Monday, June 16, 2014

సనాతన ధర్మం ఇస్లాం


  మనం  మనుషులం. అందరం సమానులం. అస్పృశ్యతా అంటరాని తనాలకు అతీతులం. దైవ దాసులం. ఆది మానవుడైన ఆదం (అ) వారి బిడ్డలం. ఒకే కుటుంబానికి చెందినవారలం. మనల్ని పుట్టించిన దేవుడు మనందరి మార్గదర్శక నిమిత్తం ఒక లక్షా ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలను ప్రభవింపజేయడమేగాక, అనేక గ్రంథాలను అవతరింపజేశాడు. అలా లోక కళ్యానార్థం వచ్చిన మహా మహులలో మొదటివారు ఆదమ్‌ (అ). ఆయన మొదలు ప్రవక్తలందరూ తీసుకొచ్చిన ధర్మం ఒక్కటే. అది ”లా ఇలాహ ఇల్లల్లాహ్‌” – దేవుడు ఒక్కడే. అదే నిజం. తక్కినవన్నీ మిథ్య. దేవుడు ప్రజలందరికి ఉపదేశించిన జీవన విధానం ఒక్కటే. అగ్ర వర్ణాల వారికి, అధమ వర్ణాల వారికి అంటూ వేర్వేరు శాసనాలు ఆయన చేయలేదు. ధనికులైనా, పేదలైనా, అరబ్బులైనా, అరబ్బేతరులైనా, నల్లవారైనా, తెల్లవారైనా, కనక పిపాసులైనా, కార్మికులైనా అందరి కోసం ఆయన నిర్దేశించిన జీవన విధానం ఒక్కటే. నాటి నుండి నేటి వరకు. అదే ఇస్లాం.
  ఇస్లాం చూపే జీవన విధానం అన్ని దేశాలకు, అన్ని కాలాలకు అన్ని విధాల ఆమోదయోగ్యంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అది ముందు మనిషి, నిజ స్వామిని గుర్తించాలంటుంది. ఆయన ప్రసన్నతను కోరుతూనే ప్రతి పని చెయాలంటుంది. తల్లిదండ్రుల్ని గౌరవించమంటుంది. వారితో కసురుకుంటూ మాట్లాడకూడదంటుంది. పొరుగువారితో మంచిగా మసలుకో మంటుంది. కుడి ఎమడల ఉన్న నలభై ఇళ్ళు పొరుగువారి క్రిందికి వస్తాయి అంటుంది. తాము పుష్టిగా భోంచేసి పొరుగువాడు ఆకలితో అలమటిస్తూ ఉంటే అతను పరిపూర్ణ విశ్వాసి కాజాలడు అని హెచ్చరిస్తుంది. ఇస్లాం శుచీ శుభ్రతల గురించి నొక్కి మరీ చెబుతుంది. దేహ పరిశుభ్రత విశ్వాసంలోని సగ భాగమైతే, ఆత్మ పరిశుద్ధత విశ్వాసంలోని మరో సగ భాగం అంటుంది.
Ads by OnlineBrowserAdvertisingAd Options


      ఇన్ని చెబుతున్న నేనెవర్ని? అని తెల్లబోతున్నారా? నా పేరు పడిగ పాలేటి. నేను 2006లో ఇస్లాం ధర్మాన్ని ఆశ్రయించాను. తోటి స్నేహితులు, మరియు అన్య పుస్తకాల నుండి ఇస్లాంను గ్రహించిన నేను ఇస్లాం ఆది ధర్మం అని గ్రహించాను. విశ్వ మానవాళి కోసం విశ్వకర్త పంపిన జీవన విధానం అని తెలుసుకున్నాను. భాష, ప్రాతం, దేశం, కాలం వేరయినా అందరూ తీసుకొచ్చిన ధర్మం ఇస్లాం మాత్రమే అని తెలుసుకున్న నేను ఇస్లాం స్వికరంచాను. నేను ఇస్లాం ధర్మాన్ని నా  జీవన విధానంగా చేసుకున్నప్పటి నుండి నాలో అనూహ్య రీతిలో మార్పు వచ్చింది. మంచి ఏది, చెడు ఏది అని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునే గుణం అలవడింది. ఒక్క మాటలో చెప్పాలంటే – ”మంచికి మారు పేరే ఇస్లాం”. ప్రస్తుతం నా పేరు ఉమర్‌.

    నా అన్వేషణ ఫలించింది


    ”అస్సలాము అలైకుమ్‌ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు”
    నా పేరు అబ్దుర్రహ్మాన్‌. పూర్వాశ్రమంలో హిందువులైన నా తల్లి దండ్రులు నా బాల్యంలో క్రైస్తవ మతాన్ని ఆశ్రయించారు. నేను నా తల్లిదండ్రులను అనుసరించి వారి బాటలోనే సాగిపోయాను. 18 సంవత్సరాల వయస్సులో బైబిల్‌ చదవాలి, అవగాహన చేసుకోవాలన్న ఉత్సుకత నాలో మొదలయింది. నేను బైబిల్‌ను కొద్దిగా చదవడం, అర్థం చేసుకోవడం ప్రారం భించాను. యెహోవా ఒక్కడే దేవుడని, ఏసుక్రీస్తు దేవుని కుమారుడని , ఏసుక్రీస్తు ద్వారానే స్వర్గం సాధ్యమని, ఏసే సత్యం, ఏసే మార్గం, ఏసే స్వర్గం అని నమ్మి బాప్తిస్మం కూడా తీసుకున్నాను. అప్పుడు నాతో ఒక ప్రమాణం చేయించారు కూడా. అదేమంటే- యెహోవాయే నిజ దైవం అని, ఏసు క్రీస్తు దేవుని కుమారుడని, ఏసు క్రీస్తు పాప విమోచకుడని, ఏసే రక్షకుడని, విగ్రహారాధన చేయకూడదని, కనిపించే ప్రతిమల్ని మొక్కకూడదని.
    మా ఊరిలో హిందువులు, క్రైస్తవులు తప్ప ముస్లింలు లేరు. ఇక హిందువుల ఆరాధ్య దేవుళ్ల గురించి – వారు ముక్కోటి మందని అంటారు. కాని ఈ సిద్ధాంతం నాకు మింగుడు పడలేదు. విశ్వాన్ని, విశ్వంలో జీవకోటిని సృజించిన సృష్టికర్త ఒక్కడే అని, ఆయన యెహోవాయేనన్నది నా నమ్మకం. అప్పట్లో నాకు ముస్లింల గురించి అంతగా తెలియదు. ఒకట్రెండుసార్లు దర్గాలు, జెండా చెట్ల చుట్టూ తిరుగుతూ హైదరాబాదుకెళ్ళి నప్పుడు చూశాను గనక, ముస్లింలంటే (నవూజుబిల్లాహ్‌– — అల్లాహ్‌ నన్ను క్షమించుగాక!) దర్గాలను, జెండా చెట్టులను పూజించేవాళ్ళేమో అన్న అభిప్రాయం నాకుండేది.
    అలా సాగిపోయే నా జీవితంలో కువైట్‌ రాక ఓ కొత్త మలుపుకి నాంది పలుకుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. చివరికి నేను కువైట్‌కి వచ్చాను. భారత దేశంలో మస్జిద్‌ ఎలా ఉంటుందో కూడా ఎరుగని నేను కువైట్‌లో ఎటు చూసినా మస్జిదులే ఉండటం చూసి కాస్తంత విస్తుబోయాను. అప్పుడే నాకు తెలిసింది. ముస్లింలంటే – ఒకే నిజ దైవాన్ని ఆరాధించేవాళ్ళని, 5 పూటలా నమాజు క్రమం తప్పకుండా చేసేవాళ్ళని, దర్గాలు జెండా మాను, పీర్ల పండగల్లాంటివి అసలు ఇస్లాంలోనే లేదన్న వాస్తవం అప్పుడే నాకు తెలిసింది. అయినా నాలో మార్పు మాత్రం రాలేదు. ఆ తర్వాత కొన్ని మాసాల తర్వాత నాకు కొందరు ముస్లిం స్నేహితులు పరిచయ మయ్యారు. అలా పరిచయం అయిన వారిలో కొందరికి అటు క్రైస్తవం, హైందవం, ఇటు ఇస్లాం గురించి కొద్దోగొప్పో అవగాహన ఉన్నవారు కూడా ఉండటం నా అదృష్టంగానే భావిస్తాను. ముస్లింలకు ఏసుక్రీస్తు గురించి బొత్తిగా తెలియదేమో అనుకున్న నాకు, ఖుర్‌ఆన్‌ గ్రంథంలో ఆయన గురించిన ప్రస్తావన ఉందని తెలుసుకొని ఆశ్చర్యమేసింది. ముస్లింలు ఏసు క్రీస్తుని – ఈసా మసీహ్‌గా పిలుస్తారని, ఆయన కేవలం ఇతర ప్రవక్తల్లాంటి దైవప్రవక్త తప్ప మరేమీ కాడని మరో ముస్లిం స్నేహితుడు చెప్పినప్పుడు సంతోషంతోపాటు ఒకింత కోపం కూడా కలిగింది. ముహమ్మద్‌ ప్రవక్త (స) ప్రస్తావన బైబిల్‌లో ఉందని చెప్పినప్పుడు మరింత చిరాకు కూడా వేసింది.


      ఆ క్షణం నుండి, ఇస్లాం గురించి తెలుసుకోవాలని, ఇస్లాం ఆదం నుండి మొదలు ఏసుక్రీస్తు వరకు వచ్చిన ప్రవక్తల గురించి ఏమంటుందో తెలుసుకోవాలని, ఈ ముహమ్మద్‌ ఎవరు? ఇస్లాం మూలాలేమిటో తెలుసుకోవాలన్న ఆరాటం మొదలయింది. ఆ తర్వాత ఎప్పటికో చాలా రోజులకుగానీ తత్సంబంధిత సమాచారాన్ని అందించే పుస్తకాలు లభించలేదు. చివరికి నా శ్రమ షేఖ్‌ ఖాదర్‌ బాషా అనే స్నేహితుడి రూపంలో ఫలించింది. (ఇంకా ఉంది)

      హజ్రత్‌ సుమామా బిన్‌ ఉసాల్‌ (రజి )


      హిజ్రీ శకం 6వ యేట…

      దైవ అంతిమ ప్రవక్త(స) తన సందేశ కార్య పరిధిని మరింత విస్తృత పరచాలని సంక ల్పించుకున్నారు. అరబ్బు, అరబ్బేతర రాజ్యాలకు చెందిన చక్రవర్తులకు ఎనిమిది లేఖలు వ్రాసి ఇస్లాం స్వీకరించమని ఆహ్వా నించారు.
      ఈ ఆహ్వాన పత్రాన్ని అందుకున్న వారిలో యమామ రాజ్యాధికారి సుమామ బిన్‌ ఉసాల్‌ (ర) కూడా ఉన్నారు.
      అజ్ఞాన కాలంలో అరేబియాలో పేరు మోసిన అరబ్బు పరిపాలకులలో సుమామా బిన్‌ ఉసాల్‌(ర) ఒకరు. హనీఫా తెగకు చెందిన ఈ సర్దారును చూసి మహా మహులు కూడా ఈర్ష్య చెందేవారు. ఎందు కంటే అరేబియాలో ఈయన మాటకు తిరుగులేదు. పైగా ప్రచారణ పొందిన నాయకుడు. ఈయన ఏ నిర్ణయం గైకొన్నా ఇతర తెగల వారు శిరసావహించేవారు.
      అజ్ఞాన భూతం ఆవరించివున్న రోజుల్లో దైవప్రవక్త (స) వ్రాసిన ఉత్తరం సుమామాకు అందింది. సుమామా ఆ ఉత్తరం చది వారు. పరిహసించారు. నుదురు చిట్లిం చారు. అతని భృకుటి ముడిపడింది. అతనిలో నిద్రాణమై ఉన్న దానవుడు మేల్కొ న్నాడు. దైవప్రవక్త (స)కు కీడు తలపెట్టా లనుకున్నాడు. అవకాశం కోసం ఎదురు చూశాడు. చివరికి అతనికి అవకాశం దొరికింది. చప్పుడు చేయకుండా వెనుక నుండే వచ్చి ప్రవక్త(స)పై దాడి చేయబో తుండగా అతని బాబాయి అడ్డుకున్నాడు. ఆ విధంగా దైవ కృప వల్ల ఆయ న(స)కు ప్రాణాపాయం తప్పింది.
      సుమామా దైవప్రవక్త (స)పై చేసిన హత్యాయత్నం విఫలమైంది. అయితే అతను ప్రవక్త ప్రియ సహచరులకు అపకారం తల పెట్టాడు. ఒక ప్రదేశంలో అనేక మంది సహాబీలను ముట్టడించి నిర్ధాక్షిణ్యంగా చంపేశాడు. ఈ మారణ హోమం గురించి తెలియగానే, సుమామా ఎక్కడ కనిపించినాసరే హతమార్చమని దైవప్రవక్త (స) ప్రకటించారు.
      హృదయ విదారకమైన ఈ సంఘటన జరిగిన కొన్నాళ్ళకే సుమామా కాబా యాత్రకు సంకల్పించుకున్నాడు. కాబా గృహ ప్రదక్షిణ చేసి, అక్కడ ప్రతిష్ఠించబడి వున్న విగ్రహాలకు జంతుబలి ఇవ్వాలని మొక్కుకున్నాడు. మొక్కుబడిని తీర్చేందుకు యమామ నుండి మక్కాకు బయలు దేరాడు.
      సుమామ మక్కా చేరుకోవాలంటే మదీనా మీదుగా ప్రయాణిచాలి. రాత్రి పూట మదీనా పొలిమేరలు దాటాలనుకున్నాడు. అయితే మదీనా దీగర రక్షణ కోసం గస్తీ తిరుగుతున్న ముస్లిం సిపాయిలు అనుమా నాస్పద స్థితిలో సుమామాను పట్టుకు న్నారు. అతనెవరో కూడా సిపాయిలకు తెలీదు. అతన్ని తెచ్చి మస్జిదె నబవీ స్థంభానికి కట్టివేశారు. తెల్లవారక దైవ ప్రవక్త (స) ఆ వ్యక్తిని చూసి, తగు నిర్ణయం తీసుకుంటారని సిపాయిలు భావించారు.
      దైవప్రవక్త (స) మస్జిదు లోపలికి విచ్చేశారు. దూలానికి కట్టబడి ఉన్న ఆ ఖైదీని చూసి ఆయన (స) తన సహచరులతో ఇలా అన్నారు: ”ఇంతకీ మీరు నిర్బంధించిన ఈ వ్యక్తి ఎవరో మీకు తెలుసా ?” దైవప్రవక్తా! ఏమో మాకు తెలీదు, అన్నారు అందరూ. ”ఇతనే సుమామా బిన్‌ అసాల్‌. ఇతని పట్ల మంచిగా మెలగండి” అని ఆదేశించారు దైవప్రవక్త(స) .
      ఇంట్లో ఉన్న భోజనాన్ని సుమామా బిన్‌ అసాల్‌ కోసం పంపించండి. నా ఒంటె పాలు కూడా ఉదయం సాయంత్రం సుమా మాకే సమర్పించాలి” అని కూడా ఆయన(స) ఆజ్ఞాపించారు. ఆ తర్వాత ఆయన (స) సుమామా వైపు తిరిగి ఆప్యా యంగా పలకరించారు.
      ”సుమామా ! ఇప్పుడేమంటావ్‌?”
      అనేదేముంది! ఒకవేళ తమరు నన్ను చంపినట్లయితే మీ సహవాసుల రక్తం చిందించిన హంతకుణ్ణి శిక్షించినట్లవు తుంది. ఒకవేళ మన్నించి వదలిపెడితే అపకారికి ఉపకారం చేసిన వారవుతారు. ఒకవేళ సొమ్ముకావాలంటే చెప్పండి, కోరి నంత సొమ్ము సమర్పించటానికి సిద్ధంగా ఉన్నాను’ – సూటిగా జవాబిచ్చారు సుమామా.
      దైవప్రవక్త(స)వారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. రెండ్రోజుల వరకూ అదే స్థితిలో ఉన్నాడు. కాని అతనికి అతిధి మర్యాదలు మాత్రం జరుగుతున్నాయి. ప్రవక్త(స)వారు వచ్చి ప్రశ్నించారు:
      ”సుమామా! నీ అభిప్రాయమేమిటో చెప్పు?”
      ఇంతకు ముందు వెలిబుచ్చిన అభి ప్రాయానికే కట్టుబడి ఉన్నాను. క్షమించి వదలి పెడితే మీ మేలును గుర్తుంచు కుంటాను. ప్రతీకారం గనక తీర్చుకుంటే మీ సహచరులను పొట్టనపెట్టుకున్న ఒక నరహంతకునిపై ప్రతీకారం తీర్చుకున్న వారవుతారు. నష్టపరిహారం కావాలంటే, కావలసినంత సొమ్మును ఇవ్వటానికి సిద్ధం గా ఉన్నాను. దైవప్రవక్త(స) మౌనంగా నిష్క్రమించారరు. మూడవ రోజు ఆయన (స) మళ్ళీ వచ్చి ప్రశ్నలు వేశారు:
      ”సుమామా! ఏమంటావ్‌ ?”
      ఏమంటాను! ముందు అన్న వాటినే అంటాను. మీరు నాకు క్షమాబిక్ష పెడితే ఒక కృతవ¦ు్ఞ్ఞనికి మేలు చేసినట్లవుతుంది. ఒకవేళ నన్నుహతమారిస్తే మీ సహవాసుల రక్త పిపాసికి తగిన శాస్తి జరుగుతుంది. ఒకవేళ ధనం కావలసి ఉంటే చెప్పండి, మీరు కోరినంత ధనం చెల్లించుకుంటాను.
      ”ఇతని కట్లు విప్పండి. ఇతన్ని విడిచి పెట్టండి” సహచరులకు ఆజ్ఞాపించారు దైవప్రవక్త(స).
      సుమామా శరీరానికున్న బంధనాలైతే త్రెంచుకున్నాయి. కాని ప్రవక్త(స) ఔదార్యబంధం మాత్రం సుమామా అణువణువునూ పెనవేసుకుపోయింది. కారుణ్యమూర్తి (స) వారి నగుమోము ఆ రాతి గుండెను కరిగించింది.
      శ్రీశ్రీశ్రీ సుమామా బిన్‌ ఉసాల్‌ ఒల్లు విరుచుకుంటూ మస్జిద్‌ ప్రాంగణం దాటారు. బఖీ ప్రదేశానికి దగ్గరలో ఉన్న ఓ కర్జూర తోటలోకి ప్రవేశించారు. ఆ తోటలో ఓ చిన్న కోనేరు ఉంది. అక్కడ తన ఒంటెను ఆపి తనివితీరా స్నానం చేశారు. తనను తాను ప్రక్షాళనం చేసుకున్నారు. తిరిగి మస్జిదె నబవీకి వచ్చి అందరి సమక్షంలో బిగ్గరగా సాక్ష్యవచనం పలికారు.
      ”అష్‌హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్‌హదు అన్న ముహమ్మదన్‌ అబ్దుహు వ రసూలుహు.”
      అవును, అల్లాహ్‌ా తప్ప మరో ఆరాధ్యదైవం లేడని నేను సాక్ష్య మిస్తున్నాను. ముహమ్మద్‌ (స) అల్లాహ్‌ా ప్రవక్త అనీ, అల్లాహ్‌ా భక్తు డని నేెను సాక్ష్యమిస్తున్నాను.
      తరువాత ఎంతో ఆప్యాయతతో ఇలా అన్నారు: ”ఓ నా ప్రియమైన ముహమ్మద్‌ (స) దైవసాక్షిగా చెబుతున్నాను ఇస్లాం స్వీకరిం చక ముందు మీ మొహం చూడటానికి కూడా ఇష్టపడేవాణ్ణి కాను, కాని ఈనాడు నా దృష్టిలో మీ ముఖారవిందం కన్నా ప్రియతమ మైన ముఖారవిందం మరేదీలేదు…. దైవసాక్షి! ఇంతకు మునుపు నా దృష్టిలో ఈ (మదీనా) నగరం కన్నా చెడ్డ నగరం మరేదీ లేదు. కాని ఈనాడు నా దృష్టిలో ఈ (మదీనా) నగరం కన్నా గొప్ప నగరం ప్రపంచంలో మరొకటి లేదు.”
      కొన్ని క్షణాల తర్వాత ఆయన బాధాతప్త హృదయంతో ఇలా అన్నారు: ‘ఓ దైవప్రవక్తా! నేను మీ ప్రియచరులను నిర్ధాక్షిణ్యంగా చంపేశానే అన్న బాధ నన్ను కృంగదీస్తోంది. నా ఈ అపరాధానికి ప్రాయశ్చిత్తం ఏమిటి?’
      ‘సుమామా (ర) నీవు ఆందోళన పడకు. ఇస్లాం స్వీకరించిన మీదట తగకాలంలోని నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి’ అని కారుణ్యమూర్తి (స) అతనికి శుభవార్త వినిపించారు.
      ఈ శుభవార్త వినగానే సుమామా మొహం సంతోషంతో దేదీప్య మానం అయింది. సంతోషాతిశయంతో ఆయన నోట వెలువడిన మాటలివి: ”దైవసాక్షి! నేను అజ్ఞాన కాలంలో ఎంతమంది ముస్లింలను పొట్టనబెట్టుకున్నానో అంతకన్నా రెట్టింపు మంది ముష్రిక్కులను నా కరవాలానికి ఆహుతి చేస్తాను. ఇక నుంచి నా జీవనం, నా ఖడ్గం, నా వద్ద ఉన్న సర్వస్వం మీకు, మీరు తెచ్చిన జీవన ధర్మానికే అంకితం”.కొన్ని నిమిషాల తర్వాత……
      ‘దైవప్రవక్త (స)! తమరి ఆనతి ఉంటే ఉమ్రాకి వెళతాను’ అన్నారు. ”ఉమ్రాకి తప్పకుండా వెళ్ళు. అయితే ఇస్లామీయ పద్ధతి ప్రకారమే ఉమ్రా చేయాలి” దైవప్రవక్త (స) అతనికి ఉమ్రా చేసే పద్ధతిని బోధించారు. సుమామా (ర) సెలవు తీసుకుని మక్కా వైపుకు పయన మయ్యారు. మక్కా చేరుకోగానే హెచ్చు స్వరం తో తల్బియా పఠించసాగారు.
      లబ్బైక్‌ అల్లాహుమ్మ లబ్బైక్‌-లబ్బైక్‌ లాషరీక లక లబ్బైక్‌-ఇన్నల్‌ హమ్ద వన్నీమత లక వల్‌ ముల్క్‌ లా షరీకలక్‌.
      (హాజరయ్యాను దేవా! నేను హాజరయ్యాను. సహవర్తులు లేని ఓ ప్రభువా! నేను హాజర య్యాను. ప్రశంసలు నీకే శోభిస్తాయి. అను గ్రహాలన్నీ నీవు ప్రసాదించినవేను. సార్వభౌమ త్వం కూడా నీదే. నీకు సాటి ఎవరూ లేరు.)
      మక్కా నగరంలో తల్బియా వచనాలు బిగ్గర గా పలుకుతూ ప్రవేశించిన మొట్టమొదటి ముస్లిం కూడా సుమామా బిన్‌ ఉసాల్‌ (ర) .
      కాబా ప్రాంగణంలో ప్రతిధ్వనించిన ఈ వచనాలను విని ఖురైషులు ఓర్చుకోలేక పోయారు. తమ పౌరుషాన్ని రెచ్చ గొట్టిన ఆ వ్యక్తిని పట్టుకోవటానికి అందరూ కత్తులు కటార్లతో సహా వచ్చి ఆయన్ని చుట్టు ముట్టా రు. వాళ్ళను చూసి సుమామా (ర) మరింత బిగ్గరగా లబ్బైక్‌ పలికారు. అంతే మక్కా వారు తమ ఒరలలో నుంచి ఖడ్గాలు బయటికి తీశారు. ఒక యువకుడు బల్లెంతో ఆయనపై లంఘిస్తూ ఉండగానే…
      ”ఒరేయ్‌! ఈయన ఎవరో నీకు తెలుసా?” అన్నారెవరో. ”ఈయన మామూలు మనిషి కారు. యమామ రాజ్యపాలకుడైన సుమామా గారీయన. దైవం తోడు! మన వల్ల ఈయనకే దైనా అపకారం జరిగిందంటే ఈయన జాతి జనాలు మనపై ఆర్థిక ఆంక్షలు విధిస్తారు. మనం ఆకలితో అలమటించాల్సి వస్తుంది, తెలుసా?”.
      ఈ మాటలు వినగానే అందరి ఖడ్గాలు ఒక్క సారిగా వారి ఒరల్లో ఒదిగిపోయాయి. ఆ తర్వాత నగర పెద్దలు సుమామా (ర)తో చర్చలు జరిపారు. ”సుమామా! అసలు మీకెేమై పోయింది? మీరెందుకు ధర్మ విహీను లయ్యారు? మీరు మీ పూర్వీకుల మతధర్మాన్ని విడిచి పెట్టేశారా?” ”నేను ధర్మ విహీనుణ్ణి కాలేదు. మరింత గొప్ప ధర్మాన్ని అవలంబిస్తున్నాను. కాబా ప్రభువు సాక్షిగా చెబుతున్నా! ఇక నుంచి నజద్‌ ప్రాంతం వారు ముహమ్మద్‌ (స)కు విధే యత చూపకపకపోతే ఒక్క గోధుమ గింజ కూడా పంపించను” అని తెగేసి చెప్పేశారు.
      కురైషులపై ఒక్కసారిగా పిడుగుపడినట్ల యింది. వారంతా చూస్తూ ఉండగానే సుమామా ఉమ్రా చేశారు. అదీ మహాప్రవక్త (స) సూచించిన పద్ధతి ప్రకారం చేశారు. ఉమ్రా అనంతరం ఆయన దైవ మార్గంలో ఒక పశువును ఖుర్బానీ చేసి, తన స్వరాజ్యా నికి తిరుగు ప్రయాణమయ్యారు. యమామా చేరగానే రాజ్య ప్రముఖులనుద్దేశించి, ఇక మీదట కురైషులకు ఆర్థిక సహాయం చేయ రాదని ఆజ్ఞాపించారు. అంతే! తక్షణం ఆర్థిక ఆంక్షలు అమలుపరచబడ్డాయి.
      సుమామా బిన్‌ ఉసాల్‌ (ర) గారు విధించిన ఆర్థిక ఆంక్షల ఫలితంగా మక్కాలో కష్టాలు మొదలైనాయి. కరవు తాండవించింది. పౌర సరఫరాలకు అంతరాయం కలిగింది. ధరలు పెరిగిపోయాయి. ప్రజలు ఆకలితో అలమ టించసాగారు. తమ పసిపిల్లలు ఆకలితో ప్రాణాలు కోల్పోతారేమోనని కురైషులు భయ పడిపోయారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో దైవ ప్రవక్త (స)కు ఉత్తరం వ్రాయటం తప్ప మార్గాంతరం లేదని వారు తెలుసుకున్నారు. కురైషులు వ్రాసిన లేఖ సారాంశమిది:
      ”మీరు బంధుత్వ సంబంధాలను గురించి నొక్కి వక్కాణించేవారు. ఇతరులకు కూడా బంధుత్వ హక్కును గురించి ఉపదేశిస్తారను కున్నాం. కాని మీరు బంధుత్వ తెగత్రెంపులకు పురికొల్పుతున్నట్లు అర్థమవుతోంది. ఈ బంధుత్వ విచ్ఛిన్నానికి మా పెద్దలు తల్లడిల్లి పోయారు. మా పిల్లలు ఆకలితో మాడిపో యారు. ఇలా చెప్పటంలోని మా ఉద్దేశమేమి టంటే సుమామా బిన్‌ అసాల్‌ మాకు అందే ఆర్థిక సహాయాన్ని నిలిపివేశారు. మీరు దయ చేసి ఈ ఆర్థిక సహాయనిన్న పునరుద్ధరించ వలసిందిగా సుమామకు ఆదేశించండి …..”


        వెంటనే దైవప్రవక్త (స) సుమామాకు ఉత్తరం వ్రాస్తూ కురైషులకు నిలిపివేసిన ఆర్థిక సహా యాన్ని తిరిగి కొనసాగించవలసిందిగా సూచించారు. ప్రవక్త (స) వారి ఆజ్ఞను శిరసా వహిస్తూ సుమామా ఆహార ధాన్యాలను ఎగు మతి చేశారు.
        హజ్రత్‌ సుమామా బిన్‌ ఉసాల్‌ (ర) జీవితాం తం విశ్వాసపాత్రునిగా మెలిగారు. దైవ ప్రవక్త (స)కు ఇచ్చిన మాటను నిలుపుకున్నారు.
        దైవప్రవక్త (స) పరమపదించినపుడు కొంత మంది దైవధర్మం పట్ల విముఖత చూప సాగారు. ఆ రోజుల్లోనే ముసైలమా కజ్జాబ్‌ తల ఎత్తాడు. ఆ అబద్ధాలకోరు తనను దైవ ప్రవక్తగా ప్రకటించుకున్నాడు. అప్పుడు సుమామా తన జాతి జనులను ముసైలమా ఉపద్రవం నుండి రక్షింటానికి నడుం బిగిం చారు. ఆయన ఇలా అన్నారు:
        ”ఓ హనీఫా తెగవారలారా! మీరు దారికి రండి. ముసైలమా కజ్జాబ్‌ బారి నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. బాగా తెలుసు కోండి! ముహమ్మద్‌ (స) అల్లాహ్‌ సత్య ప్రవక్త. ఆయన (స) తదనంతరం మరో ఎవరూ ప్రళయదినం వరకూ రారు. ఓ బనూ హనీఫా కాంతి కిరణం లేని ఆ అంధకార బంధురం నుంచి బయట పడండి. దైవసాక్షి! ఆ అసత్య వాది మాట వినటంకన్నా దౌర్భాగ్యం మరొ కటి లేదు. వాడి మాటను త్రోసిపుచ్చిన వారే ధన్య జీవులు.”
        ఆ తరువాత ఆయన (స) దివ్య ఖుర్‌ఆన్‌లోని ఈ సూక్తుల్ని పఠించారు: ”ఈ గ్రంథావతరణ అల్లాహ్‌ా తరపున జరిగింది. ఆయన మహా శక్తిమంతుడు, సర్వం తెలిసినవాడు. పాపా లను క్షమించేవాడు, పశ్చాత్తాపాన్ని ఆమో దించేవాడు, కఠినంగా శిక్షించేవాడు, ఆయన తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు. ఆయన వద్దకే మరలి పోవలసి ఉన్నది.” (అల్‌ మోమిన్‌-2,3)
        మీరే చెప్పండి – అల్లాహ్‌ా అవతరింపజేసిన ఈ పవిత్ర వాక్కుల ముందు ముసైలమా కజ్జాబ్‌ చేసే అధిక ప్రసంగం ఏ పాటిది? ఉదాహరణకు ఆ సత్యవిరోధి సూక్తుల్ని చూడండి…..
        ”బెకబెకమనే ఓ మండూకమా! నీ బెకబెకలు ఎంత వరకు? త్రాగేవారెవరినీ అడ్డుకోలేవు. కనీసం నీళ్ళనయినా కలుషితం చెయ్యలేవు.”
        ఆ తర్వాత సుమామా తన జాతి జనులలో ధర్మంపై స్థిరంగా ఉన్న వారిని సమీకరించి, ధర్మభ్రష్టులకు వ్యతిరేకంగా పోరాటం మొద లెట్టారు. భూమండలంలో దైవవాక్కు ఉన్నతి కై అహరహం కృషి చేశారు.
        అల్లాహ్‌ ఇస్లాం ముద్దు బిడ్డ అయిన సుమామా బిన్‌ ఉసాల్‌ (ర)కి ఉత్తమ ప్రతి ఫలం ప్రసాదించుగాక! స్వర్గంలో ఈయనకు దైవభీతిపరుల సరసన చోటు కల్పించుగాక !! (ఆమీన్‌)

        మంచీచెడులు మరియు ఇస్లాం


        మనిషి ప్రకృతి సిద్ధంగా సంస్కార ప్రియుడు. మంచిని ప్రేమిస్తాడు. చెడును ద్వేషిస్తారు. మనిషిలోని ఈ సహజ భావనను అతని పోషణ, శిక్షణ, వాతావరణాలు పెంపొందిస్తాయి లేదా అణగద్రొక్కుతాయి. మంచి పెరిగితే మానవత్వ మందారాలు విరబూస్తాయి. మానవ మను గడ సవ్యంగా సాఫల్య బాటన సాగుతుంది. సమాజం మొత్తం సం స్కార సౌరభాలతో గుభాళిస్తుంది. అదే మంచి అన్నది అణిగితే పైకి వచ్చేది, పెరిగేది చెడు అనుభవాలే, కుళ్ళు బ్రతుకులే, దుర్గంధభరిత వాతావరణమే. వాతావరణం నైతికంగా కలుషితమయినప్పుడు సర్వత్రా – వ్యక్తుల్లోనూ, సమాజంలోనూ కానవచ్చేది, చెలామణి అయ్యేది, రాజ్యమేలేది చెడులే. అటువంటి దుస్థితి ఎక్కడ, ఎప్పుడు చోటు చేసు కున్నా దాన్ని దూరం చేసేందుకు ప్రయత్నించడం సమాజంలోని ప్రతి పౌరుని ప్రథమ కర్తవ్యం అంటుంది ఖుర్‌ఆన్‌: ”మీలో మంచి వైపు ఆహ్వానించేవారు, మేలు చేయండి అని ఆజ్ఞాపించేవారు, చెడు నుండి వారించేవారు తప్పకుండా ఉండాలి. ఇటువంటి సంస్కరణాభిలాషులే సాఫల్యం పొందుతారు”. (ఆల్‌ ఇమ్రాన్‌: 104) 
        మనిషిలో మంచీచెడులనేవి ప్రకృతి సహజంగానే నిబిడీకృతమయి ఉంటాయి. వాటిని గ్రహించగలిగే శక్తియుక్తుల్ని సయితం అతను కలిగి ఉంటాడు. కారణం – మంచీచెడుల విచక్షణాజ్ఞానం అతనిలో పొందు పరచింది పరమోన్నత ప్రభువయిన అల్లాహ్‌ాయే. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”మానవాత్మ సాక్షిగా! దాన్ని తీర్చిదిద్దినవాని సాక్షిగా! మరి ఆయన దానికి దాని దుర్మార్గాన్ని, దాని దైవభీతిని అంతర్ప్రేరణ ద్వారా ఎరుక పర్చాడు”. (అష్‌ షమ్స్‌; 7,8)
        ఏ పని ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా, పారలౌకికంగా, నైతికంగా, సామాజికంగా, విలువల పరంగా, చట్టం రీత్యా ఏ విధమయినటువంటిదో మనిషి మనసే అతనికి సాక్ష్యం పలుకుతుంది. తాను తలపెట్టబోయే ఆ కార్యం మానవునికి, వ్యక్తిగతంగా, సమాజాని కి సమిష్టిగా మేలు చేకూరుస్తుందో, కీడు కలుగజేస్తుందో అతని అంత రాత్మే అతనికి బోధ పరుస్తుంది. ఈ అంతరాత్మ ప్రబోధనం వల్లనే వ్యక్తి స్వతహాగా తాగుబోతయినా, తన పిల్లల విషయంలో దాన్ని అస హ్యించుకుంటాడు. తాను స్వతహాగా అన్యాయపరుడయినా తన విష యంలో న్యాయాన్నే కోరుకుంటాడు. తాను స్వతహాగా దుర్మార్గుడయినా తనపై ఒకరు దౌర్జన్యం చేయడాన్ని సుతరామూ సహించడు. ఈ సెన్స్‌ ను, కామన్సెన్స్‌ను, ఈ అవగాహనను, ఈ తారాతమ్యాన్ని, ఈ ఇంగిత జ్ఞానాన్ని అతని అంతరాత్మే ప్రబోధిస్తుంది అని ఖుర్‌ఆన్‌ చెప్పడంతోపాటే – ”దానిని (మనసును మనో మాలిన్యం నుండి) పరిశుద్ధ పరచు కున్నవాడు సాఫల్యం పొందాడు. మరియు దాని (అంత రాత్మ ప్రబోధ నాన్ని) అణచి పెట్టినవాడు నష్టపోయాడు”. (అష్‌ షమ్స్‌; 8,9) అంటుంది.
        మానవునిలో ఈ ప్రేరణను మాధవుడు కలుగజేయడమేకాక, అతని మార్గదర్శనార్థం ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలను, అనేక గ్రంథాలను అవతరింపజేసి – సత్యమేదో, అసత్యమేదో, న్యాయమేదో, అన్యాయమేదో, మంచి ఏదో, చెడు ఏదో విశద పర్చాడు. అయితే మంచీచెడుల్ని అవలంబించే స్వేచ్ఛ మాత్రం మానవునికి మాధవుడు ప్రసాదించాడు. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”మరి మేము అతనికి వినేవాడుగా, చూసేవాడుగా చేశాము. నిశ్చయ ంగా మేమతనికి మార్గం కూడా చూపాము. ఇక అతను కృతజ్ఞుడుగా వ్యహరించినా లేక కృతఘ్నుడుగా తయారైనా (అతని ఇష్టం. మేము అతని స్వేచ్ఛను హరించలేదు). అయితే, కృతఘ్నతకు పాల్పడినవారి కోసం మేము సంకెళ్ళను, ఇనుప పట్టాలను, జ్వలించే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము”. (అల్‌ ఇన్సాన్‌: 3,4) అని హెచ్చరించడమే కాక, ”మిమ్మల్ని మీ పరివారాన్ని నరకాగ్ని నుండి కాపాడుకోండి” అని జాగు రూక పర్చడమేకాక, మంచిని గురించి ఆదేశించడం, చెడు నుండి వారించడం మీ అందరి బాధ్యత అంటున్నాడు. వినడం, వినకపోవడం వారి ఇష్టం.-చూడండి: ‘ఇది సత్యం. మీ ప్రభువు తరఫు నుంచి వచ్చింది. ఇష్టమైనవారు దానిని స్వీకరించవచ్చు. ఇష్టం లేనివారు దాని ని తిరస్కరించవచ్చు”. (తౌబా: 29)
        కాబట్టి సమాజంలోని చెడుల్ని అరికట్టే బాధ్యత సంఘశ్రేయోభిలాషు లైన వారందరిపై ఉంటుంది. ముఖ్యంగా ముస్లింలపై. ఎందుకంటే వారిని ప్రజా శ్రేయార్థమే ఉనికిలోకి తీసుకు రావడం జరిగింది గనక. ”విశ్వసించిన జనులరా! ఇకనుండి మానవులందరికి మార్గదర్శనం చేస్తూ వారిని సంస్కరించడానికి ఉనికిలోకి తీసుకురాబడిన శ్రేష్ఠ సముదాయం మీరే. మీరు మంచి పనులు చేయమని ఆదేశిస్తారు. చెడుల నుండి వారిస్తారు. అల్లాహ్‌ను ప్రగాఢంగా విశ్వసిస్తారు.” (ఆల్‌ ఇమ్రాన్‌: 110)
        ఆ నిమిత్తం మహాప్రవక్త(స) చేెసిన మహోపదేశం గమనార్హం! ఆయన ఇలా అన్నారు: ”మీలో ఎవరయితే చెడును చూస్తారో, వారు తన చేతి తో ఆపాలి. ఒకవేళ అంత శక్తి లేకపోతే తన నాలుకతో దాన్ని నిర్మూ లించాలి. అదీ అతను చేయలేకపోతే కనీసం మనసులోనయినా ఆ కార్యాన్ని అసహ్యించుకోవాలి. అయితే ఇది విశ్వాసపు అధమ స్థితి అన్న విషయం గుర్తుంచుకోండి”. (ముస్లిం)
        చేతితో అంటే, వ్యక్తి స్థాయిలోనూ, సంస్థ స్థాయిలోనూ, పభుత్వ స్థాయి లోనూ శక్తిని ఉపయోగించి చెడును దూరం చేసే ప్రయత్నం చేయడం. ముఖ్యంగా సంస్థలు, ప్రభుత్వాలు ఈ మహత్కార్యానికి పూనుకున్నట్ల యితే గొప్ప ఫలితాల్ని రాబట్టుకోవచ్చు. ఎందుకంటే, ‘లోకో భిన్న రుచి’ అన్నట్టు సమాజంలో అందరూ ఒకేలా ఉండరు. కొందరికి ప్రభువు భయం ఉంటే, మరికొందరికి ప్రభుత్వం విధించే శిక్ష భయం ఉం టుంది. ఈ కారణంగానే ఖుర్‌ఆన్‌ – మనిషికి దైవభీతిని, నైతిక రీతిని ప్రబోధించడంతోపాటు,స్వర్గసౌఖ్యాల గురించి, నరకయాతనలను ప్రస్తా వించడంతోపాటు దైవ శాసనోల్లంఘనకు పాల్పడేవారికి ప్రాపంచిక జీవితంలోనే శిక్ష అమలు పర్చాలని ఆదేశించడమే కాక, ”బుద్దీ వివే కాలు గల జనులారా! ప్రతీకార చట్టంలోనే మీకు సముజ్జీవనం లభి స్తుంది. మీరు ఈ శాసన ఉల్లంఘనకు పాల్పడకుండా మెలుగుతారని భావించబడుతోంది”. (అల్‌ బఖర: 179)అని నొక్కి వక్కాణించింది. నోటితో ఆపడం అంటే, మనిషి ఉక్తి మహా శక్తిలా పని చేస్తుంది అన డంలో ఎలాంటి సందేహం లేదు. ఒక మామూలు పోలీస్‌ సైరన్‌కే దొం గలు, నేరస్థులు ఎక్కడి వారు అక్కడే గప్‌చిప్‌ అయిపోతారంటే, శబ్దం తాలుకు ప్రభావం ఎటువంటిదో అర్థం చేసుకోగలం. అలాగే – ఇంట్లో పిల్లలుగాని, ఇల్లాలు గాని ఏదయినా చేయరాని పని చేస్తే ఒక గద్దింపు చర్య ఎంతటి ప్రభావవంతంగా పని చేస్తుందో మనందరికి అనుభవమ యిన విషయమే. గళానికే కాదు, కలానికి సయితం చరిత్రను తిరగ రాసిన ఖ్యాతి ఉంది. కాబట్టి చెడు ఎక్కడ, ఏ స్థాయిలో ఎవరు చేస్తూ చూసినా, చేసేవారు అయినవారయినా, కానివారయినా వారించడం మానసం గల ప్రతి మనిషి ద్వితీయ కర్తవ్యం. కాబట్టి సాహితీవేత్తలు, కలంకారులు తమ రాతల ద్వారా మంచిని పంచే, పెంచే ప్రయత్నం చేయాలి. చెడును అది సాహిత్యంలో ఉన్నా, సినిమాల్లో ఉన్నా, సమాజం లో ఎక్కడ ఏ పాళ్లల్లో ఉన్నా అరికట్టేందుకు కంకణం కట్టాలి. పై రెండు స్థాయిలోనూ లేని ప్రజలు కనీసం ఆ చెడును మనస్ఫూర్తిగా నిరసిం చాలి. అయితే ఇది సామాజిక స్పృహకు సంబంధించిన అధమ స్థాయి అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదీ ఒక వ్యక్తి చేయడం లేదంటే, ఇక అతనిలో మానవత్వం లేనట్టే లెఖ్క.
        మనిషి మంచి మనిషిగా బ్రతకాలి. దుర్గుణాల దుర్గంధాన్ని దూరం చేసుకుని, మంచి మల్లెల, మందారాల గుభాళింపుని మది నిండా నింపు కుని జీవించాలి. రెక్కలు రాలిపోతే ఎలాగయితే అందమయిన గులాబీ అందవికారంగా తయారవుతుందో, మంచి, మానవత్వాలు లేకపోతే అర్థ విహీనమవుతుంది జీవితం. మంచీచెడులనేవి జీవితంలో మమేకమయిన అంశాలే అయినప్పటికీ, చుట్టూ ఉన్న ముళ్ళు గుచ్చుకోకుండా మనం గులాబీని ఎలా కోసుకుంటామో, చెడు అనే చీకట్లు చిమ్మకుండా జీవి తాన్ని కాపాడుకోవాలి. అందుకు కావాల్సిన నేర్పూ, ఓర్పూ మనకు అల వడాలి. దాని తాలూకు మంచీచెడులు మనకు తెలియాలి.
        మనలోని కల్మష కాలుష్యం అధికమయినప్పుడల్లా పశ్చాత్తాప పవిత్ర జలంతో దాన్ని కడగాలి. అహంకార పొరలు మన కళ్లకు గంతలు కట్టే ప్రయత్నం చేెసినప్పుడల్లా జ్ఞాన కాంతితో మనం సత్యాన్ని సవినయంగా దర్శించాలి. పదవీ వ్యామోహం, కనక కామం మన స్పీడుకి కామాలు పెట్టాలనుకున్నప్పుడు పరలోక చింతనతో దాన్ని ఫుల్‌స్టాప్‌ పెట్టాలి. మని షిగా పుట్టిన మనం మహా మనీషిగా ఎదిగేందుకు అహర్నిశలు పరిశ్ర మించాలి.
        అయితే ‘మనిషిగా మనం ఇది చెయ్యాలి, ఫలానాది సాధించాలి అన గానే’ ‘అబ్బా’ అన్న బరువయిన నిట్టూర్పుతో ‘కప్పదాటు’గా వ్యవహరి స్తుంటారు కొందరు. అసలు మనిషి పుడుతూనే బోలెడన్ని బాధ్యతలతో పుట్టాడు అన్న విషయం వీరు గ్రహించరు. వారికి వారు నిర్వర్తించవల సిన బాధ్యతలు గుర్తుకు రావుగానీ, హక్కులు మాత్రం బాగానే గుర్తుం టాయి. మనిషి హక్కుల్ని గుర్తుంచుకుని, బాధ్యతల్ని విస్మరిస్తే అతనితో పాటు సంసారం, సమాజం కూడా ఉపద్రవం పాలవుతుంది.
        మన బ్రతుకుకి మనమే రథసారథులం. మన మేథతో, మన విజ్ఞతతో మన బ్రతుకు బండిని మనమే నడిపించుకోవాలి. జయాపజయాలు ఎంచుకునే అధికారం మనకుంది. మంచీచెడులను అవలంబించే స్వేచ్ఛా మనకుంది. అయితే ఈ పరిమిత అధికారం, స్వేచ్ఛ మన చివరి శ్వాస అగేంత వరకు మాత్రమే. ఆ తర్వాత లెఖ్కలుంటాయిగానీ కర్మలుండవు. కనుక రేపు ప్రళయ దినాన ప్రభువు మనతో లెఖ్క తీసుకోక ముందే మన జీవిత లెఖ్కల్ని మనం సరి చేసుకోవాలి. ఉన్న కరెప్షన్స్‌ని కరెక్ట్‌ చేసుకుని ప్రభువుచే పర్‌ఫెక్ట్‌ అనిపించుకోవాలి.

        ఇందియ్ర నిగహ్రం


        ఆదిలో దేవుడు ఏ నాలుగు మూలతత్వములతో మనషిని సృజించాడో అవి – మట్టి, నీరు, నిప్పు, గాలి. మానవులందరి నైజాలు, స్వభావాలు, ప్రతిభాపాటవాలు, నైపుణ్యత, నైతిక స్థాయి, ఆత్మశక్తి ఒకేలాగు ఉవండవు. వాటి మీద ఈ నాలుగు మూలతత్వముల ప్రభావం ఏదోక స్థాయిలో తప్పకుండా పడుతుంది. వారిలో కొందరు పిరికివారు, బలహీనులైతే మరికొందరు బలవంతులు, సాహసవంతులై ఉంటారు. కొందరు మర్యాదస్తులు, ధర్మపరాయణులైత, మరికొందరు గర్విష్ఠులు, పచ్చి స్వార్థపరులై ఉంటారు. కొందరు మృదుస్వభావులు శాంతి కాముకులైతే మరికొందరు కల్లోల జనకులు, కర్కశక హృదయులై ఉంటారు.కొందరు కరు గలవారైతే మరొకొందరు కోపిష్టులై ఉంటారు. ఏది ఏమైనా ఈ నాలుగు మూల తత్వముల ప్రభావఛాయలు ప్రతి మనిషిలోనోనూ గోచరిస్తాయి. ఇటువంటి వేర్వేరు స్వభావాలు, పరస్పర విరుధ్ద భావాలు గల వారు ఒకే సమాజంలో మనుగడ సాగించాలంటే, వారి మధ్య సోదభావం, సమరస భావం, సహిష్ణుత, సహృద్భావం, త్యాగ భావం ఎంతో అవసరం. సమాజాభ్యున్నతి, అభివృద్ధికైనా ఇవి టానిక్కులాంటివి. ఈ గుణాలు ఎంత పుష్కలంగా ఉంటే సమాజంలో అదే స్థాయిలో శాంతి సుస్థిరతలు పరిఢవిల్లుతాయి. మనిషి – తన, ధన, మాన, ధర్మానికి రక్షణ ఉంటుంది.
        సమాజంలో చోటు చేసుకునే అల్లరి అలజడులకు కారణాలు, ప్రేరణలు, కారకాలు అనేకం ఉన్నప్పటికీ ముఖ్యమైన కారణం క్రోధావేశం అనాలి. ఈ క్రోధావేశానికి దారి తీసే కారణాల్ని గనక మనం నిర్మూలించగలిగితే సమాజం శాంతి శ్రేయాలతో వర్ధిల్ల గలదని ఆశించవచ్చు. ఇక ఆ ప్రేరకాలు, కారణాలు ఏవంటారా -, ప్రకృతి స్వభావినికి విరుద్ధంగా నడిచుకోవడం, హక్కుల ఉల్లంఘన , అపహరణ, ద్రోహం, అవినీతి, మోసం, విశ్వాస ఘాతుకం, బర్బరత్వం, అమానిషత్వం, దుర్మార్గం, దౌర్జన్యం, వైరం, ద్వేషం, శత్రుత్వం, పరోక్ష నింద, చాడీలు చెప్పడం, అపనిందలు మోపడం, కూపీలు లాగటం, రంధ్రాన్వేషణ, అబద్ధం, మాట ఇచ్చి తప్పటం, వాగ్దాన ఉల్లంఘన, లజ్జారాహిత్యం, పరదూషణ, రెండునాల్కల ధోరణి, అనుమానం, అపార్థం మొదలైనవి. ఇవి కోపావేశా నికి ఎలా కారణం అవుతాయి? అంటారా-
        ప్రతి మనిషికి ఒక స్వభావం, ఒక తత్వం ఉంటుంది. దానికి భిన్నంగా ఏదైనా సంఘటన చోటు చేెసుకున్నప్పుడు కోపం వస్తుంది.
        దేవుడు మనిషికి గౌరవోన్నతల్ని ప్రసాదించాడు. అతని ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసే క్రియ, ప్రతి చర్య బహిర్గతమైనప్పుడు కోపం వస్తుంది. మనిషి దోర్బల్యం గల దౌర్బల్యుడు. ఈ కారణంగానే ఒకరి అవసరం ఇంకొరికి ఉంటుంది. ఒండొకరి బలహీలతల్ని దూరం చేసి బలగాలను వృద్ధి పర్చడంలో అందరూ సమానంగా స్పందించాలి, సహరించాలి. అలాకాక ఎదుటి వ్యక్తి బలహీనుడు కదా అని హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే కోపం వస్తుంది. ఇదే అక్రమార్జన పెచ్చరిల్లితే సహనం నశించి, విద్వేషాగ్ని జ్వాల పెల్లుబు కుతుంది. మనిషి స్వభావసిద్ధంగా అవినీతిని, అన్యాయాన్ని, మోసాన్ని, విశ్వాసఘాతుకాన్ని అసహ్యించుకుంటాడు. తత్భిన్నంగా న్యాయాన్ని, ధర్మాన్ని ఇష్టపడతాడు. ఎవరైనా తన పట్ల అమానుషత్వానికి, అన్యాయానికి ఒడిగడితే కోపం వస్తుంది. మనిషి స్నేహాన్ని, ప్రేమను కాంక్షిస్తాడు. ఎవరైనా తన పట్ల వైరభావంతో, పగతో, సెగతో శత్రత్వాన్ని ప్రదర్శిస్తే కోపం వస్తుంది. ప్రతి వ్యక్తిలోనూ ఏదో కొన్ని లోపాలుంటాయి. తన లోపాలు ప్రచారంలోకి రాకూడదని ప్రతి వ్యక్తీ అభిలషిస్తాడు. ఎవరైనా తన బలహీనతల్ని, లోపాల్ని ఇతరుల ముందు ప్రస్తావించినప్పుడు కోపం వస్తుంది. చేయని నేరానికిగాను నింద పడాల్సి వచ్చినప్పుడు కోపం వస్తుంది. మాటల గారఢితో మోసం చేెసినప్పుడు కోపం వస్తుంది. సిగ్గు, బిడియం మహా గొప్ప లక్షణం. సభ్యత, సంస్కారవంతుని పట్ల ఎవరైనా లజ్జా రాహిత్యంగా వ్యవహరించినప్పుడు కోపం వస్తుంది. ముందు ఒకవిధంగా ప్రవర్తించి, వీపు వెనకాల చెడు వాగడం వల్ల కోపం వస్తుంది. రెండు నాల్కల ఈ ధోరణి మహా దారుణమైన లక్షణం. అర్థరహితమైన అనుమానం అనర్థాలకి దారి తీస్తుందన్నట్లు మనిషి ఒకరి పట్ల లేనిపోని అనుమానాలకు పోయినప్పుడు కోపం వస్తుంది. మరి వీటన్నింటికి మూల బీజం ఏది అంటే- సమాధానం మనసు. కనుక మనిషి తన ఇంద్రియాలకు కేంద్ర బిందువు అయిన మనసును జయించగలిగితే సకల విదమైనటువంటి అవలక్షణాల్ని పరిత్యజించగలడు. సమాజానికి ప్రయోజనకారిగా మారగలడు. మహా ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”జాగ్రత్త! మానవ దేహంలో ఒక ముద్ద ఉంది. అదిగనక బాగుంటే శరీరం మొత్తం బాగుంటుంది. అది గనక పాడైతే దేహం మొత్తం పాడైపో తుంది. గుర్తుంచుకోండి! అదే హృదయం”.
        రమజాను మాసం వచ్చింది. మనకు ఎన్నో వరానుగ్రహాల్ని ప్రసాదించిన ప్రబోధిక రమజాన్‌.. మహా గొప్ప శిక్షణను ఇచ్చిన ప్రభానము రమజాన్‌. అది మనకిచ్చిన శిక్షణలో ప్రబర్హమైనది-ముఖ్యమైనది ఇంద్రియ నిగ్రహం. మనం ఈ శిక్షణకు లోబడి మనం మన పంచేంద్రియాలపై, జ్ఞానేంద్రియాలపై, నవనాడులపై, సర్వ అవయవాలపై అదుపు సాధించగలిగితే మన జీవితం ప్రహర్షణము -ప్రహల్లాదము-ఆనందప్రదం కావడమేకాక, ఇతరుల్ని సయితం ప్రశమనము-ప్రశాంతి కలుగజేసినవారం అవుతాము. ముస్లిం అన్న నామానికి సార్థకత చేకూర్చిన వారంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాము.

        మధురమైన మాట



        నేటి యువతరంల్లో నానాటికీ అభద్రతా భావం అధికమైపోతూంది.అలాగే వయసు మీద పడిందని మదనపడే పెద్దలకీ కొరవ లేదు. ఇట్టి పరిస్థితుల్లో ఒకరి సమక్షంలో వారు ఆనందంగా గడపడానికీ, వారి మనోభావాలను వ్యక్తపరచడానికి, వారి ఫీలింగ్స్‌ని చెప్పుకోవడానికీ, ‘నీకు నేను న్నాను’ అన్న ఫీలింగ్‌ కలగటానికీ నిజ మైన హితుడి ప్రాణ మిత్రుడి అవసరం ఉంటుంది. ఇలా పిల్లల నుంచి పెద్దల వరకు, యువకుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ స్నేహాన్నే కాంక్షిస్తారు. ఆ స్నేహ కాంక్షని మనం పాలతో పోల్చ వచ్చు. అవతలి వ్యక్తి ఇచ్చేది పంచాదార అయితే మనలో కరిగిపోతుంది. ఉప్ప యితే విరగ్గొడుతుంది. పెరుగయితే మన అస్థిత్వాన్ని మారుస్తుంది. నీరయితే పలు చన చేస్తుంది. కనుక మన పాలు ఎవరి పాలవ్వాలో మనమే నిర్ణయించుకోవాలి. ‘నేను చాలా ఒంటరిని నాకంటూ ఎవరూ లేరు. ఎవరూ నన్ను అర్థం చేసుకోరు. అందరితో నేను కలవలేక పోతున్నాను.’ అన్న దుర్భర స్థితి నుంచి ముందు బయట పడాలి.
        ఇక వృద్ధుల విషమంటారా..! నిజంగా పరిశీలించి చూస్తే అసలైన జీవితం నలభై సంవత్సరాల తర్వాతే ప్రారంభమవు తుంది. ఇందుకు గొప్ప ఉదాహరణ ప్రవక్తలకు, ప్రవక్త పదవి 40 ఏండ్ల తర్వాత ప్రసాదించడమే. సగం జీవితం – ఇచ్చిన అనుభవ పరంపర నుంచి సరికొత్త జీవితం ప్రారంభించాలి. ఆ వయసు దాటాక జీవితం కాటికి కాలుజాచి ఉం టుందనుకోవటం మూర్ఖత్వం. నిజంగా ఆ వయసు నుంచే కొత్త జీవితం ప్రారంభ మవుతుంది అని అనుకుంటే ఆ సరికొత్త జీవితం మరింత ఆనందప్రదంగా ఉం టుంది. వృద్ధాప్యం వయసుకే గానీ, మన సుకీ కాదని తెలుసుకోవాలి. మనిషి ఒం టరి తనానికి, అశాంతికి, అసంతృప్తికి బద్ధ శత్రువకటుంది. అది ‘వ్యాపకం’. ఒక మంచి వ్యాపకం మనిషి జీవితంలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది. అర్థం చేసుకోగలిగితే, ఒక పుస్తకం, లేద ఒక గొప్ప వ్యక్తి చరిత్ర మనకి ప్రేరణ ఇస్తుంది. ‘ఇలా చెయ్యి’ అని శాసించకుండా ఎలా చేస్తే బావుంటుందో సలాహా ఇస్తుంది.
        నేను, నా జీవితం, నా చదువు, నా ఉద్యోగం, నా కుటుంబం, నా బ్యాంక్‌ బ్యాలెన్సు అనుకుంటే నూతిలోని కప్పకీ ఒడ్డునున్న మనిషికీ తేడా ఏం ఉంటుంది చెప్పండి. కనుక జీవితం నిరాసక్తంగా అని పించినప్పుడు ఒంటరితనంతో సతమతమై పోయే బదులు రోజుకో గంట, వారానికో రోజు, నెలకో నాలుగు రోజులు, ఏడాదికో యాభై రోజులు మనకంటు ఓ గుర్తింపు నిచ్చిన సమాజం కోసం కేటాయించినప్పుడే జీవితానికి సార్థకత. సమాజ సేవ చేసినంత సేపూ ఇష్టంగా చేయండి. అందులో మమేకమైపోండి. ఆ శ్రమలో కష్టం ఉండదు. అసలట అసలే అన్పిం చదు. ప్రతిఫలాన్ని కోరుకోం కాబట్టి ఆశా నిరాశలుండవు. ఎవరో నెత్తిన కూర్చొని ఆజమాయిషీ చేస్తున్న భావనే కలుగదు. ఆ అదృష్టం సేవకులకే దక్కుతుంది. పరిమిత మైన అనుభావాలతో, పరిమితమైన వ్యక్తుల మధ్య బతికే బతుకు, జైలు జీవితం కంటే ఎక్కువేం కాదు. మన ఇల్లు, మన కుటుంబం, మన స్నేహితులు…అంతా ఇరుకిరుగా ఉంటుంది. బయటికెళ్తే బోలెడంత ప్రపంచం. ఓ కవి అన్నట్టు
        ఓ ఫూల్‌ సర్‌ చడా జో చమన్‌సే నిక్‌లా’
        ‘ఉస్‌ షక్స్‌కు ఇజ్జత్‌ మిలీ జో వతన్‌సే నిక్లా.
        మనిషికైనా, మరే మహాత్ముడికైనా గడప దాటాకే బుద్ధి వికసించింది.
        ఒంటరితనంతో బాధ పడుతున్న వారికీ, డిప్రెషన్‌ లాంటి సమస్యలు వేధిస్తున్న వారికి సృష్టిరాసుల సేవకు మించిన చికిత్స లేదు అంటున్నారు మానసిక నిపుణులు.
        అంత మంది కోసం పని చేస్తున్న ప్పుడు ఒంటరి భావనకు చోటెక్కడిది చెప్పండి. మనిషి ఎదుర్కొనే మానసిక సమస్యలకు బంధాల్ని మించిన, స్నేహపరా మర్శలకు మించిన మందేముంటుంది చెప్పండి. పైగా సమయాన్ని సృష్టి సేవ కోసం కేటాయించేవారు, మిగతావారికన్నా ఆరోగ్యంగా ఉంటారనీ, వారి ఆయుష్షు పెరుగుతుందిని, వారి సంపాదనలో శుభం కలుగుతుందిని ప్రవక్త (స) వారి పలు ప్రవచనాల ద్వారా రూడీ అవు తుంది. నిజమే మనకు బాగా ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఒత్తిడి ఉండదు. మనసు సేద తీరుతుంది. గుండే సాఫీగా పని చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
        అలాగే భరించలేని దిగులు ఆవరించిన ప్పుడు ప్రవక్త (స) గారి ”యా బిలాల్‌ అరిహ్‌ నా బిస్సలాత్‌” (ఓ బిలాల్‌! మాకు నమాజు ద్వారా విశ్రాంతినివ్వు) అన్న మాటను అనుసరిస్తూ, తాగుడికి ఇతర వ్యర్థ వ్యసనాలకి బానిసకాకుండా, మస్జి దుకు వెళ్ళటం, దైవ సన్నిధిలో సజ్దా చేయటాన్ని అలవాటు చేసుకోండి. మరీ బోరుగా ఉన్నప్పుడు సిగరెట్‌ తాగాలనిపిం చటం, చుట్ట పీల్చాలనిపించడం ఒక హానికర వ్యసనమైతే, మంచి స్వరం గల ఖుర్‌ఆన్‌ పారాయణాన్ని, పరలోక భీతిని పెంచే హితబోధనం వినడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ..?
        చెడ్డ వ్యసనం మనల్ని అధిగమించి ఎంతగా తన చెప్పు చేతలలో ఉంచుకొం టుందో, మంచి అలవాటు ఒక స్నేహి తునిగా, మన పక్కన చేరి, మనతో పాటు ఉండి స్పూర్తినిస్తుంది. అందుకే ఒక ప్రముఖ మేధావి ఇలా అన్నాడు:
        (1) ఒక మంచి ఆలోచనకి అంకురంగా వెయ్య ండి. ఒక స్పూర్తి మొలక పైకొస్తుంది.
        (2) ఒక స్పూర్తి మొలకని అంటు కట్టండి. ఒక చర్య పుష్పిస్తుంది.
        (3) చర్య అనే పుష్పాన్ని ఫలించనివ్వండి. అలవాటు అనే ఫలం పక్వానిని కాస్తుంది.
        (4) ఆ ఆరాధన (అలవాటు) అనే ఫలాన్ని ఆస్వాదించండి. అది మీకు లక్ష్యం చేరుకొనే శక్తినిస్తుంది.

        మేలిమి గుణం క్షమ


        ”ఆదం (అ) సంతతికి చెందిన ప్రతి ఒక్కరితోనూ తప్పు జరుగు తుంది. కానీ; తప్పు చేసే వారందరిలోకెల్లా ఉత్తములు తమ తప్పుల దిద్దు బాటుకు ప్రయత్నించినవారు” అన్నారు మహనీయ ముహమ్మద్‌ (స). తప్పులు అందరి వల్లా దొర్లుతుంటాయి. అది మానవ సహజం. కాని తప్పులను గుర్తించడం, వాటిని సరిదిద్దుకోవడం మాత్రం కొంద రికే సాధ్యం. తప్పు చేసిన వెంటనే పశ్చాత్తాప పడి, క్షమించమని అల్లాహ్‌ాను వేడుకుంటారు సుగుణవంతులు. తాము చేసినది తప్పే అయినా అర్థరహిత వాదనకు దిగుతూ ఉంటారు మూర్ఖులు. తాము తప్పుల తడికగా మారుతున్నామని తెలిసినా వాటినే మాటిమాటికి చేస్తూ ఉంటారు నీచులు. ఏది ఏమయినప్పటికీ, దాన్ని పాటించేవారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ తప్పు అనేది తప్పే; ఎన్నటికి అది ఒప్పు కాజాలదు. మరి అల్లాహ్‌ాకు ప్రియమయిన దాసులెవరో తెలుసా?
        ”వారు కలిమిలోనూ, లేమిలోనూ (ధర్మమార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు. ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబి స్తారు. అల్లాహ్‌ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు”. (ఆలి ఇమ్రాన్‌: 134)
        ”వారు తమ ద్వారా ఏదయినా నీతిబాహ్యమయిన పని జరిగిపోతే లేదా తమ ఆత్మలకు వారు ఏదయినా అన్యాయం చేసుకుంటే వెంటనే అల్లాహ్‌ను తలచుకుని, తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు. నిజానికి అల్లాహ్‌ా తప్ప పాపాపలను క్షమించేవాడెవడున్నాడు?”. (ఆలి ఇమ్రాన్‌: 135)
        ”వారు తమ వల్ల జరిగింది తప్పు అని తెలిసినప్పుడు దానిపై హటం చెయ్యరు. తమ ప్రభువు తరఫు నుంచి క్షమాభిక్ష, క్రింద కాలువలు ప్రవహిమచే స్వర్గ వనాలు ప్రతిఫలంగా లభించేది ఇటువమటి సుగుణవంతులకే. వారు అందులో ఎల్లకాలం ఉంటారు. ఈ సత్కార్యాలు చేెసేవారికి లభించే పూణ్యఫలం ఎంత చక్కనిది!” (ఆలి ఇమ్రాన్‌: 136)
        మక్కా అవిశ్వాసులు ఎంత అధర్మంగా ప్రవర్తించినా, ఓర్పుతో వాటిని సహించి వారికి సత్యోపదేశం చేస్తుండేవారు ప్రవక్త (స). మక్కా విజయ సందర్భంగా వారందరినీ శిక్షించే అన్ని అవకాశాలు పుష్కలంగా ఉండి కూడా వారు చేసిన అవమానాలను, తప్పలను పెద్ద మనస్సుతో కమించి, ధర్మానికి, దయకు ప్రతికగా నిలిచారు ప్రవక్త మహనీయలు (స). సత్యప్రచార విషయంలో సత్యప్రియుల యిన సహాబా తాత్కాలికంగా అవమానాలను ఎదుర్కొన్నా, చిత్ర హింసలను భరించినా వారికున్న క్షమా గుణం కారణంగా విజయం వారినే వరించింది.
        నిజంగా క్షమించడం అనేది గొప్ప సుగుణం. అవతలివారు తాము చేసింది తప్పు అని తెలుసుకుని క్షమించమని కోరితే క్షమించేంతటి సద్గుణం మనకుండాలి. మనలో క్షమా గుణమే లేకపోతే, తప్పు చేసినవారిని ఎందుకు వదలాలి? పతీకారం తీర్చుకోవాలన్న కసి బలపడుతుంది. తద్వారా మనం శారీరకంగానూ, మానసికంగానూ నష్ట పోతాము. అయితే తనకు మాలిన ధర్మం పనికి రాదన్నట్లే క్షమించే గుణం మనకున్నా, అది అందుకునే యోగ్యత అవతలి వారికి ఉండాలన్న ప్రాథమిక సూత్రాన్ని మనం మరచిపోకూడదు. కమాగుణం ఉండాలి కదా అని తప్పులు ఎంత తీవ్రమయినవి అయినా అందరిపై క్షమను ప్రదర్శించకూడదు. అనంత కరణా మయుడు, అపార దయానిధి అయిన అల్లాహ్‌ాయే కొన్ని నేరాలకు శిక్ష అదేశించాడంటే, శిష్ఠ రక్షణ కోసం దుష్ట శిక్షణ కూడా కరుణ లో, దయలో అంతర్భాగమే అని మనం గుర్తించాలి.
        ఇక మన విషయానికొస్తే, మన వల్ల జరగరాని తప్పు ఏదయినా జరిగిపోతే ‘నన్ను క్షమించు’ అని మనం అనగలగాలి. ‘ఐయామ్‌ సారీ’ వినడానికి ఎంతో తేలికగా అన్పించే ఈ మాట, దాని అర్థాన్ని చూస్తే మాత్రం ఎంతో లోతుగా, గంభీరంగా కనిపిస్తుంది. మన అహాన్ని, స్వాభిమానాన్ని వదిలి పెట్టి మనం చేసిన తప్పు అంగీక రించి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరడం మనకు అల్లాహ్‌ అనుగ్రహిం చిన గొప్ప లక్షణం. ‘ఇతరులు మన తప్పులను మన్నించాల’ని కోరు కునే మనం, మన ఆగ్రహాన్ని, ఆవేశాన్ని మన అధీనంలో ఉంచుకొని, ఎదుటి వారిని క్షమించి ఎప్పటిలాగే వ్యహరించడం అలవాటు చేసుకోవాలి. అల్లాహ్‌ా ఖుర్‌ఆన్‌లో ఇలా సెలవిస్తున్నాడు: ”వారిని క్షమించాలి. వారి పట్ల మన్నింపుల వైఖరిని అవలంబించాలి. ఏమిటీ, అల్లాహ్‌ మిమ్మల్ని క్షమించాలని మీరు అభిలషించరా? అల్లాహ్‌ అయితే తప్పులను మన్నించేవాడు. కరుణామయుడు”.
        (నూర్‌: 22)