Monday, June 16, 2014

ఇందియ్ర నిగహ్రం


ఆదిలో దేవుడు ఏ నాలుగు మూలతత్వములతో మనషిని సృజించాడో అవి – మట్టి, నీరు, నిప్పు, గాలి. మానవులందరి నైజాలు, స్వభావాలు, ప్రతిభాపాటవాలు, నైపుణ్యత, నైతిక స్థాయి, ఆత్మశక్తి ఒకేలాగు ఉవండవు. వాటి మీద ఈ నాలుగు మూలతత్వముల ప్రభావం ఏదోక స్థాయిలో తప్పకుండా పడుతుంది. వారిలో కొందరు పిరికివారు, బలహీనులైతే మరికొందరు బలవంతులు, సాహసవంతులై ఉంటారు. కొందరు మర్యాదస్తులు, ధర్మపరాయణులైత, మరికొందరు గర్విష్ఠులు, పచ్చి స్వార్థపరులై ఉంటారు. కొందరు మృదుస్వభావులు శాంతి కాముకులైతే మరికొందరు కల్లోల జనకులు, కర్కశక హృదయులై ఉంటారు.కొందరు కరు గలవారైతే మరొకొందరు కోపిష్టులై ఉంటారు. ఏది ఏమైనా ఈ నాలుగు మూల తత్వముల ప్రభావఛాయలు ప్రతి మనిషిలోనోనూ గోచరిస్తాయి. ఇటువంటి వేర్వేరు స్వభావాలు, పరస్పర విరుధ్ద భావాలు గల వారు ఒకే సమాజంలో మనుగడ సాగించాలంటే, వారి మధ్య సోదభావం, సమరస భావం, సహిష్ణుత, సహృద్భావం, త్యాగ భావం ఎంతో అవసరం. సమాజాభ్యున్నతి, అభివృద్ధికైనా ఇవి టానిక్కులాంటివి. ఈ గుణాలు ఎంత పుష్కలంగా ఉంటే సమాజంలో అదే స్థాయిలో శాంతి సుస్థిరతలు పరిఢవిల్లుతాయి. మనిషి – తన, ధన, మాన, ధర్మానికి రక్షణ ఉంటుంది.
సమాజంలో చోటు చేసుకునే అల్లరి అలజడులకు కారణాలు, ప్రేరణలు, కారకాలు అనేకం ఉన్నప్పటికీ ముఖ్యమైన కారణం క్రోధావేశం అనాలి. ఈ క్రోధావేశానికి దారి తీసే కారణాల్ని గనక మనం నిర్మూలించగలిగితే సమాజం శాంతి శ్రేయాలతో వర్ధిల్ల గలదని ఆశించవచ్చు. ఇక ఆ ప్రేరకాలు, కారణాలు ఏవంటారా -, ప్రకృతి స్వభావినికి విరుద్ధంగా నడిచుకోవడం, హక్కుల ఉల్లంఘన , అపహరణ, ద్రోహం, అవినీతి, మోసం, విశ్వాస ఘాతుకం, బర్బరత్వం, అమానిషత్వం, దుర్మార్గం, దౌర్జన్యం, వైరం, ద్వేషం, శత్రుత్వం, పరోక్ష నింద, చాడీలు చెప్పడం, అపనిందలు మోపడం, కూపీలు లాగటం, రంధ్రాన్వేషణ, అబద్ధం, మాట ఇచ్చి తప్పటం, వాగ్దాన ఉల్లంఘన, లజ్జారాహిత్యం, పరదూషణ, రెండునాల్కల ధోరణి, అనుమానం, అపార్థం మొదలైనవి. ఇవి కోపావేశా నికి ఎలా కారణం అవుతాయి? అంటారా-
ప్రతి మనిషికి ఒక స్వభావం, ఒక తత్వం ఉంటుంది. దానికి భిన్నంగా ఏదైనా సంఘటన చోటు చేెసుకున్నప్పుడు కోపం వస్తుంది.
దేవుడు మనిషికి గౌరవోన్నతల్ని ప్రసాదించాడు. అతని ఆత్మాభిమానాన్ని దెబ్బ తీసే క్రియ, ప్రతి చర్య బహిర్గతమైనప్పుడు కోపం వస్తుంది. మనిషి దోర్బల్యం గల దౌర్బల్యుడు. ఈ కారణంగానే ఒకరి అవసరం ఇంకొరికి ఉంటుంది. ఒండొకరి బలహీలతల్ని దూరం చేసి బలగాలను వృద్ధి పర్చడంలో అందరూ సమానంగా స్పందించాలి, సహరించాలి. అలాకాక ఎదుటి వ్యక్తి బలహీనుడు కదా అని హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే కోపం వస్తుంది. ఇదే అక్రమార్జన పెచ్చరిల్లితే సహనం నశించి, విద్వేషాగ్ని జ్వాల పెల్లుబు కుతుంది. మనిషి స్వభావసిద్ధంగా అవినీతిని, అన్యాయాన్ని, మోసాన్ని, విశ్వాసఘాతుకాన్ని అసహ్యించుకుంటాడు. తత్భిన్నంగా న్యాయాన్ని, ధర్మాన్ని ఇష్టపడతాడు. ఎవరైనా తన పట్ల అమానుషత్వానికి, అన్యాయానికి ఒడిగడితే కోపం వస్తుంది. మనిషి స్నేహాన్ని, ప్రేమను కాంక్షిస్తాడు. ఎవరైనా తన పట్ల వైరభావంతో, పగతో, సెగతో శత్రత్వాన్ని ప్రదర్శిస్తే కోపం వస్తుంది. ప్రతి వ్యక్తిలోనూ ఏదో కొన్ని లోపాలుంటాయి. తన లోపాలు ప్రచారంలోకి రాకూడదని ప్రతి వ్యక్తీ అభిలషిస్తాడు. ఎవరైనా తన బలహీనతల్ని, లోపాల్ని ఇతరుల ముందు ప్రస్తావించినప్పుడు కోపం వస్తుంది. చేయని నేరానికిగాను నింద పడాల్సి వచ్చినప్పుడు కోపం వస్తుంది. మాటల గారఢితో మోసం చేెసినప్పుడు కోపం వస్తుంది. సిగ్గు, బిడియం మహా గొప్ప లక్షణం. సభ్యత, సంస్కారవంతుని పట్ల ఎవరైనా లజ్జా రాహిత్యంగా వ్యవహరించినప్పుడు కోపం వస్తుంది. ముందు ఒకవిధంగా ప్రవర్తించి, వీపు వెనకాల చెడు వాగడం వల్ల కోపం వస్తుంది. రెండు నాల్కల ఈ ధోరణి మహా దారుణమైన లక్షణం. అర్థరహితమైన అనుమానం అనర్థాలకి దారి తీస్తుందన్నట్లు మనిషి ఒకరి పట్ల లేనిపోని అనుమానాలకు పోయినప్పుడు కోపం వస్తుంది. మరి వీటన్నింటికి మూల బీజం ఏది అంటే- సమాధానం మనసు. కనుక మనిషి తన ఇంద్రియాలకు కేంద్ర బిందువు అయిన మనసును జయించగలిగితే సకల విదమైనటువంటి అవలక్షణాల్ని పరిత్యజించగలడు. సమాజానికి ప్రయోజనకారిగా మారగలడు. మహా ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: ”జాగ్రత్త! మానవ దేహంలో ఒక ముద్ద ఉంది. అదిగనక బాగుంటే శరీరం మొత్తం బాగుంటుంది. అది గనక పాడైతే దేహం మొత్తం పాడైపో తుంది. గుర్తుంచుకోండి! అదే హృదయం”.
రమజాను మాసం వచ్చింది. మనకు ఎన్నో వరానుగ్రహాల్ని ప్రసాదించిన ప్రబోధిక రమజాన్‌.. మహా గొప్ప శిక్షణను ఇచ్చిన ప్రభానము రమజాన్‌. అది మనకిచ్చిన శిక్షణలో ప్రబర్హమైనది-ముఖ్యమైనది ఇంద్రియ నిగ్రహం. మనం ఈ శిక్షణకు లోబడి మనం మన పంచేంద్రియాలపై, జ్ఞానేంద్రియాలపై, నవనాడులపై, సర్వ అవయవాలపై అదుపు సాధించగలిగితే మన జీవితం ప్రహర్షణము -ప్రహల్లాదము-ఆనందప్రదం కావడమేకాక, ఇతరుల్ని సయితం ప్రశమనము-ప్రశాంతి కలుగజేసినవారం అవుతాము. ముస్లిం అన్న నామానికి సార్థకత చేకూర్చిన వారంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాము.

మధురమైన మాట



నేటి యువతరంల్లో నానాటికీ అభద్రతా భావం అధికమైపోతూంది.అలాగే వయసు మీద పడిందని మదనపడే పెద్దలకీ కొరవ లేదు. ఇట్టి పరిస్థితుల్లో ఒకరి సమక్షంలో వారు ఆనందంగా గడపడానికీ, వారి మనోభావాలను వ్యక్తపరచడానికి, వారి ఫీలింగ్స్‌ని చెప్పుకోవడానికీ, ‘నీకు నేను న్నాను’ అన్న ఫీలింగ్‌ కలగటానికీ నిజ మైన హితుడి ప్రాణ మిత్రుడి అవసరం ఉంటుంది. ఇలా పిల్లల నుంచి పెద్దల వరకు, యువకుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ స్నేహాన్నే కాంక్షిస్తారు. ఆ స్నేహ కాంక్షని మనం పాలతో పోల్చ వచ్చు. అవతలి వ్యక్తి ఇచ్చేది పంచాదార అయితే మనలో కరిగిపోతుంది. ఉప్ప యితే విరగ్గొడుతుంది. పెరుగయితే మన అస్థిత్వాన్ని మారుస్తుంది. నీరయితే పలు చన చేస్తుంది. కనుక మన పాలు ఎవరి పాలవ్వాలో మనమే నిర్ణయించుకోవాలి. ‘నేను చాలా ఒంటరిని నాకంటూ ఎవరూ లేరు. ఎవరూ నన్ను అర్థం చేసుకోరు. అందరితో నేను కలవలేక పోతున్నాను.’ అన్న దుర్భర స్థితి నుంచి ముందు బయట పడాలి.
ఇక వృద్ధుల విషమంటారా..! నిజంగా పరిశీలించి చూస్తే అసలైన జీవితం నలభై సంవత్సరాల తర్వాతే ప్రారంభమవు తుంది. ఇందుకు గొప్ప ఉదాహరణ ప్రవక్తలకు, ప్రవక్త పదవి 40 ఏండ్ల తర్వాత ప్రసాదించడమే. సగం జీవితం – ఇచ్చిన అనుభవ పరంపర నుంచి సరికొత్త జీవితం ప్రారంభించాలి. ఆ వయసు దాటాక జీవితం కాటికి కాలుజాచి ఉం టుందనుకోవటం మూర్ఖత్వం. నిజంగా ఆ వయసు నుంచే కొత్త జీవితం ప్రారంభ మవుతుంది అని అనుకుంటే ఆ సరికొత్త జీవితం మరింత ఆనందప్రదంగా ఉం టుంది. వృద్ధాప్యం వయసుకే గానీ, మన సుకీ కాదని తెలుసుకోవాలి. మనిషి ఒం టరి తనానికి, అశాంతికి, అసంతృప్తికి బద్ధ శత్రువకటుంది. అది ‘వ్యాపకం’. ఒక మంచి వ్యాపకం మనిషి జీవితంలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది. అర్థం చేసుకోగలిగితే, ఒక పుస్తకం, లేద ఒక గొప్ప వ్యక్తి చరిత్ర మనకి ప్రేరణ ఇస్తుంది. ‘ఇలా చెయ్యి’ అని శాసించకుండా ఎలా చేస్తే బావుంటుందో సలాహా ఇస్తుంది.
నేను, నా జీవితం, నా చదువు, నా ఉద్యోగం, నా కుటుంబం, నా బ్యాంక్‌ బ్యాలెన్సు అనుకుంటే నూతిలోని కప్పకీ ఒడ్డునున్న మనిషికీ తేడా ఏం ఉంటుంది చెప్పండి. కనుక జీవితం నిరాసక్తంగా అని పించినప్పుడు ఒంటరితనంతో సతమతమై పోయే బదులు రోజుకో గంట, వారానికో రోజు, నెలకో నాలుగు రోజులు, ఏడాదికో యాభై రోజులు మనకంటు ఓ గుర్తింపు నిచ్చిన సమాజం కోసం కేటాయించినప్పుడే జీవితానికి సార్థకత. సమాజ సేవ చేసినంత సేపూ ఇష్టంగా చేయండి. అందులో మమేకమైపోండి. ఆ శ్రమలో కష్టం ఉండదు. అసలట అసలే అన్పిం చదు. ప్రతిఫలాన్ని కోరుకోం కాబట్టి ఆశా నిరాశలుండవు. ఎవరో నెత్తిన కూర్చొని ఆజమాయిషీ చేస్తున్న భావనే కలుగదు. ఆ అదృష్టం సేవకులకే దక్కుతుంది. పరిమిత మైన అనుభావాలతో, పరిమితమైన వ్యక్తుల మధ్య బతికే బతుకు, జైలు జీవితం కంటే ఎక్కువేం కాదు. మన ఇల్లు, మన కుటుంబం, మన స్నేహితులు…అంతా ఇరుకిరుగా ఉంటుంది. బయటికెళ్తే బోలెడంత ప్రపంచం. ఓ కవి అన్నట్టు
ఓ ఫూల్‌ సర్‌ చడా జో చమన్‌సే నిక్‌లా’
‘ఉస్‌ షక్స్‌కు ఇజ్జత్‌ మిలీ జో వతన్‌సే నిక్లా.
మనిషికైనా, మరే మహాత్ముడికైనా గడప దాటాకే బుద్ధి వికసించింది.
ఒంటరితనంతో బాధ పడుతున్న వారికీ, డిప్రెషన్‌ లాంటి సమస్యలు వేధిస్తున్న వారికి సృష్టిరాసుల సేవకు మించిన చికిత్స లేదు అంటున్నారు మానసిక నిపుణులు.
అంత మంది కోసం పని చేస్తున్న ప్పుడు ఒంటరి భావనకు చోటెక్కడిది చెప్పండి. మనిషి ఎదుర్కొనే మానసిక సమస్యలకు బంధాల్ని మించిన, స్నేహపరా మర్శలకు మించిన మందేముంటుంది చెప్పండి. పైగా సమయాన్ని సృష్టి సేవ కోసం కేటాయించేవారు, మిగతావారికన్నా ఆరోగ్యంగా ఉంటారనీ, వారి ఆయుష్షు పెరుగుతుందిని, వారి సంపాదనలో శుభం కలుగుతుందిని ప్రవక్త (స) వారి పలు ప్రవచనాల ద్వారా రూడీ అవు తుంది. నిజమే మనకు బాగా ఇష్టమైన పని చేస్తున్నప్పుడు ఒత్తిడి ఉండదు. మనసు సేద తీరుతుంది. గుండే సాఫీగా పని చేస్తుంది. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
అలాగే భరించలేని దిగులు ఆవరించిన ప్పుడు ప్రవక్త (స) గారి ”యా బిలాల్‌ అరిహ్‌ నా బిస్సలాత్‌” (ఓ బిలాల్‌! మాకు నమాజు ద్వారా విశ్రాంతినివ్వు) అన్న మాటను అనుసరిస్తూ, తాగుడికి ఇతర వ్యర్థ వ్యసనాలకి బానిసకాకుండా, మస్జి దుకు వెళ్ళటం, దైవ సన్నిధిలో సజ్దా చేయటాన్ని అలవాటు చేసుకోండి. మరీ బోరుగా ఉన్నప్పుడు సిగరెట్‌ తాగాలనిపిం చటం, చుట్ట పీల్చాలనిపించడం ఒక హానికర వ్యసనమైతే, మంచి స్వరం గల ఖుర్‌ఆన్‌ పారాయణాన్ని, పరలోక భీతిని పెంచే హితబోధనం వినడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ..?
చెడ్డ వ్యసనం మనల్ని అధిగమించి ఎంతగా తన చెప్పు చేతలలో ఉంచుకొం టుందో, మంచి అలవాటు ఒక స్నేహి తునిగా, మన పక్కన చేరి, మనతో పాటు ఉండి స్పూర్తినిస్తుంది. అందుకే ఒక ప్రముఖ మేధావి ఇలా అన్నాడు:
(1) ఒక మంచి ఆలోచనకి అంకురంగా వెయ్య ండి. ఒక స్పూర్తి మొలక పైకొస్తుంది.
(2) ఒక స్పూర్తి మొలకని అంటు కట్టండి. ఒక చర్య పుష్పిస్తుంది.
(3) చర్య అనే పుష్పాన్ని ఫలించనివ్వండి. అలవాటు అనే ఫలం పక్వానిని కాస్తుంది.
(4) ఆ ఆరాధన (అలవాటు) అనే ఫలాన్ని ఆస్వాదించండి. అది మీకు లక్ష్యం చేరుకొనే శక్తినిస్తుంది.

మేలిమి గుణం క్షమ


”ఆదం (అ) సంతతికి చెందిన ప్రతి ఒక్కరితోనూ తప్పు జరుగు తుంది. కానీ; తప్పు చేసే వారందరిలోకెల్లా ఉత్తములు తమ తప్పుల దిద్దు బాటుకు ప్రయత్నించినవారు” అన్నారు మహనీయ ముహమ్మద్‌ (స). తప్పులు అందరి వల్లా దొర్లుతుంటాయి. అది మానవ సహజం. కాని తప్పులను గుర్తించడం, వాటిని సరిదిద్దుకోవడం మాత్రం కొంద రికే సాధ్యం. తప్పు చేసిన వెంటనే పశ్చాత్తాప పడి, క్షమించమని అల్లాహ్‌ాను వేడుకుంటారు సుగుణవంతులు. తాము చేసినది తప్పే అయినా అర్థరహిత వాదనకు దిగుతూ ఉంటారు మూర్ఖులు. తాము తప్పుల తడికగా మారుతున్నామని తెలిసినా వాటినే మాటిమాటికి చేస్తూ ఉంటారు నీచులు. ఏది ఏమయినప్పటికీ, దాన్ని పాటించేవారు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ తప్పు అనేది తప్పే; ఎన్నటికి అది ఒప్పు కాజాలదు. మరి అల్లాహ్‌ాకు ప్రియమయిన దాసులెవరో తెలుసా?
”వారు కలిమిలోనూ, లేమిలోనూ (ధర్మమార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు. ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబి స్తారు. అల్లాహ్‌ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు”. (ఆలి ఇమ్రాన్‌: 134)
”వారు తమ ద్వారా ఏదయినా నీతిబాహ్యమయిన పని జరిగిపోతే లేదా తమ ఆత్మలకు వారు ఏదయినా అన్యాయం చేసుకుంటే వెంటనే అల్లాహ్‌ను తలచుకుని, తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు. నిజానికి అల్లాహ్‌ా తప్ప పాపాపలను క్షమించేవాడెవడున్నాడు?”. (ఆలి ఇమ్రాన్‌: 135)
”వారు తమ వల్ల జరిగింది తప్పు అని తెలిసినప్పుడు దానిపై హటం చెయ్యరు. తమ ప్రభువు తరఫు నుంచి క్షమాభిక్ష, క్రింద కాలువలు ప్రవహిమచే స్వర్గ వనాలు ప్రతిఫలంగా లభించేది ఇటువమటి సుగుణవంతులకే. వారు అందులో ఎల్లకాలం ఉంటారు. ఈ సత్కార్యాలు చేెసేవారికి లభించే పూణ్యఫలం ఎంత చక్కనిది!” (ఆలి ఇమ్రాన్‌: 136)
మక్కా అవిశ్వాసులు ఎంత అధర్మంగా ప్రవర్తించినా, ఓర్పుతో వాటిని సహించి వారికి సత్యోపదేశం చేస్తుండేవారు ప్రవక్త (స). మక్కా విజయ సందర్భంగా వారందరినీ శిక్షించే అన్ని అవకాశాలు పుష్కలంగా ఉండి కూడా వారు చేసిన అవమానాలను, తప్పలను పెద్ద మనస్సుతో కమించి, ధర్మానికి, దయకు ప్రతికగా నిలిచారు ప్రవక్త మహనీయలు (స). సత్యప్రచార విషయంలో సత్యప్రియుల యిన సహాబా తాత్కాలికంగా అవమానాలను ఎదుర్కొన్నా, చిత్ర హింసలను భరించినా వారికున్న క్షమా గుణం కారణంగా విజయం వారినే వరించింది.
నిజంగా క్షమించడం అనేది గొప్ప సుగుణం. అవతలివారు తాము చేసింది తప్పు అని తెలుసుకుని క్షమించమని కోరితే క్షమించేంతటి సద్గుణం మనకుండాలి. మనలో క్షమా గుణమే లేకపోతే, తప్పు చేసినవారిని ఎందుకు వదలాలి? పతీకారం తీర్చుకోవాలన్న కసి బలపడుతుంది. తద్వారా మనం శారీరకంగానూ, మానసికంగానూ నష్ట పోతాము. అయితే తనకు మాలిన ధర్మం పనికి రాదన్నట్లే క్షమించే గుణం మనకున్నా, అది అందుకునే యోగ్యత అవతలి వారికి ఉండాలన్న ప్రాథమిక సూత్రాన్ని మనం మరచిపోకూడదు. కమాగుణం ఉండాలి కదా అని తప్పులు ఎంత తీవ్రమయినవి అయినా అందరిపై క్షమను ప్రదర్శించకూడదు. అనంత కరణా మయుడు, అపార దయానిధి అయిన అల్లాహ్‌ాయే కొన్ని నేరాలకు శిక్ష అదేశించాడంటే, శిష్ఠ రక్షణ కోసం దుష్ట శిక్షణ కూడా కరుణ లో, దయలో అంతర్భాగమే అని మనం గుర్తించాలి.
ఇక మన విషయానికొస్తే, మన వల్ల జరగరాని తప్పు ఏదయినా జరిగిపోతే ‘నన్ను క్షమించు’ అని మనం అనగలగాలి. ‘ఐయామ్‌ సారీ’ వినడానికి ఎంతో తేలికగా అన్పించే ఈ మాట, దాని అర్థాన్ని చూస్తే మాత్రం ఎంతో లోతుగా, గంభీరంగా కనిపిస్తుంది. మన అహాన్ని, స్వాభిమానాన్ని వదిలి పెట్టి మనం చేసిన తప్పు అంగీక రించి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరడం మనకు అల్లాహ్‌ అనుగ్రహిం చిన గొప్ప లక్షణం. ‘ఇతరులు మన తప్పులను మన్నించాల’ని కోరు కునే మనం, మన ఆగ్రహాన్ని, ఆవేశాన్ని మన అధీనంలో ఉంచుకొని, ఎదుటి వారిని క్షమించి ఎప్పటిలాగే వ్యహరించడం అలవాటు చేసుకోవాలి. అల్లాహ్‌ా ఖుర్‌ఆన్‌లో ఇలా సెలవిస్తున్నాడు: ”వారిని క్షమించాలి. వారి పట్ల మన్నింపుల వైఖరిని అవలంబించాలి. ఏమిటీ, అల్లాహ్‌ మిమ్మల్ని క్షమించాలని మీరు అభిలషించరా? అల్లాహ్‌ అయితే తప్పులను మన్నించేవాడు. కరుణామయుడు”.
(నూర్‌: 22)

తన కోపం తన శత్రువు


అరిషడ్వర్గాలలో రెండోదైనది క్రోధం. అది ఎంత భయంకరమయిన దంటే దానిని ఆశ్రయించిన వ్యక్తికి పతనం తప్ప ప్రగతి ఉండదు. కోపం లేని మానువుడు ఉండడు అన్నది వాస్తమే. కానీ; స్థాయికి మించిన కోపం మనిషి జీవితాన్ని అనర్థం పాలు చేస్తుంది. ఒక్క క్షణం నిగ్రహం కొండంతటి ప్రామాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం ఆవేశం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. మనం జీవితంలో ఏది సాధిం చాలన్నా కసి, ఆవేశం, ఆగ్రహంతోపాటు నిగ్రహం, సంయమనం ఎంతో అవసరం. ఈ కారణంగానే ‘ఏదైనా ధర్మోపదేశం చేయండి, ఓ దైవప్రవక్తా!’ అని అడిగిన ఓ వ్యక్తికి హితోపదేశం చేస్తూ ‘కొపగించు కోకు’ అని దైవప్రవక్త ముహమ్మద్‌ (స) వారు సెలవిచ్చారు. అది సరే, ఇంకేదైనా, మరేదైనా సెలవియ్యండి అని ఆ వ్యక్తి విన్నవించుకోగా, అడిగిన ప్రతిసారీ ప్రవక్త (స) ‘కోపగించుకోకు!’ అనే హితవు పలక డం ద్వారా సదరు వ్యక్తిలో గల ఆ అవలక్షణాన్ని తొలగించి అతన్ని నిగ్రహంగల నిండు మనీషిగా మలచదలిచారు ప్రవక్త (స).
కోపం ఎందుకు వస్తుంది? అంటే, సాధారణంగా కోరింది కోరినట్లు గా జరగకపోవడం, అనుకున్నది సమయానికి అవ్వక పోవడం, అహం దెబ్బ తినడం, తనకు వ్యతిరేకంగా సృష్టించబడిన వదంతుల్ని వినడం, తనకు దక్కాల్సిన హుక్కు దక్కకపోవడం, తృప్తి స్థానే తృష్ణ చోటు చేసుకోవడం, తీవ్రమయిన నిరాశనిస్పృహలకు లోనవ్వడం- మొదలగు కారణాల వల్ల కోపం కలుగుతుంది. సరయిన సమయం లో, సరయిన మోతాదులో, సరైన వారిపై, సరైన రీతిలో కోపాన్ని పదర్శించడం కూడా ఒక కళే. ఆ మాత్రం కోపాన్ని సయితం మనిషి ప్రదర్శించలేకపోతే అతను, అతనికి సంబంధించిన ప్రతిదీ చులకనై పోతుంది. అలా అని ఎప్పుడూ చిర్రుబుర్రులాడుతుండటం మంచిది కాదు. అలాంటి వ్యక్తికి స్వంత సంతానం కూడా జడుసుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మేకపోతు గాంభీర్యమూ కూడదు. గుంట నక్క వినయమూ వలదు. కోపాన్నిగానీ, హాస్యాన్నిగాని సహజశైలి లో ప్రదర్శించాలి.
ఈ సందర్భంగా ప్రవక్త (స) వారు చేసిన హితవు గమనార్హం! ”బల్ల యుద్ధంలో ప్రత్యర్థిని చిత్తు చేసినవాడు కాదు గొప్పోడు; కోపం వచ్చినప్పుడు ఎక్కడ ఎంత తగ్గాలో అంత తగ్గడం తెలిసి నోడు గొప్పోడు”. ఎందుకంటే, మితిమీరిన కోపం వల్ల ఆరోగ్యం ఎలాగూ పాడవుతుంది. దానికితోడు క్రోధం కలవాడికి కర్తవ్యం గోచరించదు. తరచూ తీవ్ర భావావేశానికి గురయ్యే వ్యక్తి ప్రాణ ఘాతుకమయిన హింసాచరణకు పాల్పడే ప్రమాదం ఉంది. రాపిడి వల్ల ఉద్భవించి అగ్ని ఆ చెట్టునే దహించివేసినట్లు దేహోత్పన్నమ యిన ఆగ్రహం పూర్తి శరీరాన్నే బూడిద పాలు చేసి వేస్తుంది. అందుకే-’తన కోపం తన శత్రువు, తన శాంతం తన మిత్రుడు’ అన్నారు వెనుకటికి మన పెద్దలు.
ఆలస్యంగా ఆవేశానికి లోనయి, తొందరగా ఉపశమనాన్ని పొందే వ్యక్తి ఉత్తముడయితే, తొందరగా ఆవేశానికి గురై తొందరగా దాన్నుండి బయట పడే వ్యక్తి మధ్యముడయితే, తొందరగా కాని, ఆలస్యంగా కానీ క్రోధావేశానికి లోనై ఎంత సేపటికీ దాన్నుండి బయట పడక లోలోన దావానలంలా రగులుతూ ఉండే వ్యక్తి అధ ముడు. కాబట్టి మన కోపం సయితం ఆశీర్వచనం అయ్యేలా మనం చూసుకోవాలి. ‘అల్లాహ్‌ా తేరా భలా కరే-అల్లాహ్‌ా నీకు సద్బుద్ధిని అనుగ్రహించు గాక!’ వంటి పదాలను ఆవేశ ఘడియల్లో సయితం అలవాటు చేసుకోవాలి.
నిగ్రహాన్ని అర్థం చేసుకోవడం చాలా సులువు. బయట ప్రపంచం మన ఆలోచనలకు అనుగుణంగా లేదు. నాగరికమో, అనాగరిక మో, ఆధునికమో, ఆటవికమో-ఏమో కానీ అంతా తల్లక్రిందులవుల వుతోంది. మన మాట ఎవ్వరూ వినడం లేదు. మనం అనుకున్న ఏదీ జరగటం లేదు.చిర్రెత్తుకొస్తోంది. ఎదుటి వ్యక్తి పట్టుకొని చితక బాదేయాలనిపిస్తోంది. ఆ సమయంలో శాంతాన్ని ఆశ్రయించి చిరు నవ్వు చిందించడమే నిగ్రహం. ఇది అందరికీ అవసరమయిన గుణమే అయినా ఆధ్యాత్మిక రంగంలో అవిరళంగా పరిశ్రమిస్తున్న వారికి మరీ ముఖ్యావసరం అనే చెప్పాలి. ఈ సద్గుణం మనకుంటే ప్రత్యర్థులు మనల్ని కోపానికి లోను చేసి మన మనోభావాలతో ఆడు కోవాలనుకున్నా మన మనో నిర్మలం చెదరదు. ఇది చెప్పడానికి సులుళువుగానే చెప్పేసినా ఆచరణలో పెట్టడం మాత్రం అంత సులువు కాదు.ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్‌ ఇలా పేర్కొంటోంది:
”మంచీ-చెడు (ఎట్టి స్థితిలోనూ) సమానం కాలేవు. చెడును మంచి ద్వారా తొలగించండి. (ఆ తర్వాత మీరే చూద్దురు గాని) నీకు- తనకూ మధ్య బద్ధ విరోధం ఉన్న వ్యక్తి సయితం నీకు ప్రాణ మిత్రుడయి పోతాడు. అయితే ఈ భాగ్యం సహనశీలురకు మాత్రమే ప్రాప్తిస్తుంది. దీన్ని గొప్ప అదృష్టవంతులు మాత్రమే పొందగలుగు తారు”. (హామీమ్‌ అస్సజ్దా: 34, 35)

ఈ రోగ కారకాలను ప్రజా జీవితాల నుండి ఏరివేయాలి


స్వలింగ సంపర్కానికి చట్టబద్ధతను కల్పిస్తూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన సంచలనాత్మక తీర్పు నూరు కోట్ల మంది భారతీయులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఎందుకంటే అనాదిగా భారత దేశం ఆధ్యాత్మికతకు పుట్టినిల్లుగా పరిఢవిల్లింది. మన పూర్వీకులు విలువలకు కట్టుబడినవారు. మానమ ర్యాదలకు పట్టం కట్టినవారు. గాంధీజీ సహా భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన ప్రథమ శ్రేణి నాయకులుగానీ, రుషులుగానీ, పుణ్య పురుషులు గానీ స్వలింగ సంపర్కం లాంటి ముదనష్టపు చేష్టలకు స్వతంత్ర భారతంలో మాన్యత లభిస్తుందని కలలో కూడా ఊహించి ఉండరు. అటువంటి కర్మ భూమిలో నేడు గుండె తరుక్కుపోయే అనూహ్య సంఘటనలు సంభవించటం కడు శోచనీయం.
స్వలింగ సంపర్కం ఒక అసహజమైన, ప్రకృతికి విరుద్ధమైన చేష్ట. ఇది నీతి బాహ్యతకు పరాకాష్ఠ! జంతువులు సయితం ఆసక్తి కనబరచని ఈ పాడు పనికి ఒడిగట్టడం సృష్టిశ్రేష్ఠుడైన మానవుడికే చెల్లింది. సహజసిద్ధమైన లైంగిక వాంఛల పరిపూర్తికై ఒక మగవాడు ఒక ఆడదాన్ని ఆశించటం ప్రకృతి. అయితే ఈ ప్రకృతి కాస్తా వికటించి వికృతిగా మారి, దుష్ఫలితాలు చవి చూసిన దాఖలాలు చరిత్రలో ఉన్నాయి. పురుషుడు స్త్రీని కాదని, పురుషునితోనే రమించి, లైంగిక తృప్తి నొందే అసహజ చేష్టకు సహస్రాబ్దుల క్రితం శ్రీకారం చుట్టి, అపఖ్యాతిని మూటగట్టుకున్న తొట్టతొలి జనులు లూత్‌ జాతి జనులు. తన జాతివారిలో ప్రబలిన ఈ పాపిష్టి పోకడపై దైవప్రవక్త బాధతో కుమిలిపోయేవారు. కలత చెందిన మనసుతో, ”అయ్యో! మీరు మరీ ఇంత లజ్జా విహీనులుగా ప్రవర్తిస్తున్నారేమిటి? మీ కోసం పరిశుద్ధలైన నా (జాతి) కూతుళ్ళుండగా, వారిని వదిలేసి మీరు మగవాళ్ళ వెంట పడ్డారేమిటి? మీరు కాస్త దైవానికి భయపడండి” అని లూత్‌ (అలైహిస్సలాం) తన జాతి ప్రజలను ప్రాధేయపడ్డారు. కాని ఆవేదనాభరితమైన ఆ పిలుపు వాళ్ల ముందు బధిర శంఖారావమే అయింది. ఎట్టకేలకు ప్రకృతి ప్రకోపించింది. దైవాగ్రహం వాళ్ళపై విరుచుకుపడింది. పశ్చిమాసియాలో మృత సముద్ర తీరాన నివసించే ఆ బస్తీ వాసులంతా భావితరాలకు ఒక గుణపాఠ సూచనగా మిగిలిపోయారు. నేడు శ్మశాన రాజ్యంగా మారివున్న ఆ జనవాసాల్లో ఒకటైన ‘సదూమ్‌’ పేరుతోనే (బహుశా) నేటి స్వలింగ సంపర్కులు ‘సోడోమ్‌’లుగా వ్యవహరించబడుతున్నారు.
పాశ్చాత్య దేశాలైన బ్రిటన్‌, అమెరికాలలో చాలా కాలంగా ఈ జాడ్యానికి చట్ట భద్రత ఉంది. ఆఖరికి అక్కడి చట్ట సభల్లో సయితం తమకు తగిన ప్రాతినిధ్యం ఉండాలని ఉద్యమించే దాకా పోయారు ఈ సోడోమ్‌లు. పాశ్చాత్యులను అనుకరించే మిగతా ప్రపంచంపై కూడా ఈ ప్రభావం పడింది. నేడు ప్రపంచంలో సగానికంటే ఎక్కువ రాజ్యాలే ఈ రంఢ్వాతనాన్ని నేరంగా పరిగణించటం లేదంటే పరిస్థితి ఎంతగా విషమించిందో ఊహించవచ్చు. మన దేశంలో సయితం గత థాబ్ది కాలంగా ఈ వెర్రిని ప్రమోట్‌ చేసే సినిమాలు నిర్మించబడ్డాయి. తమకు విచ్చలవిడిగా రమించే హక్కు ఇవ్వాలని మూడేండ్ల క్రితం ఈ జుట్టు పోలిగాళ్ళు ఢిల్లీ వీధుల్లో ప్రదర్శనలు జరిపిన వైనాన్ని మరవలేము. ఇప్పుడు ఆ ‘గే’ల విజ్ఞప్తిపై ఏకంగా హైకోర్టు హోమో సెక్సువాలిటీని ప్రాధమిక హక్కుల కోవకు చెందిన అంశంగా ఖరారు చేసింది.

చాడీలు చెప్పడం


ఇస్లాంలో చాడీలు చెప్పడం మహా పాపం. ముస్లిం తన నోటిని అదుపులో పెట్టుకొని నిషేధించబడిన వాటికి దూరంగా ఉండవలెను. సాధారణంగా నిషేధించబడిన వాటిని ప్రజలు చాలా తేలిగ్గా తీసుకుంటారు. చాడీలకు పాల్పడినవాడు పశ్చాత్తాపం చెందడం చాలా అవసరం.
అబూ హురైరా రజిఅల్లాహు అన్హు ఉల్లేఖించారు : దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు – “చాడీలు చెప్పడం అంటే ఏంటో మీకు తెలుసా?” అని సహాబా (సహవాసుల)ను అడిగారు. దానికి వారు “అల్లాహ్ కు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కు తెలుసు అని సమాధానమిచ్చారు.” అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం “మీ సోదరుని గురించి అతనికి నచ్చని విషయం మాట్లాడడం” అని సెలవిచ్చారు. దానికి సహాబా (సహవాసులు) “అతని గురించి చెప్పింది నిజమైతే?” అని అడిగారు. దానికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా జవాబిచ్చారు, “మీరు చెప్పింది నిజమైతే అది చాడీలో వస్తుంది, అదే అది అబద్దమైతే అది అపనింద అవుతుంది.” సహీహ్ ముస్లిం 1183, 6265 మరియు అబూ దావూద్ 4856

ఖుర్ఆన్ వెలుగులో

అల్లాహ్ సెలవిచ్చాడు, “ ఓ విశ్వాసులారా! అతిగా అనుమానించటానికి దూరంగా ఉండండి. కొన్ని అనుమానాలు పాపాల క్రిందికి వస్తాయి సుమా! కూపీలు లాగకండి. మీలో ఎవరూ ఇంకొకరి గురించి వీపు వెనుక చెడుగా (చాడీలు) చెప్పుకోకూడదు. ఏమిటి, మీలో ఎవరైనా చచ్చిపోయిన మీ సోదరుని మాంసం తినటానికి ఇష్టపడుతారా? చూడండి, మీరు స్వయంగా దీన్ని ఏవగించుకుంటున్నారు. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ పశ్చాత్తాపాన్ని స్వికరించేవాడు, కరుణించేవాడూను.” ఖుర్ఆన్ సూరా హుజురాత్ 49:12

చాడీల వల్ల నరకంలో లభించే శిక్ష

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా ఉపదేశించారు : నన్ను స్వర్గ నరకాలకు తీసుకెళ్ళినప్పుడు నేను నరకంలో కొందరిని వెండి చేతి గోళ్ళతో తమ ముఖాలను మరియు ఛాతీలను రక్కడం చూశాను. అప్పుడు “వీరెవరు” అని జిబ్రయీల్ అలైహిస్సలాంను అడిగాను. దానికి ఆయన ఇలా జవాబిచ్చారు, “వీరు చాడీలు చెప్పేవారు మరియు ఇతరుల గౌరవాన్ని కించపరిచేవారు.” సునన్ అబూ దావూద్ 4860

అనుమతించబడిన చాడీల రకాలు

ధార్మికంగా ఏదైనా లాభం ఉన్నప్పుడు, వేరే దారి లేని పరిస్థితిలో చాడీలు చెప్పే అనుమతి ఉంది. అవి ఏమిటంటే:
1. “ఎవరైనా అన్యాయం చేస్తే వారి గురించి అక్కడి పాలకుడు, న్యాయమూర్తి మొదలైన వారికి ఫిర్యాదు చేయవచ్చు. “అతని వల్ల నాకు ఫలానా విషయంలో అన్యాయం జరిగింది””అని చెప్పవచ్చు.
2. తిరస్కరించే వాడిని, తప్పుచేసే వాడిని సరిదిద్దటానికి చాడీలు చెప్పడం సమ్మతమే. అతను తప్పు చేస్తున్నాడు, కాస్త వాడిని సరిదిద్దండి. అతడిని తప్పు చేయకుండా ఆపడమే, చెప్పే వాడి ఉద్దేశ్యం కావాలి. అలా కాని పక్షంలో అది హరాం (నిషేధించబడినది) అవుతుంది.
3. ఏదైనా ధార్మిక విషయమై తీర్పు తీసుకోవలసి వచ్చినప్పుడు. మతపెద్ద లేదా మతవిద్వాంసుని ముందు తన గోడు ఈ విధంగా మొరపెట్టుకోవచ్చు, “నా తండ్రి, సోదరుడు లేదా ఫలానా వ్యక్తి నాకు అన్యాయం చేశాడు. ఇలా చేయడం సమంజసమా? ఈ పరిస్థితి నుంచి నేను ఎలా బయటపడగలను? నాకు న్యాయం ఎలా దొరుకుతుంది?” ఇలాంటి విషయంలో తీర్పు కోసం వీపు వెనుక (చాడీలు) చెప్పడం అనుమతించబడింది.
4. ముస్లింలను తప్పుడు చేష్టల నుండి ఆపడానికి మరియు వారికి సలహా ఇవ్వడానికి చాడీలు చెప్పడం సమ్మతమే. ఇది ఇజ్మా (ధార్మిక విద్వాoసుల ఏకగ్రీవ నిర్ణయం). అంతేకాదు, ఇది తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే దీని ప్రతిఫలం మనకు కళ్ళకు కట్టినట్టుగా కానవస్తుంది. పెళ్లి విషయాల్లో లేదా వ్యాపార లావాదేవీల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ విషయంలో ఎదుటివాడి గురించి ఏ విషయమూ దాచకూడదు. ఎదుటి వాడి తప్పుడు లక్షణాలు తెలియజేయడం కేవలం వినేవాడి శ్రేయస్సు కొరకై ఉండాలి.
5. నిషేధించబడిన లేదా కల్పిత పోకడల (బిద్ఆత్)ను బహిరంగంగా చేస్తున్న వ్యక్తి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు చాడీలు ఆమోదయోగ్యం. బహిరంగంగా మద్యం సేవించేవాడు, తప్పుడు పనులు చేసే నాయకుడు – ఇలాంటి వారి పాపాల చిట్టా అందరికీ తెలియజేయవచ్చు.
6. ఒక మనిషిని గుర్తించడానికి అతణ్ణి మారుపేరుతో పిలవడం. ఉదాహరణకు – అల్ అమాష్ (మెల్ల కళ్ళ వాడు), అల్ ఆరాజ్ (కుంటుతూ నడిచేవాడు), అల్ అసం (చెవిటివాడు). కాని ఆ మనిషిని అవమానపరచాలనే ఉద్దేశ్యంతో పిలవడం మాత్రం నివారించబడింది. ఆ మనిషిని వేరే మంచి పేరుతొ గుర్తు పట్టే అవకాశం ఉన్న పక్షంలో అతడిని ఆ మంచి పేరుతో పిలవడమే మేలైనది.

చాడీలుచెప్పడం మంచిపద్ధతి కాదు



    చాడీలు చెప్పడం అనేది చాలా అనర్థాలకు దారి తీస్తుంది. మనం చాలా మందిని చూస్తూ వుంటాము. వారు లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ఎవరో ఒకరి మీద ఎవరో ఒకరికి చాడీలు చెప్తూ వుంటారు. కాని అట్లాంటి వారు ఆనందంగా వుండలేరు. అలాగే మన:శాంతిని కోల్పోతారు. వాళ్ళకి లేనిది వేరే వాళ్ళకి వుందని తెగ బాధపడుతుంటారు. వాళ్ళకు లేదు అనే బాధకంటే ఇతరులకు వుందే అనే బాధే వాళ్ళలో ఎక్కువగా వుంటుంది. ఎదుటివారి మీద ఎక్కువగా చాడీలు చెప్పడా నికి ప్రయత్నిస్తుంటారు. వినేవారు వుంటే రోజంతా చెప్తూనే వుంటారు. అట్లాంటి వారిని మనం ఎవాయిడ్‌ చేయటం చాలా మంచిది. ఎందుకంటే చాడీలు చెప్పడం వల్ల ఒకరి మధ్య ఒకరికి గొడవలు జరుగుతాయి. చాలా అనర్థాలకు దారి తీస్తుంది. ఇతరుల పట్ల అసూయ కలిగిన వారే చాడీలు చెప్తూ వుంటారు. వేరొకరి పట్ల చెడు అభిప్రాయం వున్నవారికే చాడీలు చెప్పే అలవాటు వస్తుంది. మనకు చాడీలు చెప్పే అలవాటు వుంటే మాను కోవాలి. అట్లాగే వేరే వాళ్ళు చాడీలు చెప్తూవుంటే వారు చెప్పేది వినకుండా మనపని మనం చేసుకుంటూ పోతే వారు మనవద్దకు ఇంకరారు. మనకు వారు చెప్పేది వినే ఆసక్తి లేదని అర్థం చేసుకుని మనవద్ద చాడీలుచెప్పడం మానేస్తారు. ఈ చాడీలు చెప్పే అలవాటు చిన్నతనంలోనే మొదలవుతుంది. కొంత మందికి చుట్టూ వున్న పరిస్థితు లను బట్టి చాడీలు చెప్పడం అనే అలవాటు మొదలవుతుంది. ఒకవేళ మనకు చిన్నప్పటి నుండే చాడీలుచెప్పే అలవాటు వుంటే అది మానుకోవాలి. ఒక చెడ్డపని నుండి విముక్తి కల్పించుకోవటం అంటే మనల్ని మనం కాపాడుకొన్నట్లే అవుతుంది. చాడీలుచెప్తే విని విడి పోయిన కుటుంబాలు ఈ సమాజంలో చాలా వున్నాయి. చాడీలు అనేవి మనుష్యుల మధ్య కలహాలు రేపి కొన్ని కొన్నిసార్లు మనిషి మరణించడానికి కూడా దారి తీస్తాయి. మనకు ఎవరైనా ఎవరిమీదనైనా చాడీలు చెప్తేవిని ఎదుటి వారిని, నిందించటంకాని, అవమానించటం కాని, ఎదురు తిరిగి మాట్లాడటంకాని, వారిని అనుమానించటం కాని, ఇతరులు చెప్పింది విని నిజనిజాలు తెలియకుండా ఇతరు లతో గొడవపడి విడిపోవడంకాని చేయరాదు. ఎందు కంటే మనం కొన్ని కొన్ని సార్లు కళ్ళతో చూసినది కూడా నిజాలు కాకపోవచ్చు. అక్కడ జరిగింది ఒకటయితే మనం ఊహించేది వేరొక రకంగా వుంటుంది.

    సర్వ రోగ నివారిణి ‘ఇస్తిగ్ఫార్‌’


    ‘ఇస్తిగ్ఫార్‌’ అంటే అర్థం క్షమాపణ కోసం అల్లాహ్‌ాను వేడుకోవటం. తన వైపుకు మరలి క్షమాభిక్ష వేడుకునే భక్తులను అల్ల్లాహ్‌ా అమితంగా ఇష్టపడతాడు. వారిపై తన కరుణానుగ్రహాలను పుష్కలంగా కురిపిస్తాడు. దైవ ప్రవక్తలు తమ జాతి ప్రజలకు పిలుపు ఇచ్చినప్పుడల్లా ఇస్తిగ్ఫార్‌ (క్షమాపణ) చేయమని నొక్కి వక్కాణించేవారు. ఉదాహరణకు:- దైవ ప్రవక్త నూహ్‌ (అ) తన జాతి వారితో ఇలా అన్నారు:
    ”క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు. ఆయన ఆకాశం నుండి మీపై ధారా పాతంగా వర్షం కురిపిస్తాడు. మీ సిరిసంపదల్లో, మీ పుత్ర సంతతి పురోగతిలో తోడ్పడతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు. మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు”. (నూహ్‌: 10-12)
    అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) తన అనుయాయుల నుద్దేశించి ఏమని ఉపదేశించారో చూడండి – ”ప్రజలారా! మీ ప్రభువు వైపునకు మరలండి. మీ పాపాల మన్నింపు కోసం ఆయన్ని ప్రార్థించండి. నన్నే చూడండి, నేను రోజుకు వంద సార్లు క్షమాపణకై అల్లాహ్‌ను వేడుకుంటూ ఉంటాను”. (ముస్లిం)
    ఇస్తిగ్ఫార్‌ శుభాల సరోవరం. మరో విధంగా చెప్పాలంటే అది సర్వరోగ నివారిణి. పుణ్య పురుషులైన హజ్రత్‌ హసన్‌ బస్రీ (ర) వద్దకు ఒక వ్యక్తి వచ్చి తన ప్రాంతంలో కరువుకాటకాల గురించి బాధతో చెప్పుకుంటే ”ఇస్తిగ్ఫార్‌ చేయండి” అని ఆయన ఉపదేశించారు. మరో వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చి దారిద్య్రం గురించి ఫిర్యాదు చేస్తే, అతనికి కూడా ”ఇస్తిగ్ఫార్‌ చేయండి” అని ఆ పుణ్యాత్ముడు సలహా ఇచ్చారు. ఇంకొక వ్యక్తి వచ్చి, తన తోట వానలు లేక ఎండిపోయిందని వాపోయాడు. ఆయన అతనికి కూడా అదే సలహా ఇచ్చారు. వేరొక వ్యక్తి వచ్చి తనకు సంతానం కలగటం లేదని బాధతో చెప్పుకోగా, ఆయన అతనికి కూడా ఇస్తిగ్ఫార్‌ చికిత్సనే ప్రతిపాదించారు. దీన్నంతటినీ గమనించిన ఒక శిష్యుడు, ‘తమరు అందరికీ ఒకే మందు (ఇస్తిగ్ఫార్‌ మందు) ఇస్తున్నారేమిటి?’ అని సందేహపడితే ”ఈ సమస్యలన్నింటికీ అల్లాహ్‌ా చూపిన పరిష్కార మార్గం ఇదే” అని ఆయన సమాధాన మిచ్చారు.

    ఇస్తిగ్ఫార్‌ శుభాలు



      దైవధ్యాన సంబంధిత అంశాలన్నింటి సర్దారు ‘ఇస్తిగ్ఫార్‌’!
      ఇస్తిగ్ఫార్‌ చేసే వ్యక్తి నుండి షైతాన్‌ పారిపోతాడు – అల్లాహ్‌ ప్రసన్నుడవుతాడు.
      ఇస్తిగ్ఫార్‌ వల్ల గుండె బరువు తగ్గుతుంది. ఆవేదన, దుఃఖం తొలగుతాయి.
      జీవితంలో ఆనందం వెల్లి విరుస్తుంది.
      ఇస్తిగ్ఫార్‌ చేసే వ్యక్తి ముఖ వర్చస్సు పెరుగుతుంది.
      ఉపాధి అతన్ని వెతుక్కుంటూ వస్తుంది.
      దాసుడు దేవుని ప్రేమకు పాత్రుడవుతాడు. దైవ సామీప్యం లభిస్తుంది.
      ఆంతర్యం ప్రకాశమానమవుతుంది. హృదయం నిత్యం సచేతనంగా ఉంటుంది.
      దాసునికి – దైవానికి మధ్య భయాందోళన, వ్యాకులత వంటివి ఉండవు.
      ఇస్తిగ్ఫార్‌ వల్ల పాపాలు ప్రక్షాళనం అవుతాయి.
      క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రయోజనం కలుగుతుంది. ఇస్తిగ్ఫార్‌ చేసే వ్యక్తిపై అనిర్వచనీయమైన ప్రశాంతత ఆవరిస్తుంది. ఆతనికి దైవ దూతల రక్షణ (ప్రొటక్షన్‌) లభిస్తుంది.
      ఇస్తిగ్ఫార్‌లో నిమగ్నుడై ఉండే వ్యక్తి చాడీలు, దురనుమానాలు, పరనింద నీతి బాహ్యతల నుండి సురక్షితంగా ఉంటాడు.
      ఇస్తిగ్ఫార్‌ ప్రళయదినం నాటి బాధాకర పరిస్థితి నుండి మనిషికి ఉపశమనం ఇస్తుంది.
      ఏకాంతంలో ఇస్తిగ్ఫార్‌తో కంట తడిపెట్టిన వానికి తీర్పుదినాన దైవ సింహాసనం (అర్ష్‌) నీడ లభిస్తుంది.
      ఇస్తిగ్ఫార్‌ చేసే వ్యక్తి దైవాన్ని మరువడు. అజాగ్రత్తగా ఉండడు.
      ఇస్తిగ్ఫార్‌ చేసేవాడు కాపట్యం వాతన పడడు. ఎందుకంటే