీరు సూర్యచంద్రులను ఆరాధించకండి. వాటిని సృష్టించిన దేవున్ని ఆరాధించండి.(ఖుర్ ఆన్ 41:37);

స్వయంగా మీరే చెక్కుకున్న వస్తువులను మీరు పూజిస్తున్నారా. వాస్తవానికి అల్లాహ్యేయే మిమ్ముల్ని సృష్టించాడు (ఖుర్ ఆన్ 37:95);

అల్లాహ్ ను విడిచి ప్రజలు వేడుకొంటున్న ఇతర శక్తులు ఏ వస్తువులకు సృష్టికర్తలు కావు. స్వయంగా వారే సృష్టించబడినారు.(16:20);

సర్వశక్తిగల దేవుడికి ఇతరులను బాగ్యస్వాములుగా చేసే వారికీ ఆ దేవుడు స్వర్గాన్ని నిషేధం చేశాడు. వారి నివాసం నరకం. (దివ్యఖుర్ఆన్ 5:72)

సృష్టిని ఆరాధించే వారు అంధకారానికి (శాశ్వత నరకానికి ) పోతారు.చేతితో తయారైన బొమ్మలను విగ్రహాలను ఆరాధించే వారు

ఇంకా లోతైన అంధకారానికి (నరకానికి) పోతారు. యజుర్వేదం (40:9)

తమ యొక్క ప్రక్రుతిచే ప్రేరేపింపబడినవారై విషయాదులందలి కోరికలచే వివేకమునుగోల్పోయి, దేవతారాధన సంబంధమైన ఆయా నియమముల నవలభించి ఇతర దేవతలను ఆరాధించు చున్నారు. (భగవద్గీత 7:20)

నరులను ఆశ్రయించి శరీరులను తన కాధారముగా చేసుకొనుచు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకోనువాడు శాపగ్రస్తుడు. (యిర్మియా 17:5)

సర్వశక్తిమంతుడైన నిజదేవున్ని విడిచి అనేక బలహీనతలు గల సృష్టి రాశులను ఆరాధించడం దేవుని దృష్టిలో క్షమించరాని పాపం. ఇదే స్ధితిలో మనషికి మరణం సంభవిస్తే అతడు శాశ్వతమైన నరకాగ్నిలో పడవేయబడతాడు. అక్కడ శాశ్వతంగా ఉంటాడు. 

ఎవడు శాస్త్రోక్తమగు విధిని విడిచి పెట్టి తన ఇష్టము వచ్చినట్టు ప్రవర్తించునో అట్టివారు పురుషార్దసిద్దిని గాని, సుఖమునుగాని, ఉత్తమ గతియగు మోక్షము గాని పొందనేరడు (Bhagvad Geetha 16:23)

కామము,క్రోధము,లోభము అను ఈ మూడునూ మూడు విధములగు నరక ద్వారములు. ఇవి జీవులకు నాశనము కలుగ జేయును, కాబట్టి ఈ మూడింటిని విడనాడ వలెను. (భగవద్ గీత  16:21)

 

నేడు నీకాజ్ఞాపించు సమస్త ఆజ్ఞలు కట్టడములు,నీవు అనుసరించని యెడల నీ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట వినని యెడల ఈ శాపములన్నియు నీకు సంభవించును. (ద్వితియోపదేశ కాండము  28:15)

మా వాక్యాలను తిరస్కరించిన వారికోసం మేము నరకాగ్ని సిద్దం చేసే ఉంచాము. (ఖుర్ ఆన్  4:57)  


మన ఆరాధ్య దైవం ఎవడు?

ఒకడే దేవుడు ఒకడే కర్త సృష్టికి ఒకడే యజమాని. ఒకటే మార్గం ఒకటే గమ్యం - ఇదే సత్యం' అని మనం తెలుసుకున్నాము? ఈ మాట ఏకేశ్వరోపాసకులు మొదలు బహుదైవారాధకుల వరకూ, క్రైస్తవులూ, యూదులు, ఫారసీలు మొదలు సృష్టి పూజారుల వరకూ అందరూ చెబుతున్నప్పుడు ఎవరు ప్రతిపాదించిన దైవాన్ని నిజ దైవం గా ఎంచాలి? ఎవరు అవలంబించే జీవన సంవిధానాన్ని అవ లంబించాలి? ఏ మార్గం మనల్ని స్వర్గానికి చేర్చగలదు. అన్న ప్రశ్న తలెత్తుతుంది.  ''ఇక్కడయితే ప్రతి పక్షం తానే సత్య పక్షం'' అని బల్ల గుద్ది మరీ చెబుతుందాయే! 

ఎవరైతే ఈ భూమి ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్తాన్ని సృష్టిస్తున్నారో

ఎవరైతే ఈ భూమి ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్తాన్ని పోషిస్తున్నారో

ఎవరైతే ఈ భూమి ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్తాని కి మరణాన్ని ఇస్తున్నారో

ఎవరైతే ఈ భూమి ఆకాశాలను మరియు వాటిమధ్య ఉన్న సమస్త జీవుల కర్మల లెక్క తీసుకుంటాడో.

ఆయననే తెలుగు బాషలో దేవుడు అని, సంస్కృతం లో సర్వేశ్వరుడు అని, ఇంగ్లీష్ బాషలో గాడ్ అని,

 హిబ్రు బాషలో యహోవా అని, ఆయననే అరబ్బి భాషలో "అల్లాహ్" అని పిలుస్తారు

ఓ మానవులారా..! నిశ్ఛయంగా మీ అందరి దేవుడు ఒక్కడే ఆ కరుణా మయుడు , ఆ కృపాకరుడు తప్ప మరో దేవుడు లేడు. దివ్య ఖుర్ఆన్ ( 2 : 163 )

 అల్లాహ్ - ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు.ఆయన సజీవుడు సర్వ సృష్టికి మూలాధారం. (Quran 3:2)


విశ్వాన్ని, విశ్వంలో ఉన్న అణువణువును మనం సునిశితంగా పరి శీలించినట్లయితే, స్వయంగా మన దేహాన్ని, దాని నిర్మాణ విధానాన్ని గమనించినట్లయితే మూడు విషయాలు బోధ పడతాయి. 

1) సృష్టి, 2) స్థితి, 3) లయ. 

1) సృష్టి: ''ఆయనే ఆకాశాలనూ భూమిని సత్యబద్ధంగా సృష్టించాడు. ఏ రోజు ఆయన 'అయిపో' అని ఆజ్ఞాపించాడో అప్పుడు అది అయిపోతుంది. ఆయన మాట సత్యమయినది, ప్రభావ పూరితమ యినది''. (ఆల్‌ అన్‌ఆమ్‌:73)  

''ఆయనే తాను కోరిన విధంగా మాతృ గర్భాలలో మీ రూపు రేఖలను మలుస్తాడు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన శక్తి సంపన్నుడు, వివేక సంపన్నుడు కూడా''. (అల్‌ ఇమ్రాన్‌: 6) 

2) స్థితి: ''ఆత్మ సాక్షిగా! దాన్ని తీర్చి దిద్దిన వాని సాక్షిగా! మరి ఆయన దానికి చెడును, చెడు నుండి తప్పించుకుని మసలు కునే ప్రేరణను ఇచ్చాడు'' (అష్షమ్స్‌: 6,7)

''ప్రతి వస్తువుకూ దాని ప్రత్యేక రూపు ఇచ్చి, తర్వాత దానికి మార్గం చూపేవాడే మా ప్రభువు''. (తాహా: 50) 

అంటే మనిషికి శోభనిచ్చే రూపు ను, పశువుకు తగిన ఆకారాన్ని,విశ్వంలోని వస్తువులన్నింటికీ వాటికి అతికినట్లు సరిపోయే రూపురేఖలను ప్రసాదించిన వాడు. ప్రతి ప్రాణికీ దానిస్వభా వస్వరూపాల రీత్యా బ్రతుకు తెరువును నేర్పినవాడు. మనుగ డకు అవసరమయిన వాటిని సమకూర్చుకునే తెలివీ తెటలను ఇచ్చినవాడు. వాటి ప్రకారమే ఆ ప్రాణులు తమ జీవనపథాన్ని నిర్ణయించుకుంటాయి.

3) లయ: ''ఆయనే ఆకాశాలు మొదలుకుని భూమి వరకూ (ప్రతి) పనిని నడుపుతున్నాడు''. (అస్సజ్దా: 5) 

''భూమిలో సంచరించే ప్రాణుల న్నింటికీ ఆహారాన్ని సమకూర్చే బాధ్యత అల్లాహ్‌దే. అవి ఆగి ఉండే స్థానాలు, అప్పగించబడే స్థానాలు కూడా ఆయనకు తెలుసు''. (హూద్‌:6) 


మరి ఆయన పేరేమిటి? 

''నిశ్చయంగా మీ ప్రభువు అల్లాహ్‌యే. ఆయన ఆకాశాలను, భూమి నీ ఆరు రోజులలో సృష్టించాడు. తర్వాత అర్ష్‌ను అధీష్టించాడు. ఆయన సమస్త వ్యవహారాలను నిర్వహిస్తున్నాడు, ఆయన అను మతి లేకుండా (ఆయన సమక్షం లో) సిఫారసు చేయగలవాడెవడూ లేడు. ఆ మహితాత్ముడయిన అల్లాహ్‌ాయే మీ అందరి ప్రభువు. కాబట్టి మీరు ఆయన్నే ఆరాధిం చండి''. (యూనుస్‌: 3) 

ఇక ఆయన గుణగణాలేమిటి? అంటారా...   


సకల దౌర్బల్యాలకు  అతీతుడు అల్లాహ్‌:

 ''అల్లాహ్‌, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన సజీవుడు; అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునకుగానీ, నిద్ర గాని పట్టదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయన అధీనం లో ఉంది. ఆయన అనుమతి లే కుండా ఆయన సమక్షంలో సిఫా రసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానినీ, వెనక ఉన్న దానినీ ఆయన ఎరుగును.ఆయన కోరినది తప్ప ఆయనకున్నజ్ఞానం లోని ఏ విషయమూ వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. ఆయన కుర్చీ వైశాల్యం భూమ్యాకాశాలను  చుట్టు ముట్టి ఉంది. వాటిని రక్షించడానికి ఆయన ఎన్నడూ అలసి పోడు. ఆయన సర్వోన్నతుడు, గొప్పవాడు''. (అల్‌ బఖరా: 255) ''భూమ్యాకాశాల సార్వభౌమత్వం ఆయనదే. జీవన్మరణాల ప్రదాత ఆయనే. ఆయన ప్రతిదీ చేయగల అధికారం కలవాడు.ఆయనే మొదటి వాడు, చివరివాడు. ఆయనే బాహ్యం, ఆయనే నిగూఢం. ఆయన ప్రతిదీ తెలిసినవాడు''. (అల్‌ హదీద్‌: 2,3)

ఆయనే ఆది. ఆయనకంటే ముందు ఏదీ లేదు. ఆయనే అంతం.ఆయన తర్వాత ఏదీ ఉండదు. 

(నా దాసులకు ఈ విషయాన్ని) తెలియజెయ్యి: ''ఆయన అల్లాహ్‌ ఒక్కడే. అల్లాహ్‌ నిరపేక్షాపరుడు. ఆయన ఎవరినీ కనలేదు. ఆయనా ఎవరికీ పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు ఎవడూ లేడు''.  (అల్‌ ఇఖ్లాస్‌: 1-4) 

''ఆయన్ను పోలిన వస్తువేదీ లేదు''. (షూరా: 11) 

''భూమండలంలో ఉన్న వృక్షాలన్నీ కలములుగా, సముద్రాలన్నీ సిరాగా మారిపోయినా, ఆపైన మరో ఏడు సముద్రాలను కలుపుకున్నా (అవి పూర్తయిపోతాయేగాని) అల్లాహ్‌ా వచనాలు పూర్తి కావు. నిస్సందేహంగా ఆయన సర్వాధికుడు, వివేకవంతుడు''. (లుఖ్మాన్‌: 27) 

ఆయన గుణగణాలను అంతిమ దైవగ్రంథమయిన ఖుర్‌ఆన్‌ వెలుగులో తెలుసుకున్నాము. ఇప్పుడు ఆయన తన దాసులనుద్దేశించి ఏమంటు న్నాడో కూడా తెలుసుకుందాం! 

''ఓ ప్రజలారా! మిమ్మల్నీ, మీకు పూర్వం వారిని పుట్టించిన మీ ప్రభువు నే ఆరాధించండి. తద్వారానే మీరు సురక్షితంగా ఉండగలరు. ఆయనే మీ కోసం భూమిని పాన్పుగానూ, ఆకాశాన్ని కప్పుగానూ చేశాడు.  ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా పండ్లుఫలాలను పండించి మీకు ఉపాధినొసగాడు. ఇది తెలిసి కూడా మీరు ఇతరులను అల్లాహ్‌కు భాగస్వాములుగా నిలబెట్టకండి''. (అల్‌ బఖరా: 21,22) 

మనందరి ఆరాధ్య దైవం అయిన అల్లాహ్‌తో కలుసుకోవాలనీ, ఆయన దివ్య దర్శనంతో పునీతులమవ్వాలని మనలో ఎవరు కోరుకోరు చెప్పండి! మరి మన తదుపరి కర్తవ్యం ఏమిటి? అదీ ఆయన మాటల్లో నే వినండి: ''కనుక తన ప్రభువును కలుసుకోవాలన్న ఆకాంక్ష  ఉన్న వాడు సత్కార్యాలు చేయాలి, తన ప్రభువు ఆరాధనలో వేరొకరికి భాగ స్వామ్యం కల్పించకూడదు''. (కహఫ్‌:110)   



సంస్కారం - సాత్వికం

 మానవ చరిత్రలో సదా అత్యధిక శాతం ప్రజలు మత ధర్మాన్ని నమ్మేవారుగా కనబడతారు. ఈ కారణంగానే ఖుర్‌ఆన్‌ మనిషిలోని మనసులోన గూడు కట్టుకుని ఉండే ఈ భావం గురించి ఇలా తెలియజేస్తుంది: ''అల్లాహ్‌ా మానవులను ఏ స్వభా వంపై పుట్టించాడో ఆ స్వభావంపైనే (ఉండండి)''.(అర్రూమ్‌:30)


అంటే - మనిషి సృజన దేవుని ఏకత్వ భావనపైనే జరిగింది. అతని అసలు నైజంలో కూడా దేవుని ఏకత్వం వేళ్ళూనుకుని ఉం టుంది. అన్ని మతధర్మాలు కూడా ఇతర విషయాల్లో విభేదించినా ఈ ఒక్క మౌలిక విషయంలో ఏకీభవించడం మనం చూస్తాము. ఈ మౌలిక సత్యాన్నే అవి అన్నింటికీ ఆధారభుతంగా పేర్కొనడం కూడా మనం గమనించగలము. కాకపోతే మనిషి పుట్టిన తర్వాత కాలానికనుగునంగా పరిస్థితుల, పరిసరాల ప్రభావానికి, ప్రలోభా నికి లోనవుతాడు. అతను కళ్ళు తెరిచిన సమాజం కుళ్ళు అతన్ని సహజ ధర్మం వైపునకు పోనివ్వదు.  అరిషడ్వర్గాలకు బానిసలైన వారి చేతిలో పడి మార్గభ్రష్టతకు గురవుతాడు. 'సత్యం ఒక్కోసారి కటువుగానే ఉంటుంది. యదార్థవాదం లోక విరోధం అవుతుంది' అన్నట్టు అతడు అవిశ్వాస స్థితిలోనే ఉండిపోతుంటాడు. ఈ సంద ర్భంగా మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి మాట గమనించ దగ్గది: ''ప్రతి శిశువు తన సహజ ధర్మంపైనే పుడుతుంది. కాని దాని తల్లిదండ్రులు దాన్ని యూదునిగానో, క్రైస్తవుగానో, మజూసీ గానో మార్చి వేస్తారు''. (బుఖారీ)


  అలా గాడి తప్పిన మనిషిలో అసహజ అలోచనలు, అసభ్య ప్రేలాపనలు చోటు చేసుకున్నాయి. తన అభిమతమే సరైనదిగా భావించి, ఇతరుల దృక్పథాన్ని దోషపూరితమయినదిగా తల పోస్తాడు. తన అభిమతానికనుగుణంగా తాను ఎదుర్కొన్న కొన్ని అనుభవాలు, కనుగొన్న కొన్ని అధారాలను పదే పదే ఉదాహరి స్తూ అదే సర్వస్వం అనుకుంటాడు. అలా ప్రతి ముఠా వారు తామెన్నుకున్న పద్ధతే సత్యబద్ధమైనదనే అపోహకు లోనవుతారు. ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా  పేర్కొంటుంది:
''వారు తమ ధర్మాన్ని ముక్కలు చెక్కలు చేసేశారు.వారు సయితం విభిన్న ముఠాలుగా చీలిపోయారు. ప్రతి ముఠా తన దగ్గర ఉన్న దానితోనే తెగ సంబర పడిపోతోంది''. (అర్‌ రూమ్‌: 32)

అసలే మనుష్యులు దుర్బలులు
అందులో చచ్చేటన్ని చీలికలా?
అసలే ఈ లోకం ఇరుకు
అందులో ఇన్నిన్ని ఎల్లలా?
 
 ఇస్లాం ఓ సార్వజనీన ధర్మం. అది సార్వకాలికం. ఆది మానవుడ యిన ప్రవక్త ఆదం (అ) మొదలు అంతిమ దైవ ప్రవక్త ముహ మ్మద్‌ (స) వరకు ప్రవక్తలందరూ తీసుకొచ్చిన ఏకైక జీవన సంవి ధానం. అది మనిషి తన, మాన, ధన, మనోభావాలను గౌరవి స్తోంది. అడుగడుగునా వాటిని కాపాడే కట్టుదిట్టమయిన చర్యలు చేపడుతోంది. గత ప్రవక్తల సంప్రదాయాన్ని, వారి జీవన సంవి ధానాన్ని, వారి ప్రబోధనల్ని ధృవీకరించే గ్రంథంగా, వాటి బోధనా సారాంశాన్ని సంరక్షించే గ్రంథంగా ఖుర్‌ఆన్‌ను పేర్కొనడం జరి గింది: ''మేము నీ వైపునకు ఈ గ్రంథాన్ని సత్య సమేతంగా అవత రింపజేశాము. అది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్య మని ధృవీకరిస్తుంది. వాటిని పరిరక్షిస్తుంది. కాబట్టి నువ్వు వారి పరస్పర వ్యవహారాలపై అల్లాహ్‌ా అవతరింపజేసిన ఈ గ్రంథాని కనుగుణంగానే తీర్పు చెయ్యి''. (అల్‌ మాయిదా: 48)

 అంటే ఖుర్‌ఆన్‌ గత దైవ గ్రంథాల్ని, దైవప్రవక్తల్ని ధృవీకరించ డమే కాక వాటిని విశ్వసించమని, గౌరవించమని మానవాళికి పిలుపునిస్తోంది. అయితే గత సముదాయాలకు చెందిన యూద క్రైస్తవ ప్రజలు ప్రవక్తల పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించారు. ప్రవక్త నూహ్‌ా, ప్రవక లూత్‌, ప్రవక్త యాకూబ్‌ కుమారుడయిన యహూదా, ప్రవక్త దావూద్‌, ప్రవక్త సులైమాన్‌,  ప్రవక్త యూసుఫ్‌, ప్రవక్త ఉజైర్‌, ప్రవక్త ఇసా (అలైహిముస్సలాతు వస్సలామ్‌)పై  లేనిపోని అభాండాలు మోపి వారి పరమ పవిత్ర జీవితాల్ని, వ్యక్తిత్వాల్ని అనుమానాస్పదంగా చిత్రీకరించి, అట్టి వ్యర్థ కథనాలను తాము పరిశుద్ధంగా భావించే గ్రంథాలలోనే చోటు కల్పించారు. అంతటితో సరిపెట్టుకోలేదు. 1980లో డెన్మార్క్‌లో 'ఏసుక్రీస్తు లెంగిక జీవితం' (ది సెక్స్‌ లైప్‌ ఆఫ్‌ జీసెస్‌ క్రైస్ట్‌) అను అసభ్య చిత్రాన్ని విడుదల చేశారు. 1988లోనయితే మరీ బరి తెగించి 'క్రీస్తు అంతిమ శోధన' (ది లాస్ట్‌ టెంపటేషన్‌ ఆప్‌ క్రైస్ట్‌) అను మరో చిత్రాన్ని విడుదల చేశారు. అది అశ్లీలత కు, అసభ్యతకు పరాకాష్ఠ. ఆ చిత్ర దర్శకుడు మార్టిన్‌ అపర కాథలిక్కట. తర్వాత ఏసును స్త్రీ రూపంలో శిలువపైబెట్టి, న్యూ యార్క్‌లోని అతి పెద్ద చర్చీ అయిన సెయింట్‌ జాన్స్‌లో ప్రధర్శన ఇవ్వబడింది! 1984లో నార్త్‌ కెరోనాలిలో మొట్టమొదటి నగ్న వ్యక్తుల సమావేశంలో ఏసు బొమ్మను కూడా నగ్నంగానే ఉంచి ఆరాధించారు. అలాగే 1998లో టెర్రాస్స్‌ మెక్నల్లీ వేయించిన కార్పస్‌ క్రిస్టి అను నాటకంలో ఏసు వంటి మహాత్ముణ్ని స్వలింగ సంపర్కునిగా చిత్రికరించడం జరిగింది. ఇటువంటి చిత్రాలను, భావాలను ముస్లిం దేశాలు మొత్తం బాన్‌ చేెశాయి. నేటికి అటువంటి సంఘటనల్ని అత్యంత వ్యధతో ప్రతిఘటిస్తూనే ఉన్నాయి.  

 దైవంచే ఎన్నుకోబడిన ప్రవక్తల విషయంలో నాడే కాదు నేడు సయితం కార్టూన్‌లు గీసి, చిత్రాలు తీసి వారు అవలంబిస్తున్న విధానం దారుణం. అయితే అంతిమ దైవగ్రంథం ఖుర్‌ఆన్‌ వారి నిందారోపణలన్నింటినీ త్రిప్పి కొట్టడమే కాక ప్రవక్తలందరినీ పరమ పవిత్రులుగా, పరమ ఆదర్శమూర్తులుగా, పాపరహితులు గా పేర్కొనింది. అన్‌అమ్‌ సూరా 83-88 వరకు ఉన్న వాక్యాల లో అనేక ప్రవక్తల ప్రస్తావనతో పాటు-''వారందరూ సద్వర్తుల కోవకు చెందినవారే'' (అన్‌ఆమ్‌: 85) అని కితాబు ఇచ్చింది.  అలాగే మత పీష్వాలనుగానీ, దైవంగా భావించే కొలిచే వ్యక్తుల నుగాని వారు ఏ మతానికి, వర్గానికి చెందిన వారైనా తూల నాడటం తగదని నొక్కి వక్కాణించింది. ''వారు అల్లాహ్‌ాను వదలి వేడు కునేవారిని మీరు దూషించకండి''(అల్‌ అన్‌ఆమ్‌: 108)    ఈ కారణంగానే ఒక ముస్లిం తాను మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారిని ఎంతగా అభిమానించేవాడయినప్పటికీ, ఇస్లాం ధర్మాన్ని ఎంత నిష్టగా పాటిస్తున్నప్పటికీ, ఖుర్‌ఆన్‌ గ్రంథాన్ని   ఎంతగా గౌరవిస్తున్నప్పటికీ, తాను ధర్మ విషయంలో ఎంతో నిజాయితీపరుడయినప్పటికీ, ఒకవేళ తాను గత ప్రవక్తల్లోని ఏ ఒక్క ప్రవక్తను నిరాకరించినా, అగౌరపరచినా, అనుమానించినా, అవ మానించినా అతను ముస్లింగా కొనసాగ లేడు.

  తర్వాత ఇస్లాం తన్ను అనుసరించే వారినుద్దేశ్యించి చేసిన ముఖ్యోపదేశం ఏమిటంటే, వారు దైవ అంతిమ ప్రవక్త ముహ మ్మద్‌ (స) వారి రాక పూర్వం వచ్చిన ప్రవక్తల పేర్లు తీసుకున్న ప్పుడు గౌరవప్రదంగా (అలైహిస్సలామ్‌) పలకాలని, వారి గురించి మాట్లాడే విషయంలో కడు అప్రమత్తంగా వ్యవహరించాలని, వారి విషయంలో అల్లాహ్‌ాకు భయపడాలని నొక్కి వక్కాణించింది. ఖుర్‌ఆన్‌ చేప్పేదేది ఏమిటంటే, ''మేము నీకు (ఓ ప్రవక్తా!) సత్యాన్ని ఇచ్చి శుభవార్తను అందజేసేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము.  హెచ్చరించేవాడు రాని సమాజమంటూ ఏది లేదు''. (ఫాతిర్‌: 24) ''మేము ఏ ప్రవక్తను పంపినా, అతడు విష యాన్ని స్పష్టంగా విడమరచి చెప్పడానికి వీలుగా తన జాతి వారి భాషలో  మాట్లాడేవానిగా చేెసి పంపాము''. (ఇబ్రాహీమ్‌: 4)  

 ఇస్లాం మనిషికి మాట్లాడే స్వేచ్చనిస్తుంది. కానీ దానికంటూ కొన్ని మర్యాదలను, హద్దులను కేటాయిస్తుంది, మనిషి తన మత ధర్మాన్ని అనుసరిస్తూ ఇతర సిద్ధాంతాలను, విధానాలను సహేతు కంగా విమర్శంచడం, చర్చకు అవకాశమ ఇవ్వడం మంచి విషయమే. కానీ పర దూషణ, పరనింద, పరిహాసాన్ని ఏ మతమూ అంగీకరించదు. ఏ సమాజమూ హర్షించదు.  

 ఏ మత అవలంబీకులయినా వారి దృష్టిలో పవిత్రమయిన పీష్వా లను తూలనాడటం సహించరు. కొన్ని కోట్ల మంది ప్రజల మనో భావాల్ని గాయపర్చే చర్యను ఏ చట్టమూ సహించదు. ఒక దేశానికి సంబంధించిన జెండాను లేదా దేశ చిహ్నాన్ని కించపరిస్తే అట్టివారిని శిక్షించేందుకు మాత్రం కఠిన చర్యలు గైగొనడం జరు గుతుంది. మాదకద్రవ్యాల వ్యాపారం చేసేవారికి మరణ దండన విధించే ప్రభుత్వాలూ ఉన్నాయి. మరలాంటప్పుడు వందల కోట్ల మంది ప్రజలు అభిమానించే, ఆదర్శంగా భావించే వ్యక్తి చెడుగా చిత్రీకరించడం నేరం కాదా? ఈ కారణంగానే ఇస్లాం ప్రవక్తలను కించపరిచే వారికి మరణ దండన శిక్ష అంటుంది.  వాస్తవం ఏమిటంటే, మరణ దండనకన్నా ఇంకా కఠిన శిక్ష ఏదయినా ఉంటే అదీ అమలు పర్చాల్సి ఉంటుంది.

ధనం దొంగలించినవాడు హీనుడట
అభిమానధనం కొల్లగొట్టినవాడు ధీరుడట
పశువును హింసించినవాడు దండనార్హుడట
ప్రవక్తను పరహసించినవాడు హాయిగా ఉండాలట  

ప్రంపంచంలో అనేక మతాలు, సిద్ధాంతాలు వచ్చాయి, కనుమరు గై పోయాయి. కానీ పద్నాలుగు శతాబ్దాలు గడుస్తున్నా,  మస్జిదు ల కూల్చివేత, తలాఖ్‌, పరదా, బహు భార్యాత్వం వంటి అంశాల ను మాటిమాటికీ తిరగదోడుతూ, ముస్లింలను లక్ష్యంగా చేసుకొని మారణహోమాలు సాగిస్తున్నా, ఇస్లాం మాత్రం ప్రభంజనంలా విస్తరిస్తూనే ఉంది. ఇంకా ప్రళయం వరకూ కొనసాగుతూనే ఉం టుంది. కారణం మహా ప్రవక్త (స) వారు తీసుకొచ్చిన విప్లవం ప్రలోభాలది కాదు. ఒకర్ని చంపి ఇంకొర్ని బ్రతికించేది కాదు. ఇది హృదయాంతరాలను ప్రకాశమానం చేెసే కాంతి పుంజం. అది చూపే జీవన విధానంలో పాలకులకు, పౌరులకు, పురు షులకు, స్త్రీలకు, ధనికులకు, బడుగు బలహీన వర్గాలకు కావా ల్సిన దిశానిర్దేశం ఉంది. పశుపక్ష్యాదులపై సయితం అది చూపే కారుణ్యం అద్వితీయం.
మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారి వ్యక్తిత్వం పూర్తి ప్రపంచానికి మార్గదర్శకత్వం అని అంటున్నామంటే, ఇది కేవలం మతపరమైన వెర్రో, భ్రమో కాదు. విశ్వాసపరమయిన ఆనంద డోలికల్లో ఓల లాడుతూ చెప్పిన మాట అంతకన్నా కాదు. అదో అక్షర సత్యం. చారిత్రకంగా నిరూపితమయిన వాస్తవం! సమస్త మత మేధావుల నోట వెలువడిన సాక్ష్యం!! కారణం ఆయన (స) తీసుకొచ్చిన బోధనలు ఒక జాతికి, ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి, ఒక కాలా నికి మాత్రమే పరిమితం కావు. అది జాతి, వంశం, రంగు, భౌగో ళిక ఎల్లలు, దేశభాషల పేరుతో మానవులకు వర్గాలుగా, కులా లుగా విభజించలేదు. ఒకరితో మంచిగా, ఇంకొరితో చెడుగా ద్వంద్వనీతి అది ఎరుగదు.  అలాగే ఆయన ప్రబోధించిన జీవన విధానంలో మానవ జాతికి సంబంధించిన సకల సమస్యలకు పరిష్కారం ఉంది.


మనిషికి ఎదురయ్యే పరిస్థితులు - సంతోషం, విచారం, గెలుపు, ఓటమి, సౌభాగ్యం, దౌర్భాగ్యం - అన్నింటిలో అతనికి మార్గదర్శకత్వం వహిస్తుంది. అతను న్యాయవాది అయినా, న్యాయం కోరేవాడయినా, గురువయినా, శిష్యుడయినా, తండ్రయినా, కొడుకయినా, సైనాధికారి అయినా, సైనికుడయినా, సామాజికి జీవితమయినా, ఆర్థిక వ్యవస్థయినా, దేశ అంతరంగిక వ్యవహారమయినా, అంతర్జాతీయ సంబంధాలయినా, శాంతి ఒప్పందాలయినా, రణరంగ నీతి అయినా ప్రతి చోట మహాప్రవక్త ముహమ్మద్‌ (స) వారి జీవితం కాగడలా మార్గం చూపుతుంది. వీటన్నింటికితోడు ఖుర్‌ఆన్‌ మరియు ప్రవక్త (స) వారి ప్రవచ నాలు మానవాళి వరకు సురక్షితంగా చేరడం మరో విశేషం. ఈ విశిష్ఠతల కారణంగానే ముస్లిం - అతను ఎన్ని ఒడిదుడుకులకు, అగ్ని పరీక్షలకు గురయినా ఎప్పుడు కూడా విశ్వాసపరంగా న్యూనతకు లోనవ్వడు. తను పేదవాడయినా, ధనికుడయినా, పండితుడయినా, పామరుడయినా, ఇతర వర్గాల తరఫు నుంచి దోపిడీ దౌర్జన్యాలకు గురయినా, ఆరు నూరయినా, నూరు ఆరయినా తను మాత్రం సత్య మార్గాన్ని వదలడు. తన - తన, మాన, ధనాలను పణంగా పెట్టడానికి సిద్ధమయిపోతాడేగానీ, ప్రవక్త (స) వారిపై అపవాదును అతను భరించడు. ఒక్క ప్రవక్త ముహమ్మద్‌ (స) వారిపైనేకాదు దైవప్రవక్తల్లోని ఏ ప్రవక్త పట్ల అమర్యాదగా వ్యవహరించడాన్ని అతను సుతరామూ ఇష్టపడడు.




తీసుకో మా మేని కండలను; వేసుకో నీ ఇంటి కుక్కలకు.
తలపుంటే మా నెత్తురు చేదుకొని; తడుపుకో నీ తోట మొక్కలకు.
కసితీరా మా ఆత్మ నొక్కేసి; కాల్చేయి నిప్పుని రాజేసి.  
ప్రవక్త పట్ల అసలైన మా ప్రేమ ఏనాడు తొణకదు, బెణకదు.
 
 అతని నోట సదా ఈ మాట ఉంటుంది: ''మేము అల్లాహ్‌ను విశ్వసించాము. మాపై అవతరింపజేయబడిన దాని (ఖుర్‌ఆన్‌)నీ, ఇబ్రాహీమ్‌, ఇస్మాయీల్‌, ఇస్హాఖ్‌, యాఖూబ్‌ మరియు వారి సంతితిపై అవతరింపజేయబడిన దానినీ, మూసా, ఈసా ప్రవక్తలకు వారి ప్రభువు తరఫున వొసగబడిన దానిని కూడా మేము విశ్వసించాము. మేము వారిలో ఎవరి మధ్య కూడా ఎలాంటి విచక్షణ (వివక్ష)ను పాటించము. మేము ఆయనకే విధే యులము''. (అల్‌ బఖరా: 136)



ముస్లిమెతరల హక్కులు మరియు ఇస్లాం

 


ముస్లిమెతరల హక్కులు మరియు ఇస్లాం

 మనం సమాజంలోనే నివసిస్తున్నాము. మన జీవితాలు మన ప్రమేయం లేకూండా అనేక మంది జీవి తాలతో ముడిపడి ఉన్నాయి. అది మనకు ఇష్టమయినా, కష్టమయినా, ప్రత్యక్షంగానయినా, పరోక్షంగాన యినా మనమందరం ఒకే నేలన పండిన ఆహారాన్ని భుజిస్తాము. ఒకే సెలయేటి నీటిని త్రాగుతాము. ఒకే వాతావరణంలో గాలిని పీల్చుకుంటాము. అంటే మనిషి సంఘజీవి అన్న మాట. మనిషి సంఘజీవి అన్న మాట ఎంత నిజమో 'మనిషి తనకు తెలియనిదానికి శత్రువు' అన్న మాట కూడా అంతే నిజం. మనమందరం మన సొంత అభిప్రాయాలు కలిగి ఉన్నప్పటికీ మన ఇరుగుపొరుగువారి ఆలోచనలు ఎలా సాగుతున్నాయో, వారి ఆచరణలకు ముఖ్యమయిన మూలాధారాలేవో కొంత వరకయినా తెలుసుకోవ డం ఎంతయినా అవసరం. దాని వల్ల మరేమీ కాకపోయినా మన చుట్టుప్రక్కల వాతావరణంలో సాను కూలతను, సహిష్ణుతను, సుహృద్భావాన్ని, సామరస్యాన్ని పెంపొందించేందుకు దోహదపడుతుంది అన డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కోణంలో చూస్తే 'ఇతరుల మతం గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంతే మంచిదేమో' అనుకునే మనలోని ప్రతి వ్యక్తి ప్రపంచంలోని అన్ని మతాలను వాటి సర యిన రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నించడం విశ్వ శాంతి కోసం మార్గం సుగమం చేెసుకోవడమే అవుతుంది. తద్వార పరస్పర అవగాహనకు, మనకు దగ్గరగా, దూరంగా ఉన్న పరిసరాలను ఉత్తమ రీతి లో తెలుసుకోవడానికి, పరస్పరం ఒండొకరిని అర్థం చేసుకొని మసలుకొనే మార్గమేర్పడుతుంది. అప్పుడు అస్పష్టత స్థానంలో, స్పష్టత, అపార్థం స్థానంలో అర్థం చేెసుకునే తత్వం అలవడి, వారిధులపై వారధులు వెలిసి, అపోహల పొరలు తొలగి, గోడలకి బదులు ఒండొకరి మనసును చేరుకునే వంతెనలు నిర్మితమవుతాయి. అదే మన పుట్టుక పరమార్థం కూడాను. ''మరి మీ (పరస్పర) పరిచయం కోసం మిమ్మల్ని వివిధ వర్గాలుగా, తెగలుగా చేశాము'' అని అంటోంది ఖుర్‌ఆన్‌. (49:13)
 
 ఇస్లాం రూపంలో ఏ కారుణ్య మేఘాలను అల్లాహ్‌ మానవాళికి అందించాడో అది - ముస్లిములనీ, మస్లిమేతరులనీ, ఆస్తికులనీ, నాస్తికులనీ, అస్పృశ్యులనీ, అత్యున్నతులనీ తేడా చూపక అందరికి తన కారుణ్య ఒడిలో సేద తీరే అవకాశం ఇస్తుంది. సామాజిక, రాజకీయ, గృహ హింసని, దౌర్జన్యాన్ని రూపు మాపి అహింసను, ప్రశాంతతను, న్యాయాన్ని సమపాళ్ళలో అటు స్త్రీలకు ఇటు పురుషులకు అందిస్తుం ది. మానవులందరూ ఒకే దేవుని దాసులు, ఒకే మానవ జంట నుండి ఉనికిలోకి వచ్చినవారుగా పరస్ప రం సోదరులని, వారు ఒండొకరి పట్ల ప్రేమ భావం, త్యాగ భావం కలిగి ఉండాలని బోధిస్తుంది. 'ఎవరు కరుణించరో వారు కరుణించబడర'ని నొక్కి వక్కాణిస్తుంది. ఆ కరుణను మానవుల వరకే పరి మితం చేయక సృష్టిలో ప్రతి ప్రాణి పట్ల సాత్విక ప్రేమ కలిగి ఉండాలని మరీ మరీ ఉద్ఘాటిస్తుంది. 'తన కోసం దేన్నయితే ఇష్టపడతామో దాన్నే తన తోటి సోదరుని కోసం సయితం ఇష్టపడనంత వరకు దైవ ప్రేమకు పాత్రులం కాలేమ'ని హితవు పలుకుతుంది. ఇరుగుననున్న వారు - వీరా, వారా అన్న తేడా లే కుండా 'పొరుగుననున్న వారు పస్తులుండగా తాను మాత్రం కడుపార భోంజేసినవాడు విశ్వాసి కాజా లడ'ని హెచ్చరిస్తుంది. 'ఎవరి హింస నుండి పొరుగువారు సురక్షితంగా ఉండరో అతను మోమిన్‌ కాద' ని తీర్మానిస్తుంది. అది చెప్పిన ప్రతిదాన్నీ నూటికి నూరుపాళ్ల్లు మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు బ్రతి కుండగానే పాటించి చూపడమే కాక, అటువంటి ఓ సువ్యవస్థను, సత్సమాజాన్ని స్థాపించి మరీ వెళ్ళారు. ఇక ఇస్లాంలో ముస్లిమేతరుల హక్కుల గురించి ప్రస్తావిమచుకున్నట్లయితే -
  
 ఒక వేళ మనకు ముస్లిమేతర బంధువులుండి వారితో మనం ఎలా వ్యవహరించాలన్న సందేహం కలి గితే ''నాకు కృతజ్ఞుడవై ఉండు. నీ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపు...ఒకవేళ నీవు ఎరుగని వారి నెవరినయినా నాకు భాగ్యస్వామిగా చేర్చు అని వారు నిన్ను ఒత్తిడి చేస్తే మాత్రం వారి మాట వినకు. వారితో ప్రపంచంలో ఉన్నంత వరకు ఉత్తమ రీతీలో వ్యవహరించు''. (దివ్యఖుర్‌ఆన్‌- 31: 15) అంటూ మీ ఆ సంశయాన్ని దూరం చేస్తుంది. ఈ ఒక్క విషయంలోనే కాదు జీవితపు అన్ని రంగాల్లోనూ ఆది మార్గదర్శకత్వం వహిస్తుంది. 
 
 స్వయంగా అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) రోగగ్రస్థుడయిన యూద బాలుడ్ని పరామర్శించడానికి వెళ్ళారు. పరమ కపటి అయిన అబ్దుల్లాహ్‌ా బిన్‌ ఉబై అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అతని కుమారుడు తన నాన్నపై కప్పడానికి ప్రవక్త (స) వారి కంబలి అడిగితే ఇచ్చారు. మనిషి మనిషిగా చూడాలన్న  విష యాన్ననుసరించి ఒక యూదుని శవం పోతుండగా లేచి నిలబడ్డారు. కొందరు సందేహం వెలిబుచ్చగా 'తనూ మనిషే కదా' అని వారి నోళ్లు మూయించారు. యూదులు -'అ్సలాము అలైకుమ్‌'-మీపై శాంతి కురియుగాక! అనడానికి బదులు 'అస్సాము అలైకుమ్‌'-మీకు చావు మూడుగాక! అని శపించినా ప్రవక్త (స) వారి మన్నించారు. విషం పెట్టి చంపాలని ప్రయత్నించిన మరో యూద మహిళను ఆయన క్షమిం చారు.  

  బీదలకు, అవసరార్థులకు సహాయం చేసే విషయంలో ఇస్లాం ముస్లిమేతరులను ఉపేక్షించలేదు. దివ్యఖుర్‌ఆన్‌ మరియు హదీసు గ్రంథాలలో ఖైదీల పట్ల ఉత్తమంగా వ్యవహరించడి అని బోధించబడింది. ఆ ఖైదీలు అధిక శాతం ముస్లిమేతరులే అయి ఉండేవారు. స్వయంగా మహా ప్రవక్త (స) ఏదయినా మంచి వంటకం, కూర వంటివి ఇంట్లో చేస్తే మొదట పొరుగున ఉన్న ముస్లిమేతరుల ఇళ్లకు పంపేవారు. వారికి ఆర్థిక అవసరం ఏమ యినా ఉంటే తాను ముందుండి వారి అవసరాన్ని తీర్చేవారు. వేళ విశేషాన్ని బట్టి వారికి కానుకలు కూడా పంపేవారు. రోజూ అక్కసుతో తన మీద చెత్త చెదారం పోసే ఓ మహిళ మంచాన పడితే ముందు తానే వెళ్ళి పరామర్శించారు. ఈ సంఘటనల దృష్ట్యా ముస్లిమేతర సోదరులకు సద్ఖతుల్‌ ఫిత్ర్‌ సయితం ముస్లిమేతర సోద రులకు ఇవ్వవచ్చని, ఖుర్బానీ మాంసాన్ని కూడా వారికి పంచి పెట్టవచ్చు అని అభిప్రాయపడ్డారు. కొందరు ధర్మవేత్తలు. అలాగే అవసరార్థం ముస్లిమేతర సోదరులకు ప్రభుత్వ ఖజానా నుండి సహాయం అందించి దాఖ లాలు కూడా కోకొల్లలు.  
 
 కయ్యానికి కాలు దువ్వని, యుద్ధం చేయని ముస్లిమేతరుల ప్రాణం, మానం, ధనం ఇస్లాం దృష్టిలో ముస్లింల ప్రాణం, మానం, ధనం వంటిదే. ''ఏ ముస్లిమేతర సోదరుడయితే తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడో నేను అతని వాగ్దానాన్ని గౌరవిస్తాను'' అని మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) చెప్పడమే కాక, ''ఒక ముస్లిం వ్యక్తి ఒక 'జిమ్మీ' - ఇస్లామీయ పరిపాలనా పరిధిలో నివసించే ముస్లిమేతర సోదరుడ్ని హత్య చేస్తే అటువంటి ముస్లిం స్వర్గపు సువాసన కూడా ఆఘ్రాణించ లేడు'' అని హెచ్చరించాడు. ఆయన కక్షను, వివక్షను పాటించలేదు. ముస్లిం - ముస్లిమేతరుని ప్రాణాలు సమానమయినవి ప్రకటించారు. అంతే కాదు, ఒక స్వతంత్య్ర ముస్లిం రక్తానికి బదు లుగా ఎంత పరిహారం చెల్లించబడుతుందో అంతే రక్త పరిహారం ఒక ముస్లిమేతరునికి కూడా చెల్లించబడుతుం ది అని నిర్ణయించారు. ఒక ముస్లిం సొమ్మును దొంగలిస్తే ఏ శిక్ష పడుతుందో, ఒక ముస్లిమేతరుని ఆస్తిని దొం గలిస్తే కూడా అదే శిక్ష  పడుతుంది. ఒక ముస్లిం నుండి తీసుకోబడిన బాకీని చెల్లించని పక్షంలో ఏ విధమ యినటువంటి చర్యలు తీసుకోబడతాయో అలాంటి చర్యలే ఒక ముస్లిమేరుని అప్పుని తీర్చని పక్షంలో సయితం తీసుకోబడతాయి. ఇదే పరంపర నలుగురు ధర్మ ఖలీఫాల కాలంలో సయితం అమలు పర్చబడింది. సారాయి, నిషిద్ధ జంతువుల మాంసం ఒక ముస్లిం దగ్గర ఉండి మరో ముస్లిం వాటిని పారేసినట్లయితే దానికి ఎలాంటి నిందారోపణ ఆ వ్యక్తిపై ఉండదు. కానీ అదే అవి మరో మతంలో ధర్మసమ్మతంగా పరగణించబడి, ఒక ముస్లి మేతర సోదరుని వద్ద ఆ వస్తులు ఉండగా ఒక ముస్లిం వాటిని వృధా చేసినట్లయితే వాటి ధర ఆ ముస్లిం చెల్లించాల్సి ఉంటుంది.  
 
 ఒక మతంగానీ, మత అవలంబీకులుగానీ-ఇతర మతావలంబీకుల పట్ల సమరస భావం కలిగి ఉండటం, వాటిని గౌరవిమచడం అనేది ప్రధానమయిన అంశం. ''ధర్మంలో ఎలాంటి బలవంతం, బలాత్కారం లేదు''అని సైద్ధాంతిక పరంగా బలమయిన పునాదుల మీద ప్రతిపాదించిన తొలి ధర్మం ఇస్లాం మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) మదీనా వచ్చిన తర్వాత చేసుకున్న ఒప్పందం ప్రకా రం, ప్రతి ఒక్కరూ వారి మతం ప్రకారం నడుచుకోవడానికి పూర్తి స్వేచ్ఛ కలిగి ఉంటారన్నది ప్రధానాంశం. ఇతర జాతులు, తెగలు, సముదాయాలు ఆరాధించే దైవాల గురించి చెడుగా ప్రస్తావించడాన్ని ఖుర్‌ఆన్‌ బహి రంగంగా వారించింది. అంతేక కాదు, ప్రతి జాతిలోనూ తన ప్రవక్తలను అల్లాహ‌ా పంపినట్లు ఖుర్‌ఆన్‌ ప్రకటిం చింది. కాబట్టి, ఇతర మార్గదర్శకుల, ప్రవక్తల, సంఘ సంస్కర్తల పట్ల గౌరవభావంతో మెలగాలనీ, వారి విష యంలో తమ నోటిని, ఆలోచనల్ని అదుపులో ఉంచుకోవాలనీ అది నొక్కి వక్కాణిస్తోంది. అలా ప్రజల చేత పూజలందుకుంటున్న వారు దైవప్రియులు, దైవప్రవక్తలు అయి ఉండవచ్చు అని కూడా తెలియజేస్తుంది.  అలాగే ఇస్లామీయ పరిపాలనా సమాజంలో మైనారిటీల పర్సనల్‌లాకు అన్ని విధాల మద్దతు, రక్షణ ఉంటుంది. 

 ఇదే విధమయినటువంటి ఔదార్యాన్నే ఇస్లాం ముస్లిమేతరుల ప్రార్థనాలయాల విషయంలో సయితం కనబరుస్తుంది. మామూలు సమయంలోనే కాక, యుద్ధ సమయాల్లో సయితం ముసిలమేతరుల ఆరాధనాలయాలను గానీ, చర్చీలనుగానీ, అగ్నిపూజారుల మందిరాలనుగానీ కూల్చరాదని స్వయంగా ప్రవక్త (స) వారు ఆదేశించడ మేకాక, అటువంటి ఒక క్రైస్తవ బృందం మదీనా రాగా, వారిని మస్జిదె నబవీలో నివసింపజేయడమేకాక, వారు అక్కడ వారి పద్ధతిలో ప్రార్థన చేసుకునే సౌకర్యాన్ని కూడా కలుగజేశారు. మానవ మహోపకారి ముహమ్మద్‌ (స) వారి ఈ బోధనల, తర్వాతి కాలపు ధర్మఖలీఫాల ఆదర్శాల వెలుగులో ఇస్లామీయ ఫిఖహ్‌ావేత్తలు ముస్లిమేత రుల పట్ల సమరస భావం, సోదరభావం సహనం కలిగి ఉండాలని, మత స్వేచ్ఛ ప్రతి వ్యక్తి జన్మ హక్కని తీర్మా నించడమే కాక, ముస్లిమేతర సోదరుని నుండి అన్యాయంగా కాజేయబడిన భూమిపై నమాజు చేెయడంగానీ, మస్జిదు నిర్మించడంగానీ అధర్మం అని ఖరారు చేశారు. ఈ నేపధ్యంలో అలోచనాపరులయిన వారు - 'ఇస్లాం మానవాళి ఎదుర్కొంటున్న సకల సమస్యలకు పరిష్కారమేగానీ, సమస్య కాదు; కాజాలదు' అన్న అక్షర సత్యం గురించి సునిశితంగా ఆలోచిస్తారని ఆశిస్తున్నాము....!